14, జనవరి 2023, శనివారం

భోగి పండ్లు ఎందుకు పోస్తారు?

భోగి రోజున రేగుపళ్ళు పిల్లలని కూర్చోబెట్టి, వాళ్ళ మీద నించి ఎందుకు కిందకి విడిచి పెడతారు?

భోగి పండుగ నాటికి అమ్మవారి అనుగ్రహం రేగు పండులోనికి ప్రవేశిస్తుంది. అందుకే చిన్నపిల్లలకి జాతకరీత్యా ఏమైనా ఇబ్బందులుంటే తొలగించటానికి, వాళ్ళు కూర్చొని పెద్ద పెద్ద యజ్ఞ యాగాది క్రతువులని నిర్వహించలేరు కనుక చిల్లర పైసలు, బంతిపూలు, రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, కొబ్బరి ముక్కలు ఇటువంటివి కలిపి పెద్ద వాళ్ళు పిల్లలని కూర్చోబెట్టి వాళ్ళ మీద నించి ఈ పదార్ధాలని కిందకి విడిచి పెడతారు. ఈ పదార్ధాలు వాళ్ళ మీద నించి కిందకి పడిపోతే, భోగి పీడ తొలగిపోయి, వాళ్ళు సంతోషంగా జీవితం గడపటానికి ఏ అనారోగ్యం ప్రతిబంధకంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందో అటువంటి అవకాశం తొలగిపోయి, వాళ్ళు ఉత్తరోత్తర జీవితంలో సంతోషంగా ఉండటానికి కావలసిన వ్యవస్థ ఏర్పడుతుంది. అందుకే భోగిపీడ తొలగించుకొనే అద్భుతమైన రోజు భోగి పండుగ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి