17, జనవరి 2023, మంగళవారం

దనంజయుడు

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

               *ధనంజయుడు*
                  ➖➖➖✍️

*"శత్రుర్వినశ్యతి.... ధనంజయ కీర్తనేన..." ధనంజయుడు అంటే అర్జునుడు, ధనాన్ని జయించినాడు కదా! అందుకు ధనంజయుడు అయ్యాడు.* 

*కొంతమంది "ధనుంజయుడు" అంటారు, అది సరికాదు.;;; మొట్ట మొదటి వాక్యమునకు అర్థము ఏమిటంటే, ధనంజయుడు అయిన అర్జునుడిని కీర్తిస్తే అంటే అర్జునుని గుణ గణములను వింటే మన శత్రువులు నశిస్తారు అంటుంది, పై వాక్యం.* 

*"అర్జున" అంటే... ఆర్జనాత్ ఇతి అర్జునః... బాగా ఆర్జుంచువాడు, ఏమి ఆర్జించును, ధనాన్ని ఆర్జుంచును, తపో బలాన్ని ఆర్జించును, (మిగిలిన పాండవులు అరణ్య వాసమును చేస్తూ వున్న 12 సంవత్సరముల కాలము "పాశుపత" మొదలగు అస్త్ర శస్త్రములను తన తపస్సుతో ఆర్జించినాడు కదా!!!) కృష్ణ ప్రేమను కూడా ఆర్జించినాడు, మరియు అనేక రకాల సంపదలు ఆర్జించినాడు కనుక "అర్జునుడు" అయ్యాడు.* 

*ఇంకా "అర్జున" అంటే ఋజుత్వాత్ ఇతి అర్జునః అంటే ఋజు ప్రవృత్తి కలవాడు, ఎట్లా!!! ‘కృష్ణా! నాకు నువ్వుంటే చాలు నువ్వు ఆయుధం పట్టక పోయినా ఫర్లేదు, నాకు ఆ 10,000 మంది "నారాయణ గోపాల సైన్యం" కంటే నువ్వే గొప్ప. నాకు రెండవ ఆలోచన లేదు!’ అని ఖరాఖండీగా చెప్తాడు. అది ఋజుత్వం!* 

*”విరాట మహారాజా!!! నేను మీ అమ్మాయికి విద్య నేర్పాను, ఆమె నా కూతురుతో సమానం, నీ కూతురును నాకిచ్చి వివాహం చేయడం తగదు, నీకు అంతగా మా మీద అభిమానం, గౌరవం చూపాలి అని అనిపిస్తే నా కుమారుడు అయిన "అభిమన్యునికి" నీ కూతురిని ఇవ్వు, కోడలంటే కూతురే కదా!!! అంటాడు. అది ఋజుత్వము అంటే!*

*“అమ్మా! నేను ఇంద్ర అంశ తో జన్మించాను, నువ్వు ఇంద్ర సభలో ఇంద్రుడు చూస్తూ ఉండగా నాట్యములు చేస్తావు, అంటే నువ్వు నాకు తల్లితో సమానము అమ్మా!!! అని తనకు తానుగా కోరి వచ్చిన దేవ కన్యతో అంటాడు, అది ఋజుత్వము అంటే!!! * 

* కనుక "ఆర్జానాత్ అర్జునః"..., మరియు... ఋజుత్వాత్ అర్జునః!*

. 🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి