8, అక్టోబర్ 2020, గురువారం

మంగళా దేవి

🚩🚩
మంగళా దేవి
🚩🚩

పూరీ జగన్నాథుని
దేవాలయం ప్రపంచ ప్రసిధ్ధ వైష్ణవాలయాలలో ఒకటి.

ఈ ఊరిలో శక్తి ఆరాధన కూడా 
విశిష్టమైనది. అందుకు తార్కాణం గా పూరీ లోని మాతా'బాట'
మంగళాదేవి
ఆలయం నిలబడుతుంది.

పూరీ జగన్నాధుని ఆలయ హద్దు మాతా 'బాట' మంగళాదేవి
ఆలయం నుండి ఆరంభమౌతుంది. 
సృష్టి కార్యం ఆరంభించడానికి
ప్రయత్నించిన బ్రహ్మ దేవునికి లోకం అంతా ఖాళీగా కనిపించింది. ఆ సమయంలో
ముందుగా మంగళాదేవీ అవతరించి,
సృష్టికి బాట చూపించినదని,పిదప
బ్రహ్మదేవుడు నారాయణుని
నాభికి క్రింద మరో లోకం వుండడాన్ని గమనించి
తన సృష్టిని ఆరంభించినట్లు
ఐహీకం. అందువలననే
ఈ ఆలయంలోని శక్తి మాత 'బాట' మంగళాదేవిగా కీర్తించబడుతున్నది.

నభకళేబరా అనేది పూరీ జగన్నాధుని ఆలయంలో
పాత కలప విగ్రహాలు మార్చి క్రొత్త విగ్రహాలు ప్రతిష్టించే కార్యక్రమం.
ఈ విగ్రహాలు తయారు చేయడానికి కావలసిన కలపను వెతకడానికి ముందు 
మంగళాదేవిని దర్శించి పూజాదికాలు నిర్వహిస్తారు. తగిన కలప దొరకగానే ఎడ్లబండి మీద
మంగళాదేవి ఆలయానికి
తీసుకుని వచ్చి , ఆలయంలో
పూజలు చేసిన పిదపనే
పూరీ ఆలయంలోకి కలపను
తీసుకునివెడతారు.

పద్మాసనంలో ఆశీనురాలై దర్శనం అనుగ్రహిస్తున్న
మంగళాదేవి దివ్య సౌందర్యాన్ని
పొగడడానికి మాటలు చాలవు. ఒక హస్తమున
పాశం, మరియొక హస్తమున అంకుశము ధరించి, దర్శనమిస్తున్నది మాతా 'బాట'
మంగళా దేవి. మూడు నేత్రాలు కలిగిన మంగళా దేవిని దగ్గరకు వెళ్ళి దర్శించ
వచ్చును.  
దీపం తో హారతి యిచ్చి
మంగళాదేవిని భక్తులు
పూజిస్తారు. 
జగన్నాధుని దర్శించే భక్తులు
అందరూ ముందుగా 
మాతా'బాట'
 మంగళాదేవిని
దర్శనం చేసుకుంటారు. 
దుర్గా పూజలు, చైత్రమాస
పూజలు యీ ఆలయంలో
వైభవంగా జరుపుతారు.

ఒరిస్సాలోని పూరీ జగన్నాధస్వామి ఆలయానికి
మూడు కి.మీ దూరంలోనే
మాతా 'బాట' మంగళాదేవి
ఆలయం వున్నది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి