15, జనవరి 2023, ఆదివారం

ధర్మసందేహం


నోముకీ, వ్రతానికీ తేడా?

మనస్సుని కేవలం భగవంతునిపైనే లగ్నం చేసి స్వామిని పూజించి ధ్యానం చేసేదే నోము. అనగా శ్రావణమంగళవారం నోము, తిరుప్పావై నోము, ఉండ్రాళ్ళ తద్ది నోము, అట్లతద్ది నోము వంటివి. సన్నని చిల్లులు పడేలా అట్లు పోసి ముత్తైదువులకు భక్తిపూర్వకంగా ఇవ్వటము అట్లతద్ది నోము విధానంలో ఉంటుంది. అటువంటి దైవ సంబంధిత ఆరోగ్య, పుణ్యాలనిచ్చేవి నోములు.

అత్యంత నియమనిష్ఠలతో, మంత్రోచ్ఛాటనలతో, ధూప దీప నైవేద్యాలతో సేవించేది వ్రతము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి