7, అక్టోబర్ 2020, బుధవారం

కార్య అనుకూలత ఎలా?

*కార్య అనుకూలత*

ఎంత కష్టపడుతున్నా, ఎంత నీతిగా పోరాడుతున్నా, ఎదుగుదలకోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నా… కొన్ని సార్లు ఏదో దడగా ఉంటుంది. అనుకున్నవి అనుకున్నట్టు, అనుకున్న సమయానికి పనులు జరగవు. మన అనుకునే వాళ్ళు కూడా మనకు వ్యతిరేకంగా మారతారు.అర్ధం చేసుకోవలసిన వాళ్ళు, అనర్ధాలకు దారి తీస్తూ ఉంటారు. ఇలా అనేక సమస్యలను ఎదుర్కుంటూ ఉంటాం.

దీనికి కారణం ఇంట్లో నెగిటివ్ అనర్జీ ఉండటమే. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండటం వలన ఎంత ప్రయత్నిస్తున్నా కూడా కొన్ని పనులు జరగవు. అందుకని ఈ చిన్నపని చేస్తే, ఇంట్లో అంతా మంచి జరుగుతుందని శాస్రం చేవుతుంది.ఏడు జతల కర్పూరం బిళ్లలను.. ఏడు జతల లవంగాలను తీసుకోవాలి. రెండు లవంగాలపై ఒక లవంగాన్ని పెట్టి.. రెండు కర్పూరాలపై ఒక కర్పూరాన్ని పెట్టి పక్క పక్కనే అన్నింటిని పేర్చుకోవాలి. ఆ తర్వాత ఓ ప్లేటు తీసుకొని అందులో ఓ జంట లవంగాలను.. ఓ జంట కర్పూరాన్ని వేసి మీ ఇష్ట దైవాన్ని జపిస్తూ వాటిని వెలిగించి ఇల్లంతా తిరగాలి..ఇవి వెలుగుతున్నంత సేపూ ఇంట్లో రకరకాల శబ్దాలు వస్తాయి.. అవి మన ఇంట్లో ఉన్న ఆ దిష్టి దోషాన్ని పోగొడుతాయి.. ఆ మొత్తం కర్పూరం..
లవంగాలను ఏడు రోజుల పాటు వెలిగించాలి.. ఇలా వెలిగించటం వలన చెడు ప్రభావం.. దిష్టి దోషం ఇంట్లో నుంచి వెళ్లి పోతుందని శాస్త్రాలు చెపుతున్నాయి..సుఖ.. సంతో షాల కోసం చేసే వాటిలో ఇలాంటి ఎన్ని ప్రయత్నాలైనా మీ మానవ ప్రయత్నానికి తోడుగా మాత్రమే నిలుస్తాయి.. సాధించాలన్న సంకల్పం ఉంటేనే ఇవన్నీ కలిసి వస్తాయి..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి