7, అక్టోబర్ 2020, బుధవారం

భగవంతుని కృపయనే వల

*భగవంతుని కృపయనే వల!*
➖➖➖✍️

ఓ కనస్ట్రక్షన్ సూపర్ వైజర్… 16 వ ఫ్లోర్ నుంచి క్రింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వర్కర్ ని పిలుద్దామని ప్రయత్నిస్తున్నాడు.....ఓయ్ వీరన్నా......వీరన్నా......అని గట్టిగా అరుస్తూ......
కానీ ఆ శబ్ధాలకు…ఈ సూపర్ వైజర్ పిలుపు అతనికి వినపడటం లేదు
అతని అటెక్షన్ కోసం… ఏం చేయాలా అని ఆలోచించి
ఓ పది రూపాయల నోటు ని క్రిందకు విసిరాడు..ఆ వర్కర్ మీదకు
ఆ వర్కర్…దాన్ని తీసుకుని జేబులో పెట్టుకుని, కొద్దిగా కూడా తల పైకి ఎత్తకుండా తన పని కంటిన్యూ చేస్తున్నాడు....

దాంతో ఈ సారి..పెద్ద మొత్తంగా ఓ 500 నోటుని క్రిందకి పడేసాడు…అప్పుడు కూడా వర్కర్ సేమ్ ఫోజ్…ఏం పట్టించుకోకుండా సీరియస్ గా దాన్ని తీసుకుని జేబులో పెట్టుకుని పనిచేసుకుంటున్నాడు.

ఒళ్లు మండిన సూపర్ వైజర్ ..ఇది కాదు పని అని…...ఓ చిన్న రాయి తీసుకుని వర్కర్ మీదకు విసిరాడు….
ఈ సారి ..ఆ దెబ్బ తిన్న వర్కర్..తల పైకెత్తి ఎవరు విసిరారా అని కోపంగా చూసాడు…అప్పుడు పైన సూపర్ వైజర్ కనపడ్డాడు.

అచ్చం అలాగే జీవితంలో కూడా భగవంతుడు పై నుంచి మనతో కనెక్టు అవుదామని,కమ్యునికేట్ చేద్దామనుకున్నప్పుడు ఇలాగే ప్రయత్నిస్తాడు.

కానీ క్రింద ప్రాపంచిక ( డబ్బు, పదవి, కీర్తి, మోహం, బంధం అనే ) విషయాలతో బిజీగాఉంటాం మనం.
అప్పుడు ఆయన మనకు చిన్నవి,పెద్దవి ( డబ్బు, పదవి, కీర్తి, మోహం, బంధం అనే ) బహుమతులు ఇస్తాడు…అప్పుడైనా చూస్తామేమోనని.....

అయితే మనం వాటిని చక్కగా తీసుకుని వాటిని ఎంజాయ్ చేస్తూంటాం కానీ ఎవరు పంపారా అని పట్టించుకోం…భగవంతునికి కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేం…మన అదృష్టం బాగుంది. భలే లక్కి అని మనం మురిసిపోతాం..

అప్పుడు ఆయన ఆఖరి ప్రయత్నంగా ఓ రాయిని మన మీదకు విసురుతాడు. దాన్ని మనం సమస్య అంటూంటాం.
అప్పుడు ఎవరు విసిరారా దాన్ని చూసి, అప్పుడు కమ్యూనికేట్ చేయటం మొదలెడతాం…ప్రార్ధనతో..... దేవుడా ....రక్షించు...
ఆ సేవ చేపిస్తా....ఈ మ్రొక్కుబడి తీరుస్తానని.........హుడీలలో కోట్లు గుమ్మరించడం .... అలా కష్టాల్లో ఉన్నపుడు భక్తులుగా మారడం అనేది వ్యాపారిక భక్తి అవుతుంది..

దేవుడిచ్చినా ....ఇవ్వకపోయినా...ఉన్న దాంతో సంతృప్తి చెంది.... నిత్యం దైవస్మరణ చేయడం అలవాటు చేసుకోవడం వలన భగవంతుడు తప్పక కనెక్ట్ అవుతాడు.....

🌷🙏🌷

🙏సమస్త లోకా సుఖినోభవన్తు!🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి