20, సెప్టెంబర్ 2020, ఆదివారం

కర్మ సిద్ధాంతం

కర్మ సిద్ధాంతం ఉన్నదని భావిస్తే

మనకు మూడురకాల కర్మలు ఉన్నవి

ఒకటి సంచిత కర్మలు
రెండు ప్రారబ్ధ కర్మలు
మూడు ఆగామి కర్మలు

సంచిత కర్మలు
     అనేక పూర్వజన్మల శరీరమందున్న జీవుడు
సంపాదించిన శుభాశుభ కర్మఫలములలో ఇంకనూ అనుభవించవలసిన కర్మలను సంచిత కర్మలు అంటారు


ప్రారబ్ద కర్మలు:-
సంచిత కర్మల నుండి కొన్ని కర్మల ఫలములు ఈ జన్మలో అనుభవించవలసి ఉంటుంది. ఏ కర్మ ఫలములు అనుభవించుట కొరకై ఈ జన్మ ఇవ్వబడిన దో ఆ కర్మలు ప్రారబ్ద కర్మలు అంటారు. అంటే మనము ఈ జన్మలో అనుభవిస్తున్న ధనధాన్యాలు సంపదలు గాని, దారిద్ర్యము గాని సంతానం విద్య ఉద్యోగము, నిరుద్యోగం కీర్తి ప్రతిష్ఠలు, అవమానములు, సుఖదుఃఖములు ఆరోగ్యము ,రోగములు ఆయుర్ధాయ పరిమాణము అన్ని ప్రారబ్ధ కర్మలు.

ఈ ప్రారబ్ద కర్మలు మూడు విధాలుగా ఉంటాయి
 A దృఢ కర్మలు
 B దృఢ కర్మలు
 C దృఢా దృఢ కర్మలు

3ఆగామి కర్మలు:-
సంచిత కర్మల లో మిగిలిన కర్మఫలముల నిలువ, ప్రారబ్దము నందు కర్మలు చేయగా మిగిలిన కర్మలను అనుభవించుటకు భవిష్యత్తు జన్మలలో అనుభవించవలసిన కర్మ ఫలములు ఆగామి కర్మలు అంటారు. అనగా ఈ జన్మకు ఆగామి కర్మలు మరుసటి జన్మకు సంచిత కర్మలగును. సంచిత కర్మ లో పాప పుణ్య కర్మ ఫలముల నిల్వ ఏమీ లేకుండా ఉన్నచో జీవుడు మరల జన్మ ఎత్తవలసిన అవసరంలేదు. దీనినే మోక్షమనీ జీవుడు బ్రహ్మ స్థితిని పొందుట అని
 కర్మ సిద్ధాంతం 
      *జ్యోతిష శాస్త్రము సంచిత ప్రారబ్ధ ఆగామి జన్మల సంబంధము కలిగి పునర్జన్మ సిద్ధాంతాన్ని బలపరుస్తుంది*
  జ్యోతిష్య శాస్త్రము కర్మ సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతం రుణానుబంధ ప్రభావముల మీద ఆధారపడి ఉన్నదని
కొంతవరక తెలుసుకోగలుగుతున్నాము కర్మలను అనుభవించి తీరవలసిందే!
అయినప్పటికీ *కేవలము గ్రహ నక్షత్రాలు మాత్రమే శుభా శుభ ఫలితాలు ఇవ్వవు*
జీవుడు చేసినటువంటి కొన్ని స్వయంకృత కర్మ ఫలితాలు కూడా తోడవుతాయి

గ్రహములే కారణమైతే
ఒకరికి శుభమును ఇచ్చు గ్రహములు
అదే స్థానములో మరొకరికి అశుభ ఫలితాలను ఎలా ఇస్తాయి?
     కొంత కొంత ఇలా జ్ఞాన పరిశీలన చేస్తే కర్మ సిద్ధాంతము నందలి సత్యం అవగతమవుతుంది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి