23, జనవరి 2023, సోమవారం

చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం


ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండవు.🌷

చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం



🌸చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట పట్టణంలో ఉంది. ఇది సూళ్లూరుపేట దక్షిణ కొన వద్ద, కాళంగి నది ఒడ్డున ఉంది.

🌸ఈ ఆలయం చెన్నై, తిరుపతి మరియు నెల్లూరు నుండి వరుసగా 79 కిమీ, 84 కిమీ మరియు 97 కిమీ దూరంలో ఉంది. ఇది నాలుగు మరియు ఐదవ శతాబ్దాలలో స్థాపించబడిందని చరిత్ర చెబుతోంది.

పురాణం 
🌸విగ్రహం యొక్క అత్యంత ఆసక్తికరమైన అంశం, దేవత యొక్క ఎడమ వైపు పార్వతిని వర్ణిస్తుంది, కుడి వైపున సరస్వతిని మరియు మధ్య భాగంలో శ్రీ మహాలక్ష్మిని వర్ణిస్తుంది. త్రికళే చెంగళి అనే పేరు రావడానికి ఈ లక్షణాలే కారణం. చోళ పండితుడు దేవత విగ్రహాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందాడు. ఇక్కడ ఆమె చిహ్నం ఎనిమిది చేతుల రూపాన్ని వర్ణిస్తుంది, ప్రతి ఒక్కరూ శక్తివంతమైన ఆయుధాన్ని రాక్షసుడిపై నిలబడి ఉన్న భంగిమలో విస్తృతమైన మరియు సాటిలేని సౌందర్యాన్ని కలిగి ఉన్నారు, దేవి పార్వతి దేవి మాత్రమే కాదు, మహాకాళి కూడా అని భావించారు. 

🌸సుమారు 10వ శతాబ్దంలో, ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని పాలించిన చోళ సామ్రాజ్యం, కాళంగి నదిలో ఉద్భవించిన దేవత గురించి తెలుసుకుని శ్రీ చెంగాళమ్మకు ఒక చిన్న గుడిసెను నిర్మించారు.

🌸ప్రారంభంలో, దేవతను "తెంకాళి (దక్షిణ కాళి)" అని పిలిచారు, తరువాత "చెంగాలి" మరియు ఆ తర్వాత ప్రస్తుతం చెంగాళమ్మ అని పేరు పెట్టారు.

చరిత్ర 
🌸ఆలయ చరిత్ర 10వ శతాబ్దం నాటిది. గ్రామగ్రామాన అమ్మ శక్తిగా వెలసి ఒక్కో పేరుతో పిలిపించుకుంటూ, సహస్ర నామదారిని ప్రజలను కన్న బిడ్డల వలే కాపాడుతుంది. జగన్మాతకు ఉన్న అనేక దేవాలయాల్లో కొన్ని భక్తి లోకంలో విపరీతమైన విశ్వాసాన్ని కలిగించాయి. అమ్మ ఎక్కడైనా అమ్మే! కానీ భక్తులకు కలిగిన అనుభవాలే వారిలో నమ్మకాన్ని పెంచాయి.అలా అమ్మ ఇక్కడ స్థిర నివాసముంటున్నది అనే భావన, అపూర్వ అనుభూతిని కలిగించే ఆలయాల్లో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం ఒకటి. మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో తమిళనాడుకి సరిహద్దులో ఉన్న సూళ్లూరు పేటలో కొన్ని వందల సంవత్సరాలుగా పూజలందుకొంటున్నది శ్రీచెంగాలమ్మ. 

🌸పదో శతాబ్ద కాలంలో ఈ గ్రామం పేరు శుభ గిరి పదో శతాబ్ద కాలంలో ఈ గ్రామం పేరు ‘‘శుభ గిరి''. ఒక గొల్లపల్లె. రోజూ మాదిరిగానే పశువులను మేతకు తోలుకెళ్ళారు. సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకునేముందు సమీపంలోని పవిత్ర కళంగి నదిలో ఈతకు దిగిన కొందరు నీటి ప్రవాహం వేగానికి సుడిలో చిక్కుకుని కొట్టుకునిపోతూ, ఒక శిలను పట్టుకుని, ఆ ఆసరాతో ఒడ్డుకు చేరుకున్నారు.



🌸నీటీ ఉదృతి తగ్గిన తర్వాత చూస్తే అష్ట భుజాలతో వివిధ ఆయుధాలు ధరించ పాదాల క్రింద దానవుని దునుముతున్న దేవి విగ్రహం పశువుల కాపరి చూసి గ్రామా పెద్దలకు విన్నవించగా.. గ్రామస్తులు వచ్చి అమ్మవారి విగ్రహం ఒడ్డుకు తీసుకునివచ్చి ఒక రావి వృక్షం క్రింద తూర్పుముఖంగా ఉంచారు. మరుసటి రోజు వచ్చి చూడగా అమ్మవారి విగ్రహం దక్షిణ ముఖముగా నీటారుగా నిలబడి మహిసాసుర మర్ధిని స్వయంభుగా వెలసి ఉండడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యంలో మునిగిపోయారు.

🌸అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు కలలో కనబడిన అమ్మవారు కనబడి, తాను అక్కడే ఉండదలచానని చెప్పడంతో చిన్న ఆలయాన్ని నిర్మించారు. అసుర సంహారిని అయినా శాంతి మూర్తిగా కొలువుతీరడం వల్ల "తెన్ కాశీ" ( దక్షిణ కాశి ) అని పిలిచేవారు.

🌸ఏడు సంవత్సరాలకొకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా కాల క్రమంలో అదే "చెంగాలి" గా "చెంగాలి పేట"గా పిలవబడి, చివరకి ఆంగ్లేయుల పాలనలో సూళ్ళూరు పేటగా మారిందంటారు. ఊరి పేరు వెనక మరో కారణం కూడా చెబుతారు. ఏడు సంవత్సరాలకొకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద "సుడి మాను" తిప్పటం ఒక ఆచారంగా వస్తోంది. అదే సూళ్ళూరు పేటగా రూపాంతరం చెందినదని అంటారు.

ఆలయ విశేషాలు :
🌸సువిశాల ప్రాంగణంలో ఆలయ సముదాయం నిర్మించబడి ఉంటుంది. తూర్పు వైపున స్వాగత ద్వారం, రాజ గోపురం నిర్మించారు. ఉప ఆలయాలలో గణపతి, లింగ రూప కైలాసనాధుడు, నాగ దేవతలు కొలువుతీరి దర్శనమిస్తారు. నూతనంగా నిర్మించబడిన ప్రధానాలయం ముఖ మండపంలో నవ దుర్గా రూపాలను సుందరంగా మలచి, నిలిపారు.

🌸గర్భాలయంలో సర్వాలంకరణభూషితగా శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి గర్భాలయంలో సర్వాలంకరణభూషితగా శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి కొలువై ఉంటారు. రోజంతా భక్తుల సందర్శనార్ధం తెరిచి ఉండే ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండవు. చాలా సంవత్సరాల క్రిందట ఒక దొంగ ఆలయం లోనికి ప్రవేశించి భంగపడ్డాడట. అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారట. కానీ అమ్మవారు స్వప్నంలో " నాకు నా భక్తులకు మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదు" అని తెలపడంతో వాటిని ప్రాంగణంలో ఒక చోట ఉంచారట. ఎండిపోయి, చెక్కబడిన కలప నుండి ఆశ్చర్యకరంగా మొక్క మొలిచి పెద్ద వృక్షంగా ఎదిగింది. ఇది శ్రీ చెంగాలమ్మ మహత్యమా అన్నట్లుగా వృక్ష మూలంలో అమ్మవారి రూపం సాక్షత్కరించడం ఒక విశేషంగా పేర్కొనవచ్చును.

🌸ఈ వృక్షం దగ్గర నాగ లింగం ఈ వృక్షం దగ్గర నాగ లింగం, నవ గ్రహ మండపం ఉంటాయి. సంతానాన్ని కోరుకొనే దంపతులు ఈ పవిత్ర వృక్షానికి గుడ్డతో ఊయలలు కడతారు. నియమంగా ప్రదక్షిణలు చేస్తారు.

పూజలు ఉత్సవాలు : 
🌸ప్రతి నిత్యం నియమంగా ఎన్నో రకాల పూజలు, అర్చనలు, సేవలు శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరికి జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ప్రీతికరమైన నవ కలశ అభిషేకం, మహా చండీ యాగం ఆర్జిత సేవలుగా భక్తుల సౌకర్యార్ధం నిర్వహిస్తున్నారు. వివాహము, ఉపనయనం,పిల్లలకు తొలిసారి చెవులు కుట్టించడం, అక్షరాభ్యాసం లాంటివి జరుపుకోడానికి దేవాలయంలో తగిన ఏర్పాట్లు ఉన్నాయి. విశాల మండపము, వసతి గదులు అందుబాటులో ధరలతో దేవస్థానం ఏర్పాటు చేసింది. గణపతి నవ రాత్రులు, ఉగాది, మహాశివరాత్రి, నాగుల చవితి సందర్భాలలో భక్తులు వేలాదిగా పాల్గొంటారు. దసరా నవ రాత్రులలో ఆలయ శోభ మరింతగా పెరుగుతుంది. మన రాష్ట్రం నుండే కాక తమిళ నాడు నుండి కూడా భక్తులు తరలి వస్తారు.

సుళ్ళు ఉత్సవం : 
🌸సూళ్ళూరు పేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి కి ఏడు సంవత్సరాల కొకసారి మే - జూన్ నెలల మధ్య బ్రహ్మ్హోత్సవాలు జరుపుతారు. ఏడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు సుడిమాను ప్రతిష్ట, బలి హరణ తో ప్రారంభం అవుతాయి. రెండో రోజునుండి నాలుగో రోజు వరకు సుడి మానుకు చక్రం, నల్ల మేక, పూల మాల, పాలవెల్లి, మనిషి బొమ్మ కట్టి సుళ్ళు తిప్పుతారు. మూడో రోజున మహిషాసుర మర్దన అంటే దున్నపోతు బొమ్మ తలను నరకడం జరుగుతుంది. లోక కంటకుడైన మహిషాసురుని మహాకాళి సంహరించి లోకాలను కాపాడినందుకు ఆనందించిన ప్రజలు అయిదో రోజున కాళింది నదిలో అమ్మవారికి ఘనంగా తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆఖరి రోజున పరమేశ్వరిని పుష్ప పల్లకిలో ఊరేగిస్తారు. ఈ ఏడు రోజులు అమ్మవారిని గ్రామంలో అశ్వ, సింహ, నంది ఇలా రోజుకో వాహనం మీద ఊరేగిస్తారు.

🌸మహిమ గల తల్లిగా, కోరిన వారాలను ప్రసాదించే పరమేశ్వరిగా కొలువుతీరిన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరీ ఆలయం, నెల్లూరు పట్టణానికి వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న సూళ్ళూరు పేట లో ఉన్నది. చెన్నై వెళ్ళే రైళ్ళలో అధిక శాతం సూళ్ళూరు పేటలో ఆగుతాయి. నెల్లూరు, తిరుపతి పట్టణాల నుండి బస్సులు ఉన్నాయి. సూళ్ళూరు పేటలో యాత్రీకులకు కావలసిన అన్ని సౌకర్యాలు లభిస్తాయి.

🌸శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం ఇక్కడే ఉన్నది.ప్రసిద్ది చెందిన నేలపట్టు విదేశీ పక్షుల కేంద్రంప్రసిద్ది చెందిన నేలపట్టు విదేశీ పక్షుల కేంద్రం, పులికాట్ సరస్సు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాయి.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి