26, జనవరి 2023, గురువారం

💐భక్తులు చేయకూడని పనులు💐

🌺 భక్తులు చేయకూడని పనులు 🌺

(నారదునకు శివుడు చెప్పెను)

1. స్నానము చేయకుండ దేవుని మూర్తిని తాకరాదు. 

2. అశుచిగా నుండియు (మలవిసర్జన చేసి) తాకరాదు. 

3. సాక్షాత్తు భోజనము చేసి పాదోదకమును పుచ్చుకొనరాదు.

4. నైవేద్యము లేకుండ పూజించరాదు.

5 దేవుడున్న స్థానమున కంటె ఎత్తైన యాసనమున తాను కూర్చుని పూజ చేయరాదు. 

6. ముట్టుతను (బహిట్టైన స్త్రీని చూచి పూజించరాదు.

7 గంటను నేలమీద నుంచరాదు.

8. పుష్పములను నీటితో తడపరాదు కడగరాదు.

9 పూజ చేసిన దేవునకు (పెద్దలకు) వీపు చూపరాదు.

10. దేవుని (గురుని) ఎదుట గిరగిర తిరగరాదు. ఆత్మప్రదక్షిణమనునది దేవుని (గురుని) చుట్టూ చేయవలెనే కాని ఎదుట చేయరాదు.

11. దేవుని యెదుట భోజనము చేయరాదు.

12. భోజనము చేయక, ఆకలితో నకనకలాడుతూ పూజ చేయరాదు.

13. పూజ చేయునపుడు కంబళము కప్పుకొనరాదు.

14. దేవుని పూజాగృహములో ముందు కుడికాలును వుంచవలెనే గాని ఎడమకాలు వుంచి ప్రవేశించరాదు.

15. దేవుని (పెద్దల) దగ్గర ఉమ్మి వేయరాదు.

16. నైవేద్యమును దైవ (గురు) ప్రసాదమని భావించవలెనే కాని, కొబ్బరి, పెసరపప్పు గారెలు యని వర్ణించరాదు.

17 దేవుని విగ్రహమును దేవుడని భావించవలెనేగాని, రాయి లోహము, పటము అని భావించరాదు.

18. భగవంతుని భజించు భక్తులను సామాన్య మానవులతో సమముగా చూడరాదు.

19. ఇతరుల కొఱకు (బంధుమిత్రాదుల కొఱకు) చేసిన పదార్థములను దేవునకు నివేదించరాదు.

20. సాధు సజ్జనులను నిందించగూడదు.

21. తీర్థ ప్రసాదములను తీసికొనునపుడు ఒంటిచేతితో తీసుకొనరాదు నేలపై తీరమును పడనీయరాదు.

22 పూజ చేయునపుడు ఇతరులతో మాట్లాడరాదు తలను గోకుకొనరాదు.

23 శివకేశములను భేదబుద్ధితో గాంచరాదు ఇతర మతస్థులను దూషించరాదు.

24. ఆచార్యుని (గురువుని) అవమానించరాదు.

25. వేదశాస్త్రములను నిందించకూడదు.

26. భగవన్నామ మందరవాదము చేయరాదు (అనగా భగవన్నామము భజించుచున్నంత మాత్రమున పాపములు నశించునా? అజ్ఞాన రహితమగునా?
యని యనరాదు).

27. భగవన్నామమును అండగా చేసికొని పాపపుపనులను చేయరాదు (అనగా భగవన్నామ స్మరణాదులు చేసి పాపములను పోగొట్టుకొనవచ్చుగదాయని తలంచి పాపకార్యములలో ప్రవేశింపరాదు). 

28. భగవన్నామ స్మరణ దానధర్మాదులతో సమమని తలంచరాదు.

29. శ్రద్ధలేని వారికి భగవన్నా మోపదేశమును చేయరాదు.

30 భగవన్నామ ప్రభావమును వినియు అవిశ్వాసముతో వర్తించరాదు. 

31. భగవన్నామ సంకీర్తన (స్మరణ) చేయుటయందు నాయంతటివాడు లేడు అని గర్వము కలిగియుండరాదు.

32 "స్నానే చ భోజనే హోమే జపే మౌనముపాశ్రయేతో స్నానము చేయుకా లమందు, భోజనము చేయునపుడు, హోమము చేయు సమయమందు, జపము చేయుకాలమందును మౌనముగా నుండవలయును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి