30, జనవరి 2023, సోమవారం

🌹విధి 🌹

*విధి* 
                 

*తన చివరి శ్వాసను విడుస్తున్న , జటాయువు… ‘నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అని అనుకుంటారు!’*

*రావణుడు జటాయువు యొక్క రెండు రెక్కలను తెంచినప్పుడు… అప్పుడు మృత్యువు వచ్చింది. అపుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు…*

*"జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరుకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం ‘ప్రభు శ్రీరాముడి’కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు” అన్నాడు!*

*మరణం జటాయువును తాకలేకపోతోంది, అది నిలబడి వణుకుతూనే ఉంది. మరణం అప్పటివరకు కదలకుండా నిల్చునే వుంది, వణుకుతూనే ఉంది. తాను కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది.*

*కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు 58 రోజులు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళలో కన్నీళ్ళు. ఏడుస్తూవున్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను చిరునవ్వు నవ్వుతున్నారు!*

*ఈ దృశ్యం చాలా అలౌకికమైనది.*

*రామాయణంలో జటాయువు శ్రీరాముడి ఒడిలో పడుకున్నాడు. ప్రభు "శ్రీరామ్" ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు.*

*అక్కడ మహాభారతంలో…’* 

*భీష్మ పితామహుడు ఏడుస్తున్నాడు మరియు "శ్రీ కృష్ణుడు" చిరునవ్వు నవ్వుతున్నాడు.* 

*తేడా ఉందా లేదా?*

*అదే సమయంలో , జటాయువుకు ప్రభువు "శ్రీరాముడి" ఒడి పాన్పుగా అయింది. కాని భీష్మపితామహుడు చనిపోయేటప్పుడు బాణపు మొనలు పాన్పుగా అయ్యాయి!*

*జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు "శ్రీరాముడి" యొక్క ఒడిలో ప్రాణ త్యాగం చేసాడు. జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు. మరియు బాణాలపై భీష్మపితామహుడు ఏడుస్తున్నాడు.*

*ఇంత తేడా ఎందుకు?*

*ఇంతటి తేడా ఏమిటంటే..,*

*ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో పరువు తీస్తున్నా భీష్మ పితామహుడు చూశాడు. అడ్డుకోలేకపోయాడు!దుశ్శాసనునికి ధైర్యం ఇచ్చారు. దుర్యోధనుడికి అవకాశం ఇచ్చాడు. కాని ద్రౌపది ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ, అరుస్తూ,అరుస్తూ వున్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే వున్నాడు. ద్రౌపదిని రక్షించలేదు.*

*దీని ఫలితం ఏమిటంటే, మరణం కోరుకున్నప్పుడే వరం వచ్చిన తరువాత కూడా, బాణాల అంపశయ్య దొరికింది.*

*జటాయువు స్త్రీని సన్మానించాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, కాబట్టి చనిపోతున్నప్పుడు, అతనికి ప్రభు “శ్రీరాముడి” ఒడి అనే పాన్పు లభించింది!*

*ఇతరులుకు తప్పు జరిగిందని చూసి కూడా ఎవరు కళ్ళు తిప్పు కుంటారో, వారి గతి భీష్ముడిలా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ, ఇతరుల కోసం పోరాడుతారో వారు, మహాత్మ జటాయువులా కీర్తి సంపా దిస్తారు.* 

*నిజం అనేది కలత చెందుతుంది, కానీ ఓడిపోదు.*

"*సత్యమేవ జయతే "*🙏🙏

సోమరితనం

ఒక బిచ్చగాడు పొద్దున్నే రోడ్డు పైన కూర్చుని భగవంతుడిని పెద్ద పెద్ద కేకలు పెడుతూ తిడుతున్నాడు. 

ఆ దారినే ఆ దేశపు రాజుగారు గుఱ్ఱం మీద వెళుతు 
ఈ కేకలన్నీ విన్నాడు..

       " ఏమైంది నీకు ! ఇంత పొద్దున్నే భగవంతుడిని తిడుతున్నావు ! అన్నాడు.

      " మీకెమిటి ! మహారాజులు ! మిమ్మల్ని భగవంతుడు ఒక రాజు గారి కుమారుడిగా పుట్టించాడు ! మీరు చక్కగా మహారాజు అయిపోయారు.... 

నా ఖర్మ ఇలా ఉంది..ఒక రూపాయి కూడా లేని
దరిద్రుడిగా పుట్టించాడు.. చూడండి..
దేవుడికి ఎంత పక్షపాతమో! అన్నాడు..

     మహారాజు చిరునవ్వు నవ్వాడు,
 " అయితే భగవంతుడు నీకేమి ఇవ్వలేదు !! 
చిల్లిగవ్వ కూడా ఇవ్వ లేదు అంతేగా ! "" అన్నాడు.

      " నిజం చెప్పారు మా రాజా ! " అన్నాడు బిచ్చగాడు.

   " సరే అయితే ! నీకు పది వేల వరహాలు ఇస్తాను .
నీ అరచేయి కోసి ఇస్తావా ! అన్నాడు రాజుగారు.

    " భలేవారే ! అర చేయి లేక పోతే ఎలా ! " అన్నాడు ఆ బిచ్చగాడు.

" సరే ! నీ కుడి కాలు మోకాలి వరకు కోసుకుంటాను... ఒక లక్ష వరహాలు ఇస్తాను..ఇస్తావా ! " అన్నాడు రాజుగారు.

  " ఎంత మాట ! ఆ గాయం మానడానికి ఎంత కాలం పడుతుందో ఏమిటో ! ఇవ్వను ! "అన్నాడు బిచ్చగాడు.

  " అన్నింటినీ కాదంటున్నావు....... 
ఆఖరిగా అడుగుతున్నా...... పది లక్ష ల వరహాలు ఇస్తాను... నీ నాలుక కోసి ఇస్తావా! అన్నాడు రాజుగారు.

     " అమ్మో! మీరు నా జీవితాన్ని ఆడిగేస్తున్నారు. 
ఇవి లేకపోతే నేను ఎలా జీవించను ?? అన్నాడు బిచ్చగాడు.

 " ఓహో ! అయితే నువ్వు పేదవాడివి కాదన్నమాట !!

 నీ దగ్గర పదివేల కన్నా విలువైన అరచేయి, 
లక్ష రూపాయిల కన్నా విలువైన కాళ్ళు, 
పది లక్షల కన్నా విలువైన నాలుక ......
ఇంకా ఎంతో విలువైన శరీర అవయవాలు 
ఉన్నాయి కదా ......?? 

మరి ఇంత విలువైన శరీరాన్ని 
నీకు ఉచితంగా ఇచ్చిన భగవంతుడికి 
పొద్దున్నే నమస్కారం పెట్టకుండా నిందిస్తావా !! 

ఈ శరీరాన్ని ఉపయోగించి  
లోకానికి సేవ చేసి పొట్ట పోసుకో ! 
అందరూ అదే చేస్తున్నారు...ఫో ఇక్కడనుండి.! 
అన్నాడు రాజుగారు.

సోమరితనం మనిషిని మరింత నాశనం చేస్తుంది.

 ఎదుటి వారిని చూసి ఏడవడం కాదు. 
ఆ విధంగా పైకి ఎదగడానికి కష్ట పడి పని చేయాలి. అటువంటి ఆలోచన మనసులో బలంగా ఉండాలి.

 మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. 
అంతే తప్ప కస్టపడడానికి సిగ్గు పడితే 
జీవితం నాశనం అవుతుంది. 

సోమరితనం 
మనిషిని మరింత చెడ్డ వ్యక్తిగా మారుస్తుంది... జీవితంలొ గొప్ప వ్యక్తి గా ఎదగడానికి కృషి చేయాలి...

29, జనవరి 2023, ఆదివారం

భీష్మ పంచకం

_*🚩 భీష్మ పంచకం🚩*_

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*భీష్మాష్టమి మొదలుకొని భీష్మద్వాదశి వరకూ ఉన్న ఐదు రోజులనూ భీష్మ పంచకం అని పిలుస్తారు.*

వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు. కానీ భీష్ముడే కనుక లేకపోతే భారతమే లేదు ! తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లు పోతుందో అన్న సంశయంతో.... ఆజన్మాంతం పెళ్లి చేసుకోనంటూ *‘భీషణ’* ప్రతిజ్ఞ చేసిన ధీరుడు.

భీష్మునికి తను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంది. అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్నా... ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకూ వేచి ఉన్నాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత అష్టమి రోజున , తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్ముని వేడుకున్నాడు. భీష్ముడు జీవితం యావత్తూ పరిపక్వంగానే గడిచింది. ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురువృద్ధుడు. 

తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు , రాజనీతిలోని సారాంశమంతా బోధించారు. పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుని వేనోళ్ల స్తుతిస్తూ విష్ణు సహస్ర నామాన్ని పలికారు. అలాంటి భీష్ముని కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తరువాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకొంటున్నాము.

ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికీ వర్తిస్తాయి. దశమినాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకూ ఉపవాసం ఉండమనీ , ఏకాదశి రాత్రివేళ జాగరణ చేయమనీ పెద్దలు సూచిస్తారు. దీంతో పాటుగా విష్ణు పూజకు ఈ వేళ విశేష ప్రాధాన్యం ఉంటుంది. భీష్ముడు అందించిన విష్ణుసహస్రనామాలను ఈనాడు జపిస్తే , విశేష ఫలితం దక్కుతుంది. అందుకనే ఈ రోజుని శ్రీ విష్ణు సహస్ర నామ జయంతి అని కూడా పిలుచుకోవడం జరిగినది . భగవద్గీతను పఠించేందుకు కూడా ఇది అనువైన రోజని అంటారు.

*భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు.* ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని ఓ నమ్మకం. అందుకనే ఆ పేరు. ఇక భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే ! ఆచార్యునిగా , భరతవంశంలోని ఆది పురుషునిగా ఆయన మనకు స్మరణీయుడు. అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని సూచిస్తారు. భీష్ముని తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయని పెద్దలు చెబుతారు. 

రథసప్తమి నుంచి సూర్యుని తీక్షణత పెరుగుతూ వస్తుంది కాబట్టి , బహుశా ఈ సూచని చేసి ఉంటారు. *భీష్మాష్టమి మొదలుకొని భీష్మద్వాదశి వరకూ ఉన్న ఐదు రోజులనూ భీష్మ పంచకం అని పిలుస్తారు.* ఈ అయిదు రోజులూ భీష్ముని వ్యక్తిత్వాన్ని తలచుకుంటారు. భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ అయిదు రోజులనూ కేటాయిస్తారు. మనం తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోని ఆచారం ఇది. పైగా భీష్మ ఏకాదశినాడు ఉపవాసం ఉంటూ , విష్ణుసహస్రనామాలను జపిస్తూ , 
భగవద్గీతను పఠిస్తూ , భీష్ముని తల్చుకుంటే సాగే క్రతువుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

27, జనవరి 2023, శుక్రవారం

🌸ఆడపిల్ల ఉన్న తండ్రి గురించి దశరథ మహారాజు మాటలు 🌸

♦️ *🍃🪷 ఆడపిల్ల ఉన్న తండ్రి అంటే ఏమిటో అద్భుతంగా చెప్పిన దశరథుని మాటలు..*♦️👇 : 

▪️ *దశరథ మహారాజు తన నలుగురు కొడుకులతో కూడిన వివాహ శోభాయాత్రను తీసు కుని, జనక మహారాజు ద్వారం వద్దకు వెళ్ళాడు.*

▪️ *అప్పుడు జనక మహారాజు, వారి వివాహ శోభాయాత్రకు సాధరపూర్వకస్వాగతంచెప్పాడు.*

▪️ *వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్లి, జనక మహా రాజుకుపాదాభివందనంచేశాడు.*

▪️ *అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు యొక్కభుజం తట్టి పైకి లేపి సంతోషంతో కౌగ లించుకుని…*

▪️ *“రాజా! మీరు పెద్దవారు.. పైగా వరుని పక్షంవారు..!*
*ఇలా మీరు నాకు పాదాభి వందనం చేయడం ఏమిటి?*
*గంగానది వెనక్కు ప్రవహించ డం లేదు కదా?”అనిఅన్నాడు..*

▪️ *అప్పుడు దశరథ మహా రాజు అద్భుతమైన, సుందర మైన జవాబు చెప్పాడు..*

▪️ *”మహారాజా, మీరు దాతలు.. కన్యను దానం చేస్తున్నారు..*

▪️ *మహారాజును అయినా మా అబ్బాయికి పిల్లనివ్వమని మీతో సంబంధం కోసం కోరుకుంటున్న యాచకున్ని, మీ ద్వారా నా కొడుక్కి కన్యను పొందాలని వచ్చాను..*

▪️ *ఇప్పుడు చెప్పండి.. దాత - మరియు, యాచకులలో ఎవరు పెద్ద? ఎవరు గొప్ప?” అని అన్నాడు.*

▪️ *ఆ మాటలను విన్న జనక మహారాజు కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు రాలుస్తూ.. ఇలా అన్నాడు..*

♦️▪️ *“ఏ గృహంలో అయితే కూతుళ్లు ఉంటారో..వాళ్ళు భాగ్యవంతులు. ప్రతీ కూతురు అదృష్టంలో తండ్రి ఉంటాడు.”*

▪️ *ఇదీ భారతీయత సనాతన సంప్రదాయ సంస్కృతి..*

              *🥀 జై శ్రీ రాం

🕉️ జై భారత్, జై హింద్, జై శ్రీ రామ్, జై జై శ్రీ రామ్! మేరా భారత్ మహాన్! హరిః ఓమ్.

🌹రమణ మహర్షి 🌹

పదహారేళ్ల వయసులోనే మృత్యువు చేరువకు వెళ్లారు.
కేవలం కొద్ది వారాలపాటు దైవసన్నిధిలో గడిపి, తనను తానే మరిచిపోయేంత దీర్ఘ సమాధి స్థితికి చేరుకొన్నారు. అప్పుడే యోగ జ్ఞాన సాధనకు కావలసిన పునాది పడింది.

భగవాన్ రమణ మహర్షి తన మాతృ మూర్తి అళగమ్మాళ్ తో
ఆలయంలో శివదర్శనం అనంతరం ఆ బాలుడు, తన శరీరంపై వస్త్రాలు, వస్తువులు విసర్జించి, కౌపీనధారియై, ఆలయ వెనుకభాగంలో నిశ్చలంగా కూర్చుని తపస్సు చేసాడు. చుట్టుపక్కల సందడి కోలాహలం వద్దని, ఆలయ పరిసరాలలోని పాతాళలింగం వద్దకు చేరి ఎన్నో నెలలు  సమాధి స్థితిలో ఉండిపోయారు.  జుట్టు అట్టలు కట్టి, తొడలు పురుగులు కీటకాలు కోరికివేయడంతో రక్తం గడ్డకట్టేసినా, స్వామికి ఇవేమీ తెలియలేదు. కొందరు భక్తులు ఆయనను ఆ స్థితిలో చూసి, అక్కడినుంచి బయటకు చేర్చి, స్నానపానాలు అమర్చారు. అప్పటినుంచీ  గురుమూర్తమ’నే మఠంలో అయన ఉండగా, ఉద్దండ నాయనార్, అన్నామలై తంబిరాన్ అనే సాధువులు సంరక్షించారు.

తరువాత అరుణాచలం కొండపైనున్న పవళకుండ్రు’కి బస మార్చారు. తల్లికి సంగతి తెలిసి తీసుకెళ్ళడానికి వస్తే ఏది ఎలా జరగాలో అట్లా జరుగుతుంది’ అని  వ్రాసి ఇచ్చారు ఆ మౌనస్వామి.  1899లో అనుచరుడైన పళనిస్వామితో విరూపాక్ష గుహకి మారారు. పాటవం కలిగిన వారి మౌనోపదేశమే వచ్చేవారికి ప్రయోజనకారి అయింది. ఆ తరువాతి కాలంలో ఆయన, ఒక భక్తుని విన్నపం మీద అరుణాచలేశ్వరునికి ఐదు స్తోత్రాలు’ కృతిగానం చేసారు. అవి అక్షర మణిమలై, నవ మణిమలై, అరుణాచల పటికం, అరుణాచల అష్టకం, అరుణాచల పంచరత్న’.  శ్రీ రమణ మహర్షి వాక్కులు, ప్రసంగాల గురించి భక్తులు వ్రాసిన మరెన్నో గ్రంథాలు ఉన్నాయి.

ఒక ఆధునిక ఋషికి ఉండవలసిన లక్షణాలన్నింటినీ రమణ మహర్షి పుణికి పుచ్చుకొన్నారు. వ్యక్తిగత జీవితంలో ఎంతగా వేదాంతనిష్ఠను పాటించారో అంతేస్థాయిలో నిర్మల, నిశ్చలమైన ఆత్మాన్వేషణా మార్గంలోనే వారు జీవిత పర్యంతం కొనసాగారు. ఆయన స్థిత ప్రజ్ఞత ఆశ్రమంలోని భక్తులందరికీ తెలిసిందే. అనేకమంది కళ్ళారా చూసినవారే. ఐతే, ‘దేవుడి’లా తానెప్పుడూ అద్భుతాలు చేయలేదు. అసలు తనను దేవుడిలా చూడవద్దని ఆయన అనేకమందికి ఆయా సందర్భాలలో కరాఖండిగా చెప్పేసినట్లు ఆయా రచనలు చదివితే అర్థమవుతుంది.
కనిపించేదంతా భగవత్‌ స్వరూపమే అయినప్పుడు అంతటిపై భక్తి ఉండాల్సిందే… సాటి మనుషులైనా, సర్వ ప్రాణులైనా… అన్నీ ఆత్మ స్వరూపాలే… నీలో ఉన్నదే ఆ జీవుల్లోనూ ఉంది. అందుకే నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావో, అన్నిటినీ అలాగే ప్రేమించాలి. పూజించాలి. ఇదే రమణులు చెప్పిన భక్తి  తత్త్వం. ఆయన దైవానికి, భక్తికి ఇచ్చిన నిర్వచనాలు ఆసక్తికరం, అనుసరణీయం ఆ విషయాలను ఆయన అనుభవ పూర్వకంగా వివరించారు…‘భక్తి లేకుండా జ్ఞానం కలగడం అసంభవం. పరిపూర్ణమైన .భక్తి పరమజ్ఞానంతో ముగుస్తుంది. రమణ మహర్షి బోధనలలో ప్రధానమైంది “మౌనం” లేదా “మౌనముద్ర”. శ్రీరమణులు చాలా తక్కువగా ప్రసంగించేవారు. తన మౌనంతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవారు. రమణుల బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా  వుండేది. ఎవరైనా ఉపదేశించమని కోరితే, “స్వీయ శోధన” ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షం సులభ సాధ్యమని బోధించేవారు. ఆయన అనుభవం అద్వైతం, జ్ఞానయోగాలతో ముడిపడి ఉన్నా కూడా అడిగినవారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాలని బోధించేవారు. ఆర్ద్రా నక్షత్రం లో పుట్టిన ఆయన దక్షిణామూర్తి స్వరూపం అని, కేవలం కౌపీనం మాత్రమే ధరిస్తారు కాబట్టి ఆయన్ని కుమారస్వామి స్వరూపం అని శిష్యులు  కొలిచేవారు. పశు పక్ష్యాదులతో కూడా ఆయన సఖ్యతతో మెలిగే వారు. అలాంటి వారికి కావ్య కంఠగణపతి ముని కూడా శిష్యుడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా వంటి వారు ఆయన్ని, ఆయన భోధనలు అనుసరిస్తూ ఉన్నారు. భగవాన్ రమణుల గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది చాలా ఉంటుంది.
సంస్కృత విద్వాంసుడు, ఆసుకవి, తపస్వి అయిన శ్రీ కావ్యకంఠ గణపతి ముని, భగవాన్ శ్రీ రమణులను గురువుగా స్వీకరించి, ఎన్నో సందేహాలను తీర్చుకున్నారు, అవే రమణగీత’గా రూపొందాయి. అందులోని ఒక శ్లోకం విశేష ప్రాముఖ్యత పొందింది. ఆత్మ స్వరూపం నిర్దేశించే ప్రశ్నకు సమాధానంగా శ్రీ రమణ మహర్షి తెలిపినది.  దేశ జాతి కుల మతభేదాలు లేకుండా అందరూ మహర్షిని దర్శించుకునేవారు. వచ్చిన వారందరినీ అత్యంత ప్రేమాదరణలతో చూసేవారు. అక్కడి ప్రశాంతత అందరినీ ఆకర్షించేది. వారివద్దకు వచ్చిన వారినందరినీ, భక్తి పరమార్థాల వైపు తిప్పేవారు. వారి ఒక దృష్టి మాత్రంగానే ఇదంతా జరిగేది. ఫోటో చూసినా వారి చూపు సూదంటురాయి వలె భక్తులను ఆకర్షించేది.  ఎఫ్.హెచ్. హంఫ్రీస్ 1911లో స్వామిని వేసే ప్రశ్నకు సమాధానంగా నీవు లోకానికి భిన్నం కాదు, నిన్ను నీవు తెలుసుకో’ అని తెలిపారు.

కాలక్రమేణా దేశవిదేశాలనుంచి ఎంతోమంది పండితులు, పరమహంస యోగానంద వంటి యోగులు, పాల్ బ్రాంటన్ మరియు సోమర్సెట్ మాఉమ్ వంటి ప్రఖ్యాత రచయితలు వచ్చి శ్రీ రమణ మహర్షిని కలిసేవారు. మౌనంగానే తమ దృక్కులతో మహర్షి వారి సందేహాలను తీర్చేవారు. స్వమీ రామదాస్ వంటి మహాయోగి కూడా శ్రీ రమణ మహర్షిని దర్శించుకుని అక్కడి అరుణాచల గుహలో కొంత కాలం ధ్యానంలో గడిపారు.
[07/01, 12:30] Shobha Rani: ప్రఖ్యాత రచయిత శ్రీ గుడిపాటి వెంకటాచలం, రమణ మహర్షి శిష్యుడై తమ జీవితం చాలాకాలం అంతిమ దశ వరకు అరుణాచలంలోనే గడిపారు.
వారు సాక్షాత్ సుభ్రమణ్యస్వామి అవతారమని కొందరు, శ్రీ దక్షిణామూర్తి అవతారమని మరి కొందరు భక్తులు భావించేవారు, ఎన్నో అద్భుత సంఘటనలు జరిగినా తమ ప్రమేయమేమీ లేదని ఆయన  అనేవారు. ఒక రోజు ఒక వస్తువు లేకపోతే, మరునాడే ఎవరో ఆ వస్తువు పంపడం జరిగేది. ఆయన తల్లి ఆశ్రమంలో వచ్చి ఉన్నా, మిగతా అందరిలాగే చూసేవారు. ఆమె ఆఖరి ఘడియల్లో తన హస్త స్పర్శతో ముక్తినిచ్చిన సంఘటన ఎంతో విశేషం. శ్రీ రమణ మహర్షి చివరి రోజుల్లో, ఎడమ చేతిపై వ్రణం పెరిగి, శస్త్ర చికిత్స చేసినా తగ్గలేదు. డాక్టర్లు మత్తుమందు ఇస్తామన్నా నిరాకరించారు. ఎందరో భక్తులు ఆయనని తమ అంతర్గత శక్తితో ఆరోగ్యం బాగు చేసుకోమని కోరగా, `భోజనానంతరం విస్తరిని ఉంచుకుంటామా?’  అని అడిగారు.  14, ఏప్రిల్ 1950 రాత్రి 8.47ని.లకు శ్రీ రమణ మహర్షి దేహాన్ని వదిలేసినప్పుడు, ఒక నక్షత్రం గిరి శిఖరం మీదుగా అంతరిక్షంలో అదృశ్యమైంది. మహితాత్మ స్వస్థలానికి చేరుకుంది..🙏🏻

🙏మన తల రాత మార్చే గీత🙏

*🕉️ మన తలరాత మార్చే గీత* 🕉️

*మన లోపల ఒకడు*
*ఉన్నాడు....అసలైన వాడు.*

*కానీ వాడిదగ్గరికి వెళ్ళాలి అంటే 6 గురు దొంగలు అడ్డుగా ఉన్నారు..*

*కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనే 6 గురు దొంగలు..*

*ఈ 6 గురిలో 4 గురు దొంగల నుండి సులభంగా తప్పించు కోవచ్చు, కానీ ఇద్దరు దొంగలనుండి తప్పించు కోవడం చాలా కష్టం..*

*🔺ఆ ఇద్దరు పెద్ద రౌడీలు. వాళ్ళే కామం, క్రోధం....ఈ ఇద్దరు రౌడీలు ఎక్కడ దాక్కొని ఉంటారు అంటే రజో గుణం అనే ఇంట్లో..*

*" కామ ఏష క్రోధ ఏష రజో*
  *గుణ సముద్భవహ "* 

*ఈ కామం, క్రోధం అనేవి రజో గుణం నుండి వస్తున్నాయి* *అని గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు..*

*కాబట్టి రజో గుణం అనే ఇంట్లో ఈ ఇద్దరు దొంగలు ఉంటారు*.

*ఈ దొంగలను పట్టుకోవాలి అంటే రజో గుణం అనే ఇంటికి తాళం వేయాలి. అంతే, ఇంక వాళ్ళు బయటికి రాలేరు..అయితే ఈ రజో గుణం అనేది First floor....ఇంకా మనం First floor కు రాలేదు.....మనం Ground floor లో ఉన్నాం.*

*మనలో ఉండే తమో గుణమే ఆ Ground floor.*

*అంటే మనం తమో గుణంలో ఉన్నాం.*

*బద్దకం, అతి నిద్ర, ఆలస్యం, నిర్లక్ష్యం ఇవే తమో గుణం.....ఇలాంటి తమో గుణంలో మనం ఉన్నాం.....ఇంకా Ground floor లోనే ఉన్నాం.*

*ఈ Ground floor నుండి పైకి రావాలంటే చాలా కష్టం. అలాటి ఈ Ground floor నుండి పైకి వచ్చి, First floor కు వెళ్లి అక్కడ ఉండే 6 గురు దొంగలను తప్పించుకొని ఇంకా పైకి వెళ్తే అప్పుడు Second floor వస్తుంది.*

*ఆ floor పేరు *సత్వ గుణం..*

*ఈ floor చాలా పెద్దగా ఉంటుంది....హాయిగా ఉంటుంది......*

*ఎక్కడ చూసినా వెలుగే ఉంటుంది..*

*అయితే చిన్న సమస్య....... ఇక్కడ ఒకే ఒక దొంగుంటాడు. భయపడకండి*...... *వాడు*
 
*మంచి దొంగ.....వాడు మీకు* *మంచి మాటలే చెబుతూ ఉంటాడు* *మీకు Third floor కు దారి చూపిస్తాడు........ ఆ floor పేరు శుద్ధ సాత్వికం.....ఇదే చివరిది........ఇక్కడే మీకు అఖండమైన వెలుగులో కలిసిపోయింది........ఆ అఖండమైన వెలుగే పరమాత్మ..*

*అది వెలుగులకు వెలుగు,మహావెలుగు.*

*చివరిగా ఒక good news ఏమిటంటే మనం Ground floor నుండి third floor వరకు వెళ్ళడానికి ఒక *Lift* ఉంది.

*🕉️ఆ Lift పేరే "భగవద్గీత".*

*🕉️📚🕉️గీతను చదువుతూ ఉంటే తమో గుణం నుండి రజో గుణానికి, రజో గుణం నుండి సత్వ గుణానికి, సత్వ గుణం నుండి శుద్ధ సత్వం వరకు మనం ప్రయాణం చేసి, చివరికి 🛐శాశ్వతమైన స్థానాన్ని చేరుకోవచ్చు.*

*♻️పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు..*

*🦚కృష్ణం వందే జగద్గురుం*!
🙏🎯🎯🎯🎯🎯🎯🎯🎯🙏

ఆచార్య భోధన

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

              *ఆచార్య సద్బోధన:*
                  ➖➖➖✍️

*చెప్పులు లేకుండా...*
*దేవాలయంలోకి ప్రవేశించే ముందు పాదరక్షలు బయటే విడిచి, కాళ్లు కడుక్కోవాలనేది మన సంప్రదాయం. ఈ నియమంలో ఆరోగ్యం, ఆధ్యాత్మికత ఇమిడి ఉన్నాయి.*

*గుడి ప్రాంగణాన్ని పవిత్రంగా భావించా లనేది ముఖ్య కారణం. ఆ సంగతలా ఉంచితే ఆలయంలో మంత్ర పూర్వకంగా స్థాపించిన యంత్రాల వలన గుడిలో అనుకూల శక్తి వ్యాపించి ఉంటుంది.*

*స్వయంభూ దేవాలయాలైతే విగ్రహాలను ప్రతిష్టించినవారి దైవిక శక్తి, తపశ్శక్తి తదితర శక్తుల సమాహారంతో ఆ నేల భాగం అయస్కాంత శక్తితో ప్రేరేపితమై ఉంటుంది.* 

*ఆ శక్తుల ప్రభావం మన శరీరంలోకి ప్రవహించడం ఆరోగ్యప్రదం. అందుకు ప్రధాన వాహకాలు పాదాలే. భూమి నుంచి వెలువడే సానుకూల తరంగాలను స్వీకరించే శక్తి పాదాల్లోనే ఉంటుంది.*

*అంటే పాదాలు మనిషి లోని సర్వ శక్తులకూ ఆలంబనలు. వివిధ శరీర భాగాల్లోని నాడుల చివరలు పాదాల్లో ఉంటాయి. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆ నాడులన్నీ ఉత్తేజితమై ఆరోగ్యం బాగుంటుంది.* 

*అలాగే ఆలయ పరిసరాల్లో ఉండే పూలమొక్కలూ, ఔషధ వృక్షాలూ కూడా అనుకూల శక్తిని వ్యాప్తి చేస్తాయి.*

*ఇక విగ్రహాన్ని అభిషేకించిన జలాదులతో పవిత్రమయ్యే నేలపై పాదాన్ని మోపడం వల్ల భక్తుడు అనుకూల శక్తి పొందుతాడు.*

*లౌకికంగా చూస్తే... పాదరక్షలు ధరించకపోవడం వల్ల గర్వం, అహం లాంటివి తొలగిపోతాయి.*

*ఇలా మానసిక, శారీరక శ్రేయస్సు కోసం చేసిన ఏర్పాటిది. ప్రస్తుతం చేస్తున్న అయస్కాంత చికిత్స ప్రాచీన కాలంలోనే ఉండేది. అందువల్లే పాదరక్షలు లేని పాదాలతోనే ఆలయంలో ప్రవేశించాలన్నారు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     

26, జనవరి 2023, గురువారం

🌹తొమ్మిది వర్గాలుగా సృష్టి 🌹

🌸🌸🌸🌸🙏🕉️🙏🌸🌸🌸🌸

*🌻తొమ్మిది వర్గాలుగా సృష్టి🌻*

1. మహత్తత్త్వం : సత్వరజస్తమో గుణాలు సమతుల్యం చెదిరిపోగా, ప్రకృతినుండి వచ్చిన మొదటి సృష్టి ఇది.

2. అహంకార తత్త్వం : పంచ భూతాలు, దశేంద్రియాలు, పంచతన్మాత్రలు, మనస్సుతో కలిపి వచ్చిన రెండవ సృష్టి. ద్రవ్య, జ్ఞాన, క్రియాత్మక మైనటువంటిది.

3. భూతసృష్టి : సూక్ష్మావస్థలు గల పంచ తన్మాత్రలనే శక్తులు ద్రవ్యాలైన పంచభూతాలలో చేరి ఉంటాయి.

4. ఇంద్రియ సృష్టి : ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు. 5. దేవతా సృష్టి : దేవతలు ఇంద్రియాభిమానులుగా దేవస్వర్గం అంటారు. ఇది మనోమయమైన సాత్వికాహంకారం వల్ల జనిస్తుంది.

5. తామస సృష్టి : ప్రకృతి మండలమైన అండ సృష్టి. ఆవరణ విక్షేపాలు కలుగుతాయి. తామసాహంకార జనితమై అజ్ఞానం వల్ల కలుగుతాయి.

ఈ ఆరు భగవంతుని లీలావిలాస జనితమైన ప్రకృతిపరమైన సృష్టి. క్రింది మూడు రకాలు వికృత సృష్టి. రజోగుణంతో నిండిన బ్రహ్మదేవుని

6. స్థావర సృష్టి : ఓషధులు, వృక్షజాతులు, లతలు మున్నగునవి భూమినుండి ఆహారం తీసుకొంటూ వృద్ధి చెందుతుంటాయి.

7. తిర్యక్కులు : 28 జంతుజాతులు, తమోగుణ ప్రధానమైనవి. ఆహార నిద్రా మైథునాల్లోనే అభిరుచి. ఇలా భూచరాలే కాకుండా, మొసలి లాంటి జలచరాలు, రాబందుల్లాంటి ఆకాశచరాలు కూడ తిర్యక్కులే.

8. మానవులు : రజోగుణ ప్రేరితమైంది. కర్మాసక్తి మెండు. దుఃఖంలో సుఖాన్ని కోరుకొనే వారు వీరు.

ఈ మూడు వైకృత సర్గములు. దేవతలు కూడ ఇందులోని వారే అయినా వారిని దశమ వర్గంగా చెప్తారు.

9. దేవతలు : ఎనిమిది వర్గాలు. పితృదేవతలు, అసురులు, గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, యక్షరాక్షసులు, చారణులు, భూత ప్రేత పిశాచాలు, కిన్నెరకింపురుషులు, విద్యాధరులు. 

ఇదీ కల్పారంభంలో జరిగిన సృష్టి. 

🌹☘️🌻🌻🌻🙏🌻🌻🌻☘️🌹
         *🙏ఓం నమో వేంకటేశాయ🙏*
🌹☘️🌻🌻🌻🙏🌻🌻🌻☘️🌹

🌹గోమాత విశిష్టత 🌹

🐂🐂🐂🐂🐂
మీరు ధనవంతులు అయితే
ఆవుకు మేత ఇవ్వండి గోశాల తెరవండి.
🐂🐂🐂🐂🐂
మీరు పోలీసు అధికారి అయితే
కబేళాలకు వెళ్లే గోవులను రక్షించండి.
🐂🐂🐂🐂🐂
మీరు న్యాయవాది అయితే 
గో సంరక్షణ కోసం పోరాటం చేయండి.
🐂🐂🐂🐂🐂
మీరు వైద్యుల అయితే
పాలు, పెరుగు, నెయ్యి, పేడా గోమూత్రం, వాడేలా ప్రజలను ప్రేరేపించండి.
🐂🐂🐂🐂🐂
మీరు పశువైద్యులు అయితే
అనారోగ్యంతో ఉన్న ఆవుకు చికిత్స చేయండి.
🐂🐂🐂🐂🐂
మీరు ఉపాధ్యాయులు అయితే
విద్యార్థినీ విద్యార్థులకు ఆవు ప్రాముఖ్యత గురించి వివరించండి.
🐂🐂🐂🐂🐂
మీరు రైతులు అయితే
సేంద్రియ వ్యవసాయం చేయండి.
🐂🐂🐂🐂🐂
మీరు రాజకీయ నాయకులు అయితే 
గోవధను నిషేధించే చట్టం తయారు చేయండి.
🐂🐂🐂🐂🐂
మీరు పాత్రికేయులు అయితే
ఆవు వల్ల కలిగే ప్రయోజనాలను సమాజానికి వివరించండి.
🐂🐂🐂🐂🐂
గోసేవ చేద్దాం
గోపూజ చేద్దాం
గోమాతను రక్షించుకుందాం.
🐂🐂🐂🐂🐂
జై గోమాత
🐂🐂🐂🐂🐂 జై శ్రీరామ్🚩🙏

🌹శ్రీ సరస్వతీ కవచం 🌹

🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*శ్రీ సరస్వతీ కవచం*

*ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః |*
*ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫాలం మే సర్వదాఽవతు.*

*ఓం హ్రీం సరస్వత్త్యె స్వాహేతి శ్రోత్రే పాతు నిరంతరమ్|*
*ఓం శ్రీం హ్రీం భగవత్త్యె సరస్వత్త్య స్వాహా నేత్రయుగ్మం సదాఽవతు.*

*ఓం ఐం హ్రీ వాగ్వాదిన్యై స్వాహా నాసాం మే సర్వదాఽవతు|*
*ఓం హ్రీం విద్యాదిష్ఠాతృదేవ్యై స్వాహా చోష్ఠం సదాఽవతు.*

*ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి దంతపంక్తిం సదాఽవతు|*
*ఓం ఐమిత్యేకాక్షరో మంత్రో మమకంఠం సదాఽవతు.*

*ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం స్కంధౌ మే శ్రీ సదాఽవతు|*
*ఓం హ్రీం విద్యా ధిష్ఠాతృదేవ్యై స్వాహా వక్షః సదాఽవతు.*

*ఓంహ్రీం విద్యాధిస్వరూపాయై స్వాహా మే పాతు నాభికామ్|*
*ఓం హ్రీం క్లీం వాణ్యైస్వాహేతి మమ హస్తౌసదాఽవతు.*

*ఓం సర్వ వర్ణాత్మికాయై స్వాహా పాదయుగ్మం సదాఽవతు |*
*ఓం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహా సర్వం సదాఽవతు.*

*ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా ప్రాచ్యాం సదాఽవతు|*
*ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహాఽగ్నిదిశి రక్షతు.*

*ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సరస్వత్త్యె బుధజనన్యై స్వాహా|*
*సతతం మంత్రరాజోఽయం దక్షిణేమాం సదాఽవతు.*

*ఓం ఐం హ్రీం శ్రీం క్లీం త్ర్యక్షరోమంత్రో నైరృత్యాం సర్వదాఽవతు|*
*ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాం వారుణేఽవతు.*

*ఓం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సదాఽవతు|*
*ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మా ముత్తరేఽవతు.*

*ఓం ఐం సర్వశాస్త్రావాసిన్యై స్వాహా - ఐశాన్యాం సదాఽవతు |*
*ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్థ్వం సదాఽవతు.*

*ఓం హ్రీం పుస్తకావాసిన్యై స్వాహా -అధోమాం సదాఽవతు|*
*ఓం గ్రంథబీజ స్వరూపాయై స్వాహా మాం సర్వతోఽవతు.*

*( శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోనిది)*
🌸🌸🌸🌸🌸🌸🌸

💐యోగాలు - ఫలితాలు 💐

యోగాలు - ఫలితాలు

జ్యోతిష్యశాస్త్రంలో అనేక యోగాలు సూచింపబడ్డాయి. రాశి, అంశ చక్రాలలో ఉన్న గ్రహస్థానలను పరిశీలిస్తూ ఈ యోగాలు ఉంటాయి. యోగాలను అనుసరించి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని యోగాలు గురించి తెలుసుకుందాం.

రవి సంబంధిత యోగాలు

జ్యోతిష్యంలో రవి(సూర్యుడు)కి సంబంధించిన యోగాలు పరిశీలిద్దాం.

1. బుధాదిత్య యోగము
రవి బుధుడు ఏ రాశిలో ఉన్నా దానిని బుధాదిత్య యోగము అంటారు. జాతక చక్రంలో రవి, బుధులు మేషం, మిథునం, సింహం, కన్యారాశుల్లో కలిసి ఉంటే ఈ యోగం కలుగుతుంది. ఈ రాశుల్లో ఒకటి లగ్నమై అక్కడ రవి, బుధులు కలిసి ఉంటే రాజయోగం అనుభవిస్తారు. మిగిలిన చోట ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నా బుధాదిత్యయోగం కాదు.
ఫలితాలు: విచక్షణతో కూడిన కార్యాలు, వెనకడుగు వేయని పట్టుదల, పట్టు వదలని ప్రయత్నం వీరి స్వంతం.

2. శుభవేశి యోగము
రవికి రెండవ స్థానంలో శుభగ్రహాలు ఉంటే శుభవేశి యోగము అంటారు.
ఫలితం: సుఖమైన ప్రశాంత జీవితము, కీర్తి, మర్యాద, అదృష్టము వరించుట.

3. శుభవాశి యోగము
రవికి పన్నెండవ స్థానంలో శుభగ్రహాలు శుభవాశి యోగము అంటారు.
ఫలితాలు: కీర్తి ప్రతిష్టలు, సంపద, పలుకుబడి, పట్టుదల, స్వయంకృషితో అభివృద్ధి.

4. ఉభయరాశి యోగము
2, 12 స్థానాలలో శుభగ్రహాలు ఉంటే ఉభయరాశి యోగము అంటారు.
ఫలితాలు: సంతోషం, సంపద, కీర్తి, మర్యాద, పలుకుబడి, పట్టుదల ప్రయత్నంతో ముందుకు రావడం.

చంద్రుడు సంబంధిత యోగాలు
5. చంద్ర మంగళ యోగము
చంద్రుడు, కుజుడు ఒకే స్థానంలో ఉన్నా నేక చంద్రునికి కేంద్రంలో అంటే 1, 4, 7, 10 స్థానాలలోఉంటే చంద్రమంగళ యోగం అంటారు. జాతక చక్రంలో చంద్రునికి కేంద్రమందు కుజుడు ఉన్నా, లేక ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నా ఈ యోగం కలుగుతుంది.
ఫలితాలు:  భాగ్యవంతులవుతారు, రసాయన, ఔషధ వ్యాపార రంగంలో అనుకూలత ఉంటుంది. మనో చంచలం రావడానికి అవకాశం.

6. వసుమతి లేక లక్ష్మి యోగము
చంద్రునికి ఉపజయ స్థానాలయిన 3, 6, 10, 11 స్థానాలలో బుధుడు, శుక్రుడు, గురువు ఉంటే వసుమతి లేక లక్ష్మి యోగము అంటారు.
ఫలితాలు: అకస్మాత్తుగా ధనాగమనం. ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ యోగ జాతకులకు ధనం కొరత ఉండదని శాస్త్రం చెబుతోంది.

7. గజ కేసరి యోగము
గురు, చంద్రులు కర్కాటక రాశియందు ఉన్నప్పుడు ఈ యోగము కలుగుతుంది. చంద్రునికి కేంద్రంలో గురువు ఉంటే గజ కేసరి యోగము అంటారు.
ఫలితాలు: చంద్రునికి కేంద్ర స్థానంలో గురుడు ఉన్నా, లేక ఇతర స్థానాల్లో ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నా మిక్కిలి భోగభాగ్యాలు అనుభవిస్తారు. కీర్తి ప్రతిష్టలు, శత్రుజయం, ధనాగమనం, సంపద, దీర్ఘాయువు.

8. అనపా యోగము
చంద్రునికి పన్నెండు స్థానాలలో రాహువు, కేతువు మనహా మీలిన గ్రహాలు ఉంటే అనపా యోగము అంటారు.
ఫలితము: ఆరోగ్యమైన శరీరం.

9: శునభా యోగము
చంద్రునికి రెండులో రాహువు, కేతువు మినహా మిగిలిన గ్రహాలు ఉంటే అనపా యోగము అంటారు.
ఫలితాలు: స్వప్రయత్నంతో సంపాదన.

10. మేఘదృవా యోగము
చంద్రునికి 2, 12 స్థానాలలో ఏగ్రహాలు లేకుంటే అనపా యోగం అంటారు.
ఈ యోగము పీడ, కీడు కలిగిస్తుంది. అయినా కేంద్రం అంటే 1, 4, 7, 10 స్థానాలలో ఏదైనా గ్రహం ఉంటే నివృత్తి ఉంటుంది.

12 అది యోగము
చంద్రుడికి 6, 7, 8 స్థానాలలో శుభగ్రహాలు ఉంటే అది యోగం అంటారు.
ఫలితాలు: విలాసవంతమైన జీవితం.

13. శకట యోగము
చంద్రునికి , 6,8, 12వ స్థానంలో గురువు ఉంటే శకట యోగము అంటారు.రాశి చక్రములోని గ్రహములన్ని లగ్నము మరియు సప్తమ స్థానమల మాత్రమే ఉన్న శకట యోగము అంటారు.
గురువు లగ్నము తప్ప మిగిలిన స్థానములలో ఉన్న శకట యోగము సంభవిస్తుంది.

ఫలితాలు: జీవితంలో నిలకడ లేమి, అవమానము, ఆర్థిక బాధలు, శారీరక కష్టం, మానసిక బాధలు కలిగించును. ధనవంతుల గృహంలో జన్మించినా ఈ యోగప్రభావమున పేదరికమే అనుభవించవలసి ఉంటుంది. అర్హతకు తగిన గౌరవ, మర్యాదలు ఉండవు. అయితే ఇతర బాధలు ఉండవు. ఈ యోగముకు భంగము ఏర్పడినప్పుడు సమస్యలు ఉన్నా గౌరవ మర్యాదలాకు భంగము వాటిల్లదు.

💐భక్తులు చేయకూడని పనులు💐

🌺 భక్తులు చేయకూడని పనులు 🌺

(నారదునకు శివుడు చెప్పెను)

1. స్నానము చేయకుండ దేవుని మూర్తిని తాకరాదు. 

2. అశుచిగా నుండియు (మలవిసర్జన చేసి) తాకరాదు. 

3. సాక్షాత్తు భోజనము చేసి పాదోదకమును పుచ్చుకొనరాదు.

4. నైవేద్యము లేకుండ పూజించరాదు.

5 దేవుడున్న స్థానమున కంటె ఎత్తైన యాసనమున తాను కూర్చుని పూజ చేయరాదు. 

6. ముట్టుతను (బహిట్టైన స్త్రీని చూచి పూజించరాదు.

7 గంటను నేలమీద నుంచరాదు.

8. పుష్పములను నీటితో తడపరాదు కడగరాదు.

9 పూజ చేసిన దేవునకు (పెద్దలకు) వీపు చూపరాదు.

10. దేవుని (గురుని) ఎదుట గిరగిర తిరగరాదు. ఆత్మప్రదక్షిణమనునది దేవుని (గురుని) చుట్టూ చేయవలెనే కాని ఎదుట చేయరాదు.

11. దేవుని యెదుట భోజనము చేయరాదు.

12. భోజనము చేయక, ఆకలితో నకనకలాడుతూ పూజ చేయరాదు.

13. పూజ చేయునపుడు కంబళము కప్పుకొనరాదు.

14. దేవుని పూజాగృహములో ముందు కుడికాలును వుంచవలెనే గాని ఎడమకాలు వుంచి ప్రవేశించరాదు.

15. దేవుని (పెద్దల) దగ్గర ఉమ్మి వేయరాదు.

16. నైవేద్యమును దైవ (గురు) ప్రసాదమని భావించవలెనే కాని, కొబ్బరి, పెసరపప్పు గారెలు యని వర్ణించరాదు.

17 దేవుని విగ్రహమును దేవుడని భావించవలెనేగాని, రాయి లోహము, పటము అని భావించరాదు.

18. భగవంతుని భజించు భక్తులను సామాన్య మానవులతో సమముగా చూడరాదు.

19. ఇతరుల కొఱకు (బంధుమిత్రాదుల కొఱకు) చేసిన పదార్థములను దేవునకు నివేదించరాదు.

20. సాధు సజ్జనులను నిందించగూడదు.

21. తీర్థ ప్రసాదములను తీసికొనునపుడు ఒంటిచేతితో తీసుకొనరాదు నేలపై తీరమును పడనీయరాదు.

22 పూజ చేయునపుడు ఇతరులతో మాట్లాడరాదు తలను గోకుకొనరాదు.

23 శివకేశములను భేదబుద్ధితో గాంచరాదు ఇతర మతస్థులను దూషించరాదు.

24. ఆచార్యుని (గురువుని) అవమానించరాదు.

25. వేదశాస్త్రములను నిందించకూడదు.

26. భగవన్నామ మందరవాదము చేయరాదు (అనగా భగవన్నామము భజించుచున్నంత మాత్రమున పాపములు నశించునా? అజ్ఞాన రహితమగునా?
యని యనరాదు).

27. భగవన్నామమును అండగా చేసికొని పాపపుపనులను చేయరాదు (అనగా భగవన్నామ స్మరణాదులు చేసి పాపములను పోగొట్టుకొనవచ్చుగదాయని తలంచి పాపకార్యములలో ప్రవేశింపరాదు). 

28. భగవన్నామ స్మరణ దానధర్మాదులతో సమమని తలంచరాదు.

29. శ్రద్ధలేని వారికి భగవన్నా మోపదేశమును చేయరాదు.

30 భగవన్నామ ప్రభావమును వినియు అవిశ్వాసముతో వర్తించరాదు. 

31. భగవన్నామ సంకీర్తన (స్మరణ) చేయుటయందు నాయంతటివాడు లేడు అని గర్వము కలిగియుండరాదు.

32 "స్నానే చ భోజనే హోమే జపే మౌనముపాశ్రయేతో స్నానము చేయుకా లమందు, భోజనము చేయునపుడు, హోమము చేయు సమయమందు, జపము చేయుకాలమందును మౌనముగా నుండవలయును.

💐గురు మహిమ 💐


ఈ ధర్మములన్నీ సకల మానవ జాతి తప్పక ఆచరించదగినవని గోకర్ణుడు చెప్పెను🌹

గురు మహిమ


🍁జగన్మాత పార్వతీదేవి "గురుమహిమ" గురించి శివపురాణంలోని పార్వతీఖండంలో తెలిపిన విశేషాలు.

🍁శ్లోII గురూణాం వచనం పథ్యం ఇతి వేదవిదో విదుః
గురూణాం వచనం సత్యం ఇతి యేషాం దృఢా మతిః
తేషామిహాముత్ర సుఖం పరమం నా సుఖం క్వచిత్ II 
(శి.పు.రు.సం.పార్వతీఖండం. అ.25.శ్లో.58,59)

🍁గురువుల మాట పథ్యం. అనగా సుఖాన్ని కలిగిస్తుంది అని వేదపండితులు అంటారు. గురువుల మాట సత్యం అని దృఢంగా నమ్మినవారికి, ఈ లోకంలోనూ, పరలోకంలోనూ సుఖం కల్గుతుంది. అటువంటి వారికి దుఃఖం ఎప్పుడూ, ఎక్కడా ఉండదు. గురువులు చెప్పిన మాట వినక, ఆయన మార్గాన్ని విడిచిన వారికి ఈ లోకంలోనూ సుఖం ఉండదు. ఇక పరలోకసుఖం అసంభవం. గురువు చెప్పినది ఏదైనా సరే చేయవలసిందే. నా జీవితం ఏమైపోయినా సరే. నా గురుని ఆజ్ఞ ఉల్లంఘించను. గురువును నమ్మిన వ్యక్తికి శాశ్వతసుఖం కలిగినా కలగవచ్చు, లేదా శూన్యమే మిగలవచ్చు. ఏది ఏమైనా నాకు గురుభక్తియే ముఖ్యం. గురుభక్తి వల్ల మాత్రమే శాశ్వతముక్తి లభిస్తుంది.గురునింద చేయడం, వినడం మహాపాపాలు.


🍁పద్మపురాణంలోని శ్లోకము
ధర్మం భజస్వ సతతం త్వజ లోక ధర్మాన్
సేవస్వ సాధు పురుషాన్ జహి కామ తృష్ణామ్

🍁ధర్మమును సేవించుము, లోక ధర్మమును విడిచిపెట్టుము, సాధు పురుషులను సేవించుము, కోరిక మీద ఆశను గెలువుము. ధర్మము సామాన్య ధర్మం, విశేష ధర్మం అలాగే లోక ధర్మం, వైదిక ధర్మం అని నాలుగు విధములు. కుల, మత, వర్గ, వర్ణ బేధం లేకుండా స్త్రీ, పురుష బేధం లేకుండా అందరికి ఒకే తీరుగా ఉండేది సామాన్య ధర్మం. సత్యమునే మాట్లాడుట, ఎవరిని హింసించకుండుట, పరోపకారం, ఉన్నంతలో దానం చేయుట, అనాథలు, దీనులకు భిక్షపెట్టుట, బాధను ఇతరులకు తెలియచేయకుండుట ఇవన్నీ సామాన్య ధర్మాలు. శరీరాన్ని, మనసును, బుద్ధిని మంచి మార్గంలో నడిపించే ధర్మాలు ఇవి.

🍁మిత్రుడు, శత్రువు, బంధువు, పాలివారు (జ్ఞాతులు), సేవకులు, యజమానులు, సంపద, ఆపద, సంతోషం, దుఃఖం ఇవన్నీ లోక ధర్మాలు అంటే బ్రతకడానికి పనికి వచ్చేవి. ఇక వైదిక ధర్మాలు తపస్సు, శమము, ద మము( ఇంద్రియ నిగ్రహము), దైవ చింతన ఇవి ఆత్మ తరించడానికి పనికి వచ్చే ధర్మాలు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ ధర్మాలు విశేష ధర్మాలు. ఈ ధర్మములన్నీ సకల మానవ జాతి తప్పక ఆచరించదగినవని గోకర్ణుడు చెప్పెను. అలాగే అహింస, సత్యాదులను, ఆత్మ ధర్మములను సేవించుమని కూడా చెప్పెను. లోక ధర్మాలను అంటే కుటుంబ పోషణ, ఆస్తిని సంపాదించుట వంటివి వదిలి పెట్టమని చెప్పాడు. పిల్లలు పెద్దవారై స్థిరపడిన తరువాత కూడా ఇంకా వారిని పోషించాలని, కాపాడాలనే తపనతో శరీరం, మనసు, బుద్ధి బాధల పాలవుతుంది కావున సామాన్య ధర్మాన్ని ఆచరించు, లోక ధర్మాలను విడిచిపెట్టమని ఈ శ్లోకంలోని అర్ధము.

 

25, జనవరి 2023, బుధవారం

శ్రీ ఆద్య కాత్యాయని శక్తి పీఠం


ఈ ఆలయం పూర్తిగా పాలరాతితో నిర్మించబడింది.🌷

ఛతర్పూర్ ఆలయం



🌸ఛతర్పూర్ ఆలయం (అధికారికంగా: శ్రీ ఆద్య కాత్యాయని శక్తి పీఠం ) భారతదేశంలోని ఢిల్లీలోని ఛతర్పూర్లోని డౌన్ టౌన్ ప్రాంతంలో ఉంది. ఈ ఆలయం కాత్యాయని దేవికి అంకితం చేయబడింది. ఆలయ సముదాయం మొత్తం 70 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది న్యూ ఢిల్లీ యొక్క నైరుతి శివార్లలో ఛతర్పూర్ వద్ద ఉంది మరియు కుతుబ్ మినార్ నుండి కేవలం 4 కిమీ (2.5 మైళ్ళు) దూరంలో, మెహ్రౌలీ-గుర్గావ్ రహదారికి దూరంగా ఉంది. 

🌸ఈ ఆలయాన్ని 1974లో బాబా సంత్ నాగ్పాల్ జీ స్థాపించారు, ఆయన 1998లో మరణించారు. ఆయన సమాధి మందిరం ఆలయ సముదాయంలోని శివ-గౌరీ నాగేశ్వర్ మందిర్ ప్రాంగణంలో ఉంది.

🌸2005లో ఢిల్లీలో అక్షరధామ్ ఆలయాన్ని రూపొందించడానికి ముందు ఈ ఆలయం భారతదేశంలో అతిపెద్ద ఆలయంగా మరియు ప్రపంచంలో రెండవ అతిపెద్దదిగా పరిగణించబడింది. ఈ ఆలయం పూర్తిగా పాలరాతితో నిర్మించబడింది మరియు అన్ని కోణాలపై జాలీ (చిల్లులు గల రాయి లేదా లాటిస్డ్ స్క్రీన్) పని ఉంది. దీనిని వెసర శైలి నిర్మాణ శైలిగా వర్గీకరించవచ్చు.


🌸సరిస్కా టైగర్ రిజర్వ్ నుండి ఢిల్లీ వరకు విస్తరించి ఉన్న ఉత్తర ఆరావళి చిరుతపులి వన్యప్రాణుల కారిడార్లో పరిసరాలు ముఖ్యమైన జీవవైవిధ్య ప్రాంతం. అభయారణ్యం చుట్టూ ఉన్న చారిత్రక ప్రదేశం బద్ఖల్ సరస్సు (6 కి.మీ. ఈశాన్య), 10వ శతాబ్దపు పురాతన సూరజ్కుండ్ రిజర్వాయర్ మరియు అనంగ్పూర్ ఆనకట్ట , దామ్దామ సరస్సు, తుగ్లకాబాద్ కోట మరియు ఆదిలాబాద్ శిధిలాలు (రెండూ ఢిల్లీలో ఉన్నాయి). ఇది ఫరీదాబాద్లోని పాలి-ధుయాజ్-కోట్ గ్రామాలలో కాలానుగుణ జలపాతాలకు ఆనుకుని ఉంది, పవిత్రమైన మంగర్ బానీ మరియుఅసోలా భట్టి వన్యప్రాణుల అభయారణ్యం. ఢిల్లీ రిడ్జ్లోని అటవీ కొండ ప్రాంతంలో పాడుబడిన ఓపెన్ పిట్ గనులలో అనేక డజన్ల సరస్సులు ఏర్పడ్డాయి.

🌸మొత్తం ఆలయ సముదాయం 60 ఎకరాల్లో (24.3 హెక్టార్లు) విస్తరించి ఉంది, 20 కంటే ఎక్కువ చిన్న మరియు పెద్ద దేవాలయాలు మూడు వేర్వేరు సముదాయాలుగా విభజించబడ్డాయి. ఆలయంలో ప్రధాన దేవత కాత్యాయని దేవి, నవదుర్గలో ఒక భాగం, హిందూ దేవత దుర్గా లేదా శక్తి యొక్క తొమ్మిది రూపాలు, నవరాత్రి వేడుకల సమయంలో పూజించబడతాయి.

🌸ప్రధాన ఆలయం లోపల ఒక ప్రక్క మందిరంలో కాత్యాయని దేవి (దుర్గా) మందిరం ఉంది, ఇది ద్వై-వార్షిక నవరాత్రి సీజన్లో మాత్రమే తెరవబడుతుంది, వేలాది మంది ప్రజలు దర్శనం కోసం ప్రాంగణంలోకి వస్తారు. సమీపంలోని ఒక గదిని వెండితో చేసిన బల్లలు మరియు కుర్చీలతో లివింగ్ రూమ్గా రూపొందించబడింది మరియు మరొకటి షయన్ కక్ష (పడక గది)గా పరిగణించబడుతుంది, ఇక్కడ ఒక మంచం, డ్రెస్సింగ్ టేబుల్ మరియు టేబుల్ వెండితో చెక్కబడ్డాయి. ఈ మందిరం పెద్ద సత్సంగం లేదా ప్రార్థనా మందిరంలో తెరుచుకుంటుంది, ఇక్కడ మతపరమైన ప్రసంగాలు మరియు భజనలు (మతపరమైన పాటలు) జరుగుతాయి. ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారం వద్ద, ఒక పాత చెట్టును నిలబెట్టండి, ఇక్కడ భక్తులు కోరికల నెరవేర్పు కోసం పవిత్ర దారాలను కట్టారు. దుర్గామాత యొక్క మరొక మందిరం ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులకు తెరిచి ఉంటుంది, ఇది రాధా కృష్ణ మరియు గణేశుడికి అంకితం చేసిన మందిరాల పైన ఉంది.

 

💐కర్మ💐

*కర్మ* 

కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకి లను చూడటానికి, చూచి వారిని కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు . 

దేవకీమాత కృష్ణుని చూసిన వెంటనే 'నాయనా! నీవే పరమాత్మవి కదా. నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి. అయినా నువ్వు ఎందుకు 14 సంవత్సరాలు ఆగావు కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి ' అని అడిగింది

అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు *'అమ్మా! నన్ను క్షమించు. నీవు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో? '* చిరునవ్వు తో! 

దేవకి ఆశ్చర్య చకితురాలయింది, *'కృష్ణా ఇది ఎలా సాధ్యము? ఎందుకు ఇలా అంటున్నావు?*' అని అడిగింది

కృష్ణుడు అన్నాడు, *'అమ్మా! గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు. కానీ నీవు గత జన్మలో కైకేయివి. నీ భర్త దశరథుడు.'*

దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా అడిగింది *'అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో? అని*

కృష్ణుడు ఇలా అన్నాడు, *'ఇంకెవరు?యశోద మాత! 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెని దూరం చేశావు గత జన్మలో. అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది.'*

ఎంతటి వారైనా కర్మ ఫలాలను అనుభవించక తప్పదు. భగవద్భక్తులైనా వాటి నుంచి తప్పించుకోలేరు కదా!

 *ఓం నమో నారాయణాయ*

24, జనవరి 2023, మంగళవారం

రఘు మహారాజు


రఘు మహారాజు ఎందుకు సంపాదించాడంటే...🌻

రఘు మహారాజు 


🔶రఘు మహారాజు పరాక్రమవంతుడు. కారణజన్ముడు. ఆయన విశ్వజిత్ అనే ఒక యాగం చేసాడు. భూమండలమంతా దిగ్విజయ యాత్ర చేసి తీసుకొచ్చిన ధనాన్నంతటినీ కొద్దిగా కూడా ఉంచుకోకుండా ఆ యాగ సమయంలో పూర్తిగా దానం చేసేసాడు. రఘువంశ రచన చేసిన కాళిదాసు –‘‘త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణామ్ యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినామ్’’ అంటాడు.

🔶రఘు మహారాజు ఎందుకు సంపాదించాడంటే.. పదిమందికి దానం చేయడానికి–అని, ఎక్కడ మాట జారితే చటుక్కున అసత్య దోషం వస్తుందేమోనని ఆయనకు అన్నీ తెలిసి ఉన్నా ఎక్కువ మాట్లాడేవాడు కాదట, దండయాత్రలు చేసేది కేవలం తన పరాక్రమాన్ని చాటడానికి తద్వారా కీర్తికోసమేనట, గృహస్థాశ్రమంలో ఉన్నది ధర్మబద్ధంగా సంతానం పొందడానికట.. అదీ రఘువంశ గొప్పదనం అంటాడు.

🔶వరతంతు మహాముని శిష్యుడు కౌత్సుడు. విద్యాభ్యాసం పూర్తయిన పిమ్మట గురువుగారికి దక్షిణ ఇవ్వాలని వెళ్ళాడు. ‘నాయనా! నీవు నాకేమీ దక్షిణ ఇవ్వక్కరలేదు. నీ క్రమశిక్షణ, మంచితనం నాకు నచ్చాయి. సంతోషంగా వెళ్ళి నీ ధర్మాలను నీవు సక్రమంగా నిర్వర్తించు’ అంటూ ఆశీర్వదించినా... దక్షిణ ఇస్తానని పట్టుపట్టి అడగమన్నాడు. హఠం చేస్తున్న శిష్యుడి కళ్లు తెరిపించాలని... ‘నా వద్ద 14 విద్యలు నేర్చుకున్నావు. కాబట్టి 14 కోట్ల సువర్ణ నాణాలు ఇవ్వు చాలు.’’ అన్నాడు.


🔶బ్రహ్మచారి అంత ధనం ఎక్కడినుంచి తీసుకురాగలడు? పని సానుకూలపడొచ్చనే ఆశతో నేరుగా రఘుమహారాజు దగ్గరికి వెళ్ళాడు. స్నాతక వ్రతం పూర్తిచేసుకొని ఒక శిష్యుడు తన సహాయం కోరి వచ్చాడని తెలుసుకున్న రఘు మహారాజు అతిథికి అర్ఘ్యం ఇవ్వడానికి మట్టిపాత్రతో వచ్చాడు. అది చూసి శిష్యుడు హతాశుడయ్యాడు. దానం ఇచ్చే సమయంలో అర్ఘ్యం ఇవ్వడానికి బంగారు పాత్రకూడా లేనంత దీనస్థితిలో ఉన్న రాజు తనకు ఏపాటి సాయం అందించగలడని సంశయిస్తుండగా.. సందేహించకుండా ఏం కావాలో అడగమన్నాడు మహారాజు.

🔶కౌత్సుడు విషయం విశదీకరించాడు. సాయం కోరి నా దగ్గరకు వచ్చినవాడు ఖాళీ చేతులతో వెడితే నా వంశానికే అపకీర్తిని తెచ్చినవాడనవుతాను. నాకు రెండు మూడు రోజుల వ్యవధి ఇవ్వు. అప్పటివరకు అగ్నిశాలలో నిరీక్షించమన్నాడు. అంత ధనం పొందడం కేవలం కుబేరుడివద్దే సాధ్యమవుతుందనిపించి కుబేరుడిపై దండయాత్రకు రథం, ఆయుధాలను సమకూర్చుకొని మరునాటి ఉదయం బయల్దేరడానికి సిద్ధమయ్యాడు.

🔶తీరా బయల్దేరే సమయంలో కోశాధికారి వచ్చి ‘మహారాజా! తమరు యుద్ధానికి వస్తున్న విషయం తెలుసుకొని కుబేరుడు నిన్న రాత్రి కోశాగారంలో కనకవర్షం కురిపించాడు– అని చెప్పాడు. దానినంతా దానమివ్వడానికి మహారాజు సిద్ధపడగా కౌత్సుడు..‘నాకు కేవలం అడిగినంత ఇస్తే చాలు. నేను బ్రహ్మచారిని. మిగిలినది నాకు వద్దు’ అన్నాడు. నీకోసమే వచ్చింది కాబట్టి అది మొత్తం నీకే చెందుతుంది’ అంటాడు మహారాజు... అదీ ఒకనాటి మన సంస్కార వైభవం. అదీ వినయ లక్షణం.

 

🌄దేవుడు ఇంటికి సరైన దారి🌄

*దేవుడి ఇంటికి సరైన దారి* 

🔼 *'రామాపురం'* అనే ఊళ్ళో రైలు దిగండి.

⏺ *'నమ్మకం'* అనే రిక్షాని మాట్లాడుకోండి. 

🔼 *భక్తి* అనే పేటలోకి తీసుకెళ్ళమనండి.

 ⏺ *పాపం* అనే డెడ్‌ ఎండ్‌ వీధి వస్తుంది. 

🔼 *పుణ్యం* అనే దాని ఎదురు సందులోకి ముందుకి సాగండి.
 
⏺ *ప్రార్ధన* అనే వంతెనని దాటండి. 

🔼 *కర్మ* అనే సర్కిల్‌ వస్తుంది. 

⏺ *దుష్కర్మ* అనే రెడ్‌లైట్‌ అక్కడ వెలుగుతూండవచ్చు.
 
🔼 *సుకర్మ* అనే పచ్చలైటు వెలిగాక ముందుకి సాగండి. 

⏺ *భజనమండలి* అన్న బోర్డున్న కుడి రోడ్డులోకి మళ్ళండి. 

🔼అక్కడ రోడ్డు నాలుగు రోడ్లుగా చీలుతుంది.
 
⏺మొదటి మూడిటి పేర్లు - *అసూయ స్ట్రీట్‌, ద్వేషం సందు, ప్రతీకారం వీధి.* 

🔼వాటిని వదిలి నాలుగో సందులోకి తిరగండి. దానిపేరు *సత్సంగం* వీధి. 

⏺పక్కనే కనబడే *వద0తుల* వీధిలోకి వెళ్ళకండి. అది వన్‌వే రోడ్డు. 

🔼కాస్తంత ముందుకు వెళ్ళాక ఓ జంక్షన్‌ వస్తుంది. 
అక్కడ ఎడమవైపు రోడ్డు పేరు *వ్యామోహం.* 

⏺కుడివైపు రోడ్డు పేరు *వైరాగ్యం.* వైరాగ్యం వీధిలోకి వెళ్ళండి. 

🔼ఎదురుగా మీకు *కైవల్యం* అనే మరో చౌరస్తా కనిపిస్తుంది.

 ⏺ *దయగల హృదయం - భగవన్నిలయం* అన్న బోర్డున్న తెల్లరంగు ఇల్లు కనిపిస్తుంది. 

☯గేటు దగ్గరున్న *ముక్తి* అనే తలుపు మిమ్మల్ని చూడగానే తెరుచుకుంటుంది. 
ఇది *దేవుడి ఇంటికి సరైన దారి.* 

మీరు మీ బంధుమిత్రులకి కూడా ఈ దారిని తెలపండి. లేదా సరైన దారి తెలియక వారు దారి తప్పిపోవచ్చు.

ఆధ్యాత్మిక మార్గంలో భక్తి, మంత్రం, ధ్యానం ఇలా...రకరకాల సాధన ఏదైనా గాని, చేసేవారు ఎవరైనా గాని తెలుసుకోవలసిన సూక్ష్మ విషయం ఇదే!

బృహదీశ్వర ఆలయం

ఈ ఆలయంలో మనం #32పొరల_మానవ #వెన్నెముకను పూజిస్తాము, బరువుగా, 
నిష్పత్తి 32,16,8.ఇది #తంజావూర్ లోని #బృహదీశ్వరాలయం

మన పురాతన దేవాలయాలు నిర్మాణ నిర్మాణాలు మాత్రమే కాదు, మానవ శరీరం మరియు మన #విశ్వం_యొక్క_రహస్యం స్పష్టమైన నిర్మాణం మరియు కోడ్.
మన #దేవాలయం_శాస్త్ర_విజ్ఞానానికి_మూలం.

మన దేవాలయం ప్రైమరీ డివైన్ క్రియేటివ్ బుక్, ఇది విశ్వ, ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయతతో మానవ మెదడు యొక్క వివరణ చేస్తుంది...
ఇది #తమిళనాడులో ఉన్న బృహదీశ్వరాలయం...
ఇది చక్రవర్తి రాజా #చోలచే నిర్మించబడిన పురాతన ఆలయం.

2010లో ఈ ఆలయం #1000సంవత్సరాల పురాతనమైనది మరియు #యునెస్కో ప్రపంచ #వారసత్వ_ప్రదేశంలో_భాగమైంది...

 ఈ ఆలయం యొక్క ప్రతి నిర్మాణం మానవ మెదడు యొక్క ఆకృతిని పోలి ఉంటుంది, ఇది జ్ఞానం మరియు విద్యను ప్రకాశవంతం చేయడానికి రూపొందించబడింది.

ఉగ్రతార దేవాలయం


ఈ ఆలయం శివుని మొదటి భార్య సతీదేవికి సంబంధించినది.🌹

ఉగ్రతార దేవాలయం 



🌸ఉగ్రతార దేవాలయం ఈశాన్య భారతదేశంలోని లోటాక్సిల్ (లటాసిల్) ప్రాంతంలో గౌహతి నగరం నడిబొడ్డున జోర్ పుఖురి ట్యాంకుల పశ్చిమ భాగంలో ఉగ్రతారకు అంకితం చేయబడిన ఆలయం. అస్సాంలోని గౌహతి తూర్పు భాగంలో ఉజాన్ బజార్లోని ఉగ్రతార దేవాలయం ఒక శక్తి క్షేత్రం. శివుని మొదటి భార్య సతీదేవి నాభి ఈ ఆలయానికి సంబంధించినదని పురాణాలు చెబుతున్నాయి. అస్సాంలోని ఉగ్రతార సాధారణంగా బౌద్ధ మతానికి చెందిన తిక్ష్నా-కాంత, ఏక-జాత మొదలైన వాటితో గుర్తించబడుతుంది.

🌸ప్రస్తుత ఉగ్ర తార ఆలయాన్ని అహోం రాజు శివ సింహ 1725 ADలో నిర్మించాడు, అతను మూడు సంవత్సరాల క్రితం ఒక ట్యాంక్ను తవ్వాడు. జోరెపుఖురి అని పిలువబడే ట్యాంక్ ఆలయానికి తూర్పున ఉంది. వినాశకరమైన భూకంపం కారణంగా ఆలయం ఎగువ భాగం ధ్వంసమైనప్పటికీ, ట్యాంక్ ఇప్పటికీ ఉంది. అయితే దీనిని స్థానిక పౌరుడు పునర్నిర్మించారు.

🌸కాళికా పురాణం దిక్కర వాసిని అనే శక్తి పీఠాన్ని వివరిస్తుంది. దిక్కర వాసినికి తిక్ష్ణ కాంత మరియు లలిత కాంత అనే రెండు రూపాలు ఉన్నాయి. తిక్ష్ణ కాంత నలుపు మరియు కుండ బొడ్డుతో ఉంటుంది. దీనిని ఉగ్ర తార లేదా ఏక జాత అని కూడా పిలుస్తారు. లలిత కాంత మనోహరంగా ఆకర్షణీయంగా ఉంటుంది, దీనిని తామ్రేశ్వరి అని కూడా పిలుస్తారు.ఉగ్ర తార గర్భగృహంలో ఆమె బొమ్మ లేదా విగ్రహం లేదు. నీటితో నిండిన చిన్న గొయ్యిని దేవతగా భావిస్తారు. ఉగ్ర తార ఆలయం పక్కన శివాలయం మరియు రెండు దేవాలయాల వెనుక ఒక చెరువు ఉన్నాయి.

🌸ఒకానొకప్పుడు, యమ ( నరకాధిపతి ) బ్రహ్మకు ఫిర్యాదు చేసాడు, పాపాలు చేసినప్పటికీ, ఈ ప్రాంతం యొక్క పవిత్రత కారణంగా ఎవరూ కామరూపం నుండి నరకానికి రావడం లేదు. బ్రహ్మ ఈ ఫిర్యాదును విష్ణువుకు చేరవేసాడు. విష్ణువు వారిని శివుని వద్దకు తీసుకెళ్లాడు. కామాఖ్యలో నివసించే ప్రజలందరినీ తరిమికొట్టమని శివుడు ఉగ్ర తార దేవిని ఆదేశించాడు. ఆమె తన సైన్యాన్ని పంపింది. ఈ డ్రైవ్లో, వారు సంధ్యాచల్లో శివుని ధ్యానిస్తున్న ఋషి వశిష్ఠపై చేయి వేశారు. వసిష్ఠుడు కోపించి ఉగ్ర తారను, శివుడిని శపించాడు. అప్పటి నుండి అన్ని వైదిక (శివ) సాధనలు కామ రూపములో విడిచిపెట్టబడ్డాయి మరియు ఉగ్ర తార వామాచార సాధనకు దేవత అయింది. ఆమె సైన్యం అంతా మ్లేచ్ఛలయ్యారు.

కావలసిన వారు ఇక్కడ Click చేయండి
🌸గౌహతి సాంస్కృతికంగా గొప్ప దేవాలయాలు మరియు మతపరమైన ప్రదేశాలకు నిలయం. నగరంలో ఉన్న ఉగ్రతార ఆలయం అందులో ఒకటి. ఇది ఒక దేవి ఆలయం, మరియు హిందూ సంప్రదాయంలోని శక్తి విభాగంలో అపారమైన విలువను కలిగి ఉంది, ఇది అస్సాంలోని జుర్ పుఖురి ట్యాంక్కు పశ్చిమాన గౌహతిలోని లతాసిల్ ప్రాంతంలో ఉంది. ఈ ఆలయం శివుని మొదటి భార్య సతీదేవికి సంబంధించినది.

ఉగ్రతార దేవాలయం, గౌహతి యొక్క ప్రసిద్ధ పురాణం
🌸ఉగ్రతార ఆలయానికి సంబంధించిన విభిన్న పురాణగాథలు ప్రజలలో వ్యాపించి ఉన్నాయి. ఈ ఆలయాన్ని చాలా మంది విశ్వాసులు ముఖ్యమైన శక్తి పీఠంగా భావిస్తారు. పౌరాణిక సంప్రదాయం ప్రకారం, సతీదేవి తన తండ్రి దక్షుని అవమానానికి గురై యజ్ఞం చేసినప్పుడు ఆత్మాహుతి చేసుకుంది. వేదనకు గురైన శివుడు మరియు దుఃఖంతో సతీదేవి కాలిన శరీరాన్ని విశ్వమంతా మోసుకెళ్లి, ఆ తర్వాత తాండవ (నాశన నృత్యం) ప్రదర్శించాడు. ఇది చూసిన చాలా మంది దేవతలు భయపడి, సహాయం కోసం విష్ణువు వద్దకు పరుగులు తీశారు. విష్ణువు వారి ప్రార్థనలను విని, సతీదేవిని తన సుదర్శన చక్రంతో ముక్కలుగా చేసి భూమిపై పడ్డాడు. ఉగ్రతార ఆలయం ఉన్న ఈ ప్రదేశంలో సతీ నావికాదళం పడిపోయిందని చెబుతారు.

🌸వివిధ పురాణాలలో చెప్పబడిన శక్తి పీఠాల గురించి వివిధ వివరణలు ఉన్నాయి. కాళికా పురాణం ప్రకారం, ప్రముఖ శక్తి పీఠాలు ప్రసిద్ధ కామాఖ్య శక్తి పీఠం మరియు చుట్టుపక్కల కేంద్రీకృతమై ఉన్నాయి. ఆ పీఠాలలో ఒకటి దిక్కర వాసిని. దిక్కర వాసిని భక్తులలో ఆరాధించే రెండు ప్రసిద్ధ రూపాలను కలిగి ఉంది, తిక్ష్ణ కంఠ మరియు లలిత కంఠ. తిక్ష్ణ కంఠం నలుపు మరియు కుండ-బొడ్డు అని చెబుతారు మరియు దీనిని ఉగ్రతార లేదా ఏకజాత అని కూడా అంటారు. ఉగ్రతార ఆలయం గౌహతి ఈ రకమైన దిక్కర వాసినికి అంకితం చేయబడింది.

ఉగ్రతార ఆలయ నిర్మాణం
🌸గౌహతిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని అహోం రాజు శివ సింగ్ 1725 ADలో నిర్మించాడు, అతను సంవత్సరాల క్రితం ఒక ట్యాంక్ను తవ్వాడు. జుర్ పుఖురి అని పిలువబడే ఈ ట్యాంక్ ఉగ్రతార ఆలయానికి తూర్పు వైపున ఉంది. ట్యాంక్ ఇప్పటికీ అదే స్థలంలో ఉంది, అయినప్పటికీ దానిలో కొంత భాగం భూకంపం కారణంగా ధ్వంసమైంది, అది తరువాత పునర్నిర్మించబడింది. గర్భ గృహంలో, అమ్మవారి గర్భగుడిలో, ఆమె విగ్రహం లేదా చిత్రం లేదు, కానీ నీటితో నిండిన చిన్న గొయ్యిని దేవతగా భావిస్తారు. ఆలయం పక్కనే ఒక శివాలయం ఉంది మరియు రెండు దేవాలయాల వెనుక ఒక చెరువు కూడా ఉంది.

అస్సాంలోని గౌహతిలోని ఉగ్రతార ఆలయంలో పండుగలు జరుపుకుంటారు
🌸ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఆచారాలు మరియు భక్తిశ్రద్ధలతో జరిగే ప్రధాన పండుగ దుర్గాపూజ. ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దేవుడిని ప్రార్థిస్తారు. ఉగ్రతార దేవి యొక్క వివిధ అవతారాల ఇతర పండుగలు కూడా ఆలయంలో జరుపుకుంటారు, వీటిని స్థానికంగా అనుసరిస్తారు. నవరాత్రులు కూడా ఆలయంలో సమాన శక్తితో మరియు విశ్వాసంతో జరుపుకుంటారు.

 

అరుణాచల ఆలయం లో యథార్థ కథ

🌺పటిక బెల్లం లో మూడవవంతు🌺
(అరుణాచల ఆలయంలో యదార్థo)

🌹ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వారి దృష్టి అరుణాచలుని సన్నిధి లోని 
హుండీపై పడింది. ఆ పిల్లలిద్దరు హుండీ లోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీయటం ప్రారంభించారు.
అందులో ఒకడు " ఒరేయ్ ఎవరన్నా చూస్తున్నారేమో - చూడరా అన్నాడు ఇంకొకడితో.

🌹రెండవవాడు చుట్టూ చూసి.... అరుణాచలుడు ఇంతేసి గుడ్లేసుకొని చూస్తున్నాడురా ! అన్నాడు.
ఇద్దరు అరుణాచలునికి ఎదురుగా నిలబడి మా దొంగతనం బయట పడకుండా చూచే బాధ్యత నీదే, అందుకు పటిక బెల్లం లో మూడవ వంతు నీకిస్తాము, ముగ్గురం సమానంగా తీసుకుందాం, ఇది మన ఒడంబడిక అన్నారు.

🌹ఇలా ప్రతీ రోజు ఒక వంతు పటిక బెల్లం అరుణాచలునికి పెడుతున్నారు. ఆశ్చర్యంగా శివుని ముందు పెడుతున్న పటిక బెల్లం మాయ మవుతోంది.

🌹ఒకరోజు ఆలయ పూజారి ఇద్దరు దొంగల్ని పట్టుకొని ఆలయ అధికారికి అప్పగించాడు, వీళ్లిద్దరు ఎనిమిదేళ్ల పసి కాయలు, వీళ్ళను ఎలా శిక్షించాలి అని, అరేయ్ పిల్లలు! మీరు ఇద్దరు అంతరాలయంలో 108 ప్రదక్షిణలు చేయండి అని..ఇదేమీ శిక్ష అన్నాడు పూజారి.

🌹పిల్లలు ఇద్దరు ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించారు, ఆలయ పూజారి, అధికారి దూరంగా కూర్చొని పిల్లల ప్రదక్షిణాలు చూస్తున్నారు వినోదంగా. ఇంతలో పూజారి , అధికారి ఒక్కసారిగా త్రుళ్ళిపడ్డారు, పరిశీలించి పిల్లల్ని మళ్ళొకసారి చూసారు, ఆ ఇద్దరి పిల్లతో పాటు, మూడవ పిల్లవాడు ప్రదక్షిణ చేయడం చూసారు, మూడవ పిల్లాడు మెరిసిపోతున్నాడు, మళ్ళీ మాయమవుతున్నాడు మాటిమాటికీ. ఇది గమనించి అధికారి మెల్లగా పిల్లల్ని సమీపించి మూడవ పిల్లవాడిని గట్టిగా వాటేసుకున్నాడు.

🌹అద్భుతం!! మూడవ పిల్లవాడు కాంతిరేఖగా మారి, గర్బాలయంలోకి వెళ్లి మాయమై పోయాడు.
అరుణాచలేశ్వరుడు దొంగ పటిక బెల్లం మూడవ వంతు తిన్నాడు కదా, అందుకని పరమేశ్వరుడు వారితో ప్రదక్షిణ చేస్తున్నాడన్నమాట.

🌹ఆ అధికారి పిల్లల్ని బుజ్జగిస్తూ " అసలేం జరిగింది " అని అడిగాడు. పిల్లలు అరుణాచలేశ్వరుని వాటా గురించి చెప్పారు. అది విని వారు ఆశ్చర్యం,ఆనందంలో మునిగిపోయారు. సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు కూడా వారితో వాటా పంచు కున్నందుకు శిక్ష అనుభవించాడన్న మాట. ఆలయం లో సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు ఉన్నాడు అంటానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి ??

🌹నిష్కల్మష ప్రేమకు, నిర్మల భక్తి కి అరుణాచలేశ్వరుడు ఎపుడూ బందీయే !! అరుణా చలుడు కాంతి రూపం లో ఉంటాడని, అది అగ్ని లింగం అని శాస్త్రవచనం. ఆ పరిసర ప్రాంతాలలో మరియు కొండపైన అరుణాచలుడు కాంతి రూపం లో, కాంతి స్తంభం ( Beem of light ) రూపం లో భక్తులని అనుగ్రహించిన సంఘటనలు అనేకం .

🍀శివుడు ప్రేమ నిష్కల్మషమైన ప్రేమ.. ఆర్తితో పిలిస్తే పరుగున వచ్చేస్తారు నా స్వామి... హర హర మహాదేవ.. ఓం నమఃశివాయ🙏🙏🙏🙏🙏🙏🙏

23, జనవరి 2023, సోమవారం

శ్రీ కపోతేశ్వరస్వామి ఆలయం

🕉 

👉 తూ.గో జిల్లా : కడలి 

👉 శ్రీ కపోతేశ్వరస్వామి ఆలయం : కడలి


🔅 జగతిలోని ప్రతి అణువులోనూ శివతత్వం ఇమిడి ఉన్నదన్న పరమతత్వాన్ని ప్రబోధించే దివ్యక్షేత్రం కడలి కపోతేశ్వర క్షేత్రం. 
తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధికెక్కిన శైవ క్షేత్రాల్లో ఒకటిగా, కుజ, రాహుకేతు దోషాలను రూపుమాపే మహిమాన్విత క్షేత్రంగా గుర్తింపు పొందింది ఈ క్షేత్రం.

🔅 త్యాగానికి నిదర్శనం ఈ పుణ్య ‘కడలి’.

💠 భక్తుల పాలిట కరుణాసముద్రుడిగా పూజలందుకుంటున్న కపోతేశ్వర స్వామివారికి ఎంతో గొప్ప పౌరాణిక నేపథ్యం ఉంది.

💠 ఈ క్షేత్ర మహాత్యం బ్రహ్మాండ పురాణంలో ఉన్నట్లు పురాణకారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో శ్రీ కపోతేశ్వర క్షేత్రానికి విశిష్టత ఉంది. ఇక్కడి క్షేత్రంలో శివలింగం కపోతం ఆకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది.

🔅ఆలయ చరిత్ర:
💠 పూర్వం అటవీ ప్రాంతంగా ఉన్న కడలి అనే ప్రాంతంలో ఒక పావురాల జంట నివాసం ఉండేది. తన వృద్ధ తల్లిదండ్రుల ఆకలి బాధను తీర్చేందుకు ఒక వేటగాడు అడవికి వేట కోసం బయలుదేరుతాడు. 
ఆ సమయంలో అధికంగా వర్షం కురవడంతో వేటగాడికి ఎటువంటి ఆహారం లభ్యం కాదు. వర్షానికి తడిసి ముద్దయిన వేటగాడు పావురాలు కాపురం ఉంటున్న చెట్టుకింద తలదాచుకుంటాడు. 
చలికి వణుకుతూ తన తల్లిదండ్రులకు ఆహారం సంపాదించి పెట్టలేని జీవితం ఎందుకని బాధతో తల్లడిల్లిపోతాడు. చెట్టుపైన ఉన్న పావురాలు వేటగాడి బాధను గ్రహించి తమ గూటిలోని ఎండుపుల్లలను చెట్టు కింద ఉంచి పక్కనే ఉన్న శ్మశానంలోని రగులుతున్న నిప్పుపుల్లను తెచ్చి మంట రాజేసి వేటగాడిని చలిబాధ నుంచి విముక్తి చేస్తాయి. చలి నుంచి తేరుకున్న వేటగాడిని తమ అతిథిగా భావించి పావురాల జంట ఆ మంటలో దూకి ప్రాణత్యాగం చేసి వేటగాడికి ఆహారమవుతాయి. 
పావురాల త్యాగానికి చలించిపోయిన వేటగాడు, వాటి ఔదార్యం ముందు తానెంత అనే భావనతో విరక్తి చెంది అదే మంటలో దూకి ఆత్మత్యాగం చేసుకుంటాడు.

💠 పావురాల అతిథి ధర్మానికి, కారుణ్యానికి పరమశివుడు సంతోషించి ప్రత్యక్షమై పావురాల జంటను తనలో ఐక్యం చేసుకుంటాడు. పావురాలు మహాశివుడిని ప్రార్థించి వేటగాడిని బతికించాలని వేడుకుంటాయి. 
అలాగే తాము ప్రాణత్యాగం చేసుకున్న ప్రాంతంలో భక్తులను అనుగ్రహించేందుకు ఆ ప్రాంతంలో ఆవిర్భవించవలసిందిగా కోరడంతో పరమశివుడు శ్రీ కపోతేశ్వర స్వామిగా కొలువుదీరారు. 

💠 కపోత జంటను తనలో లీనం చేసుకున్న గుర్తుగా శివలింగంపై రెండు వైపులా పావురాల తల, రెక్కలు, తోక గుర్తులు ఉంటాయి. 
వీటిని స్వామి వారికి అభిషేకాలు చేసే సమయంలో నిజరూప దర్శనంలో భక్తులు వీక్షించవచ్చు

💠 నేటికీ స్వామి వారికి ఉత్తరం భాగంలో శ్మశానం ఉండటం స్థల పురాణానికి నిదర్శనంగా భావిస్తారు. ఇక్కడ శివలింగం కపోతాకారంలో దర్శనం ఇస్తుంది. కపోతగుండమనే చెరువులోకి ప్రతి మాఘ ఆదివారమున కాశీ నుంచి గంగాతీర్ధం అంతర్వాహినిగా వస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

💠 గర్భాలయంలో ఉత్తరాభిముఖంగా ఆవిర్భవించిన స్వామికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తన పడగలతో నీడపట్టాడు. 
అందుకే ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్రుని రూపంలో ఇలవేల్పుగా వెలియడంతో శివలింగంతో పాటు నాగేంద్రుడు కూడా ఒకే పీఠంపై నిత్య పూజలు అందుకుంటున్నారు.

💠 నిత్యం శ్రీ కపోతేశ్వరస్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ప్రతి మాస శివరాత్రికి లక్షబిల్వార్చన పూజలు జరుగుతాయి. 
మార్గశిర మాసంలో జరిగే సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలకు సుబ్రహ్మణ్యేశ్వరునికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవాలు జరిపిస్తారు.

💠 ఆలయానికి అనుకుని ఉన్న కొలను కపోతగుండం (చెరువు)గా ప్రసిద్ధి చెందింది. కాశీలోని గంగాజలం ఈ గుండంలోకి అంతర్వాహినిగా ప్రవహిస్తోందని భక్తుల విశ్వాసం. ప్రతి మాఘమాసం ఆదివారం నాడు కాశీ నుంచి గంగాజలం అంతర్వాహినిగా వచ్చి కపోతగండంలో కలవటంతో ఆ రోజు మారేడు పత్రాలు ఆ గుండంలో వేస్తే మునిగిపోతాయని, ఆ రోజున కపోత గుండంలో స్నానమాచరించి కపోతేశ్వరుని దర్శిస్తే మోక్షం కలుగుతుందని అర్చకులు వివరిస్తున్నారు.

💠 శ్రీ చక్ర సహిత త్రిపుర సుందరీ దేవి
జగద్గురువులు ఆది శంకరాచార్యులు భారత దేశ పాదయాత్ర చేస్తూ అష్టోత్తర శ్రీ చక్ర సహిత అమ్మవార్ల ఆలయాలను 108 చోట్ల ప్రతిష్ట చేశారు. 
దీనిలో భాగంగా ఈ క్షేత్రంలో శ్రీ కపోతేశ్వరస్వామి వారి ఆలయానికి ఎడమవైపు శ్రీ చక్ర సహిత బాలా త్రిపుర సుందరీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అమ్మవారికి నిత్య కుంకుమపూజలు నిర్వహిస్తారు.

💠 క్షేత్ర పాలకుడు జనార్దనుడు
కపోతేశ్వరస్వామి ఆలయానికి క్షేత్ర పాలకుడుగా జనార్దన స్వామి ఉన్నారు.

💠 ఇది కుజదోష నివారణ క్షేత్రం.
స్వయంభువుగా కొలువుతీరిన స్వామి వారి ఆలయంలో శైవాగమ సంప్రదాయం ప్రకారం నిత్య పూజలు, అభిషేకాలు జరుగుతాయి. 

💠 భక్తులు 11 మంగళవారాలు క్రమం తప్పకుండా స్వామి వారిని దర్శించుకుంటారు. వివాహం కాని వారు, సంతానం లేని దంపతులు, కుజ దోష నివారణ కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి విచ్చేస్తారు.

💠 ఈ ఆలయం రాజోలు నుండి 7 కిలోమీటర్ల దూరంలో కడలి అనే గ్రామంలో కలదు

చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం


ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండవు.🌷

చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం



🌸చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట పట్టణంలో ఉంది. ఇది సూళ్లూరుపేట దక్షిణ కొన వద్ద, కాళంగి నది ఒడ్డున ఉంది.

🌸ఈ ఆలయం చెన్నై, తిరుపతి మరియు నెల్లూరు నుండి వరుసగా 79 కిమీ, 84 కిమీ మరియు 97 కిమీ దూరంలో ఉంది. ఇది నాలుగు మరియు ఐదవ శతాబ్దాలలో స్థాపించబడిందని చరిత్ర చెబుతోంది.

పురాణం 
🌸విగ్రహం యొక్క అత్యంత ఆసక్తికరమైన అంశం, దేవత యొక్క ఎడమ వైపు పార్వతిని వర్ణిస్తుంది, కుడి వైపున సరస్వతిని మరియు మధ్య భాగంలో శ్రీ మహాలక్ష్మిని వర్ణిస్తుంది. త్రికళే చెంగళి అనే పేరు రావడానికి ఈ లక్షణాలే కారణం. చోళ పండితుడు దేవత విగ్రహాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందాడు. ఇక్కడ ఆమె చిహ్నం ఎనిమిది చేతుల రూపాన్ని వర్ణిస్తుంది, ప్రతి ఒక్కరూ శక్తివంతమైన ఆయుధాన్ని రాక్షసుడిపై నిలబడి ఉన్న భంగిమలో విస్తృతమైన మరియు సాటిలేని సౌందర్యాన్ని కలిగి ఉన్నారు, దేవి పార్వతి దేవి మాత్రమే కాదు, మహాకాళి కూడా అని భావించారు. 

🌸సుమారు 10వ శతాబ్దంలో, ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని పాలించిన చోళ సామ్రాజ్యం, కాళంగి నదిలో ఉద్భవించిన దేవత గురించి తెలుసుకుని శ్రీ చెంగాళమ్మకు ఒక చిన్న గుడిసెను నిర్మించారు.

🌸ప్రారంభంలో, దేవతను "తెంకాళి (దక్షిణ కాళి)" అని పిలిచారు, తరువాత "చెంగాలి" మరియు ఆ తర్వాత ప్రస్తుతం చెంగాళమ్మ అని పేరు పెట్టారు.

చరిత్ర 
🌸ఆలయ చరిత్ర 10వ శతాబ్దం నాటిది. గ్రామగ్రామాన అమ్మ శక్తిగా వెలసి ఒక్కో పేరుతో పిలిపించుకుంటూ, సహస్ర నామదారిని ప్రజలను కన్న బిడ్డల వలే కాపాడుతుంది. జగన్మాతకు ఉన్న అనేక దేవాలయాల్లో కొన్ని భక్తి లోకంలో విపరీతమైన విశ్వాసాన్ని కలిగించాయి. అమ్మ ఎక్కడైనా అమ్మే! కానీ భక్తులకు కలిగిన అనుభవాలే వారిలో నమ్మకాన్ని పెంచాయి.అలా అమ్మ ఇక్కడ స్థిర నివాసముంటున్నది అనే భావన, అపూర్వ అనుభూతిని కలిగించే ఆలయాల్లో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం ఒకటి. మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో తమిళనాడుకి సరిహద్దులో ఉన్న సూళ్లూరు పేటలో కొన్ని వందల సంవత్సరాలుగా పూజలందుకొంటున్నది శ్రీచెంగాలమ్మ. 

🌸పదో శతాబ్ద కాలంలో ఈ గ్రామం పేరు శుభ గిరి పదో శతాబ్ద కాలంలో ఈ గ్రామం పేరు ‘‘శుభ గిరి''. ఒక గొల్లపల్లె. రోజూ మాదిరిగానే పశువులను మేతకు తోలుకెళ్ళారు. సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకునేముందు సమీపంలోని పవిత్ర కళంగి నదిలో ఈతకు దిగిన కొందరు నీటి ప్రవాహం వేగానికి సుడిలో చిక్కుకుని కొట్టుకునిపోతూ, ఒక శిలను పట్టుకుని, ఆ ఆసరాతో ఒడ్డుకు చేరుకున్నారు.



🌸నీటీ ఉదృతి తగ్గిన తర్వాత చూస్తే అష్ట భుజాలతో వివిధ ఆయుధాలు ధరించ పాదాల క్రింద దానవుని దునుముతున్న దేవి విగ్రహం పశువుల కాపరి చూసి గ్రామా పెద్దలకు విన్నవించగా.. గ్రామస్తులు వచ్చి అమ్మవారి విగ్రహం ఒడ్డుకు తీసుకునివచ్చి ఒక రావి వృక్షం క్రింద తూర్పుముఖంగా ఉంచారు. మరుసటి రోజు వచ్చి చూడగా అమ్మవారి విగ్రహం దక్షిణ ముఖముగా నీటారుగా నిలబడి మహిసాసుర మర్ధిని స్వయంభుగా వెలసి ఉండడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యంలో మునిగిపోయారు.

🌸అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు కలలో కనబడిన అమ్మవారు కనబడి, తాను అక్కడే ఉండదలచానని చెప్పడంతో చిన్న ఆలయాన్ని నిర్మించారు. అసుర సంహారిని అయినా శాంతి మూర్తిగా కొలువుతీరడం వల్ల "తెన్ కాశీ" ( దక్షిణ కాశి ) అని పిలిచేవారు.

🌸ఏడు సంవత్సరాలకొకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా కాల క్రమంలో అదే "చెంగాలి" గా "చెంగాలి పేట"గా పిలవబడి, చివరకి ఆంగ్లేయుల పాలనలో సూళ్ళూరు పేటగా మారిందంటారు. ఊరి పేరు వెనక మరో కారణం కూడా చెబుతారు. ఏడు సంవత్సరాలకొకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద "సుడి మాను" తిప్పటం ఒక ఆచారంగా వస్తోంది. అదే సూళ్ళూరు పేటగా రూపాంతరం చెందినదని అంటారు.

ఆలయ విశేషాలు :
🌸సువిశాల ప్రాంగణంలో ఆలయ సముదాయం నిర్మించబడి ఉంటుంది. తూర్పు వైపున స్వాగత ద్వారం, రాజ గోపురం నిర్మించారు. ఉప ఆలయాలలో గణపతి, లింగ రూప కైలాసనాధుడు, నాగ దేవతలు కొలువుతీరి దర్శనమిస్తారు. నూతనంగా నిర్మించబడిన ప్రధానాలయం ముఖ మండపంలో నవ దుర్గా రూపాలను సుందరంగా మలచి, నిలిపారు.

🌸గర్భాలయంలో సర్వాలంకరణభూషితగా శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి గర్భాలయంలో సర్వాలంకరణభూషితగా శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి కొలువై ఉంటారు. రోజంతా భక్తుల సందర్శనార్ధం తెరిచి ఉండే ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండవు. చాలా సంవత్సరాల క్రిందట ఒక దొంగ ఆలయం లోనికి ప్రవేశించి భంగపడ్డాడట. అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారట. కానీ అమ్మవారు స్వప్నంలో " నాకు నా భక్తులకు మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదు" అని తెలపడంతో వాటిని ప్రాంగణంలో ఒక చోట ఉంచారట. ఎండిపోయి, చెక్కబడిన కలప నుండి ఆశ్చర్యకరంగా మొక్క మొలిచి పెద్ద వృక్షంగా ఎదిగింది. ఇది శ్రీ చెంగాలమ్మ మహత్యమా అన్నట్లుగా వృక్ష మూలంలో అమ్మవారి రూపం సాక్షత్కరించడం ఒక విశేషంగా పేర్కొనవచ్చును.

🌸ఈ వృక్షం దగ్గర నాగ లింగం ఈ వృక్షం దగ్గర నాగ లింగం, నవ గ్రహ మండపం ఉంటాయి. సంతానాన్ని కోరుకొనే దంపతులు ఈ పవిత్ర వృక్షానికి గుడ్డతో ఊయలలు కడతారు. నియమంగా ప్రదక్షిణలు చేస్తారు.

పూజలు ఉత్సవాలు : 
🌸ప్రతి నిత్యం నియమంగా ఎన్నో రకాల పూజలు, అర్చనలు, సేవలు శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరికి జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ప్రీతికరమైన నవ కలశ అభిషేకం, మహా చండీ యాగం ఆర్జిత సేవలుగా భక్తుల సౌకర్యార్ధం నిర్వహిస్తున్నారు. వివాహము, ఉపనయనం,పిల్లలకు తొలిసారి చెవులు కుట్టించడం, అక్షరాభ్యాసం లాంటివి జరుపుకోడానికి దేవాలయంలో తగిన ఏర్పాట్లు ఉన్నాయి. విశాల మండపము, వసతి గదులు అందుబాటులో ధరలతో దేవస్థానం ఏర్పాటు చేసింది. గణపతి నవ రాత్రులు, ఉగాది, మహాశివరాత్రి, నాగుల చవితి సందర్భాలలో భక్తులు వేలాదిగా పాల్గొంటారు. దసరా నవ రాత్రులలో ఆలయ శోభ మరింతగా పెరుగుతుంది. మన రాష్ట్రం నుండే కాక తమిళ నాడు నుండి కూడా భక్తులు తరలి వస్తారు.

సుళ్ళు ఉత్సవం : 
🌸సూళ్ళూరు పేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి కి ఏడు సంవత్సరాల కొకసారి మే - జూన్ నెలల మధ్య బ్రహ్మ్హోత్సవాలు జరుపుతారు. ఏడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు సుడిమాను ప్రతిష్ట, బలి హరణ తో ప్రారంభం అవుతాయి. రెండో రోజునుండి నాలుగో రోజు వరకు సుడి మానుకు చక్రం, నల్ల మేక, పూల మాల, పాలవెల్లి, మనిషి బొమ్మ కట్టి సుళ్ళు తిప్పుతారు. మూడో రోజున మహిషాసుర మర్దన అంటే దున్నపోతు బొమ్మ తలను నరకడం జరుగుతుంది. లోక కంటకుడైన మహిషాసురుని మహాకాళి సంహరించి లోకాలను కాపాడినందుకు ఆనందించిన ప్రజలు అయిదో రోజున కాళింది నదిలో అమ్మవారికి ఘనంగా తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆఖరి రోజున పరమేశ్వరిని పుష్ప పల్లకిలో ఊరేగిస్తారు. ఈ ఏడు రోజులు అమ్మవారిని గ్రామంలో అశ్వ, సింహ, నంది ఇలా రోజుకో వాహనం మీద ఊరేగిస్తారు.

🌸మహిమ గల తల్లిగా, కోరిన వారాలను ప్రసాదించే పరమేశ్వరిగా కొలువుతీరిన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరీ ఆలయం, నెల్లూరు పట్టణానికి వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న సూళ్ళూరు పేట లో ఉన్నది. చెన్నై వెళ్ళే రైళ్ళలో అధిక శాతం సూళ్ళూరు పేటలో ఆగుతాయి. నెల్లూరు, తిరుపతి పట్టణాల నుండి బస్సులు ఉన్నాయి. సూళ్ళూరు పేటలో యాత్రీకులకు కావలసిన అన్ని సౌకర్యాలు లభిస్తాయి.

🌸శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం ఇక్కడే ఉన్నది.ప్రసిద్ది చెందిన నేలపట్టు విదేశీ పక్షుల కేంద్రంప్రసిద్ది చెందిన నేలపట్టు విదేశీ పక్షుల కేంద్రం, పులికాట్ సరస్సు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాయి.

 

గురువు యొక్క ప్రేమ

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


            *గురువు యెుక్క ప్రేమ!*
                  ➖➖➖✍️

*1). విహంగ న్యాయం:-*

*పక్షి గుడ్లను పెట్టి పొదిగి తన రెక్కల స్పర్శ చేత గుడ్లను పిల్లలుగా చేస్తుంది.*

*అలాగే సద్గురువు తన 'స్పర్శ' చేత శిష్యునికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తాడు.( స్పర్శ ప్రేమ మయంగా ఉండవచ్చు లేదా కొట్టవచ్చు కూడా)*

*2). భ్రమర కీటక న్యాయం:-*

*భ్రమరం ఒక కీటకాన్ని తెచ్చి దాని చుట్టూ తిరుగుతూ 'ఝుంకార' శబ్దం చేస్తుంది. అప్పుడు ఆ కీటకము ఝుంకారము వల్ల భ్రమరంగా మారిపోతుంది.*
*అలాగే సద్గురువు శిష్యునకు 'వాక్కు' ద్వారా బోధ చేస్తూ తన వలే తయారు చేస్తాడు.*
*( వాక్కు మధురంగా ఉండవచ్చు లేదా తిట్టవచ్చు )*

*3). మీన న్యాయం :-*

*చేప గుడ్లను పెట్టి వెనకకు తిరిగి వాటిని తీక్షణంగా చూస్తుంది. తల్లి చేప దృష్టి సోకగానే గుడ్లు పిల్లలుగా మారుతాయి.*

 *ఇదేవిధంగా సద్గురువు కరుణామృత 'దృష్టి' ప్రసరించడంవల్ల శిష్యుడు జ్ఞాన పరిపుష్టి పొందుతాడు.*

*4). తాబేటి తలపు న్యాయము :-*

*తాబేలు ఒకచోట గుడ్లు పెట్టి ఆహారానికి వెళుతుంది. ఆ గుడ్లు పిల్లలు కావాలని 'సంకల్పిస్తుంది'. ఆ సంకల్పబలంతో ఆ గుడ్లు పిల్లలుగా తయారవుతాయి.*

*అలాగే శిష్యుడు ఎక్కడ ఉన్నా అతను ‘పర బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి, పరమార్థ జ్ఞానాన్ని చేరాలి!’ అని సద్గురువు 'సంకల్పిస్తారు'.*
*ఆ దివ్య సంకల్పంతో శిష్యుడు అభివృద్ధి పొంది పరమార్ధం పొందుతారు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

20, జనవరి 2023, శుక్రవారం

మౌని అమావాస్య అనగానేమి?

_*మౌని అమావాస్య*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*మౌని అమావాస్య అనగానేమి ? మౌని అమావాస్య యొక్క విశిష్టత ఏమిటి ?*

పుష్యమాసంలో అమావాస్యను మౌని అమావాస్యగా జరుపుకుంటారు. ఇది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో వస్తుంది. మౌని అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు మరియు నదుల్లో పవిత్రస్నానాలు ఆచరిస్తారు. స్నానం యొక్క పవిత్రత రెండు లేదా ఎక్కువ నదులు కలిసేచోట చేస్తే పెరుగుతుంది. మరో ముఖ్య విషయం మౌని అమావాస్య సాధారణంగా ఆంగ్ల సంవత్సరపు మొదటి అమావాస్యగా మరియు మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తుంది.


*మౌని అమావాస్య ప్రాముఖ్యత*

మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు , సాధువులు మౌనంగా ఉంటారు. దీన్ని జ్ఞానంను నిద్రలేపే చర్యగా భావించి , దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తారు. ఏమీ చెప్పవలసిన అవసరం కానీ , చెప్పగలిగేందుకు కూడా ఏమీ ఉండదని నమ్ముతారు.

గంగానది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు. దీనివల్ల ఆరోజు స్నానం చేయటానికి గంగానది ముఖ్యమైన నదిగా మారింది.

గంగానదిలో స్నానం చేయటానికి కూడా మౌని అమావాస్య కూడా మేటి రోజు. కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగానదిలో స్నానం చేయాలని వ్రతం చేపడతారు. వారు పుష్య పూర్ణిమ నాడు మొదలుపెట్టి , మాఘ పూర్ణిమ నాడు వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఈ రోజు ఎంత ముఖ్యమైనదంటే 5 కోట్ల కన్నా ఎక్కువ మంది భక్తులు అలహాబాద్ సంగమ్ ఘాట్ల దగ్గర చేరి పవిత్రస్నానం ఆచరిస్తారు.

మౌని అమావాస్య రోజును మాఘి అమావాస్య అని కూడా అంటారు. ఇది ఉత్తరభారతం వారు పాటించే క్యాలెండర్ లో మాఘమాసంలో వస్తుంది

*మౌని అమావాస్య ఆధ్యాత్మిక విశిష్టత*

మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పది. మౌని అమావాస్య పదాలను మౌని , అమ మరియు వాస్యగా విడగొట్టవచ్చు.
మౌనికి అనువాదం - మాట్లాడకుండా మౌనంగా ఉండటం , అమ - చీకటి మరియు వస్య - కామం. అమావాస్యకి మరో అర్థం కలిసి వెతకడం. దీని అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని , కామాన్ని తొలగించుకోవాలని.
చంద్ర దేవుడు లేదా చందమామ మన మనస్సులను నియంత్రించే గ్రహమని నమ్ముతారు. మౌని అమావాస్య నాడు చంద్రుడు ఉండడు. ఈ రోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు.
భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు - *'మన మనస్సే మనకి గొప్ప స్నేహితుడు , అందుకని దానికి సరిగ్గా శిక్షణనిస్తే నియంత్రణలో ఉంటుంది. దానికి మీమీద నియంత్రణనిస్తే అదే గొప్ప శత్రువుగా మారవచ్చు.'*
శరీరాన్ని , మనస్సును , ఆత్మను శుద్ధిచేసుకునే పవిత్రనదుల్లో స్నానం మరియు మౌనంగా ఉండే సంప్రదాయానికి కూడా కారణం ఇదే కావచ్చు.

*మౌని అమావాస్యను ఎలా జరుపుకోవాలి?*

సాంప్రదాయంగా , భక్తులు మౌని అమావాస్య రోజు ఉపవాసం ఉంటారు. మౌనవ్రతం చేస్తారు మరియు ఒక్క మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్తపడతారు. గంగానదిలో స్నానం కూడా తప్పనిసరిగా భావిస్తారు. మీరు సాంప్రదాయకంగా మౌని అమావాస్యను జరుపుకోలేకపోతే , మీరు అదే ఫలితం కోసం ఈ కింది ఆచారాలను పాటించవచ్చు. 

మీరు గంగానదిలో స్నానం చేయలేకపోతే
మీ ఇంట్లో గంగానది నీళ్ళు కొంచెం ఉన్నట్లయితే , అందులో కొన్ని చుక్కలను స్నానం చేసే నీళ్ళకి జతచేయండి. మీరు స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని చదవవచ్చు.
*'గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి ,*
*నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధుం కురు'*
పై మంత్రం భారత ఉపఖంఢంలోని అన్ని పవిత్రనదుల ఆశీర్వాదాన్ని మరియు తమ అంశలను మీ స్నానం చేసే నీటిలో చేరేలా చేస్తుంది.

*రుద్రాక్షలు*

చంద్రుడితో సంబంధం ఉన్నందున రుద్రాక్షమాలను ఈరోజు మీరు ధరించవచ్చు. కాకపోతే రుద్రాక్షలు ద్విముఖి లేదా పదహారు ముఖి అయివుండాలి. ఇవి వేసుకున్నవారికి ఆందోళన తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది.

*మూన్ స్టోన్*

మూన్ స్టోన్ ను మనస్సుకు సానుకూలత ఏర్పడటానికి వాడవచ్చు.
జంతువులకి ఆహారం పెట్టడం కుక్కలు , ఆవులు మరియు కాకుల వంటి జంతువులకి ఈరోజు ఆహారం పెట్టడం పవిత్రంగా భావిస్తారు.

*శనీశ్వరుడు*

మౌని అమావాస్య నాడు శనేశ్వరుడిని కూడా పూజిస్తారు. ప్రజలు నువ్వులు లేదా తిల్ నూనెతో ఈ రోజు శనేశ్వరుడికి అభిషేకం చేస్తారు.
 చొల్లంగి అమావాస్య , నాగోబా జాతర, తెప్పతిరునాళ్లు*

*చొల్లంగి అమావాస్య , నాగోబా జాతర, తెప్పతిరునాళ్లు*

 *చొల్లంగి అమావాస్య* 

పుష్య మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. గోదావరి ఏడు పాయల్లో ఒకటైన తుల్యభాగ తూర్పుగోదావరిలోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుంది. ఈ రోజున అక్కడ స్నానం చేయడంవల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ ప్రతిఏటా జరిగే చొల్లంగి తీర్ధానికి ఎంతోమంది భక్తులు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించడంతో పాటు పెద్దలకు పిండప్రదానం చేయడం, చొల్లంగిలో వెలసిన స్వామి వారిని అర్చించడం జరుగుతుంది.

 *తెప్పతిరునాళ్లు*

పుష్య బహుళ అమావాస్య అయిన ఈ రోజు, సింహాచలం కొండ దిగువ భాగంలో ని అడవివరంలో గల ఉద్యానవనం, పుష్కరణి ప్రాంతాల్లో సింహాచల అప్పన్న కు ప్రత్యేక పూజలతో పాటు తెప్పతిరునాళ్లు వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ.

 *నాగోబా జాతర* 

పుష్యమాసంలో వచ్చే అమావాస్యరోజున, గిరిజనులు నాగోబా జాతరను ఎంతో సంబరంగా జరుపుకుంటారు.ఈ రోజు వారి ఆరాధ్య దైవమైన ‘నాగోబా’ పురివిప్పి నాట్యంచేస్తాడని వారి నమ్మకం. ‘నాగోబా’ దేవాలయం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ గ్రామంలో ఉంది. మనరాష్ట్రం నుంచే కాకుండా పక్కరాష్ట్రాలనుంచీ లక్షలాదిమంది గిరిజనులు ఈగ్రామానికి చేరుకుని నాగోబా జాతరలో పాల్గొంటారు. ఈ జాతరకు ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర ఉంది.

ఈ జాతరకు 16 రోజుల ముందు అంటే పుష్యమాస పౌర్ణమికి ఒకరోజు ముందు కొంతమంది గిరిజనులు పవిత్ర నాగోబా ఆలయం నుంచి కలశం తీసుకుని గోదావరి జలం తేవటానికి కాలినడకన బయలుదేరి వెళతారు.కేస్లాపూర్‌కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న జన్నారం మండలం కలమడుకు వరకు నడిచి వెళ్ళి గోదావరి జలం తీసుకు వస్తారు. ఇక్కడ గిరిజనుల పూర్వులు స్నానం చేస్తుండగా నాగదేవత దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్రంగా గిరిజనులు భావిస్తుంటారు. ఇక్కడ సేకరించిన జలంతో నిండిన కలశాన్ని నలభై కిలోమీటర్ల దూరంలోని ‘పూసినగూడ’ గ్రామానికి లేదా ప్రధాన పూజారి ఉండే నార్నూరు మండలం గుంజాల గ్రామానికి తెచ్చి అక్కడ ఒకరోజు ఉన్న తరువాత కేస్లాపూర్‌కు 8కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లిలో ఆగి అక్కడ వెలసిన ఇంద్రాదేవిని సామూహికంగా పూజలు జరుపుతారు. అక్కడి నుంచి బయలుదేరి కేస్లాపూర్‌ చేరి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రిచెట్టు కింద 4 రాత్రులు, ఒక పాకలో 3 రాత్రులు సామూహిక పూజలు జరిపి కేస్లాపూర్‌ మందిరానికి వాయిద్యాలతో ఊరేగిస్తూ తెచ్చి ఆలయం వద్ద ఉన్న మర్రిచెట్టుపై పవిత్ర జలకలశం భద్రపరిచి 10కి.మీ. దూరంలోని సిరికొండ చేరుకుంటారు. పుష్య అమావాస్య రోజున కలశం ఉంచిన మర్రిచెట్టు దగ్గర పుట్టను తయారు చేసి ఆలయం ప్రక్కన ఉన్న పూజామందిరం మట్టితో అలికి అమావాస్య అర్థరాత్రి కలశంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగ దేవతను అభిషేకిస్తారు. గిరిజన తెగకు చెందిన మెస్రిం వంశస్తులు దేశంలో ఏ మారుమూల ఉన్నా తప్పనిసరిగా ఈ జాతరకు హాజరై నాగదేవతను పూజిస్తుంటారు.

జయమంత్రం

#జయమంత్రము!!

ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్భలం గా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకం తో పఠించి స్వామి కి ఒక్క కొబ్బరి కాయ పంచదార ను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి ఒక్క సారిగా మీ మనసు తేలిక పడి యధార్థమైన త్రోవ భోధ పడుతుంది!! మీ మనసు తేలిక పడిన తరువాత చిన్న పిల్లల కు పానకం వడపప్పు పంచండి చాలు ఉప్పొంగిపోతారు మారుతి!!

ఇది సుందరకాండ లో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్య నూ లక్ష్మణుడు ని సుగ్రీవుడిని కీర్తిస్తూ సీతమ్మ కి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం ఇది!!
జయత్యతి బలో రామః 
 లక్ష్మణస్య మహా బలః !
రాజా జయతి సుగ్రీవో 
 రాఘవేణాభి పాలితః !!
దాసోహం కౌసలేంద్రస్య 
 రామస్యా క్లిష్ఠ కర్మణః !
హనుమాన్ శత్రు సైన్యానాం
 నిహంతా మరుతాత్మజః !!
నరావణ సహస్రం మే 
 యుధ్ధే ప్రతిబలం భవేత్ !
శిలాభిస్తు ప్రహారతః
 పాదపైశ్చ సహస్రశః !!
అర్ధయిత్వాం పురీం లంకాం 
 మభివాద్యచ మైథిలీం !
సమృధ్ధార్థ్యో గమిష్యామి 
 మిషతాం సర్వ రక్షసాం !!
హనుమాన్ అంజనాసూనుః
 వాయుపుత్రో మహాబలః
 రామేష్ఠ ఫల్గుణః స్సఖా 
 పింగాక్షోమిత విక్రమః
 ఉదధిక్రమణశ్చైవః సీతా శోక వినాశకః
 లక్ష్మణః ప్రాణదాతాశ్చ దశగ్రీవశ్చ దర్పః
ద్వాదశైతాని నామాని
 కపీంద్రశ్చ మహాత్మనః
 స్వాపకాలే పఠేన్నిత్యం 
 యాత్రాకాలే విశేషతః
 తస్యమృత్యు భయంన్నాస్తి 
 సర్వత్ర విజయీ భవేత్!!

 (ఈ హనుమంతుని ద్వాదశనామాలను
 విశేషించి యాత్రలకు వెల్లేటప్పుడు లేదా
 ఏదైన ముఖ్యమైన పనులకోసం వెల్లేటప్పడు
 పఠించండి సర్వత్రా విజయాన్ని పొందండి)

అర్థం : మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై, కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసలదేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు.
శత్రుసైన్యములను రూపుమాపువాడను. వేయిమంది రావణులైనను యుద్దరంగమున నన్నెదిరించి నిలువ జాలరు. వేలకొలది శిలలతోను, వృక్షములతోను, సకల రాక్షసులను, లంకాపురిని నాశన మొనర్చెదను. రాక్షసులందరును ఏమియూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను.
ఇది పఠించిన వారికి జయం తధ్యం !!
జయశ్రీ రామ!!

తులసి , లక్ష్మీ కటాక్షం

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*తులసి…*
         *లక్ష్మీ కటాక్షం లభిస్తుంది!*
                   ➖➖➖✍️

*తులసిదళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణం కాదు.*

*‘యాన్ములే సర్వతీర్దాని! యన్మధ్యే సర్వదేవతాః* 
*యాదాగ్రే సర్వవేదాశ్చ! తులసిం త్వాం నమమ్యహమ్’’*

*ఐశ్వర్య ప్రదాయిని అయిన తులసిని పై శ్లోకం చదువుతూ ప్రదక్షిణం చేసినచో సర్వదేవతా ప్రదిక్షణం చేసిన ఫలితం దక్కుతుంది.* 

*తులసి శ్రీ మహాలక్ష్మిః, విద్యా విద్యా యశస్విని!*
*ధర్మా ధర్మనా దేవీ దేవ దేవ మనః ప్రియా!*
*లక్ష్మి! ప్రియ సఖీ దేవీ ద్యౌర్బమి రచలాచలా!*

*లక్ష్మీ నారాయణ స్వరూపిణి యైన తులసిని నమస్కరిస్తూ పైన 16నామాలను పఠించిన వారికి గృహంలో లక్ష్మి సుస్థిరంగా నిలిచి సుఖ, సౌభాగ్యాలు వృద్ధి పొందుతాయి.*

*తులసి చెట్టుతోనూ దేవికి బాంధవ్యముంది. తులసిదళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణం కాదు.*

*విష్ణుమూర్తితో కలిసి లక్ష్మి ఇంటి లోపల నివసిస్తే, తులసి ఇంటి ఆవరణలో కొలువై ఉంటుంది.* 

*తులసిదళంతో పూజలు చేయడం అంటే విష్ణువుకు పరమ ప్రీతికరమైనది. ఈ దళాలతో పూజలు చేసిన వ్యక్తికి సకల హోమాలు, యజ్ఞాలు, వ్రతాలు చేసిన ఫలితం దక్కుతుంది.* 

*తులసి స్తోత్రం చేయడం అంటే అనంత గుణ ఫలాలను పొందడమే. తులసి ఉన్న ఇంటికి ప్రేత, పిశాచ, భూతాలవంటివి దూరమవుతాయి. ప్రతిరోజు ఇంటిముందు లేదా తులసికోట వద్ద దీపం పెట్టడం వల్ల దారిద్య్రం తొలగి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. దీపం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. ఆలయాల్లో, ఇళ్లల్లో, తులసి, మారేడు వంటి దేవతా వృక్షాల వద్ద దీపాలను వెలిగించడం శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి.* 

*శ్రీ తులసి లక్ష్మీదేవి స్వరూపిణి. లేవగానే తులసిని చూస్తే పాపాలు పోతాయి.* 

*తులసి మొక్క ముందు భాగంలో సకల తీర్థాలు, మధ్యభాగంలో దేవతలు, చివరి భాగంలో వేదాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది.* 

*తులసి పత్రం అగ్రభాగంలో బ్రహ్మ, మధ్యలో విష్ణుమూర్తి, కాండమందు శివుడు, శాఖల్లో అష్టదిక్పాలకులు విడిది చేసి ఉంటారని పండితులు చెబుతారు.* 

*ప్రాతఃకాలంలోను, సంధ్యాసమయంలోనూ తులసి కోట ముందు దీపాన్ని వెలిగించి, ప్రదక్షిణలు చేస్తే శుభప్రదం.*✍️

. 🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

19, జనవరి 2023, గురువారం

విశ్వాసం

ఒకసారి శివపార్వతులు ఆకాశమార్గంలో కాశీ నగరానికి వెళ్తున్నారు. వారికి గంగానదిలో అనేకమంది యాత్రికులు స్నానాలు చేస్తుండటం కనిపించింది. అది చూసి పార్వతీదేవి ఇలా అన్నది.. 

‘‘నాథా! ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా, నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా? అదే నిజమైతే అందరూ పాపాలు చేసి, వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగాస్నానం చేసి పోగొట్టుకుంటారు కదా’’ అని సందేహం వెలిబుచ్చింది. 

ఈశ్వరుడు చిరునవ్వుతో ‘‘దేవీ! ఇప్పుడు నేను ఒకటి చెబుతాను. నీవు ఆ విధంగా చేయి. అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది’’ అంటూ ఆమె ఏమి చేయాలో చెప్పాడు. ఆ ప్రకారం పార్వతి, పండు ముతైదువ రూపం ధరించి, గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, ‘‘దయచేసి నా భర్తను కాపాడండి’’ అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని చాలామంది గంగలో దూకి, ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు సిద్ధమయ్యారు. అది చూసిన వృద్ధురాలు ‘‘అయ్యా! నా భర్తకొక శాపం* *ఉంది. పాపాత్ములెవరయినా ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి. అదేవిధంగా ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది. కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి’’ అని హెచ్చరించింది.

ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్లిపోయారు. ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలో దూకి, కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్క పుచ్చుకుని, తన వీపు మీద ఆయనను మోస్తూ, ఒడ్డుకు తీసుకు వచ్చాడు. వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూనే, నాయనా! నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగల్యం దక్కించావు. నీవు పాపరహితుడవా’’ అని అడిగింది. 

ఆ వ్యక్తి ‘‘అమ్మా! నేను ఇంతకుముందే గంగా స్నానం చేసి పునీతుడినయ్యాను. అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించాను’’ అని చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి, అంతులేని సంపదలను ప్రసాదించి తిరిగి వినువీధులలో విహరించసాగారు. ‘‘ చూశావా దేవీ! విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది’’ అన్నాడు పరమేశ్వరుడు. అర్థమైందన్నట్లుగా పార్వతి చిరునవ్వుతో తల పంకించింది.  

పని చేస్తుందా లేదా అని అనుమానంతో వేసుకుంటే ఔషధం కూడా పని చేయదు.

దృఢవిశ్వాసంతో చేసే పని తప్పక ఫలితాలనిస్తుంది

జనకపూర్ జానకీ మాతా దేవాలయం

🚩🚩
జనక్పూర్ జానకి
🚩🚩

🚩క్షేత్ర దర్శనం🚩

రామాయణ,
మహాభారత కాలం నాటి నైసర్గిక స్వరూపానికి నేటి భారతదేశ నైసర్గిక స్వరూపానికి పోలికేలేదు. ఆ యా యితిహాసాలలో పేర్కొనబడిన అనేక రాజ్యాలు కొన్ని ఇప్పుడు మన పొరుగుదేశాలలో వుండడాన్ని గమనించవచ్చును.

త్రేతాయుగంలోని రామాయణ సీతారాముల పరిణయగాధ విదేహదేశంలో జరిగింది. విదేహ రాజ్యాధీశుడు జనకమహారాజు. ఆయన రాజధాని నగరం మిధిల. ఆ మిధిల ఇప్పుడు మన సరిహద్దు దేశమైన నేపాల్ లో వున్నట్లు గుర్తించారు.

దేశం సుభిక్షంగా వుండాలనే సత్చింతనతో జనక మహారాజు ఒక మహా యజ్ఞాన్ని తలపెట్టి అందుకుగానూ భూమిని దున్నుతూండగా నాగేటిచాలుకు ఒక అందమైన మందసం అడ్డుపడింది. దానిని తెరచిచూడగా అందులో చిరునవ్వులు చిందిస్తూ చందమామలాంటి ఒక పసిపాప వుంది. జనకమహారాజు మహా సంతోషంతో ఆ పాపను తన భార్యకు అందించి అపురూపంగా పెంచడం మొదలెట్టాడు. ఆ పాపకు సీత అని పేరు పెట్టాడు.

ఇలావుండగా ఒకరోజు త్రిలోకసంచారియైన నారద మహర్షి జనకమహారాజు వద్దకు వచ్చాడు. జనకుడు తనకు అపూర్వంగా లభించిన పసిపాప గురించి నారదుడికి తెలియజేశాడు.
జనకుడు చెప్పినది విన్న నారదమహర్షి
 "జనకమహారాజా !
నీకు దొరికిన పసిపాప సామాన్యురాలు కాదు.
సర్వశక్తిమంతుడైన పరమాత్ముడు దుష్టశిక్షణ శిష్టరక్షణార్ధం
రావణుని సంహరించడానికి, ఒక మానవునిగా , దశరధమహారాజు పుత్రునిగా రాముడిగా అవతరించ సంకల్పించాడు.

ఇప్పుడు నీ భవనంలో సీత ఆనే పేరుతో పెరుగుతున్నది శ్రీమహాలక్ష్మి యోగమాయగా ఆ పెట్టిలో
ఆవిర్భవించినది.
అందువలన నీ పుత్రికని తప్పక శ్రీ రామునికే యిచ్చి పరిణయం చేయాలి. అది దైవసంకల్పం.లోక కళ్యాణం కోసం సీతారాముల కళ్యాణం ఎంతైనా అవసరం" 
అని నారదుడు ఉపదేశించి వెళ్ళిపోయాడు.

నారద మహర్షి చెప్పిన దేవరహస్యం తెలుసుకున్నప్పటి
నుండి జనకుడు సీతను
రామునికిచ్చి వివాహం చేయడానికి కావలసిన ప్రణాలికను సిధ్ధంచేసి ఒక నిశ్చయానికి వచ్చాడు.

పరమేశ్వరుడు త్రిపురాలతో సమరం చేసినప్పుడు ఉపయోగించిన అతి శక్తివంతమైన ధనుస్సును జనక మహారాజు తాతకు కానుకగా ఇచ్చాడు.
ఆ విల్లును ఎక్కుపెట్టిన మహావీరునికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయడానికి సీతా స్వయంవరం ప్రకటించాడు.
స్వయంవరానికి విచ్చేసిన రాజాధిరాజులెందరో 
ఆ శివధనుస్సును ఎత్తలేక భంగపాటుపడ్డారు.
అప్పుడు తన సోదరుడు లక్ష్మణుడు, విశ్వామిత్ర మహర్షితో మిధిలానగరానికి విచ్చేసిన
 శ్రీ రాముడు ఆ శివధనుస్సును వంచడానికి సంసిధ్ధుడైనాడు. 
ఐదువేల మంది మహావీరులు మోసుకువచ్చి సభామండపంలో పెట్టిన ఆ విల్లును శ్రీ రాముడు ఒక ఆట వస్తువులా సునాయాసంగా తన ఎడమ చేతితో
ఆ విల్లును ఎత్తిపట్టి నారి బిగించాడు. కుడి చేత్తో కొంచెము వంచాడు . అంతటి విల్లు పుటుక్కున విరిగింది. అవతారపురుషుడైన రామునిపై
దేవతలు పూల వాన కురిపించారు. అనేక
స్తోత్రాలతో కీర్తించారు.
అప్సరసలు నాట్యమాడారు.
అప్పుడు బంగారు దేహఛ్ఛాయ కలిగిన సీతాదేవి సకలాభరణశోభితయై కుడి హస్తమున సుమమాలను ధరించి,
పట్టు వస్త్రాలు ధరించి కాళ్ళ నూపురాలు మ్రోగుతుండగా,సిగ్గు
మోమున చిరునవ్వులు చిందాడగా
శ్రీ రాముని మెడలో పూమాలను వేసింది.

ఇటువంటి అద్భుతమైన చారిత్రాత్మక సీతా స్వయంవరం జరిగిన
స్థలం ఈనాటి నేపాల్ దేశంలో జనక్పూర్ నగరంలో ఒక పెద్ద రాజభవనంగా రూపొందింది.
ఈ రాజ భవనంలోనే సీతాదేవి పెరిగి పెద్దదైనదని , ఈ రాజభవనంలోనున్న కళ్యాణ మండపంలోనే
సీతారాముల కళ్యాణం జరిగినదని చెపుతారు.

సీతాదేవి మందిర్ గా ప్రసిధ్ధికెక్కిన 
ఈ భవనం నేపాల్, రాజస్థాన్, మొగలాయి శైలిలో అద్భుత శిల్ప కళా నైపుణ్యంతో నిర్మించబడినది. 

కళ్ళు మిరుమిట్లు గోలిపే సౌందర్యంతో 
జనక్పూర్ జానకీ మందిర్
నిర్మించబడినది.
విశాలమైన మండపంలో
గర్భగుడి మధ్యన ఉన్నతమైన
రజిత వేదిక మీద శ్రీ రామచంద్రుడు , సీతాదేవి, 
లక్ష్మణుడు, భరత శతృఘ్నులు, ఆంజనేయ స్వామి మొదలైనవారు కొలువై వుండగా ఇది ఒక
రాజభవనంగానే కాకుండా, 
శ్రీ రాముని ఆలయంగా కూడా దర్శనమిస్తుంది.  
ఈ వెండి మండపంలో రామాయణ దృశ్యాలు అత్యద్భుంతగా చెక్కబడి చూపరులకు అమితానందం కలిగిస్తాయి.

ఈ కోటలో
హనుమంతునికి, మహావిష్ణువుకి, వేణుగోపాలస్వామి కి
ప్రత్యేక ఆలయాలు వున్నవి.
ఈ సీతారాముల వివాహమండపం జబల్పూర్
మహారాజుల పోషణతో నిర్మించబడినది.
ఈ మండపంలో సీతారాముల
కళ్యాణ దృశ్యాలు, మునులు
మహారాజులు పరివేష్టితులై
వుండగా సీతారాముల కళ్యాణ దృశ్యాలు నయనానందకరంగా యాత్రికులను సమ్మోహనపరుస్తాయి.కళ్యాణానంతరం
సీతారాములు అయోధ్యకి తరలినప్పుడు ఒక ముని కూడా వెంటవెళ్ళి వచ్చారు. ఆయన
తిరిగి వచ్చినప్పుడు మధ్యమార్గంలో
ఒక హోమగుండం నుండి బంగారు సీతాదేవి విగ్రహాన్నీ తీసుకు వచ్చారు. మిధిలానగర ప్రజలంతా కలసి ఎంతో ఉత్సాహంతో ఆ బంగారు విగ్రహాన్ని ఈ జనక్పూర్
రాజభవనంలో ప్రతిష్టించారు.

కాలక్రమేణా ,
స్త్రీలు తమవివాహ భాగ్యానికై
సంతాన భాగ్యానికి ఈ మూర్తిని భక్తి శ్రధ్ధలతో పూజించసాగారు.

ఈ జానకీమందిర్ లో జరపబడే వివాహ
పంచమి శ్రీ సీతారామకళ్యాణం జరిగిన 
మార్గశిర మాస శుక్లపక్ష
పంచమి రోజున వైభవంగా జరుపుతారు.

18, జనవరి 2023, బుధవారం

message from god

*🌺🙏🏻ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🏻🌺*

🌷🌷

🌾 message from God🌾

*_🌴" ఒక్కసారి నీవు నీ బాధలను నాకు చెప్పుకున్నాక అంతా నేనే చూసుకుంటానన్న నమ్మకంతో వాటిని గురించి అలోచించడం మానేయాలి. వాటిని గురించి మరళా మరళా నాకు చెప్పనవసరం లేదు. నీ ప్రార్ధన నిజమైనదై ఉంటే అది తప్పక నాకు వినపడుతుంది. నీ ప్రార్ధన నిజమైనదని నాకనిపించినపుడు నీ కొరకు ఏదైనా చేస్తాను. ఎంత భారమైనా సరే నేను మెాస్తాను.. సందేహానికి తావివ్వకు. ఈ సృష్టినంతటినీ భరించి పోషించుచున్నవాడిని నీ బాధలు తీర్చడం నాకు పెద్ద సమస్య కాదు. కాకపోతే దానికి కొంత ‌సమయం పడుతుంది. ఎంత సమయం పడుతుందనేది నీ భక్తి విశ్వాసాలపై ఆధారిపడి ఉంటుంది. హృదయమందు భక్తి విశ్వాసాలు అభివృద్ది పరచుకొనక భగవంతుని అనుగ్రహం కావాలనుకోవడం అజ్ఞానం, అసంభవం." 🌴_*

ప్రదోష వ్రతం


శాండిల్య మహర్షి ప్రదోష వ్రత విధానాల గురించి వ్రతకథ గురించి వివరిస్తాడు🍁

ప్రదోష వ్రతం 


🌺ప్రదోషమనే పదానికి సంధ్యాసమయమని అర్థం. మహాశివుడిని ధ్యానిస్తూ ప్రదోషవ్రతం నాడు అంటే ఉపవాసం ఉంటారు. ఈ రోజునాడు సంధ్యాసమయంలో పరమశివుడిని ధ్యానిస్తే విజయం, ఆరోగ్యం అలాగే మంచి జీవిత భాగస్వామిని పొందుతారని భక్తుల నమ్మకం.

🌺పూజా విధివిధానాలు
పేరుకు తగ్గట్టుగానే ప్రదోషవ్రత పూజను సాయంత్రం వేళలో జరుపుతారు. భక్తులు రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంసమయాన స్నానం చేసి తెల్లటి వస్త్రాలను ధరించాలి. అప్పుడు, దైవానికి పూజ చేయాలి. ఆదిదంపతులు, పార్వతీ పరమేశ్వరులకు, గణేషుడిని, స్కందుడిని అలాగే నందిని పూజించాలి. రాత్రంతా భక్తి పాటలతో, ప్రార్థనలతో దైవాన్ని పూజించాలి. బిల్వపత్రం, గంగాజలం, అక్షతలు, ధూపదీపాలతో పూజను చేయాలి.

🌺ప్రదోష వ్రత కథ
ఒకప్పుడు చాలా పేద బ్రాహ్మణ మహిళ ఉండేది. ఆమె పరమ భక్తురాలు. ఆమెకి ఒక కుమారుడు కలడు. ఒకసారి ఒక బాలుడు నదీతీరంలో ఏడుస్తూ ఈవిడకు తారసపడ్డాడు. ఆ అబ్బాయిని తనతో పాటు తీసుకెళ్లి ఆలనా పాలనా చూసేది. ఆ తరువాత కోవెలను సందర్శించింది. శాండిల్యుడనే ఋషిని కలిసింది. అప్పట్లో, శాండల్యుడు పేరొందిన ఋషి. ఈ అబ్బాయి గురించి ఆమె శాండిల్యుడిని అడగగా, ఈ అబ్బాయి విదర్భ రాజ్య యువరాజని, ఒక యుద్ధంలో తన తండ్రిని కోల్పోయాడని తెలుస్తుంది.


🌺ఆ అబ్బాయి గురించి దిగులు చెందిన ఈ మహిళ అతడిని దత్తత తీసుకోవాలని భావిస్తుంది. అప్పుడు, ఆ ఋషి ఈ మహిళకు ప్రదోషవ్రతాన్ని చేయమని సూచిస్తాడు. అలాగే, ఆమె కుమారుల చేత కూడా ఈ వ్రతాన్ని ఆచరింపచేయమని ఆదేశిస్తాడు. అంగీకరించిన ఈ మహిళ ఆ రోజు ఉపవాసాన్ని చేయాలని భావిస్తుంది. ప్రదోషవ్రతం నాడు ఆచరించవలసిన విధివిధానాల గురించి అలాగే ప్రదోష వ్రత కథ గురించి వివరించమని శాండిల్యుడిని కోరుతుంది. అప్పుడు, శాండిల్య మహర్షి ప్రదోష వ్రత విధానాల గురించి వ్రతకథ గురించి వివరిస్తాడు. అప్పటినుంచి, ఉపవాసం ఉంటూ మహాశివుడిని ధ్యానించడం ప్రారంబిస్తారు.

🌺ఒకరోజు, ఈ ఇద్దరు బాలురు అడవికి వెళతారు. లోతైన అడవిలోకి వెళ్ళినప్పుడు వీరికి ఆడవారి గొంతులో పాటలు వినిపిస్తాయి. చిన్నవాడైన శుచివ్రతుడు ఆ గొంతులు గంధర్వకన్యలవని గుర్తించి అక్కడ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. ధర్మగుప్తుడు, శుచివ్రతుడి మాటలతో ఏకీభవించడు. గంధర్వకన్యలను కలవాలని నిర్ణయించుకుంటాడు. అక్కడికి వెళ్ళగానే, గాంధర్వరాజు కుమార్తె అయిన అన్షుమతిని చూస్తాడు. మొదటి చూపులోనే వీరిద్దరూ ప్రేమలో పడతారు. రెండవసారి కలవగానే, ఇతనే విదర్భ రాజ్య యువరాజని గాంధర్వరాజు గ్రహిస్తాడు. అప్పుడు, ధర్మగుప్తుడితో తన కుమార్తె వివాహాన్ని జరిపిస్తాడు.

🌺వీరిద్దరి పెళ్లి వలన యువరాజు ధర్మగుప్తుడికి సౌభాగ్యంతో పాటు మంచి రోజులు వచ్చాయి. అలాగే, ధర్మగుప్తుడి సోదరుడికి వారి తల్లికి కూడా మంచిరోజులు వచ్చాయి. తన తండ్రి కొల్పోయిన రాజ్యాన్ని యుద్ధంలో గెలిచి తిరిగి దక్కించుకుంటాడు. ఆ బ్రాహ్మణ మహిళ శివుడిని ఆరాధించడం వలన తిరిగి మంచిరోజులను తీసుకురాగలిగింది. ఇదంతా మహా శివుడిని ఆరాధించడం వలెనే సాధ్యమైంది. అందువలన, ప్రదోష వ్రతాన్ని ఆచరించి మహాశివుడి ఆశీస్సులను పొందామని రాజ్యంలోని ప్రజలను ఆదేశిస్తాడతడు.

🌺ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కలిగే లాభాలు:
స్కంద పురాణంలో ప్రదోష వ్రతం గురించి వివరించబడింది. ప్రదోషవ్రతాన్ని ఆచరించడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. ప్రదోష వ్రతం అనేది ఆచరించే రోజును బట్టి ఫలితాలను అందిస్తుంది. ఆదివారం నాడైతే మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. సోమవారం నాడు కోరికలను తీరుస్తుంది. మంగళవారం నాడు వ్యాధులను నయం చేస్తుంది. బుధవారం నాడు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తే కోరికలు తీరతాయి. గురువారం నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే శత్రువులు ఉండరు. శుక్రవారం నాడు ఆచరిస్తే అదృష్టం కలిసి వస్తుంది. శనివారం నాడు ఆచరిస్తే కుమారుడు కలుగుతాడు.

 

జీవన మాధుర్యం

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


               *జీవన మాధుర్యం*
                   ➖➖➖✍️

జీవితం ఎప్పుడూ ఒకే విధంగా సాగదు. అనుకోని సంఘటనలు ఎన్నో సంభవిస్తాయి. ఆకస్మిక ఘటనలు ఎదురవుతాయి. వాటి విషయంలో ఒక్కొక్కరి స్పందన ఒక్కో విధంగా ఉంటుంది. అవి కష్ట నష్టాలను కలిగించేవి అయితే సాధారణ ప్రజలు భయాందోళనలకు గురవుతారు. నిరాశా నిస్పృహలకు లోనవుతారు. అవి సంతోషదాయకమైనవైతే ఉబ్బితబ్బిబ్బవుతారు. గర్వంతో విర్రవీగుతారు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్న వారి తీరు వేరుగా ఉంటుంది. ముఖ్యంగా జెన్‌ గురువుల స్పందన మరింత భిన్నంగా ఉంటుంది. 

జెన్‌ గురువు ఒకరు ఒక గ్రామ శివార్లలో నివసిస్తూ ఉండేవాడు. రోజూ పొద్దున్న వాహ్యాళి కోసం బాగా దూరంగా ఉన్న అడవిలోకి ఒంటరిగా వెళ్ళాడు. ఒక రోజు అతను కొంత దూరం నడిచిన తరువాత ఎందుకో వెనక్కి తిరిగి చూశాడు. కొంత దూరంలో ఒక పులి కనిపించింది. అది కూడా ఆయనను చూసింది. మరొకరైతే భయంతో పరుగులు తీసేవారు. పులి కూడా అతణ్ణి పట్టుకోవడానికి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చేది. కానీ ఆ గురువు మామూలుగానే నడకను కొనసాగించాడు. పులి కూడా అతని వెనుక నెమ్మదిగా నడుస్తూ వస్తోంది.

ఆ గురువు నడిచి నడిచి ఒక కొండ అంచును చేరుకున్నాడు. అతని ముందు లోతైన లోయ ఉంది. వెనుక పులి వస్తోంది. కానీ ఆయన భయపడలేదు. చుట్టూ గమనిస్తే కొండ పై నుంచి లోయ వైపు పెరిగిన ఒక చెట్టు కనిపించింది. దాని కొమ్మలు లోయలో దూరంగా దిగుతున్నాయి. ఆ గురువు తను నిలబడిన స్థలం నుంచి లోయలోకి దిగుతున్న చెట్టు కొమ్మను పట్టుకున్నాడు. పులి సమీస్తోంది. అతను. కింద ఉన్న లోయలోకి చూశాడు. అక్కడ ఒక సింహం సంచరిస్తోంది. అంతేకాదు, అతను పట్టుకొని వేలాడుతున్న చెట్టు కొమ్మను రెండు ఎలుకలు కొరుకుతున్నాయి. తను పట్టు తప్పి లోయలోకి పడిపోవచ్చు. లేదా చెట్టు కొమ్మ ఏ నిమిషంలోనైనా తెగి, కొమ్మతో సహా లోయలోకి పడిపోవచ్చు. ఎలాగూ తనకు చావు తప్పదని అతనికి తెలిసిపోయింది. 
ఈలోగా అతనికి దగ్గరలో ఉన్న ఒక మరో కొమ్మ మీద పండ్లు కనిపించాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరూ పండ్లను తిని ఆనందించలేరు కదా? అది అసంభవం. కానీ అతను పరిణతి ఉన్న గురువు. ఒక్కొక్క పండునూ కోసుకొని తినడం మొదలుపెట్టాడు. అతనికి మధురమైన అనుభూతి కలిగింది. ఒకవైపు పులి, మరోవైపు లోయ, లోయలో సింహం... తప్పదనుకున్న మరణం. ఇక తాను జీవించగలిగేది కొన్ని క్షణాలు మాత్రమే! ఆ కొద్ది క్షణాలనూ భయంతో కాకుండా ఆనందంగా గడపాలన్న ఆలోచన ఆయనకు కలిగింది. అదే ఆయనలో జ్ఞానజ్యోతిని వెలిగించింది. 

ఈ కథను ఓషో చెబుతూ ‘‘ఆ గురువు ఆ క్షణంలో బుద్ధుడయ్యాడు. చావు అంత సమీపంలో ఉన్న సమయంలో.. పులి, సింహం, లోయ, విరుగుతున్న చెట్టు కొమ్మ, చివరకు తానొక వ్యక్తిననే భావన... ఇవన్నీ ఆయనలో మాయమైపోయాయి. పండ్ల మాధుర్యం, ఆ క్షణాల్లోని జీవన మాధుర్యం... అవే మిగిలాయి’’ అని అంటారు.✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

17, జనవరి 2023, మంగళవారం

దనంజయుడు

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

               *ధనంజయుడు*
                  ➖➖➖✍️

*"శత్రుర్వినశ్యతి.... ధనంజయ కీర్తనేన..." ధనంజయుడు అంటే అర్జునుడు, ధనాన్ని జయించినాడు కదా! అందుకు ధనంజయుడు అయ్యాడు.* 

*కొంతమంది "ధనుంజయుడు" అంటారు, అది సరికాదు.;;; మొట్ట మొదటి వాక్యమునకు అర్థము ఏమిటంటే, ధనంజయుడు అయిన అర్జునుడిని కీర్తిస్తే అంటే అర్జునుని గుణ గణములను వింటే మన శత్రువులు నశిస్తారు అంటుంది, పై వాక్యం.* 

*"అర్జున" అంటే... ఆర్జనాత్ ఇతి అర్జునః... బాగా ఆర్జుంచువాడు, ఏమి ఆర్జించును, ధనాన్ని ఆర్జుంచును, తపో బలాన్ని ఆర్జించును, (మిగిలిన పాండవులు అరణ్య వాసమును చేస్తూ వున్న 12 సంవత్సరముల కాలము "పాశుపత" మొదలగు అస్త్ర శస్త్రములను తన తపస్సుతో ఆర్జించినాడు కదా!!!) కృష్ణ ప్రేమను కూడా ఆర్జించినాడు, మరియు అనేక రకాల సంపదలు ఆర్జించినాడు కనుక "అర్జునుడు" అయ్యాడు.* 

*ఇంకా "అర్జున" అంటే ఋజుత్వాత్ ఇతి అర్జునః అంటే ఋజు ప్రవృత్తి కలవాడు, ఎట్లా!!! ‘కృష్ణా! నాకు నువ్వుంటే చాలు నువ్వు ఆయుధం పట్టక పోయినా ఫర్లేదు, నాకు ఆ 10,000 మంది "నారాయణ గోపాల సైన్యం" కంటే నువ్వే గొప్ప. నాకు రెండవ ఆలోచన లేదు!’ అని ఖరాఖండీగా చెప్తాడు. అది ఋజుత్వం!* 

*”విరాట మహారాజా!!! నేను మీ అమ్మాయికి విద్య నేర్పాను, ఆమె నా కూతురుతో సమానం, నీ కూతురును నాకిచ్చి వివాహం చేయడం తగదు, నీకు అంతగా మా మీద అభిమానం, గౌరవం చూపాలి అని అనిపిస్తే నా కుమారుడు అయిన "అభిమన్యునికి" నీ కూతురిని ఇవ్వు, కోడలంటే కూతురే కదా!!! అంటాడు. అది ఋజుత్వము అంటే!*

*“అమ్మా! నేను ఇంద్ర అంశ తో జన్మించాను, నువ్వు ఇంద్ర సభలో ఇంద్రుడు చూస్తూ ఉండగా నాట్యములు చేస్తావు, అంటే నువ్వు నాకు తల్లితో సమానము అమ్మా!!! అని తనకు తానుగా కోరి వచ్చిన దేవ కన్యతో అంటాడు, అది ఋజుత్వము అంటే!!! * 

* కనుక "ఆర్జానాత్ అర్జునః"..., మరియు... ఋజుత్వాత్ అర్జునః!*

. 🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

శివ పూజ

శివ పూజ*

ఒక గ్రామంలో నిత్యం శివ పూజ చేసే శివ భక్తుడు ఉండేవారు.

 శివ నామ స్మరణ చేయకుండా మంచి నీళ్ళు కూడా ముట్టుకోని మహా భక్తుడు.. 

కొద్దిగా వ్యవసాయ భూమి ఉంటే సాగు చేసుకుంటూ కుటుంబ పోషిoచు కునే వారు.. నిత్య అనుష్ఠానపరుడు శివనామమే ఊపిరిగా బతికే ఆ శివ భక్తుడు ఏ పని చేసిన శివ నామ స్మరణతో చేయడం వల్ల అది మహా తపస్సు అయ్యింది.

 అతనికి రకరకాల పూలతో శివయ్య ని అలంకారం చేసి మురిసిపోవడం పూలతో అర్చన చేయడం చాలా ఆనందంగా ఉండేది. 

వీరి భక్తిని ఒక మేకలు కాచే గొల్లవాడు గమనిస్తూ వారి లాగా పూజ చేయలేక పోయిన శివ నామ స్మరణ చేయడం అలవాటు చేసుకున్నాడు.

 వారిలాగా మంత్రాలతో అనుష్ఠానం చేయలేను కనుక కనీసం వారు చేసే పూజలో ఎదో రూపంలో పాలు పంచుకోవాలి అని ఆశతో ఒక రోజు శివ గానం చేస్తూ అనేక రకాల పూలు చెట్టల్లో సేకరించి శివ భక్తుని గుమ్మం ముందు నిల్చుని వివిధ రకాల పుష్పాలు వారికి చూపించి ...స్వామి నేను మీలాగా మంత్రాలతో కీర్తనలతో స్వామి కి పూజ చేసి మెప్పించ లేను నాకు అంత చదువు లేదు శివ నామ స్మరణ తప్ప ఇంక ఏమీ తెలియదు మీరు చేసే శివ పూజ నాకు చాలా ఇష్టం ఈ పూలను శివ పూజకు ఉపయోగిస్తే స్వామి కరుణించాడని సంతోషిస్తాను ..
 మీరు అనుమతిస్తే ప్రతి రోజు మీ పూజకు పువ్వులు సేకరించి సేవ చేసుకుంటాను అని వేడుకున్నాడు.. 

మహా భక్తుడు అయిన ఆయన అతన్ని గమనిస్తున్నారు ఆ గొల్లవాని మొహంలో అమాయకత్వం తప్ప అసూయ అహంకారం లేదు చదువు లేకున్నా మాటలో సంస్కారం ఉంది, 

పేదవాడు శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించాడు పైగా శివ నామ స్మరణతో పువ్వులు తెస్తాను అంటున్నాడు ఇస్తున్నది శివయ్యకే కదా అని చాలా సంతోషం అలాగే కానివ్వు అని ఒప్పుకున్నారు,.

 శివుడే వరం ఇచ్చినట్టుగా అతను పొంగిపోయాడు .

ప్రతి రోజు శివ నామ స్మరణ చేస్తూ పూలను తెచ్చి ఇచ్చే వాడు పూజ జరిగే సమయంలో కిటికీ లోనుండి చూసి శివ నామ స్మరణతో పొంగిపోయే వాడు.  

ఇలాగే కాలం గడిచింది ఇరువురికి కైవల్య ప్రాప్తి కలిగింది శివ భక్తుడి కోసం శివ గణాలు వచ్చారు , ఆ గొల్ల వాని కోసం శివుడు పూల పల్లకిని పంపిస్తాడు..

అది గమనించిన శివ భక్తుడు ఆ గొల్లవాన్ని తీసుకొని వెళ్లడానికి ఆ పల్లకీ వచ్చింది ఎందుకు అని అడుగుతారు ..

, 'అతను మహా శివ భక్తుడు శివ నామ స్మరణతో ప్రతి నిత్యం నామ స్మరణ చేస్తూ ఒక మహా శివ భక్తుడు చేసే శివ పూజకు భక్తిగా పూలు సమర్పించే వాడు అతను భక్తిగా సేకరించే సమయంలోనే ఆ పూలు శివ పాదాల చెంతకు చేరేవి అతని భక్తికి మెచ్చి అతను ఒక భక్తుడికి మంచి మనసుతో సహాయం చేయడం వల్ల తన కర్మల నుండి విముక్తి కలిగి ఆ శివయ్యే పూల పల్లకీ పంపారు' అని వివరించారు, 

ఆ శివ భక్తుడికి ఆశ్చర్యం తో పాటు నిస్వార్ధమైన సేవకు దక్కిన ఫలితాన్ని చూసి ఆనంద పడ్డారు..

 శివ గణాలతో వెళ్లిన శివ భక్తుని కన్నా ముందే పుష్ప పల్లకీలో ఆ గొల్లవాడు శివుని సన్నిధి చేరుకున్నాడు

 తోడు తోడటన్న తోడనే ఉన్నాడు, 
 లేడు లేడటన్న...లేనె లేడు. 
 కాదు కాదటన్న ..కానేకాడు,
 *విశ్వదాభిరామ వినురవేమ !!* 

భగవంతుని విషయంలో నమ్మేవారు కొందరు, నమ్మనివారు కొందరు, అటు ఇటుగా కొందరు ఉంటారు. భగవంతుడు కూడా అలాగే ఉంటాడు.
              పరమేశ్వరుడు ఉన్నాడు అని పూర్తిగా నమ్మి, సంపూర్ణమైన భక్తి విశ్వాసములతో ఎవరైతే ఆయనను సేవిస్తూ ఉంటారో అటువంటి వారు ఎపుడైనా ఆపద వచ్చినప్పుడు పరమేశ్వరా నీవే దిక్కు అని తలిస్తే చాలు తప్పకుండా ఆదుకుంటాడు.
             అదే విధంగా లేదు అన్న వారికి లేనట్లుగాను, కాదు అన్న వారికి కానట్లుగాను ఉంటాడు. 

భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు... నన్ను ఎవరెవరు ఏవిదంగా తలిస్తే వారిని నేను ఆవిధంగానే గానే అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు కదా

16, జనవరి 2023, సోమవారం

విక్రమార్కుని కథ

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

              *విక్రమార్కుని కథ:*
                   ➖➖➖✍️

*విక్రమాదిత్య మహారాజు ఒక రాత్రి తన జాతకం వ్రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది.*

*నేను పుట్టిన రోజే ప్రపంచం లో అనేకమంది పుట్టి వుంటారు.*

*కానీ వాళ్ళంతా రాజులు కాలేదు. నేనే ఎందుకయ్యాను ? గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది?*

*మరుసటి రోజు సభ లో పండితుల ముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు.*

*అపుడు ఒక వృద్ధ పండితుడు “రాజా ఈ నగరానికి తూర్పున బయట వున్న అడవిలో ఒక సన్యాసి వున్నాడు. ఆయనను కలవండి. జవాబు దొరుకుతుంది!” అన్నాడు.*

*రాజు వెళ్ళాడు. అపుడు ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు.*

*అది చూసి రాజు ఆశ్చర్యపోయి తన ప్రశ్న ఆయన ముందు పెడితే.... ఆయన అన్నాడు…”ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరం లో ఇలాంటిదే మరొక గుడిశె వుంది. అందులో ఒక సన్యాసి వున్నాడు , ఆయన్ను కలవండి.”*

*నిరాశపడినా, రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు.*

*రాజు ఆయన్ని చూసినపుడు , ఆ సన్యాసి మట్టి తింటున్నాడు. రాజు కాస్త ఇబ్బందిపడ్డాడు.*

*కానీ తన ప్రశ్ననైతే అడిగాడు.*

*కానీ ఆ సన్యాసి, రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడినుండి వెళ్ళిపో అని కసురుకున్నాడు.*

 *రాజుకూ కోపం వచ్చినా, సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు.*
*తిరిగి వెళ్ళి పోతుంటే సన్యాసి రాజుతో ఇలా అంటాడు : “ఇదే దారిలో వెళితే ఒక గ్రామం వస్తుంది.*
*అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా వుంటాడు. వెంటనే అతన్ని కలవండి.”*

*రాజుకంతా గందరగోళంగా వుంది. అయినా అక్కడికెళతాడు.*

*చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు.*

*అపుడు ఆ అబ్బాయి అన్నాడు “గత జన్మ లో నలుగురు వ్యక్తులు ఒక రాత్రి అడవిలో దారి తప్పివుంటారు. ఆకలేస్తే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టు క్రింద ఆగివుంటారు. తినబోతుంటే అక్కడికి బాగా ఆకలేసి, నీరసంగా వున్న ఒక ముసలి వ్యక్తి వచ్చి తనకూ కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే ఆ నలుగురిలో మొదటివాడు కోపంతో… “నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా?” అని కసురుకొంటాడు.*

*రెండవ వ్యక్తిని అడిగితే..”నీకు ఈ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే!” అని వెటకారంగా అంటాడు.*

*మూడవ వాడు…”రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా ?” అని నీచంగా మాట్లాడాడు.*

*కానీ నాల్గవ వ్యక్తి మాత్రం ..”తాతా! నీవు చాలా నీరసంగా వున్నావు. ఈ రొట్టె తిను.” అని తాను తినబోతున్న రొట్టెను ఇచ్చేసాడు. ఆ నాల్గవ వ్యక్తివి నువ్వే రాజా!” అని అన్నాడు. *

*రాజు దిగ్భ్రాంతికి లోనయ్యాడు.*

*”రాజా నీ పుణ్యం వల్ల రాజుగా జన్మించావు. అనవసరమయిన మీమాంసలతో కాలం వృథా చేయక ప్రజలను కన్న తండ్రి వలె పాలించు!” అని చెప్పి కనులు మూసినాడు.*

*మంచిమాట-*
 
*దానం సంపద వంటిది. మనకున్న దానిలో కొంత అందరికీ పంచండి. ప్రతిఫలంగా అది పుణ్యాన్ని అందిస్తుంది.*

*ఓ చెడ్డ పని అప్పులాంటిది. ప్రతిగా వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంది.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖