12, అక్టోబర్ 2020, సోమవారం

అన్వేషణ

అన్వేషణ

జీవితంలో ఎదగాలంటే అన్వేషణ ఉండాలి.

అన్వేషణలో ముఖ్యమైనది జిజ్ఞాస. 

ఏదైనా 

ఇది ఏమిటీ, 

ఇది ఎలా, 

ఇదే ఎందుకు, 

ఇది ఎవ్వరూ,

ఇది ఎప్పటిది, 

ఇది ఏక్కడిది 

ఇలా ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలు వెతకాలి. 

ఈ ప్రశ్నలేవో సామాన్యంగా ఉన్నాయి అనిపిస్తాయి కానీ మనం అంతర్ముఖం అయ్యి ఈ ప్రశ్నలు వేసుకొని సమాధానాలు తెచ్చుకుంటే మన అవహాగన పెరుగుతుంది.

 ఉదాహరణకు 

ఏమిటి ఈ జీవితం? 

ఎందుకు పుట్టాను?

ఏమి చెయ్యాలి నేను?

ఏమి చేస్తున్నాను?

ఎందుకు నాకు ఇలా జరిగింది?

ఎందుకు నాకు ఇలా జరగలేదు?

అస్సలు నేనేవరు?

ఎక్కడినుంచి వచ్చా?

ఎక్కడికి పోతా?

ఇక్కడికే ఎందుకు వచ్చా?

ఇక్కడ ఉన్నవి అన్ని నావేనా?

వీటిని నాతో ఈ లోకం వదిలి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్లవచ్చా?

ఈ శరీరము లోకి రాక ముందు నేను ఎక్కడ ఉన్నాను?

ఎందుకు ఈ శరీరంలో కి వచ్చాను?

ఈ శరీరం వదిలాక ఎక్కడికి పోతా?

ఇలా ప్రశ్నలు వేసుకొని వాటికి సమాధానాలని గ్రంధముల ద్వారా కానీ, 
సత్పురుషులతో సంభాషణ ద్వారా కానీ, 
ధ్యాన స్థితిలో కానీ తెలుసుకోవాలి. 

ఆ సమాధానాలు మనకి సంతృప్తి ని ఇవ్వాలి. 

అలా ఇవ్వనంత వరకు అన్వేషణ కొనసాగించాలి. విశ్రమించకూడదు. 

ఒకవేళ వీటికి నేను సమాధానాలు చెప్పినా అవి వెంటనే ఆమోదించకూడదు. 

తర్కము తో విచారించాలి. 

పెద్దలతో చర్చించాలి. మీరు తృప్తి పొందితే అప్పుడు ఆ సమాధానాలు అంగీకరించాలి.

మూల సూత్రం ఏమిటీ అంటే 
వెతుకు, వెతుకు, వెతుకు, 
వెతికితే దొరకనిది ఏది లేదు. 
నీవెవరో, నీవారెవరో, నీ ఉనికి ఏమిటి 

ఇలా అన్నిటి గురించి 

వెతికి వెతికి వెతికి 

తెలుసుకో.

ఏమంటారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి