18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

కర్మలు, కర్మ ఫలాలు


      _*👌*కర్మలు, కర్మ ఫలాలు, గత జన్మ కర్మఫలం.. అనే వీటితో బంధం, అనుబంధం, ఋణాను బంధము.. అనే వీటికి ఉన్న సంబంధం ఏమిటి? పిల్లలు కలగడం గతజన్మ ఋణాను బంధం అంటూ ఉంటారు. వీటన్నింటి వివరాలను ఒకసారి కూలంకషంగా పరిశీలిద్దాం..*_👌

       _**కంటితో చూసినా, చేత్తో చేసినా, కాలితో చేసినా, మనసుతో ఆలోచించినా వీటన్నింటినీ కర్మలు అంటారు. ఆ చేసేవి మంచి పనులైతే వాటిని ఉత్తమ కర్మలని, చెడు పనులైతే చెడు కర్మలని అంటారు. వీటిలో ఏవి చేసినా వాటికి తప్పక ఫలితం వస్తుంది. దానినే కర్మఫలం అంటారు. తెలిసి చేసినా, తెలియక చేసినా కర్మఫలం తప్పకుండా అనుభవించ వలసినదే. అది ఉత్తమ కర్మఫలం అయినా, చెడు కర్మఫలం అయినా మన ఖాతాలో జమ అవుతూ ఉంటాయి. ఇవి తక్కెడ లోని బరువును తూచి నట్లుగా ఒకటి పెరిగితే మరొకటి తగ్గుతుంది. ఒకటి తగ్గితే మరొకటి పెరుగుతుంది. అలా నీ జీవితం ముగిసే సమయానికి ఏది నీ ఖాతాలో ఎక్కువగా జమై ఉంటే దాన్ని బట్టి నీకు మరుజన్మలో ఆ స్థాయిలో మనిషిగానో, మరొక జీవిగానో జన్మించి ఆ గత జన్మ కర్మ ఫలాలను అనుభవించిన వలసి ఉంటుంది.*_

     _**గతజన్మ ఉత్తమ కర్మలే ఈ జన్మలో సుఖ శాంతులు. గతజన్మ చెడు కర్మలే ఈ జన్మలో అష్టకష్టాలు, రోగాలు, రొస్టులు.. గత జన్మలో నీవు తెలిసి తెలియక చేసే తప్పులు కూడా బంధాలు అవుతాయి. ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు. ఆ ఇచ్చి పుచ్చుకునే ఋణాలు తీరగానే వారు మనకు దూర మవడమో లేక మరణించడమో జరుగుతుంది.*_

      _**ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు. కష్టసుఖాలకు స్పందన, ప్రతి స్పందనలు ఉండవు. ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే.. మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గానో తారసపడతారు. ద్వేషం కూడా ఒక బంధమే. పూర్వజన్మలో మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగానో లేదా సంతానంగానో ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు.*_

      _**మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసే వారిగానో ఎదురవుతారు. మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులు గానో, సహాయకులు గానో ఎదురవుతారు. దీనికి ఒక ఉదాహరణగా ఒక అమ్మవారి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు. ఆ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు. కానీ తను సౌకర్య వంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని బిక్షగాడి జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచ లోనో పడుకుంటూ, ఆలయం లో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు.*_

      _**తన సంపాదనతో ఇద్దరి కొడుకులను పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నాడు. ఒకసారి తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహాను భావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు. పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా వారికి తిరిగి ఇవ్వలేదు. అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను బాధలు పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు అని చెప్పాడు. ఇక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక ఉదాహరణ..*_

      _**ఒకసారి ఒక మహర్షి బస చేసిన అతిథిగృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన ఎంగిలి విస్తరాకుల కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోటీపడుతూ పోట్లాడు తున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, స్వామి ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని. ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకనే వారు ఈ జన్మలో ఆహారం కోసం ఇలా పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు. నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు మహర్షి..*_

     _**ఒకసారి శ్రీ విద్యా ప్రకాశా నందగిరి స్వామి వారు బందరుకి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే, ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడుగుతే, పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెప్పాడు. అప్పుడు మలయాళ స్వామి వారు నువ్వు మోయగలిగి ఉండికూడా ఈ జన్మలో నీ మిత్రుడు చేత నీ సంచీని మోయిస్తే వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది అన్నారు. ఇలాంటివి మనము కూడా తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం.*_

      _**మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో, గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించిన వన్నీ కర్మ బంధాలయి జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి. కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన వస్తువులను మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే నాకు ఫలానా వస్తువులు తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం. అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన జీవిత కాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాలలో చిక్కుకుపోతూ ఉంటాము.*_

     _**ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం. అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితాన్ని ఈ జన్మలో కాక పోయినా వచ్చే జన్మలో నైనా తప్పకుండా అనుభవించ వలసిందే, తప్పించుకొనే అవకాశమే లేదు.. అందుకే మిత్రులారా ! అందరూ ఉత్తమ కర్మలనే ఆచరించి కర్మరాహిత్యాన్ని పొంది, మరొక జన్మలేని జన్మరాహిత్యాన్ని పొంది, ముక్తిని మోక్షాన్ని పొంది ఆ భగవంతుడిలో ఐక్యమౌతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.. శుభం భూయాత్.*_👌

_*🤘*సర్వే జనా సుఖినోభవంతు**_🤘

       _*👌*ధర్మో రక్షతి రక్షతః **_👌

       _**For Every Action Equal &*_   
             _*Opposite Reaction**_        

                                       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి