27, జనవరి 2023, శుక్రవారం

ఆచార్య భోధన

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

              *ఆచార్య సద్బోధన:*
                  ➖➖➖✍️

*చెప్పులు లేకుండా...*
*దేవాలయంలోకి ప్రవేశించే ముందు పాదరక్షలు బయటే విడిచి, కాళ్లు కడుక్కోవాలనేది మన సంప్రదాయం. ఈ నియమంలో ఆరోగ్యం, ఆధ్యాత్మికత ఇమిడి ఉన్నాయి.*

*గుడి ప్రాంగణాన్ని పవిత్రంగా భావించా లనేది ముఖ్య కారణం. ఆ సంగతలా ఉంచితే ఆలయంలో మంత్ర పూర్వకంగా స్థాపించిన యంత్రాల వలన గుడిలో అనుకూల శక్తి వ్యాపించి ఉంటుంది.*

*స్వయంభూ దేవాలయాలైతే విగ్రహాలను ప్రతిష్టించినవారి దైవిక శక్తి, తపశ్శక్తి తదితర శక్తుల సమాహారంతో ఆ నేల భాగం అయస్కాంత శక్తితో ప్రేరేపితమై ఉంటుంది.* 

*ఆ శక్తుల ప్రభావం మన శరీరంలోకి ప్రవహించడం ఆరోగ్యప్రదం. అందుకు ప్రధాన వాహకాలు పాదాలే. భూమి నుంచి వెలువడే సానుకూల తరంగాలను స్వీకరించే శక్తి పాదాల్లోనే ఉంటుంది.*

*అంటే పాదాలు మనిషి లోని సర్వ శక్తులకూ ఆలంబనలు. వివిధ శరీర భాగాల్లోని నాడుల చివరలు పాదాల్లో ఉంటాయి. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆ నాడులన్నీ ఉత్తేజితమై ఆరోగ్యం బాగుంటుంది.* 

*అలాగే ఆలయ పరిసరాల్లో ఉండే పూలమొక్కలూ, ఔషధ వృక్షాలూ కూడా అనుకూల శక్తిని వ్యాప్తి చేస్తాయి.*

*ఇక విగ్రహాన్ని అభిషేకించిన జలాదులతో పవిత్రమయ్యే నేలపై పాదాన్ని మోపడం వల్ల భక్తుడు అనుకూల శక్తి పొందుతాడు.*

*లౌకికంగా చూస్తే... పాదరక్షలు ధరించకపోవడం వల్ల గర్వం, అహం లాంటివి తొలగిపోతాయి.*

*ఇలా మానసిక, శారీరక శ్రేయస్సు కోసం చేసిన ఏర్పాటిది. ప్రస్తుతం చేస్తున్న అయస్కాంత చికిత్స ప్రాచీన కాలంలోనే ఉండేది. అందువల్లే పాదరక్షలు లేని పాదాలతోనే ఆలయంలో ప్రవేశించాలన్నారు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి