7, అక్టోబర్ 2020, బుధవారం

సహనం చాలా అవసరం

🙏 *ఒక మంచి కథ*🙏 " *సహనం చాలా అవసరం*"
*చిన్న పిల్లలు చేసే చిన్న తప్పుల ను....పెద్దలు సహనం తో ...ఓర్పు తో క్షమించాలి....కానీ....సహనం కోల్పోయి వారిని కొట్టరాదు.....అని చెప్పే కథ..

*ఒక వ్యక్తి తన కొత్త కారు తుడుచుకుంటుండగా , అతని ఐదేళ్ల కూతురు అక్కడికి వచ్చింది*... *చేతికందిన రాయి తీసుకుని కారుకి ఒకవైపు గీతలు గీసేసింది...కోపం పట్టలేని ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ చిన్నారి పాపని కిందకి తోసేశాడు*... *అంతేకాకుండా ఆ తప్పుకి శిక్షగా ఆ చిన్నారి చేతుల మీద చితక్కొట్టేశాడు*...
.
*కాసేపటికి కోపం తగ్గాక , ఆ తండ్రి తన కూతురిని తీసుకుని ఆసుపత్రికి పరిగెత్తాడు*... *అక్కడి వైద్యులు చాలా కృషి చేశారు*... *కానీ , తండ్రి కొట్టిన దెబ్బలకి చిన్నారి చేతి వేళ్ళు ఎంతలా దెబ్బ తిన్నాయంటే , ఆమె రెండు చేతుల వేళ్లని తీసివేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పేశారు*...
.
*శస్ర్త చికిత్స పూర్తయింది... ఆ పాపాయి రెండు చేతులకి కట్లు కట్టేశారు*... *మెలకువ వచ్చాక పాపాయి అమాయకంగా చెప్పింది* " *నాన్న నీ కారు పాడు చేశాను ...నన్ను క్షమించు* " ... *అంతేకాదు ఆ తర్వాత ఇంకా ప్రశ్నించింది " నా వేళ్ళు మళ్లీ ఎప్పటికి పెరుగుతాయని* " ...
.
*ఈ ప్రశ్నకి జవాబులేదా తండ్రి దగ్గర , నోట మాట లేని స్థితిలో , తన మీద తనకే అసహ్యం పడుతుంటే , కారు దగ్గర కెళ్లి ఎడా పెడా తన్నడం మొదలెట్టాడు*...
.
*తనేం చేస్తున్నాడో తనకే అర్థమయ్యేసరికి నిస్ప్రహ ఆవరించింది...కారు ముందు కూలబడిపోయాడు*...*అప్పుడు కన్నీళ్లతో నిండిన కళ్లలోంచి చూస్తుంటే మసకమసకగా అక్షరాలు కనిపించాయి*... *కారు మీద కూతురు గీసిన గీతలు అవేనని అర్థమయ్యేసరికి , అవి రాసినందుకే తన చిన్నారిని క్రూరంగా హింసించి శాశ్వతంగా చేతివేళ్ళు పొగొట్టానన్న సంగతీ మనసుకి తెలిసేసరికీ ఆ తండ్రీ మనసు చెదిరిపోయింది* ...ఇంతకీ ఏం రాసిందంటే...
.
 *DADDY I LOVE YOU *
అని రాసివుంది.... *చిట్టితల్లి కి...నాన్న అంటే అంత ప్రేమ......
చిన్న పిల్లల పిచ్చి గీతల్లో......వారి యొక్క పిచ్చి ప్రేమ వుంట్టుంది.....అది మనము అర్థం చేసుకోవాలి*....
#ఆచరించే ముందు ఆలోచించండి ...సహనం కోల్పోవద్దు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి