8, అక్టోబర్ 2020, గురువారం

నిజమైన స్నేహితుడు?????

ఒక కొడుకు తన తండ్రి దగ్గరకు వచ్చి,ఒక జాబితా ఇచ్చి " నాన్నా,ఈ జాబితాలో ఉన్న యాభై మంది నా స్నేహితులు. *వీరిని నా పెళ్ళికి పిలుద్దామని అనుకుంటున్నాను"* అని చెప్పాడు.అప్పుడు తండ్రి "సరే, ఆ జాబితాలో ఉన్న వాళ్ళందరికీ నేను పిలుస్తాను. *నువ్వు మిగిలిన పనులు చూసుకో"* అని చెప్పాడు.పెళ్లి ముహూర్తం సమీపించింది. పెళ్లి మండపంలో చూస్తే తన స్నేహితులు పదిమంది మాత్రమే కనిపించారు. వెంటనే కొడుకు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి" *నాన్నా నేను నీకు యాభై మంది జాబితా ఇచ్చాను కదా, మరి పదిమంది మాత్రమే ఉన్నారు,మిగిలిన వారిని మీరు పిలవలేదా"* అని అడిగాడు. అప్పుడు తండ్రి *"నేను నువ్వు ఇచ్చిన జాబితాలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాను.* కాని నీ పెళ్ళి అని చెప్పలేదు. నా కొడుకు ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు, దయచేసి మీరు ఎవరైనా అతనికి సహాయం చెయ్యదలచుకుంటే, ఈ సమయానికి ఇక్కడికి వచ్చి సహాయం చెయ్యండి అని చెప్పాను. *ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా నీ నిజమైన స్నేహితులు. మిగిలిన వారు స్నేహం ముసుగులో ఉన్న పరిచయస్తులు. పరిచయం ఉన్న ప్రతి ఒక్కరినీ స్నేహితులుగా భావించకు"* అని చెప్పాడు.

*✍️నీతి : - మనం ఆనందంలో ఉన్నప్పుడు మన పక్కన లేకపోయినా పరవాలేదు,కాని మనం బాధలో ఉన్నప్పుడు మాత్రం నేనున్నాను అని భరోసా కలిగించిన వాడే నిజమైన స్నేహితుడు.*


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి