3, అక్టోబర్ 2020, శనివారం

చేయకూడని ధర్మాలు

*మానవుడు చెయ్యకూడని ధర్మాలు ఏంటో తెలుసా?*

                        పరిగెత్తే వారికి, ఆవిలించే వారికీ, తలస్నానం చేస్తున్న వారికి నమస్కరించకూడదు.   

 భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నదీ స్నానము, సముద్రస్నానము చెయ్యరాదు. అలాగే క్షౌరము, పర్వతారోహనము చెయ్యరాదు.      
                    * స్త్రీలను కాటుక పెట్టుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు చూడరాదు.       

 ఉదయించె, అస్తమించే సూర్యుడ్ని నీళ్ళలోనూ, అద్దంలోనూ చూడరాదు.        

తన నీడను తానే నీటిలో చూసుకొనుట, రత్రిపూట చెట్ల ఆకులను కోయుట, రాత్రిపూట బావిలో నీళ్ళు తోడుట చేయరాదు.                            

తలకూ, శరీరానికి నూనె రాసుకొని మల మూత్రాలు విడవరాదు.                           

భోజనం చెస్తున్న భార్యనూ, ఆవలిస్తున్న భార్యనూ, తుమ్ముతున్న భార్యనూ చూడరాదు. అలా చూడాల్సి వస్తె వెంటనే పక్కకు తిరగాలి.  

చతుర్దశినాడు క్షీరమూ, అమావస్యనాడు సంసారసుఖాన్ని గూర్చి మర్చిపోవాలి.  

                        అలాగే మొలత్రాడు లేకుండా మగవాడు ఎట్టి స్థితిలోనూ ఉండరాదు.                            

 గుమ్మడికాయను స్త్రీ ఎలా పగులకొట్టకూడదో, అలాగే పురుషుడు దీపాన్ని ఆర్పకూడదు.                         

నీళ్ళుత్రాగే జంతువులనూ, పాలు త్రాగుతున్న దూడనూ అదిలించరాదు. *సర్వేజనా సుఖినోభవంతు మీరు రాజు గురు స్వామి*🙏🏻

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి