29, సెప్టెంబర్ 2020, మంగళవారం

శివ తాండవ స్తోత్రం

*శివ తాండవ స్తోత్రం*

జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ
విలోల వీచివల్లరీ విరాజమాన మూర్ధని 
ధగ ద్ధగ ద్ధగ జ్జ్వలల్లలాట పట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ 

ధరాధరేంద్ర నందినీ విలాస బంధుబంధుర
స్ఫురద్దిగంత సంతతి ప్రమోద మానమానసే 
కృపాకటాక్ష ధోరణీ నిరుంద దుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని 

జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణా మణిప్రభా
కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే 
మదాన్ధ సిన్ధుర స్ఫురత్త్వ గుత్తరీయ మేదురే
మనో వినోద మద్భుతం బిభర్తు భూత భర్తరి 

సహస్ర లోచన ప్రభృత్య శేషలేఖ శేఖర
ప్రసూన ధూళి ధోరణీ విధూస రాంఘ్రి పీఠభూః 
భుజంగ రాజమాలయా నిబద్ధ జాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధు శేఖరః 

లలాట చత్వరజ్వల ద్ధనంజయ స్ఫులింగభా
నిపీత పంచసాయకం నమన్నిలింప నాయకం
సుధామయూఖ లేఖయా విరాజమాన శేఖరం
మహా కపాలి సంపదే శిరోజటాల మస్తు నః 

కరాళ ఫాల పట్టికా ధగ ద్ధగ ద్ధగ జ్జ్వల
ద్ధనంజయా హుతీకృత ప్రచండ పంచ సాయకే 
ధరా ధరేన్ద్ర నందినీ కుచాగ్ర చిత్ర పత్రక
ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ 

నవీన మేఘ మండలీ నిరుద్ధ దుర్ధర స్ఫురత్
కుహూ నిశీథి నీతమః ప్రబంధ బంధ కన్ధరః 
నిలింప నిర్ఝరీ ధరస్తనోతు కృత్తి సిన్ధురః
కళా నిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః 

ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలి మచ్ఛటా
విడంబి కంఠ కంథరా రుచి ప్రబంద కందరం
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంద కచ్ఛిదం తమంత కచ్ఛిదం భజే 

అగర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరీ
రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంత కాంతకాంతకం తమంతకాంతకం భజే 

జయత్వదభ్ర విభ్రమ భ్రమ ద్భుజంగ మస్తురః
ధగ ధగ ద్వినిర్గమత్ కరాళ ఫాల హవ్యవాట్ 
ధిమిద్ధిమిద్ధిమి ధ్వనన్ మృదంగతుంగమంగళ
ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవః శివః 

దృషద్విచిత్ర తల్పయో ర్భుజంగ మౌక్తికస్రజోర్
గరిష్ఠ రత్న లోష్ఠయోః సుహృద్వి పక్ష పక్షయోః 
తృణారవిందచక్షుషోః ప్రజా మహీమహేంద్రయోః
సమం ప్రవర్తయః మనః కదా సదాశివం భజే 

కదా నిలింప నిర్ఝరీ నికుంజ కోటరే వసన్
విముక్త దుర్మతిః సదా శిరఃస్థ మంజలిం వహన్ 
విముక్త లోల లోచనో లలాట ఫాల లగ్నకః
శివేతి మంత్ర ముచ్చరం సదా సుఖీ భవామ్యహం

ఇమంహి నిత్యమేవముక్త ముత్తమోత్తమం స్తవం
పఠన్ స్మరన్ భృవన్నరో విశుద్ధిమేతి సంతతం
హరే గురౌ సుభక్తిమా శుయాతి నాన్యథా గతిం
విమోహనం హిదేహినాం సుశంకరస్య చింతనం

పూజావసాన సమయే దశవక్త్ర గీతం యః
శంభు పూజనమిదం పఠతి ప్రదోషే 
తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగ యుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః

                     - రావణ బ్రహ్మ
          

సృష్టి రహస్యాలు

*సృష్టి_రహస్య_విశేషాలు..!!*

1 సృష్టి ఎలా ఏర్పడ్డది
2 సృష్టి కాల చక్రం ఎలా నడుస్తుంది
3 మనిషిలో ఎన్ని తత్వాలున్నాయి

( సృష్ఠి ) ఆవిర్బావము.
1 ముందు (పరాపరము) దీనియందు శివం పుట్టినది
2 శివం యందు శక్తి
3 శక్తి యందు నాధం
4 నాధం యందు బిందువు
5 బిందువు యందు సదాశివం
6 సదాశివం యందు మహేశ్వరం
7 మహేశ్వరం యందు ఈశ్వరం
8 ఈశ్వరం యందు రుద్రుడు
9 రుద్రుని యందు విష్ణువు
10 విష్ణువు యందు బ్రహ్మ
11 బ్రహ్మ యందు ఆత్మ
12 ఆత్మ యందు దహరాకాశం
13 దహరాకాశం యందు వాయువు
14 వాయువు యందు అగ్ని
15 ఆగ్ని యందు జలం
16 జలం యందు పృథ్వీ. 
17. పృథ్వీ యందు ఓషధులు
18. ఓషదుల వలన అన్నం
19. ఈ అన్నము వల్ల నర మృగ పశు పక్షి స్థావర జంగమాదులు పుట్టినవి.

( సృష్ఠి ) కాల చక్రం.
పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.
ఇప్పటివరకు ఎంతో మంది శివులు  
ఎంతోమంది విష్ణువులు  
ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు 
ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.
ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.

1 కృతాయుగం
2 త్రేతాయుగం
3 ద్వాపరయుగం
4 కలియుగం

నాలుగు యుగాలకు 1 మహయుగం.
71 మహ యుగాలకు 1మన్వంతరం.
14 మన్వంతరాలకు ఒక సృష్ఠి (ఒక కల్పం.)
15 సందులకు ఒక ప్రళయం (ఒక కల్పం)
1000 యుగాలకు బ్రహ్మకు పగలు (సృష్ఠి) .  
1000 యుగాలకు ఒక రాత్రి (ప్రళయం.)
2000 యుగాలకు ఒక దినం.
ఇప్పుడు బ్రహ్మ వయస్సు 51 సం.

ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.
1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.
7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.
14 మంది మనువులు.
ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం. 
శ్వేతవరాహ యుగంలో ఉన్నాం.

5 గురు భాగాన కాలంకు 60 సం
1 గురు భాగాన కాలంకు 12 సం
1 సంవత్సరంకు 6 ఋతువులు.
1 సంవత్సరంకు 3 కాలాలు.
1 రోజుకు 2 పూటలు పగలు రాత్రి
1 సం. 12 మాసాలు.
1 సం. 2 ఆయనాలు
1సం. 27 కార్తెలు
1 నెలకు 30 తిధులు
27 నక్షత్రాలు - వివరణలు
12 రాశులు
9 గ్రహాలు
8 దిక్కులు
108 పాదాలు
1 వారంకు 7 రోజులు

పంచాంగంలో 1 తిధి. 2 వార. 3 నక్షత్రం. 4 కరణం. 5 యోగం.

సృష్ఠి యావత్తు త్రిగుణములతోనే ఉంటుంది.
దేవతలు జీవులు చెట్లలో అన్ని వర్గంలలో మూడే గుణములు ఉంటాయి.
1 సత్వ గుణం 
2 రజో గుణం
3 తమో గుణం

( పంచ భూతంలు ఆవిర్భావం )
1 ఆత్మ యందు ఆకాశం 
2 ఆకాశం నుండి వాయువు
3 వాయువు నుండి అగ్ని
4 అగ్ని నుండి జలం
5 జలం నుండి భూమి అవిర్బవించాయి.

5 ఙ్ఞానేంద్రియంలు
5 పంచ ప్రాణంలు
5 పంచ తన్మాత్రలు
5 ఆంతర ఇంద్రియంలు
5 కర్మఇంద్రియంలు = 25 తత్వంలు

1 ( ఆకాశ పంచికరణంలు )
ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల ( జ్ఞానం )
ఆకాశం - వాయువులో కలవడం వల్ల ( మనస్సు )
ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల ( బుద్ది )
ఆకాశం - జలంతో కలవడంవల్ల ( చిత్తం )
ఆకాశం - భూమితో కలవడంవల్ల ( ఆహంకారం ) పుడుతుతున్నాయి

2( వాయువు పంచీకరణంలు )
వాయువు - వాయువుతో కలవడం వల్ల ( వ్యాన)
వాయువు - ఆకాశంతో కలవడంవల్ల ( సమాన )
వాయువు - అగ్నితో కలవడంవల్ల ( ఉదాన )
వాయువు - జలంతో కలవడంవల్ల ( ప్రాణ )
వాయువు - భూమితో కలవడంవల్ల ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.

3 ( అగ్ని పంచీకరణములు )
అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల ( శ్రోత్రం )
అగ్ని - వాయువుతో కలవడంవల్ల ( వాక్కు )
అగ్ని - అగ్నిలో కలవడంతో ( చక్షువు )
అగ్ని - జలంతో కలవడంతో ( జిహ్వ )
అగ్ని - భూమితో కలవడంతో ( ఘ్రాణం ) పుట్టెను.

4 ( జలం పంచికరణంలు )
జలం - ఆకాశంలో కలవడంవల్ల ( శబ్దం )
జలం - వాయువుతో కలవడంవల్ల ( స్పర్ష )
జలం - అగ్నిలో కలవడంవల్ల ( రూపం )
జలం - జలంలో కలవడంవల్ల ( రసం )
జలం - భూమితో కలవడం వల్ల ( గంధం )పుట్టెను.

5 ( భూమి పంచికరణంలు )
భూమి - ఆకాశంలో కలవడంవల్ల ( వాక్కు )
భూమి - వాయువుతో కలవడం వల్ల ( పాని )
భూమి - అగ్నితో కలవడంవల్ల ( పాదం )
భూమి - జలంతో కలవడంతో ( గూహ్యం )
భూమి - భూమిలో కలవడంవల్ల ( గుదం ) పుట్టెను.

( మానవ దేహ తత్వం ) 5 ఙ్ఞానేంద్రియంలు
1 శబ్ద
2 స్పర్ష
3 రూప
4 రస
5 గంధంలు.

5 ( పంచ తన్మాత్రలు )
1 చెవులు
2 చర్మం
3 కండ్లు
4 నాలుక
5 ముక్కు

5 ( పంచ ప్రాణంలు )
1 అపాన 
2 సామనా
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యాన

5 ( అంతఃర ఇంద్రియంలు ) 5 ( కర్మేంద్రియంలు )
1 మనస్సు
3 బుద్ది
3 చిత్తం
4 జ్ఞానం
5 ఆహంకారం

1 వాక్కు
2 పాని
3 పాదం
4 గుహ్యం
5 గుదం

6 ( అరిషడ్వర్గంలు )
1 కామం
3 క్రోదం
3 మోహం
4 లోభం
5 మదం
6 మాత్సర్యం

3 ( శరీరంలు )
1 స్థూల శరీరం
2 సూక్ష్మ శరీరం
3 కారణ శరీరం

3 ( అవస్తలు )
1 జాగ్రదావస్త
2 స్వప్నావస్త
3 సుషుప్తి అవస్త

6 ( షడ్బావ వికారంలు )
1 ఉండుట
2 పుట్టుట
3 పెరుగుట
4 పరినమించుట
5 క్షిణించుట
6 నశించుట

6 ( షడ్ముర్ములు )
1 ఆకలి
2 దప్పిక
3 శోకం
4 మోహం
5 జర
6 మరణం

.7 ( కోశములు ) ( సప్త ధాతువులు )
1 చర్మం
2 రక్తం
3 మాంసం
4 మేదస్సు
5 మజ్జ
6 ఎముకలు
7 శుక్ల.
      *సమాప్తం*

పద్నాలుగు లోకాల పాలకులు

🌹
పదనాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు.

 పదనాలుగు లోకాలలో..!

మొదటి మూడు లోకాల్లోను అంటే భూలోకం , భువర్లోకం, సువర్లోకాలను " కృతక లోకాలు " అంటారు. జీవులు తాము చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లొకాల్లొను ఉంటారు.
 
 నాల్గొవదైన మహర్లోకం 
కల్పాన్తములో కూడా నశించదు. ఈ లొకంలొ కల్పాంత జీవులు ఉంటారు.

 అయిదోవది అయిన జనలోకంలొ 
బ్రహ్మ దేవుని మానస పుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు నివసిస్తారు.

 ఆరొవదైన తపోలోకంలో 
దోష వర్జితులు , దేహ రహితులు అయిన వైరాజులనే వారు ఉంటారు.

 ఏడో లొకం మరియు ఊర్ధ్వ లోకములలో ఆఖరది అయిన సత్యలోకం మరణ దర్మం లేని పుణ్య లొకం.
ఇందులొ సిద్ధాది మునులు నివసిస్తారు.

 ఎనిమిదొవ లోకం అయిన అతలంలో మయదానవుని సంతతికి చెందిన అసురులు నివశిస్తారు.

 తొమ్మిదొవది అయిన వితలం లొ హోటకేస్వరుడు మరియు ఆయన పరివారం ఉంటారు.

 పదోవది అయిన సుతలం లొ బలిచక్రవర్తి , అతని అనుయాయులు నివశిస్తూ ఉంటారు.

 పదకొండవధి అయిన తలాతలం లొ త్రిపురాధిపతి అయిన యమధర్మ రాజు , మహాదేవ రక్షితుడై ఉంటాడు.

 పన్నెండో వది అయిన మహాతలం లొ 
కద్రువ సంతతి వారైన నానా శిరస్సులు గల కాద్రవేయులు ఉంటారు. వీరిలో తక్షకుడు, కాలుడు, సుషేణుడు మొదలైనవారు ఉన్నారు .

 పదమూడవధి అయిన రసాతలం లొ 
"పణి " అనబడే దైత్యులు , రాక్షసులు నివశిస్తూ ఉంటారు. నిరత కవచులు, కాలేయులు, హిరణ్య పురవాసులు వీరే .

 పదనాలుగోవ ది అయిన పాతాళ లొకం లో 
 శంఖుడు, మహాశంఖుడు, శ్వేతుడు , ధనంజయుడు, శంఖచూడుడు, కంబలుడు, ధృతరాష్ట్రుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలయిన సర్వజాతుల వారు నివశిస్తు ఉంటారు.
🌹

స్త్రీ రూపలో ఆంజనేయస్వామి

*స్త్రీ రూపంలో* *ఆంజనేయుడు*
*ప్రపంచంలో ఒకే ఒక్క ఆలయం*

ఈ మందిరం ఛత్తీస్ ఘడ్ లోని రతన్ పూర్ లో ఉంది. 

ఇందుకు సంబంధించిన విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం. 

*ఈ అరుదైన ఆలయం గురించి*

 హనుమంతున్ని స్త్రీ రూపంలో పూజించే ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే. *ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలో రతన్ పూర్ జిల్లాలో గిర్జబంద్ లోని ఈ ఆలయంలో హనుమంతున్ని దేవత రూపంలో పూజిస్తున్నారు.* 

ఇక్కడ పూజలు నిర్వహించే భక్తులకు ఈ ఆలయంపై అపారమైన నమ్మకం ఉంది. ఈ ఆలయంలో దేవత రూపంలో ఉన్న హనుమంతున్ని ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని విశ్వసిస్తారు. ఇక్కడ రాముడు, సీతాదేవిలను తన భుజాలపై మోస్తున్నట్లు ఉండే ఆంజనేయుని విగ్రహాన్ని కూడా చూడవచ్చు.

 *ఈ విగ్రహం ప్రతిష్టాపన వెనుక ఉన్న కథ*
 
ఈ దేవాలయంలో హనుమంతుడి విగ్రహం స్త్రీ రూపంలో ఉండటం వెనుక పురాణ కథనం ఉంది. 

ఇక్కడ ఒకానొక కాలంలో పృథ్వీ దేవరాజ్ అనే రాజు ఉండేవాడు. అతను హనుమంతుడికి మిక్కిలి భక్తుడు. ఇదిలా ఉండగా ఆ రాజు కుష్టు రోగం బారిన పడుతాడు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అదే రోజు రాత్రి హనుమంతుడు రాజు కలలో కనబడి తనకు మందిరం నిర్మించాలని చెబుతాడు. దీంతో రాజు తన ఆలోచనను విరమించుకుని హనుమంతుడికి దేవాలయం నిర్మించాలని, అందుకు ఒక శిల్పం చెక్కమని ఒక శిల్పికి చెబుతాడు. 

కానీ విగ్రహ ప్రతిష్టాపన ముందు రోజు రాత్రి రాజుకు మరల హనుమంతుడు స్వప్న దర్శనం ఇచ్చి నా విగ్రహం ఇక్కడికి దగ్గర్లో ఉన్న మహామాయ అనే కొలనులో ఉందని దానిని తీసి ప్రతిష్టించాలని రాజును ఆదేశిస్తాడు. 

దీంతో రాజు ఆ సరస్సు వద్దకు వెళ్లి సేవకులతో విగ్రహాన్ని వెలికి తీయిస్తాడు. అయితే ఆ విగ్రహానికి ముక్కుపుడక ఉండటమే కాకుండా చూడటానికి స్త్రీ మూర్తి వలే ఉంటుంది. అయినా హనుమంతుడి ఆదేశాను సారం ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి దేవాలయంలో ప్రతిష్టింపజేస్తారు. 

 *దక్షిణ ముఖంగా ఇక్కడ హనుమంతుడు* 

ఈ ఆలయంలో హనుమంతుడు దక్షిణ ముఖంగా ఉంటాడు. ఆయన కుడి వైపు శ్రీ రాముడు, ఎడమ వైపు లక్ష్మణుడు ఉంటాడు. హనుమంతుడి కాలి కింద ఇద్దరు రాక్షసులు ఉంటారు. ఇక ఈ విగ్రహం ప్రతిష్టించిన తర్వాత రాజు కుష్టు రోగం పూర్తిగా సమిసి పోయింది. అంతే కాకుండా తనను దర్శించుకున్న వారికి చర్మరోగాలు పూర్తిగా నయమవుతాయని కూడా హనుమంతుడు రాజుకు తెలిపినట్లు ఇక్కడి వారు చెబుతారు. 

అంతే కాకుండా ఇక్కడకు వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. స్త్రీ రూపంలో ఉండే ఈ హనుమంతుడు వివాహ సమస్యలను పరిష్కరించి, సంతనం కోరే వారికి సంతానం ప్రసాదిస్తాడు. ఇలా ఎందరో భక్తులకు అనుభవపూర్వకంగా జరిగిన సంఘటనలు ఉన్నాయి.  

ఈ దేవాలయానికి దగ్గర్లోనే కాలభైరవ మందిరం ఉంది. ఈ దేవాలయంలో కాలభైరవ విగ్రహం 9 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంతే కాకుండా అతి పురాతన లక్ష్మి దేవి మందిరం కూడా ఇక్కడకు దగ్గర్లోనే ఉంది.


*జై శ్రీరామ్*
*జై హనుమాన్*

అశ్వత్థ వృక్షం

*అశ్వత్థ_వృక్షం:*

*మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణీ!*
*అగ్రత శ్శివ రూపాయ వృక్ష రాజాయతే నమః!!*

*అశ్వత్థ వృక్షం త్రిమూర్తి స్వరూపం. అంతే కాకుండా అశ్వత్థమ్ వృక్షం సర్వదేవతా స్వరూపం*. 

ఈ వృక్షమును ఒక్క శనివారము మాత్రమే ముట్టుకోవచ్చును. అమావాస్య నాడు ఈ అశ్వత్థ వృక్షానికి శక్తి కొలది అనగా 21, 108 ప్రదక్షిణలు చేసి పూజి౦చిన సర్వాభీష్ట సిద్ధి కలుగుతు౦ది.

  విష్ణు సహస్ర నామం పఠిస్తూ ప్రదక్షిణ చేయవచ్చు. మౌనంగా ప్రదక్షిణ చేస్తే అమిత ఫలం లభిస్తు౦ది. 

ఉదక కుంభం(నీళ్ళ చెంబు) తీసుకొని గర్భిణీ స్త్రీలా మ౦దగతితో ప్రదక్షిణ చేసినచో అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తు౦ది...

*రావి చెట్టును పూజించుట వలన కలుగు ఫలితములు.*

అశ్వత్ధ వృక్షంలో సర్వదేవతలూ ఉంటారు. దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండపురాణము లో నారదుడు వివరించెను. అశ్వత్ధమే నారాయణస్వరూపము. ఆ వృక్షం యొక్క:
మూలము – బ్రహ్మ
దాని మధ్య భాగమే – విష్ణువు
దాని చివరి భాగము – శివుడు
కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించి నట్లే.
ఈ త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులలోని కొమ్మలలో ఉంటారు. తూర్పు దిక్కునగల కొమ్మలలో ఇంద్రాదిదేవతలు, సప్తసముద్రాలు, అన్ని పుణ్యనదులు ఉంటాయి.
దాని వేర్లలో మహర్షులు, గోబ్రాహ్మలు, నాలుగువేదాలు ఉంటాయి. అశ్వత్ధ వృక్షాన్ని ఆశ్రయించి అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిపతులు, దిక్పాలకులు ఎల్లప్పుడు ఉంటారు.
అశ్వత్ధ వృక్షం మూలములో ‘అ’ కారము, మానులో ‘ఉ ‘ కారము, అదిఇచ్చే పళ్ళలో ‘మ’ కరము, వెరసి ఆ వృక్షమంతా ప్రణవస్వరూపమే .అశ్వత్ధ వృక్షం సాక్షాత్తు కల్పవృక్షము.

*ప్రదక్షణ మరియు పూజించు విధానము:💮*
ముందుగా అశ్వత్ధ వృక్షాన్ని దర్శించి దానిని చేతితో తాకి( శనివారం మాత్రమే తాకాలి) ఈ క్రింది అశ్వత్ధ వృక్ష స్తోత్రమును పఠించాలి..

*అశ్వత్ధవృక్ష స్తోత్రం:*

మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతో విష్ణురూపిణే
అగ్రత శ్శివరూపాయ
వృక్షరాజయతే నమః
అశ్వత్ధ వృక్ష ప్రదక్షిణ చైత్ర, ఆషాడ, పుష్య మాసాలలో చేయరాదు. గురు,శుక్ర మౌడ్యాలలో చేయరాదు. కృష్ణపక్షంలో అశ్వత్ధ వృక్ష ప్రదక్షిణ ప్రారంబించరాదు. ఆది,సోమ,శుక్రవారాలలో, గ్రహణ మరియు సంక్రమణ సమయాల్లో, నిషిద్ధ సమయాల్లో, రాత్రి భోజనముచేసి యీ వృక్షాన్ని సేవించరాదు.
మౌనంగా లేదా గురునామము లేదా విష్ణుసహస్ర నామమును చదువుతూ నెమ్మదిగా ప్రదక్షణలు చేయాలి. ప్రతి ప్రదక్షణానికి ముందు అలాగే చివర అశ్వత్ధ వృక్షానికి నమస్కారించాలి.

*🙏అశ్వత్ధ వృక్ష పూజా ఫలము..*
*అశ్వత్ధ వృక్షానికి రెండులక్షల ప్రదక్షణాలు చేస్తే సర్వపాపాలూ నశించి నాలుగుపురుషార్ధాలు సిద్ధిస్తాయి.*
బిడ్డలు కలగాలన్న సంకల్పముతో ప్రదక్షణలు చేస్తే తప్పక కలుగుతారు.
*శనివారంనాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితో తాకి మహామృత్యుంజయ మంత్రమును జపిస్తే మృత్యుభయం పోతుంది. అలాగే శనివారంనాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితోతాకి ఈ క్రింది శనైశ్చర స్తోత్రమును పఠించిన శనిదోషం తొలగిపోతుంది.*
అశ్వత్ధ వృక్షం క్రింద చెప్పవలసిన శనైశ్చర స్తోత్రం..
కోణస్థ: పింగళో బభ్రు: కృష్ణో రౌద్రాంతకోయమః
శౌరీ శ్శనైశ్చరో మందః పిప్పిల దేవ సంస్తుతః
గురువారం, అమావాస్య కలసి వచ్చినరోజున అశ్వత్ధ వృక్షం క్రింద వేదవిప్రునికి భోజనము పెడితే కోటిమంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితముంటుంది.
గురువారం, అమావాస్య కలసి వచ్చినరోజున అశ్వత్ధ వృక్షనీడలో స్నానమాచరించిన మహాపాపములు తొలగును.
అశ్వత్ధ వృక్షం క్రింద చదివిన గాయత్రి మంత్రజపం నాలుగు వేదాలు చదివిన ఫలితాన్ని ఇస్తుంది. అశ్వత్ధ వృక్షాన్ని స్థాపిస్తే నలభైరెండు తరాలవారికి స్వర్గం లభిస్తుంది.
లోకా సమస్తా సుఖినో భవంతు..!!

                       


28, సెప్టెంబర్ 2020, సోమవారం

విష్ణు కథ

🕉 విష్ణు కథ -  🕉

విష్ణువు జయవిజయులతో, ‘‘మహా మునుల శాపం మీరరానిది. నా పట్ల మిత్రభావంతో ఏడు జన్మల్లో తరించి వస్తారా? లేక నన్ను ద్వేషిస్తూ నాకు శత్రువులై మూడు జన్మల్లో నాచేత అంతమొంది ఇక్కడికి వస్తారా?'' అని అడిగాడు. జయవిజయులు విష్ణు సన్నిధానాన్ని త్వరగా చేరుకోడానికి మూడు జన్మలే కోరుకున్నారు.

అప్పుడు సనకసనందనాది మునులు జయవిజయుల్ని మెచ్చుకుంటూ విష్ణువుతో, ‘‘రాగద్వేషాలు రెండూ నీకు సమానమనీ, నిన్ను ద్వేషించేవారు మరింత త్వరగా నీకు దగ్గరవుతారనీ ఇప్పుడు తెలుసుకున్నాం! కర్తవ్య నిర్వహణలో మమ్మల్ని అడ్డుకున్న నీ ద్వారపాలకులను శపించిన మా తొందరపాటుతనానికి సిగ్గు పడుతున్నాం. మమ్మల్ని మన్నించు!'' అని చెప్పి, లక్ష్మీనారాయణులను అనేక విధాల మనసార స్తుతిస్తూ సేవించి వెళ్ళారు.

జయవిజయులు కశ్యపప్రజాపతి భార్య దితి కడువున హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడుగా పుట్టారు. అన్నదమ్ములు గొప్ప పరాక్రమవంతులై తపస్సులు చేసి బ్రహ్మను మెప్పించి గొప్ప వరాలు పొందారు. విష్ణువుపై కత్తికట్టి విజృంభించారు. హిరణ్యకశిపుడు రాక్షసులకు రాజై, విష్ణువును ఎదుర్కొని సాధించడానికి కంకణం కట్టుకున్నాడు. హిరణ్యాక్షుడు విష్ణువును కవ్వించే ఘోరకృత్యాలు చేసి చేసి, భూమిని దొర్లించుకుపోయి రసాతల సముద్రంలోకి తోశాడు. భూమి రసాతలం అడుగున మునిగిపోయింది. భూదేవి విష్ణువును తలంచి తన్ను ఉద్ధరించమని మొరపెట్టింది.

విష్ణువు భూదేవి మొర ఆలకించి దశావతారాల్లో మూడవది అయిన వరాహావతారాన్ని ఎత్తాడు. బ్రహ్మ హోమం చేస్తూండగా యజ్ఞకుండం నుంచి తెల్లని కాంతితో ఒక నలుసు వెలువడింది. ఆ నలుసు క్రమ క్రమంగా పెద్దదై అడవి పందిగా రూపొందింది. ఆ ఏదు పందిని విష్ణువు అవతారంగా ఎంచి బ్రహ్మాది దేవతలు యజ్ఞవరాహంగా, శ్వేత వరాహంగా, ఆదివరాహంగా కీర్తిస్తూ స్తుతించారు.

యజ్ఞవరాహము అలా అలా పెరిగి, బ్రహ్మాండమైన ఆకృతి పొందింది; బలిష్ఠమైన కాళ్ళతో, ఉక్కుకవచం లాంటి పైచర్మంతో, వజ్రాల్లాంటి పొడవైన వాడి కోరకొమ్ములతో, ఎరన్రికాంతి ప్రసరించే కన్నులతో, మెడ నుంచి తోకవరకూ నిక్కబొడుచుకొని బంగారంలా మెరుస్తున్న వెంట్రుకల జూలుతో, విశ్వమంతా ఘూర్ణిల్లేలాగ వరాహము హుంకార ధ్వనులు చేసింది. యజ్ఞవరాహం ముట్టెలపై ఖడ్గంలాంటి కొమ్ము ధగధగా మెరుస్తున్నది.

వరాహావతారం మెరుపు వేగంతో రసాతలానికి పరిగెత్తింది. ఆ వేగానికి దిక్కులు అదిరాయి, ప్రళయవాయువులు భీకరంగా వీచాయి. రసాతల సముద్రంలోకి చొచ్చుకొని వెళ్ళి, అడుగున మునిగి ఉన్న భూమిని తన కొమ్ముతో గుచ్చి యజ్ఞవరాహము మీదకు ఎత్తింది. అదే సమయంలో హిరణ్యాక్షుడు వరుణుడిపై దాడిచేసి పోరాటానికి పిలిచాడు.
వరుణుడు, ‘‘వీరాధి వీరుడివైన నీవు పోరాడవలసినది నాతో కాదు రసాతలం నుంచి భూమిని ఉద్ధరిస్తున్న యజ్ఞవరాహంతో!’’ అని అన్నాడు.

హిరణ్యాక్షుడు హుటాహుటిని వెళ్ళి యజ్ఞ వరహావతారాన్ని ఢీకొన్నాడు. వరాహరూప విష్ణువుతో హిరణ్యాక్షుడు గొప్ప పరాక్రమంతో పోరుతూ గదతో విష్ణువు గదను తృళ్ళగొట్టి కొంతసేపు అలాగే నిల్చున్నాడు. విష్ణువు అతని యుద్ధనీతిని మెచ్చుకొని తిరిగి గదను ధరించాక, ఇరువురికీ సంగ్రామం ఘోరంగా సాగింది. చివరకు వరాహావతారం తన కొమ్ముతో హిరణ్యాక్షుణ్ణి పొడిచి చంపింది.

వరాహావతారుడైన విష్ణువును భూదేవి వరించింది. వరాహమూర్తి భూదేవిని సందిట చేర్చుకొని తొడపై కూర్చుండ బెట్టుకున్నాడు. బ్రహ్మాది దేవతలు పూలవాన కురిపిస్తూ, జగపతిగా విష్ణువును అనేక విధాలుగా స్తోత్రం చేశారు.

పందిరూపంతో తన తమ్ముణ్ణి చంపిన విష్ణువుపై పగ సాధించడానికి తీవ్ర సంకల్పంతో, ముందు బ్రహ్మవల్ల వరాలు పొందడానికి హిరణ్యకశిపుడు తపస్సుకు బయలుదేరి వెళ్ళాడు. అప్పుడు అతని భార్య లీలావతి గర్భవతిగా ఉన్నది. ఆమె గర్భవాసాన్ని హతమార్చడానికి ఇంద్రుడు మాయోపాయంతో లీలావతిని చెరగొని, ఆకాశమార్గాన పోతూండగా, నారదుడు ఎదురై, ‘‘దేవేంద్రా! ఎంత పనికి ఒడిగట్టావు! నీ ప్రయత్నాన్ని విరమించు. సర్వకాల సర్వావస్థలలో హిరణ్యకశిపుడు పగతో విష్ణువు గురించే తలంచుతూండే వాడవడంవల్ల, లీలావతి గర్భస్థుడైన శిశువుకు ఆ విష్ణుచింతన సంక్రమించి, పగ భక్తిగా అతనిలో రూపాంతరం పొందింది. ఇదే విష్ణుమాయ అయిన ప్రకృతి విశేషాల్లో ఒకటి.

లీలావతి గొప్ప విష్ణుభక్తుణ్ణి కనబోతూన్నది. అంచేత లీలావతిని విడిచిపుచ్చి. నీ దారిన నువ్వు వెళ్ళు!’’ అని చెప్పి లీలావతిని తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు.

ఆశ్రమంలో నారదుడు ఉన్నతమైన వేదాంత విషయాలనూ, విష్ణు దివ్య కల్యాణ గుణగణాలను వర్ణిస్తూన్నప్పుడు, లీలావతి గర్భంలో ఉన్న బిడ్డ అమిత ఆసక్తితో వింటూ, ఊకొడుతూండే వాడు. లీలావతి కుమారుణ్ణి ప్రసవించింది. హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు.

భూమ్మీద గాని, ఆకాశంలోగాని, రాత్రిగాని పగలు గాని, ఇంటగాని, బయటగాని, మృగంచేత గాని మనిషిచేతగాని, దేవతలు మొదలైన వారివలన గాని, ప్రాణమున్న దానిచేత గాని లేనిదానిచేతగాని, నిప్పు, నీరులాంటి పంచభూతాల చేతగాని సృష్టిలో ఉన్న ఏరూపంచేత గాని, ఇంకా ఎన్నో విధాలుగా తనకు చావులేని వరాల్ని కోరాడు; బ్రహ్మ అతను కోరిన వరాలన్నిటినీ ఇచ్చాడు.

వరాలను పొందిన విజయగర్వంతోహిరణ్యకశిపుడు వస్తూండగా, నారదుడి వలన జరిగినది విని, నారదాశ్రమానికి వచ్చి, కుమారుడి పేరు ప్రహ్లాదుడు అని నామకరణ మహోత్సవం జరిగాక, భార్యనూ, కుమారుణ్ణీ తన రాజధానికి తీసుకువెళ్ళాడు. ఇంద్రుడిపై ప్రతీకారంగా హిరణ్యకశిపుడు స్వర్గం మీదకు దండయాత్ర చేసి, స్వర్గ సింహాసనం ఆక్రమించాడు.

దిక్కులన్నిటినీ జయించి, అష్ట దిక్పాలకుల్ని తన అదుపాజ్ఞల్లో పెట్టుకున్నాడు. దేవతల్ని పశువుల్ని బాదినట్లుగా బాదాడు. శచీదేవిని అవమానించబోతే లీలావతి అడ్డుకొంది.

హిరణ్యకశిపుడు విజృంభించి మునుల ఆశ్రమాల్ని తగలబెట్టించాడు. విష్ణు విశ్వాసకుల్ని చిత్రవధలు చేయించాడు. విష్ణువును ఎదుర్కోవడమే అతని ధ్యేయం. విష్ణువును కవ్వించడానికి చేయవలసినవన్నీ చేశాడు. అయినా విష్ణువు అతనికి తారసపడలేదు. వైకుంఠానికి దాడి వెళ్ళాడు. అక్కడా విష్ణువు అతనికి కనపడలేదు. ‘‘నాకు భయపడి అదృశ్యంగా దాగున్నాడు. పిరికిపంద!’’ అని హిరణ్యకశిపుడు తిరిగివచ్చాడు.

ప్రహ్లాదుడు దినదిన ప్రవర్థమానంగా ఎల్లప్పుడు విష్ణుస్మరణ చేస్తూ పెరుగుతూన్నాడు. తనకు అటువంటి కులద్రోహి ఎందుకు పుట్టాలి! అని హిరణ్యకశిపుడు చింతించి, గురుపుత్రులైన చండామార్కులకు ప్రహ్లాదుణ్ణి అప్పగించి, విద్యాబుద్ధులు నేర్పమన్నాడు. ప్రహ్లాదుడు గురుకులంలో హరిధ్యానంతోనే చదువంతా పూర్తిచేశాడు. తోటి బాలురకు విష్ణుభక్తి ప్రబోధంచేసి మోక్ష మార్గంపట్ల ఆసక్తికలవారిగా చేశాడు.

చండామార్కులు ప్రహ్లాదుణ్ణి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళారు. హిరణ్యకశిపుడు కుమారుణ్ణి ఆప్యాయంగా తొడపై కూర్చుండబెట్టుకొని, ‘‘నాయనా! నువ్వు నేర్చిన విద్యతెలిసేలాగ మంచి పద్యం ఒకటి చెప్పు!’’ అన్నాడు. ప్రహ్లాదుడు, ‘‘తండ్రీ! గురువులు చెప్పిన చదువంతా క్షుణ్ణంగా నేర్చాను. చదువులన్నిటి కంటె గొప్పదైన చదువు విష్ణువునందు మనసు నిల్పడం ఒక్కటే! విష్ణువును స్మరించే జన్మే జన్మ!’’ అన్నాడు. హిరణ్యకశిపుడు కుమారుణ్ణి చప్పున క్రిందకు తోసి పట్టరాని ఆగ్రహంతో చండామార్కులతో, ‘‘ఇదా మీరు నేర్పిన చదువు?’’ అన్నాడు.

చండామార్కులిద్దరూ గజగజలాడుతూ, ‘‘మా తప్పేమీ లేదు, మహాప్రభూ! మాపై ఆగ్రహించకు!’’ అని వేడుకుంటూ, గురుకులంలో ప్రహ్లాదుడేవిధంగా ప్రవర్తించినదీ వివరంగా విన్నవించుకున్నారు. హిరణ్యకశిపుడు కొడుకుతో, ‘‘విష్ణువు పందిగా నీ పినతండ్రిని చంపాడు. మన రాక్షస కులానికి పరమశత్రువు. నీవు విష్ణువును పొగడ్డం క్షమించరాని కులద్రోహం. విష్ణుభక్తి మాను, ఈ క్షణమే వాణ్ణి మర్చిపో!’’ అన్నాడు.

‘‘దానవేశ్వరుడవైన నీవు అన్నివిధాలా నన్ను శాసింపతగినవాడివే! కాని ఇనుముముక్క అయస్కాంతాన్ని ఏవిధంగా అంటుకుంటుందో, అలాగే నా మనస్సు విష్ణువుపైనే లగ్నమై ఉన్నది; మందార పువ్వు మకరందాన్ని తుమ్మెద ఎలాగ విడిచి పెట్టలేదో, అలాగే విష్ణువును మర్చిపోవడం నా వశంలో లేదు. నాలో జీవము ఉన్నంతవరకూ విష్ణుచింతన పోదు, ఆ జీవము కూడా విష్ణువే!’’ అన్నాడు వినయంగా.

ముక్కుపచ్చలారని బాలుడైన ప్రహ్లాదుడి మాటలకు విస్తుపోతూ హిరణ్యకశిపుడు కోపంతో అగ్నిలా ప్రజ్వరిల్లి, ‘‘అయితే నీవు చావక తప్పదు, ఆహార పానాలు లేకుండా మలమల మాడి చావు!’’ అంటూ ప్రహ్లాదుణ్ణి వెలుతురు చొరని కారాగారంలో పెట్టించాడు. పుత్రప్రేమతో లీలావతి తల్లడిల్లి పోయింది.

రోజులు గడుస్తున్నాయి. లీలావతి శోకం చూడలేక హిరణ్యకశిపుడు కారాగారం తెరిపించి, తన్మయుడై విష్ణుసంకీర్తన చేస్తూ నవనవలాడుతూన్న ప్రహ్లాదుణ్ణి చూసి, చాలా రోజులుగా అన్న పానాలు లేకుండా ఎలా బతికి ఉన్నాడా అని ఆశ్చర్యపడుతూనే, పట్టరాని ఆగ్రహంతో ప్రహ్లాదుణ్ణి ఏనుగులచేత మట్టించమన్నాడు. ప్రహ్లాదుణ్ణి చూడగానే ఏనుగులు సింహాన్ని చూసినట్లు బెదిరాయి. మావటివాళ్లు పొడిచి అతి ప్రయత్నం మీద నడిపించితే, అతనిమీద నుంచి వెళ్ళాయిగాని, అతనికే అపాయమూ కలగలేదు.

పాములచేత కరిపించబోతే, కాటువేయకుండా ముద్దాడి, పడగలు విప్పి గొడుగులుపట్టి ఆడాయి. కొండశిఖరం నుంచి తోయించాడు, మంటల్లో వేయించాడు, సముద్రంలో పడవేయించాడు, కాలకూట విషం త్రాగించాడు. ఎన్నిచేసినా, ప్రహ్లాదుడు సురక్షతంగా ఉండటం చూసి, హిరణ్యకశిపుడు, ‘‘నువ్వు, చావకున్నా వెందుచేత? ఆ రహస్యమేమిటో చెప్పు!’’ అని అడిగాడు.

ప్రహ్లాదుడు నవ్వుతూ, ‘‘ఇందులో రహస్యం ఏదీలేదు; ఏనుగుల్లో, పాముల్లో, రాళ్ళలో, అగ్నిలో, సముద్రాల్లో, విషంలో అన్నిట్లో, నీలో, నాలో ఉన్నది విష్ణువే అన్న సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు! నన్ను చంపాలనుకుంటున్నదీ, నేను బతుకుతూన్నదీ, అతని లీలావినోదమే, నాన్నా!’’ అన్నాడు.

ఆ మాటలకు హిరణ్యకశిపుడు కోపావేశంతో ప్రహ్లాదుణ్ణి బరబరా ఈడ్చుకు వెళ్ళి సభామంటపం మధ్య నిలబెట్టి, తన గదను తీసి పట్టుకొన్నాడు. లీలావతి మూర్ఛపోయింది. చుట్టూరా రాక్షస ప్రముఖులు నిర్విణ్ణులై బొమ్మల్లా నిలబడి చూస్తున్నారు.

సభామంటపానికి ఎదురుగా లోహనిర్మితమైన పెద్ద జయస్తంభం ఉంది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి ఆ స్తంభాన్ని చూపుతూ, ‘‘ఓరీ కులద్రోహీ! అది, నా విజయ స్తంభం! నా తమ్ముణ్ణి చంపిన విష్ణువుతో పోరాడి, నీ ముందే సంహరించి పగతీర్చుకుంటాను, అందులో ఉన్నాడా?’’ అని అడిగాడు. ‘‘ఆసందేహమే వద్దు నాన్నా. అంతటా ఉన్నాడు, అందులోనూ ఉన్నాడు,’’ అన్నాడు ప్రహ్లాదుడు.

హిరణ్యకశిపుడు చరచరా వెళ్ళి గదతో స్తంభాన్ని కొట్టాడు. ప్రళయధ్వనితో భూన భోంతరాలు దద్దరిల్లాయి, పొగల మేఘాలు అంతటా విరజిమ్ముకున్నాయి. స్తంభం రెండుగా చీలిపోతూండగా వెలువడిన మిరుమిట్లుగొలిపే మెరుపుల మధ్య దశావతారాల్లో నాలుగవది అయిన నరసింహావతారంగా విష్ణువు ఆవిర్భవించాడు. సింహం తల, మనిషి శరీరము, చేతులకు సింహం గోళ్ళతో సృష్టిలో లేని అద్భుత రూపం గల నరసింహమూర్తి ప్రళయభీకరంగా గర్జించాడు. పాంచజన్యశంఖధ్వని వినిపించింది. సుదర్శనచక్రం అతని చుట్టూ తిరుగుతూ కనిపించింది

సశేషం..
🕉️🙏🕉️🙏🕉️🙏

భూకైలాసం గోకర్ణం

కర్ణాటక రాష్ట్రం
ఉత్తర కన్నడజిల్లా లో
గోకర్ణ పట్టణం లో
కొలువైఉన్న
పరమేశ్వర ఆత్మలింగం భూకైలాసం...గోకర్ణం
శివసంకల్పం లో ఈరోజు

   *మన దేశంలోని శైవక్షేత్రాలైన వారణాశి, రామేశ్వరం ఆలయాల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో ఆ కోవలోకి చెందినదే మహాబలేశ్వరఆలయం. ***కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడ జిల్లాలో గోకర్ణ పట్టణంలో కొలువుదీరి ఉన్న ఈ ఆలయాన్ని గోకర్ణం అని కూడా అంటారు. 
 *అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రాలలో 'గోకర్ణం' ఒకటి. 
  *గోకర్ణ క్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వర క్షేత్రం, ఉత్తరాన గంగావళినది, దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి. ఓ వైపు అపారమైన ఆధ్యాత్మికత, మరో వైపు ప్రకృతి రమణీయకతతో అలరారుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్టితమైంది.
 
 ***గోకర్ణ క్షేత్రం గురించి రామాయణ, మహాభారత గ్రంథాలలో వివరించబడింది. ఇక స్కాందపురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది. పూర్వం రావణాసురుడు శివుని గురించి కఠోర తపస్సు చేయగా, అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు. అందుకు ఓ నిబంధన విధించిన శివుడు, రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఆ నింబంధన ఏమిటంటే.. రావణాసురుడు లంకకు వెళ్లేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై దించకూడదు. అలా దించితే ఆ లింగం అక్కడే ప్రతిష్టితమైపోతుంది.
 
*** అలా ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు తన లంక రాజ్యం వైపు పరుగులు తీయసాగాడు. ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని భయపడిన దేవతలు, తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ... తదితర దేవుళ్లను వేడుకున్నారు. అప్పుడు గణపతి చిన్నపిల్లవాని రూపంలో రావణాసురునికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది.
 
*** అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుని చూసిన రావణాసురుడు కాసేపు ఆత్మలింగాన్ని పట్టుకొమ్మని, తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్థిస్తాడు. అందుకు ఒప్పుకున్న బాలవినాయకుడు తాను మూడుసార్లు పిలుస్తానని, అప్పటికీ రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కిందపెట్టేస్తానని చెబుతాడు. వేరే దారిలేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకుని సంధ్యావందనం చేసుకోవడానికి వెళతాడు. అయితే రావణాసురునికి ఏ మాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు గబగబా మూడుసార్లు రావణాసురుని పిలిచి, ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు.
 
 ***రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది. ఆ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాలవినాయకుని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ నొక్కును ఇప్పటికీ, ఇక్కడున్న మహాగణపతి ఆలయంలో గణపతి విగ్రహానికి చూడవచ్చు.
 
 ఆత్మలింగం చుట్టూ పంచక్షేత్రాలు
 ఆ తరువాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరంవైపు నుంచి లాగుతాడు. ఆ పెట్టె అతి విసురుగా వెళ్లి దూరంగా పడిపోయింది. అక్కడ సజ్జేశ్వర లింగం వెలిసింది. పెట్టె మూతపడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవించింది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురడేశ్వరం లింగం వెలిసింది. పెట్టెను కట్టిన తాళ్లు పడిన చోట ధారేశ్వరలింగం ఉద్భవించింది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం ‘మహాబలేశ్వర లింగం’ గా గోకర్ణంలో వెలిసింది. ఆత్మలింగంతో ముడిపడిన ఈ ఐదు క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటారు.
 
 "గోరూపం" దాల్చిన భూమాత...
 మరొక కథనం ప్రకారం పాతాళలోకంలో తపస్సు చేసి భూలోకానికి వస్తున్నప్పుడు భూమాత గోరూపాన్ని ధరించిందట. ఆ గోవుచెవి నుండి పరమేశ్వరుడు బయటకు రావడంతో ఈ క్షేత్రానికి గో (అవు) కర్ణం (చెవి) = గోకర్ణం అనే పేరు ఏర్పడిందంట.
 
 రాజుల కాలంలో గోకర్ణం
 దక్షిణ కాశి, భూ కైలాసం అని భక్తులచే కొనియాడబడుతున్న ఈ క్షేత్ర చరిత్ర ఎంతో పురాతనమైంది. కాళిదాసు తన ‘రఘువంశం’ కావ్యంలో ఈ క్షేత్ర ప్రస్తావన చేశాడు. క్రీ.శ. 7వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్దనుడు ‘నాగానంద’ కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించాడు. కదంబ చక్రవర్తి మయూరశర్మ ఈ ఆలయంలో నిత్యపూజాదికాలను ఏర్పాటు చేశాడని, చెన్నమ్మాజీ, ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హళసునాడు- కుందపురానికి చెందిన విశ్వేశ్వరాయుడు చంద్రశాల, నందిమంటపాలను నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం గోకర్ణం క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. క్రీ.శ 1665వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని దర్శించుకుని పూజలు చేసినట్టు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది.
 
 సర్వపాప హరణం కోటి తీర్థంలో పుణ్యస్నానం
 గోకర్ణంలో ప్రధానాలయం శ్రీ మహాబలేశ్వరాలయం. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటితీర్థంలో స్నానాలు ఆచరిస్తారు. కోటితీర్థంలో స్నానం చేస్తే సమస్తరోగాలు నయమవుతాయని ప్రతీతి. కోటి తీర్థంలో స్నానం చేసిన తరువాత భక్తులంతా ప్రక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు. ఆలయానికి ప్రక్కనన్ను అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మిక, కోటితీర్థానికి దక్షిణం వైపు అగస్త్యులవారిచే ప్రతిష్టింపబడిన వరటేశ్వర లింగం ఉంది. ఈ ఆలయం భక్తుల సౌకర్యార్థం 24 గంటలూ తెరిచే ఉంటుంది.
 
 నయనానందకరం రథోత్సవం
 అతి ప్రాచీనమైన ఈ ఆలయం పెద్ద గాలిగోపురంతో భక్తులను ఆహ్వానిస్తుంది. ఈ లింగం కింది వైపు కాస్త వెడల్పుగా, పైన సన్నగా కనబడుతుంటుంది. రావణాసురుడు ఈ లింగాన్ని పైకి లాగడానికి ప్రయత్నించడం వల్ల పై భాగాన సన్నగా ఉందంటారు. పైకి ఉండే ఒక రంధ్రంలో వేలును ఉంచినప్పుడు కిందనున్న లింగం వేలికి తగులుతుంది. భక్తులు శివలింగం చుట్టూ కూర్చుని పూజలు నిర్వహిస్తారు. అయితే, మహామంగళహారతుల సమయంలో గర్భగృహంలోకి భక్తులను అనుమతించరు. ఇక్కడ పన్నెండేళ్లకొకసారి జరిగే విశేష కార్యక్రమంలో శివలింగాన్ని బయటకు తీసి, నిజస్వరూప లింగానికి పూజలు చేస్తారు. ఈ పుష్కర ఉత్సవాలకు దేశవిదేశాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ సందర్భంగా రథోత్సవం జరుగుతుంది. ముందుగా వినాయక దర్శనం...
 
 రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు, అతడిని అడ్డుకున్న గణపతి చాతుర్యాన్ని మెచ్చుకున్న పరమశివుడు మహాబలేశ్వర క్షేత్రంలో ముందుగా వినాయకుని దర్శించుకున్న తరువాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరమిచ్చాడు. రావణుడు వేసి మొట్టికాయకు గుర్తుగా ఈ స్వామి తలపై చిన్న పల్లం కనపడుతుంటుంది. ఈ ఆలయం మహాబలేశ్వర ఆలయానికి తూర్పు దిక్కున ఉంది.
 
 ఉత్తరాన రుద్రుని సతి తామ్రగౌరి
 మహాబలేశ్వర ఆలయప్రాంగణంలో ఉత్తరం వైపున తామ్రగౌరి ఆలయం ఉంది. ఈమె మహాబలేశ్వరుని అర్ధాంగి. ఈమె బ్రహ్మదేవుని కుడి చేయి నుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ దేవి తపస్సు చేసి రుద్రుని వివాహం చేసుకుంది. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయత్రం 5 గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది.
 
 సిద్ధించిన అమృతం
 నేత్రాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకై త్రిమూర్తుల శక్తితో భద్రకాళి ఇక్కడే ఆవిర్భవించిందట. అమృతమథనం జరుగుతున్నప్పుడు దేవతలు ఇక్కడకు వచ్చి ఆత్మలింగానికి పూజలు జరపడం వల్ల వారికి అమృతం లభించిందని ప్రతీతి. గోకర్ణ క్షేత్రంలో ఆత్మలింగాన్ని దర్శించుకున్న వారికి జన్మజన్మల పాపకర్మలు తొలగిపోయి సర్వసుఖాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.
 
 సమీప పుణ్యక్షేత్రాలు
 ధారేశ్వర ఆలయం: ఈ ఆలయం గోకర్ణానికి దక్షిణ దిక్కున దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆత్మలింగానికి సంబంధించిన లింగం. ఈ ఆలయం చాళుక్య, హోయసలల శిల్పశైలిలో కనపడుతుంది. దీనిని 11వ శతాబ్దిలో పునర్నిర్మించినట్లు తెలుస్తోంది.
 గుణవంతేశ్వర: ఈ ఆలయం కూడా గోకర్ణ ఆత్మలింగానికి సంబంధించిన క్షేత్రంగా చెప్పబడుతుంది. గోకర్ణం నుంచి సుమారు 60 కిలోమీటర్లు. మురుడేశ్వర ఆలయం: పంచలింగాల క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. ఈ భారీ ఆలయం భక్తులను అమితంగా ఆకర్షిస్తుంటుంది. గోకర్ణక్షేత్రానికి 70 కిలోమీటర్ల దూరం....

25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

అన్నదాన మహత్యం

#అన్నదాన #మహాత్యo
**********************
            #ఒకఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తుండేవారు_*

           #ఆఊళ్లోకి ఒకనాడు ఒక సాధుపుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిలోనికి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగుమీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు_*. 

          _**#ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి" అని తలచి, స్వామి! ఈ ఇంటి యజమాని వూళ్లో లేడు. మీరింక వెళ్లవచ్చును అన్నాడు సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం తెలిసిపోయింది_*.

     #అలాగా! పాపం నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే! ప్రాప్తం లేదన్నమాట! అంటూ వెనుదిరిగాడు_*. 

            #అపుడతను పరుగున వెళ్లి సన్యాసితో 'స్వామి! నేనే ఈ ఇంటి యజమానిని. నన్ను క్షమించండి. లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి' అని ప్రార్థించాడు. లోపలికి తీసుకొని వెళ్లాక ఆ సన్యాసి అతనికి ధర్మసూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని 'స్వామి! నా సమయం చాలా విలువైనది. నేనిలా వ్యర్థప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు.

           #అపుడా సన్యాసి యజమానితో ఇలా అన్నాడు. 'నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది. ఇదేనా!! ఆ గొప్ప ఉపకారం? అన్నాడు ధనికుడు అసహనంగా, సన్యాసి అతనికొక సూది ఇచ్చి ఇది చాలా మహిమగల సూది. దీనిని నీ దగ్గర భద్రంగా దాచి, నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు.

         #ధనికునికి కోపం తారాస్ధాయినంటింది. 'నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను' అని అరిచాడు. 

         #ఆ సాధుపుంగవుడు శాంతంగా 'నాయనా! మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేనివాడివి ఈ లక్షలు, కోట్లు తీసుకొని పోగలవా? అని ప్రశ్నించాడు. ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది. 

       #ఆసన్యాసి కాళ్లపై బడి 'స్వామీ! ఇప్పటి వరకూ అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేసాను! ఇప్పటి నుండి దానధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను' అన్నాడు. 

        #ధనికుడు ఆ మరునాడు చాటింపు వేయించాడు. బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసికొనండొహో!! అని. ఇంకేం? బోలెడంతమంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తానొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టికెళ్లినవారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు.

         #ఆరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవయ్యేసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు.
గుమాస్తా చదవడం ప్రారంభించాడు.

_**1వ వాడు: ఇంకో 20 నాణాలిస్తే వీడిసొమ్మేం పోయింది? పిసినారి పీనుగ!

2వ వాడు: ఇంకో పదినాణాలు వేస్తే గానీ ఈ పూటకి తాగడానికి సరిపడా మద్యంరాదు. ఆ పదీ కూడా ఇవ్వచ్చు కదా. 

3వవాడు: అయ్యో! దీనికి మరో ఎనభై నాణాలు కలిపి ఇవ్వకూడదూ? నా కూతురికి ఓ నగ కొందును కదా*_

_**#అంతట ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు చదవకు.. అని సాధు పుంగవుని వద్దకు పరుగెత్తాడు. స్వామీ, నేను ఈవిధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది.. అంటూ వాపోయాడు*_. 

_**#సాధువతనిని ఓదార్చి 'బాధపడకు నాయనా! ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు' అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్లీ తన గుమాస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండివంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిల్చి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు*_.

_**1వ వాడు: #అన్నదాతా సుఖీభవ!

2వ వాడు: ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్లయింది? బాబుగారు చల్లగా ఉండాలి.

3వ వాడు: అమ్మయ్య ! ఆకలి చల్లారింది. అయ్యగారు వారి బిడ్డలు అందర్నీ దేవుడు చల్లగా చూడాలి*_.

_**#దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు.

#కోట్లు సంపాదించినపుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు. 
ఆరోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి , పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు తరించాడు,మరియు వారి వంశము 
తరించినది.

_**#సర్వే #జనా: #సుఖినోభవంతు*_

తప్పులున్న క్షమించాలి

ప్రతి స్త్రీ అమ్మవారి రూపమే

ప్రతి స్త్రీ అమ్మవారి రూపమే

నవరాత్రి సమయంలో నే కాదు ఎప్పుడు ఎవరికి తాంబూలం ఇచ్చిన ఆ ఆడవాళ్లకు అమ్మవారి స్వరూపంగా భావించే ఇవ్వాలి.. భావించడం ఎందుకు అమ్మవారే అనుకోవాలి.. ప్రతి స్త్రీ లోనూ ఆ తల్లి అంశ ఉంటుంది.. చిన్న పిల్లలు బాల స్వరూపం.. ముత్తైదువులు త్రి మాత స్వరూపం, బిడ్డలు కనని తల్లి పార్వతి స్వరూపం ఆమె గర్భం దాల్చలేదు అందువల్ల పిల్లలు లేని వారు బాధ పడకూడదు అందరూ తమ పిల్లలే అనుకోవాలి, భర్త లేని పూర్వ సువాసినిలు ధూమ్రవతి స్వరూపం.. వారు కూడా లలితా నామ పారాయణం అమ్మవారికి పూజ చేయవచ్చు.. ఆడవాళ్లు భక్తిగా పూజ చేస్తే చాలు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం వారికి అమ్మవారు అనుగ్రహిస్తుంది.. ఆడవాళ్లు ఎక్కువగా మౌన వ్రతం పాటిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది.. పూర్వ సువాసినిలు తాంభూలం ఇవ్వకూడదు తీసుకోకూడదు కానీ నిక్షేపంగా పూజ చేసుకోవచ్చు...ప్రసాదం తీసుకోవచ్చు ఇవ్వచ్చు.
మీ యొక్క స్థితి గతులను లోటు పాట్లు అన్ని ఆమెకు తెలిసినదే కదా ఎవరో చేసినట్టు చేయాలి అని అప్పుచేసి ఆడంబరంగా చేయకండి.. ఉన్నంతలోనే తృప్తిగా పూజ నామ జపం చేసుకోండి.. తాంబులం తో పాటు కుదిరితే రవిక ముక్క స్తోమత ఉంటే చీర పెట్టండి లేకుంటే తాంభూలం పసుపుకుంకుమా ప్రసాదం పంచుకున్నా చాలు..గాజులు పంచుకోండి ,మగవాళ్ళు నవరాత్రి వ్రతం చేసే వాళ్ళు వారి ఇంట్లో అడవాళ్ళతో తాంభూలం ఇప్పించండి..మగవాళ్ళు పరాయి ఆడవాళ్ల చేతికి పసుపుకుంకుమ ఇవ్వకూడదు , కానీ భార్యకు వాళ్ళ చేత్తో తాంభూలం పసుపుకుంకుమా గాజులు ఇస్తే మంచిది అలాగే ఇంట్లో అమ్మవారి కి తాంభూలం సమర్పిస్తాము కదా (ఆకు వక్క, పసుపుకుంకుమా, రవిక గాజులు, చీర) ఇలాంటివి తల్లికి సమర్పించినవి భర్త చేత్తో మీరు స్వీకరించాలి అక్షంతలు వేయించు కుని ఆశీర్వాదం తీసుకోవాలి అది వారికి మంచిది తీసుకున్న భార్యకు మంచిది.

మహా శివుని అవతారం.

*సగం పక్షి, సగం సింహం... ఇది మహాశివుని అవతారం.*

విష్ణుమూర్తి దశావతారాల గురించి చాలామంది టకటకా చెప్పేస్తారు. కానీ మహాశివుడు ఎత్తిన అవతారాల గురించి మన అవగాహన తక్కువే. అలాంటి శివుని అవతారాలలో ఒక్కటే శరభ. ఎనిమిది పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉండే రూపమే శరభ! దక్షిణాది ఆలయాలలో ఎక్కువగా కనిపించే ఈ రూపం వెనుక ఓ ఘనమైన కథ ఉంది.

విష్ణుమూర్తి హిరణ్యకశిపుని సంహరించేందుకు నరసింహావతారాన్ని ఎత్తిన విషయం తెలిసిందే! అయితే హిరణ్యకశిపుని సంహారం తరువాత కూడా ఆయన కోపం చల్లారనే లేదట. ఆ ఉగ్రనారసింహుని క్రోధానికి లోకమంతా అల్లకల్లోలమైపోయింది. నరసింహుని నిలువరించకపోతే ఆయన కోపానికి ప్రకృతి సర్వనాశనం కాక తప్పదని భయపడ్డారు దేవతలు. అందుకోసం నరసింహుని నిలువరించమంటూ వారంతా కలిసి శివుని ప్రార్థించారట. అప్పుడు శివుడు తన అవతారాలైన వీరభద్ర, భైరవులని పంపాడట. కానీ నారసింహుని ముందు ఆ రెండు అవతారాలూ నిలువలేకపోవడంతో శరభ అవతారాన్ని ధరించాడు శివుడు.

కొన్ని పురాణాల ప్రకారం శరభ, నరసింహ అవతారాల మధ్య తీవ్రమైన పోరు జరిగింది. ఈ పోరులో నరసింహుడు ఓడిపోయాడు కూడా. మరి కొన్ని పురాణాల ప్రకారం శరభ అవతారాన్ని ఎదుర్కొనేందుకు విష్ణుమూర్తి గండభేరుండ పక్షిగా అవతరించాడు. రెండు తలలతో ఉండే ఈ పక్షి శరభని దీటుగా ఎదుర్కొంటుంది. ఎంతసేపు యుద్ధం జరిగినా గెలుపు ఓటములు తేలకపోవడంతో, రెండు అవతారాలూ యుద్ధాన్ని విరమించుకుంటాయి. ఎవరి మధ్య యుద్ధం జరిగినా, ఆ యుద్ధంలో ఎవరు గెలిచినా శివకేశవులు ఇరువురూ ఒక్కటే కాబట్టి శరభను విష్ణుమాయగా వర్ణించేవారు కూడా లేకపోలేదు. కేవలం శివకేశవుల పురాణాలలోనే కాదు, బుద్ధుని జాతక కథలలో కూడా ఈ శరభ ప్రస్తావన కనిపిస్తుంది. ఈ జాతక కథల ప్రకారం శరభ బుద్ధుని పూర్వ అవతారాలలో ఒకటి!

శరభ రూపం దక్షిణాదిన, అందునా తమిళనాట ఉన్న శివాలయాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా శైవ మతాన్ని ప్రోత్సహించిన చోళులు నిర్మించిన ఆలయాలలో ఈ ప్రతిమ తప్పక ఉంటుంది. ఒకో చోట ఈ శరభ రూపం కేవలం నామమాత్రంగానే ఉంటే, మరికొన్ని చోట్ల సకల ఆయుధాలతోనూ, దుర్గాదేవి సమేతంగా దర్శనమిస్తుంది. శివుని శరభేశ్వరునిగానో, శరభేశ్వరమూర్తిగానో కొలుచుకునే సంప్రదాయం తమిళనాట ఇంకా ప్రచారంలోనే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని శైవాలయాలలో కూడా ఈ రూపం కనిపిస్తున్నప్పటికీ, దానిని శరభ అవతారంగా పోల్చుకునే భక్తులు అరుదు. అలాగని శరభ అవతారాన్ని తెలుగువారు గుర్తిచలేదని కాదు. ఈ అవతారం పేరు మీదుగా శరభాపురం వంటి ప్రాంతాలు మన రాష్ట్రాల్లో ఉన్నాయి. వీరశైవులు చేసే నృత్యాలలో శరభ, అశ్శరభ, దశ్శరభ అంటూ ఒళ్లు గగుర్పొడిచే అరుపులు వినిపిస్తాయి. తెలుగునాట శరభ ఉపనిషత్తు కూడా ప్రచారంలో ఉండేదని చెబుతారు.

రాహు,కేతు పూజకై శ్రీ కాళహస్తి

*రాహు,కేతు పూజకై శ్రీ కాళహస్తి* శ్రీకాళహస్తి లోని గుడికి రాహు కేతువుల గ్రహణ సమయం కాలంలో పూజలు జరుగుటకు గల ఆంతర్యమును తెలుపుచున్నాను. ఈ దేవాలయంలో పరమేశ్వరుడు తూర్పు దిశ యందు కూర్చుండి పశ్చిమము చూచుట మనము గమనించ దగ్గ విశేషం. అలాగే పడమర లో అమ్మవారు కూర్చుండి తూర్పు లో ఉన్న ఈశ్వరుని చూచుట గమనించగలము. (ఆది అంతము)( ప్రకృతి పురుషుడు) ఒకరి కొకరు ఎదురెదురుగా ఉండటము . ఈ విషయమును మరొక విధముగా చెప్పదలచుకుంటే రాశి చక్రమూలో రాహువు కేతువు లు ఒకరికొకరు ఎదురెదురుగా ఉంటారు. ఈ దేవాలయములో పరమేశ్వరుని శిరముపై పంచ తలలు కేతు గాను . అమ్మవారు ఏక సిర రాహు గాను పరిగణించ వలెను. ఈ దేవాలయంలో రాహుకాలంలో రాహు కేతువుల పూజ ప్రశస్తము అయితే ప్రతి రోజు రాహుకాలము వచ్చును. కానీ ఆ సమయంలో స్వామివారిని దర్శించుకున్న స్వామి వారి తల పై పంచ నాగులు కేతువు దర్శనము కనపడును. అయితే రాహు గా అమ్మవారిని పరిగణించినపుడు సోమవారము నాడు శుక్రవారం మాత్రమే అమ్మవారికి నడుమునకు అలంకరించ్చే వడ్రాణం రూపంలో రాహు కనబడును . అమ్మవారికి శుక్రవారం రోజున వజ్రాల కిరీటం నడుమునకు ఒక తల నాగుపాము వడ్రాణం గాను బంగారము తో తయారు చేసిన చీర తో అలంకరింపబడును. కనుక శ్రీకాళహస్తి లో సోమవారం శుక్రవారం రాహుకాల సమయంలో మాత్రమే . ఈ విషయమును గమనించి రాహు కేతువుల దోషనిమిత్తము సోమవారం శుక్రవారం రాహుకాలంలో ప్రశస్తమని గమనించగలరు.

23, సెప్టెంబర్ 2020, బుధవారం

ఆహారంలో 5 రకాల దోషాలు

మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి.
1. అర్ధ దోషం
2. నిమిత్త దోషం         
3. స్ధాన దోషం
4. గుణ దోషం   
5. సంస్కార దోషం.

ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు. 

🔸 అర్ధ దోషం

ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు.

భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది. 

హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది , ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు.

తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు.మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు.  

తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు.

వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు. శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు. 

శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు." అని తలవంచుకొన్నాడు.

ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో, తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం. 

🔸 నిమిత్త దోషం
 
మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి.

వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు వంటివి పడ కూడదు.

అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి. 

భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు.

అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు? అని అనుకొన్నది.

ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు
'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను. 

నా స్వీయ బుధ్ధిని ఆ ఆహారం తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం - బిందువులుగా బయటికి పోయి నేను 
ఇప్పుడు పవిత్రుడినైనాను.

నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు.

చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది తినినందు వలన మనిషిలోని మంచి గుణములు నశించి *'నిమిత్త దోషం '* ఏర్పడుతోంది.

🔸 స్ధాన దోషం

ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంటll కూడా పాడైపోతుంది.

యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంతl మంచివి కావు.

దుర్యోధనుడు ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి, ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి,అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను. అని అన్నాడు. 

మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి 

🔸 గుణ దోషం

మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది.

🔸సంస్కారదోషం

ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది.సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని రోగాన్ని తెచ్చి పెడుతుంది.
     
        🍃🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏🍃

20, సెప్టెంబర్ 2020, ఆదివారం

కర్మ సిద్ధాంతం

కర్మ సిద్ధాంతం ఉన్నదని భావిస్తే

మనకు మూడురకాల కర్మలు ఉన్నవి

ఒకటి సంచిత కర్మలు
రెండు ప్రారబ్ధ కర్మలు
మూడు ఆగామి కర్మలు

సంచిత కర్మలు
     అనేక పూర్వజన్మల శరీరమందున్న జీవుడు
సంపాదించిన శుభాశుభ కర్మఫలములలో ఇంకనూ అనుభవించవలసిన కర్మలను సంచిత కర్మలు అంటారు


ప్రారబ్ద కర్మలు:-
సంచిత కర్మల నుండి కొన్ని కర్మల ఫలములు ఈ జన్మలో అనుభవించవలసి ఉంటుంది. ఏ కర్మ ఫలములు అనుభవించుట కొరకై ఈ జన్మ ఇవ్వబడిన దో ఆ కర్మలు ప్రారబ్ద కర్మలు అంటారు. అంటే మనము ఈ జన్మలో అనుభవిస్తున్న ధనధాన్యాలు సంపదలు గాని, దారిద్ర్యము గాని సంతానం విద్య ఉద్యోగము, నిరుద్యోగం కీర్తి ప్రతిష్ఠలు, అవమానములు, సుఖదుఃఖములు ఆరోగ్యము ,రోగములు ఆయుర్ధాయ పరిమాణము అన్ని ప్రారబ్ధ కర్మలు.

ఈ ప్రారబ్ద కర్మలు మూడు విధాలుగా ఉంటాయి
 A దృఢ కర్మలు
 B దృఢ కర్మలు
 C దృఢా దృఢ కర్మలు

3ఆగామి కర్మలు:-
సంచిత కర్మల లో మిగిలిన కర్మఫలముల నిలువ, ప్రారబ్దము నందు కర్మలు చేయగా మిగిలిన కర్మలను అనుభవించుటకు భవిష్యత్తు జన్మలలో అనుభవించవలసిన కర్మ ఫలములు ఆగామి కర్మలు అంటారు. అనగా ఈ జన్మకు ఆగామి కర్మలు మరుసటి జన్మకు సంచిత కర్మలగును. సంచిత కర్మ లో పాప పుణ్య కర్మ ఫలముల నిల్వ ఏమీ లేకుండా ఉన్నచో జీవుడు మరల జన్మ ఎత్తవలసిన అవసరంలేదు. దీనినే మోక్షమనీ జీవుడు బ్రహ్మ స్థితిని పొందుట అని
 కర్మ సిద్ధాంతం 
      *జ్యోతిష శాస్త్రము సంచిత ప్రారబ్ధ ఆగామి జన్మల సంబంధము కలిగి పునర్జన్మ సిద్ధాంతాన్ని బలపరుస్తుంది*
  జ్యోతిష్య శాస్త్రము కర్మ సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతం రుణానుబంధ ప్రభావముల మీద ఆధారపడి ఉన్నదని
కొంతవరక తెలుసుకోగలుగుతున్నాము కర్మలను అనుభవించి తీరవలసిందే!
అయినప్పటికీ *కేవలము గ్రహ నక్షత్రాలు మాత్రమే శుభా శుభ ఫలితాలు ఇవ్వవు*
జీవుడు చేసినటువంటి కొన్ని స్వయంకృత కర్మ ఫలితాలు కూడా తోడవుతాయి

గ్రహములే కారణమైతే
ఒకరికి శుభమును ఇచ్చు గ్రహములు
అదే స్థానములో మరొకరికి అశుభ ఫలితాలను ఎలా ఇస్తాయి?
     కొంత కొంత ఇలా జ్ఞాన పరిశీలన చేస్తే కర్మ సిద్ధాంతము నందలి సత్యం అవగతమవుతుంది!

దీపంలో ఉండే నవగ్రహాలు

*🪔దీపంలో ఉండే నవగ్రహాల అంశలు:*
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
🏴🚩🏴🚩🏴🚩🚩🏴🚩🏴🚩🏴

*దీపపు ప్రమిద సూర్యుడు,*
*నూనె అంశ చంద్రుడు,* 
*దీపం వత్తి బుద్ధుని అంశ*
*వెలిగే దీపం నిప్పు కుజుని అంశ,*
*దీపం జ్వాలలో ఉండే పసుపు రంగు గురువు,*
*దీపం నీడ రాహువు,*
*దీపం నుంచి వెలువడే కిరణాలే శుక్రుడు( ఆశ )*
*దీపం వెలిగించడం వల్ల పొందే మోక్షమే కేతు*
*దీపం కొండెక్కిన తర్వాత మాడిన నలుపు రంగే శని*
🪔🪔🪔🪔🪔🪔🪔🪔

*దీపంలో పంచభూతాల కలయిక ఎలాగంటే ప్రమిదపు మట్టి భూమి గాను నూనె నీరు గా ను అగ్నిజ్వాల నిప్పు గాను దీపం వెలగడానికి కారణమైన ఆక్సిజన్ గాలి గాను దీపపు కాంతిని ప్రసరింపజేసేది ఆకాశంగాను ఇలా పంచభూతాలు దీపంలో ఉన్నాయి.*
🪔🪔🪔🪔🪔🪔🪔🪔

*దానివల్లనే మన పెద్దవాళ్లు ఇంట్లో దీపం వెలిగించి పంచభూతాల నవగ్రహా కలయికతో అష్ట ఐశ్వర్యాలు పొందాలని ఈ విధంగా చెప్పారు..*

గుడి పూజారి వ్యవస్థ

గుడిలో పూజారిని పోషించే వ్యవస్థ కనుమరుగయ్యింది ! కాదు కనుమరుగు చేశారు .
ఇది ఒక పథకం ప్రకారం జరిగింది ! 
.
#గుడిలో పూజారికి కడుపునిండకపోతే ఆ దేవుడు చూపిన వేరే దారి వెతుక్కుంటాడుగానీ పూజారిగా ఉండడు! 
.
#అప్పుడు గుడి ఉండదు దేవుడిపూజలూ ఉండవు!
.
 #మనం గొప్పగా చెప్పుకునే భారతీయ సంస్కృతి అసలే ఉండదు ! ...ఎందుకంటే గుడులే సంస్కారకేంద్రాలు కాబట్టి ! 
.
#పూజారికి కానుకలు వేయవద్దు అని బోర్డులు ! బాగుంది ! 
.
#మరి ఆయనకు జీతమెంత ఇస్తారు ఆలోచించారా ? 
.
#ఎక్కువలో ఎక్కువ 5000 / 
ఆడబ్బుతో పెళ్ళానికి చీరలేకొంటాడా ? 
పిల్లాడికి చదువులేచెప్పిస్తాడా ? 
రోగంరొష్టువస్తే వైద్యమే చేయించుకుంటాడా ? 
.
#అసలు విషయం మరచిపోయా ఇంటి అద్దె కట్టి కడుపునింపుకొని గుడ్డలుకొనుక్కొన్న తరువాత కదా పైన చెప్పినవి ! 
.
#గుడులు ఆదాయకేంద్రాలు కాదు అవి సంస్కారకేంద్రాలు ! అక్కడ పనిచేసేవారి జీవితం జీవనం సుఖసంతోషాలతో ఉంటేనే ! సంస్కృతి సంప్రదాయం నిలబడేది !
.
#పూజారిగారికి దక్షిణ ఇవ్వండి ! వారి జీవితాలలో వెలుగు నింపండి ! అప్పుడే భారతీయసంస్కారాలు పదికాలాలు నిలబడతాయి !
.
#ప్లేటులో వేస్తే లాక్కుంటారు కాబట్టి వారికి దక్షిణ Phonepe, Google pe లలో ఇవ్వండి దాని వాటాకి ఎవ్వరూ రారు

#మనప్రభుత్వలు హుండీలో మనంవేసిన డబ్బులను ఇమామ్ ప్రాస్టర్లకు జీతాలరూపంలో ఇస్తున్నారు గుళ్ళో పనిచేసే పంతుల్లకు శఠగోపం అందుకే హూండిలో వేయకండి పూజారికి మీకు తోచిన సహయం చేయండి!!

*సర్వేజనసుఖీనోభవంతు*
#jaisanatanaDharm

శయన నియమాలు

శయన నియమాలు
పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు:-

1. *నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో* ఒంటరిగా పడుకోవద్దు. *దేవాలయం* మరియు *స్మశానవాటికలో* కూడా పడుకోకూడదు.( *మనుస్మృతి*)

2పడుకోని ఉన్న వారిని *అకస్మాత్తుగా* నిద్ర లేపకూడదు. ( *విష్ణుస్మృతి*)

3. *విద్యార్థి,నౌకరు,మరియు ద్వారపాలకుడు* వీరు అధిక సమయం నిద్రపోతున్నచో,వీరిని మేల్కొలపవచ్చును.( *చాణక్య నీతి*)

4. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం *బ్రహ్మా ముహూర్తం* లో నిద్ర లేవాలి.( *దేవీ భాగవతము*).పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు.( *పద్మ పురాణము*)

5. *తడి పాదము* లతో నిద్రించవద్దు. పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి (ధనం)ప్రాప్తిస్తుంది.( *అత్రి స్మృతి*)
 విరిగిన పడకపై,ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం.( *మహాభారతం*)

6. *నగ్నంగా, వివస్త్రలులై* పడుకోకూడదు.( *గౌతమ ధర్మ సూత్రం*)

7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన *విద్య*,పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన *ప్రబల చింత*,ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన *హాని,మృత్యువు*,ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించిన చో *ధనము,ఆయువు* ప్రాప్తిస్తుంది.( *ఆచార మయూఖ్*)

8. *పగటిపూట* ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ *జ్యేష్ఠ మాసం*లో 1 ముహూర్తం(48నిమిషాలు) నిద్రిస్తారు.(పగటిపూట నిద్ర రోగహేతువు,మరియు ఆయుక్షీణత కలుగచేస్తుంది)

9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు.( *బ్రహ్మా వైవర్తపురాణం*)

10.సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు3 గంటల) తరువాత నే *పడుకోవాలి*

11.ఎడమవైపు పడుకోవడం వలన *స్వస్థత* లభిస్తుంది.

12.దక్షిణ దిశలో *పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు* *యముడు మరియు దుష్ట గ్రహము* ల నివాసము వుంటారు.దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. *మెదడుకు రక్త సరఫరా* మందగిస్తుంది. *మతిమరుపు* *మృత్యువు* లేదా
*అసంఖ్యాకమైన రోగాలు* చుట్టుముడుతాయి.

13.గుండెపై చేయి వేసుకుని, *చెత్తు యొక్క బీము* కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.

14.పడక మీద *త్రాగడం- తినడం* చేయకూడదు.

15. పడుకొని *పుస్తక పఠనం* చేయడానికి వీల్లేదు. ( పడుకొని చదవడం వలన *నేత్ర జ్యోతి* మసకబారుతుంది.)

*ఈ పదహారునియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి,మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు*

 ఈ సందేశం ప్రతి ఒక్కరికి చేరవేయండి......మీతో పాటు అందరికీ లాభాన్ని చేకూర్చాలి..

19, సెప్టెంబర్ 2020, శనివారం

ఎంగిలి దోషం

🙏🙏🙏🙏🙏ఎంగిలి దోషం.🌹🌹🌹🌹🌹
మన పూర్వీకులు అందించిన ఆరోగ్య సూత్రాలలో ఒకటి 'ఎంగిలి దోషం' అంటకుండా జాగ్రత్త పడటం. ఇతరులు తినగా మిగిలినది, లేదా ఇతరులు తింటున్న సమయంలో వారి దగ్గరి నుంచి తీసుకుని తినడం ఎంగిలి. ఒకరి ఎంగిలి ఇంకొకరు తినడం మహాపాపం అన్నారు. 🙏

ఎంగిలి చాలా ప్రమాదకరం, ఒకరి ఎంగిలి మరొకరు తినడం, తాగటం వలన సూక్ష్మక్రిములు వ్యాపించి అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ముమ్మరంగా ఉంటుంది. ఒకే కంచంలోని🍽️🥣 ఆహారం ఇద్దరు ముగ్గురు కలిసి తినడం, ఓకే సీసాలోని 🥛నీటిని నలుగురైదుగురు ఒకరి తరువాత ఒకరు తాగటం మొదలైనవన్నీ ఎంగిలి దోషాలే. 🌱

ఇంతెందుకు ! స్వయంగా సీసాలోని🧂 నీటిని సగం తాగి పక్కన పెట్టి ఐదు నిమిషాల తర్వాత మిగిలిన సగాన్ని తాగితే కూడా ఎంగిలి దోషం అంటుతుందట , అంటే స్వంత ఎంగిలి కూడా మనకు పనికి రాదు అని అర్థం.. 🌱

పెద్దలు, పూజ్యులు, గురువుల ముందుకు వెళ్ళినప్పుడు నేరుగా మాట్లాడరు. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని మాట్లాడతారు. అది కనీసం మర్యాద. పొరపాటున కూడా పెద్దలు, గురువుల మీద మాటల సమయంలో ఉమ్ము పడకూడదు. 

పసిపిల్లలకు కూడా ఎంగిలి ఆహారం పెట్టకూడదు. ఉపనయనంలో హోమం సందర్భంలో కొన్ని మంత్రాలు వస్తాయి. అందులో ఇంతకముందు నేను ఎంగిలి తినడం వలన ఏదైనా పాపం వచ్చివుంటే అది శమించుగాక అని ప్రాయాశ్చిత్తం చేయిస్తారు. ఇక ముందు తినను అని అగ్నిదేవునకు🔥 వటువుతో చెప్పిస్తారు. 

ఐదువేళ్ళతో నోటిలో నమలడానికి సరిపోయేటంత ఆహారం మాత్రమే స్వీకరించాలి. నోట్లోకి ఎక్కువ ఆహారం తీసుకుని, అది నమలలేక, తిరిగి కంచంలో పెట్టడం దోషమని శాస్త్రం చెప్తుంది. 

పూర్వం మన ఇళ్ళలో ఎవరి కంచాలు, 🍽️చెంబులు వారికే ఉండేవి (ఇప్పుడు కూడా కొంతమంది ఇళ్ల లో ఉన్నాయి). అతిథులు వచ్చినప్పుడు, వారికి వేరే పాత్రలలో ఇచ్చేవారు. ఒక 50 ఏళ్ళ క్రితం వరకు పేదవారి ఇళ్ళలో కూడా వెండి కంచాలు🍽️🍽️, చెంబులు ఉండేవి. వెండి అనేది చాలాశాతం క్రిములను తన ఉపరితలం మీద నిలువనీయదు. అది వాటిని నశింపజేస్తుంది. ఇంకొన్ని ఇళ్ళలో అయితే వెండి కంచంలో బంగారు పువ్వు వేసి ఉండేది. అప్పుడా కంచానికి ఎంగిలి దోషం ఉండదని చెప్పేవారు. ఇప్పుడు కూడా వెండి క్రిమిసంహారకమని శాస్త్రవేత్తలు ఋజువు చేస్తున్నారు. ఇప్పుడు మీకు అర్ధమైందా మనము పూజల్లో వెండి వస్తువులకు ప్రాధాన్యం ఎందుకు ఇస్తామో ?! 🌿

వంట వండే సమయంలో సైతం మనవాళ్ళు మడి కట్టుకుని మౌనంగా ఉండటంలో ఇది కూడా ఒక కారణం. మాట్లాడితే పొరపాటున నోటి తుంపరలు వండే ఆహారంలో పడి అవి ఎంగిలి అవుతాయని భయం. 

కొందరు ఈనాటికి నిత్యపూజకు మడి నీళ్ళు పడితే చాలామంది వరలక్ష్మీ వ్రతం, వినాయకచవితి మొదలైన పర్వదినాలప్పుడు, పితృకర్మలు చేసే రోజుల్లో మడి కట్టుకుని నీళ్ళు పడతారు. ఆ దైవకార్యం పూర్తయ్యేవరకు ఆ నీటిని వేరే పనులకు వాడరు, అశుభ్రంగా ముట్టుకోరు.🙏 

ఎంగిలి చేసిన అన్నాన్ని ఆవు, కుక్క, కాకి మొదలైన జీవాలకు కూడా పెట్టడం దోషమని చెప్తారు. ఆహారం (అది ఏదైనా సరే) పడేయకూడదు. అలాగని ఎంగిలి చేసి ఇతరులకు పెట్టకూడదు. ఎంతకావాలో అంతే వడ్డించుకుని తినాలి. ఆహారం వృధ చేస్తే వచ్చే జన్మలో ఆహారం దొరక్క బాధపడతారు. 🙏

ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో కరోనా ఉన్నది కనుక  నోటిద్వారా తుంపరలు వ్యాపించకుండా జాగ్రత్త వహించమని ఈ ఎంగిలిదోషాన్ని నిర్వచిస్తున్నారు. 

ఎంగిలి దోషం అంటని మూడు పదార్థాలు ఈ లోకంలో ఉన్నాయి.

1. చిలక కొరికిన పండు,
2. తేనెటీగ నోటిద్వారా తయారైన తేనె.
3 దూడ తాగిన తర్వాత పిండినటువంటి ఆవుపాలు. వీటిని చక్కగా దేవుని అభిషేకానికి వాడవచ్చు, మనమూ సేవించవచ్చు.

వేద సంస్కృతి వల్ల మనకు లభించిన పూర్వ ఆచారాలను మన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్ధి కోసం పాటిద్దాం.  🌹🌹🌹🌹🌹సర్వే జనాః సుఖినో భవంతు .

18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

దానం గురించి చిన్న కథ

🙏ఒక చిన్న కథ_🙏

ఇంటి గుమ్మం ముందు కూర్చుని అమ్మ బియ్యంలో రాళ్లు ఏరుతూ, కొడుకు చదువుతూ ఉన్నారు.
అక్కడకు ఆకుకూరలు🍃🌱 అమ్ముకుంటూ ఓ ఆవిడ వచ్చారు.
ఆకుకూర 🌿🌱కట్ట ఎంత అని అడగగా ఐదు రూపాయలు అమ్మగారు అన్నది అమ్మే ఆవిడా. 
నాలుగు కట్టలు తీసుకుంటా మూడు రూపాయలు కట్ట చేసివ్వు అని బేరమాడింది కొనాల్సిన ఆవిడ

బేరం కుదరక ఆవిడ తన గంప🍚 తీసుకుని నాలుగు అడుగులు వేసి మళ్ళీ వెనక్కు తిరిగి అమ్మగారు నాలుగు చేసుకోండి అని,
ఈవిడ కుదరదు మూడంటే మూడే అన్నది.
సరే అని ఆవిడ ఇచ్చేస్తూ మళ్ళీ తన దారి పట్టాలని లేవగా కాస్త కాలు జారింది. 

ఎంటమ్మాయి తిండి తినలేదా అని కొన్న ఆవిడ అడగగా,
లేదమ్మగారు ఇవన్నీ అమ్మేసి వెళ్లి వండుకు తినాలి అని చెప్పింది. 

సర్లే గంప దించి రా తినివెల్దువు అని పిలిచి ఇంట్లో నుండి ఆరు ఇడ్లిలు తెచ్చి ఇచ్చింది తినమని.

తిన్నాక తన గంప 🍚తీసుకుని తాను వెళ్లిప్పోయాక, ఇవన్నీ గమనిస్తున్న కొడుకు అమ్మను ఒక ప్రశ్న వేసాడు.

అమ్మ కూరాకు బేరం ఆడవు, అది ఐదు రూపాయలే నాలుగు కట్టలు ఇరవై రూపాయలే కానీ నువ్వు ఆరు ఇడ్లిలు ఊరకనే పెట్టావు. ఒక్కో ఇడ్లి ఐదు రూపాయలు ముప్పై రూపాయలు అవుతుంది అని అన్నాడు.

అందుకు అమ్మ చూడు కన్నా ...
*బేరంలో దానధర్మాలు ఉండకూడదు* 
*దానంలో వ్యాపారం చూడకూడదు* అని
వ్యాపారములు వ్యాపారం గానే చూడాలి.🙏

 ఎంత మంచి మాట!

తిరుపతి దేవస్థానం లో ప్రసాదాలు

సమస్త జీవరాశికి ఎప్పుడు ఎప్పుడు, ఏమి కావాలన్న విషయం విష్ణువుకు తెలుసు. అందువల్లే ఆయన్ను స్థితి కారకుడు అంటారు. ఆ విష్ణువు రూపమైన వేంకటేశ్వరుడికి నైవేద్యం సమర్పించడం అంటే సష్టిలో ఆకలితో ఉన్న సమస్త జీవులను సంతృప్తి పరచడమేనని మన పురాణాల్లో చెప్పబడింది. కలియుగ దైవంగా తిరుమల కొండ పై కొలువై ఉన్న ఆ వేంకటేశ్వరుడికి నిత్యం మూడు పూటలా నైవేద్యాన్ని సమర్పిస్తారు. తిరుమల గర్భగుడిలో స్వామి వారి మూల విగ్రహం ఎత్తునకు అనుగుణంగా స్వామి వారికి ఏ పూట ఎంత పరిమాణంలో నైవేద్యం సమర్పించాలన్న విషయం శాస్త్రంలో స్పష్టంగా నిర్దేశించారు. అదే సమయంలో ఏ సమయంలో ఏ ఏ రకాల నైవేద్యం సమర్పించాలన్న విషయం కూడా శాస్త్రంలో పేర్కొన్నారు. ఆ నైవేద్యానికి సంబంధిచిన వివరాలతో పాటు నైవేద్యం సమయంలో ఎటువంటి ఆచారాలు పాటిస్తారన్న విషయానికి సంబంధించిన వివరాలు 
బాలభోగం ఇలా   సాధారణంగా తిరుపతి అనగానే లడ్డు మనకు గుర్తుకు వస్తుంది. అయితే ఈ లడ్డుతో పాటు స్వామివారికి మూడు పూటలా వివిధ రకాల పదార్థాలను స్వామివారికి నైవేద్యం పెడుతారు. అటు పై ఆ నైవేద్యాన్ని భక్తులకు పంచుతారు. ఈ మూడు పూటల్లో ఉదయం ఆరు గంటల నుంచి ఆరున్నర గంటల మధ్య సమర్పించే నైవేద్యాన్ని బాలభోగం అంటారు. ఇందులో మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కర పొంగలి, రవ్వకేసరి ఉంటుంది. 
రాజభోగం 
మధ్యాహ్నం సమర్పించే నైవేద్యాన్ని రాజభోగం అంటారు. ఇలా ఇది పది నుంచి పదకొండు గంటల మధ్య ఉంటుంది. ఇందులో శుద్ధాన్నం, పులిహోర, గుడాన్నం, దద్యోజనం, శీర లేదా చక్కెరన్నం ఉంటుంది. ఇక రాత్రి స్వామివారికి నివేదించే నైవేద్యాన్ని శయన భోగం అంటారు. ఇందులో మరీచ్య అన్నం (మిరియాల అన్నం) దోసె, లడ్డు, వడ తో పాటు వివిధ కూరగాయలతో కలిపి వండిన అన్నాన్ని సమర్పిస్తారు. దీనినే శాకాన్నం అని పిలుస్తారు. 
శయనభోగం 
రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య సమర్పిస్తారు. మూడు పూటలతో పాటు స్వామివారికి అల్పాహారాలు కూడా సమర్పిస్తారు. ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన తర్వత అప్పుడే తీసిన చిక్కని ఆవుపాలు సమర్పిస్తారు. తోమాల, సహస్రనామ అర్చన సేవల తర్వాత నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం ఇస్తారు. తర్వాత బాలభోగం సమర్పిస్తారు. దీంతో ప్రాత:కాల ఆరాధన పూర్తవుతుంది. అటు పై సర్వదర్శనం మొదలవుతుంది. రాజభోగం అష్టోత్తర శతనామ అర్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్లీ సర్వ దర్శనం ప్రారంభమవుతుంది. సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయాన్ని శుద్ధి చేసి స్వామివారిని తాజా పూలతో అలంకరిస్తారు. అష్టోత్తర శతనామ అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. అర్థరాత్రి తిరువీశం పేరుతో బెల్లపు అన్నం అందజేస్తారు. అటు పై ఏకాంత సేవలో భాగంగా నేతితో వేయించిన బాదం, జీడిపప్పులు, తాజా పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి సమర్పిస్తారు. 
అన్నీ ఆగమశాస్త్ర ప్రకారమే
 ఇక నైవేద్యాలను ఎలా వండాలి, ఎవరు వండాలి అన్న విషయంతో పాటు ఆ సమయంలో ఎలా ఉండాలన్న విషయం మొత్తం ఆగమశాస్త్రంలో సవివరంగా పేర్కొన్నారు. నైవేద్యం వండే సమయంలో వాసన సోకకుండా నోటికి, ముక్కుకు అడ్డుగా వస్త్రం పెట్టుకొంటారు. స్వామికి సమర్పించేదాకా బయటివారు ఎవరూ నైవేద్యాన్ని కనీసం చూడటానికి కూడా అనుమతించరు. నైవేద్యాన్ని సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్లతో శుద్ధి చేస్తారు. అటు పై నైవేద్యం పెట్టే సమయంలో అర్చకుడు మాత్రమే ఉంటారు. విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు నైవేద్యం పై గ్రాసముద్రతో ప్రసాదన్ని తాకి దానిని స్వామి కుడిచేతికి తాకించి, నోటి దగ్గర తాకుతారు. పవిత్ర మంత్రాలు ఉచ్చరిస్తూ అన్నసూక్తం పఠిస్తారు. ముద్దముద్దకీ మధ్య ఔషద గుణాలున్న వివిధ పత్రాలు కలిపిన నీటిని కూడా సమర్పిస్తారు. నైవేద్యం సమర్పించేత వరకూ ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది.
51 లడ్డూలను ఒక ప్రోక్తం అంటారు. ఒక్కోసారి వెయ్యి ప్రోక్తాలను తిరుమలలో తయారు చేస్తారు. అంటే 51వేల లడ్డూలన్న మాట. ఇందుకుగాను 2వేల కిలోల శనగ పిండి, 4వేల కిలోల చక్కెర, 1850 కిలోల నెయ్యి, 350 కిలోల జీడిపప్పు, ఎనభై ఏడున్నర కిలోల ఎండుద్రాక్ష, 50 కిలోల యాలకులు, 50 కిలోల కలకండ అవసరమవుతాయి.
వివిధ నైవేద్యాలు
తిరుమలలో విజయనగర సామ్రాజ్య కాలం నాటికే రోజుకు వందకు పైగా నివేదనలు చేసే పద్ధతి ఏర్పడిపోయింది. వందలాది మంది దాతలు అనేక పదార్థాల నివేదనకు ఏర్పాట్లు చేయడంతో ఎన్నెన్నో నైవేద్యాలు స్వామివారికి నివేదిస్తూవుంటారు. వీటిలో కొన్నిటిని ప్రసాదంగా భక్తులకు పంచిపెట్టడమో, అమ్మడమో చేసే పద్ధతి ఉంది. స్వామి వారి కైంకర్యాలు, ఉత్సవాలు నిర్దుష్టంగా ఈస్టిండియా కంపెనీ పాలనా కాలంలో సవాల్ జవాబ్ పట్టీలో నిర్దేశించడంతో, తిరుమల తిరుపతి దేవస్థానం దానని ప్రమాణంగా తీసుకుని ఈ నివేదనలు కొనసాగిస్తోంది.
వేర్వేరు నైవేద్యాల పేర్లు ఇలా ఉన్నాయి:
అన్న నైవేద్యాలు
• సంధి తిరుప్పానకం
• తిరుప్పానకం
• రజన తిరుప్పానకం
• వెళ్ళై తిరుప్పానకం
• అర్ధనాయకతళిగ
• నాయికతళిగ
• దద్దోజనం (దధ్యోజనం)
• మట్టిరాయ్ తళిగ
• తిరుప్పావడ (పులిహోర లాంటి పదార్థం)
• తిరువలక్కం
• తిలాన్నం
• అక్కలిమండై
• పంచవాహి - పవిత్ర అన్నం
భక్ష్యాలు
• అప్పపడి - అప్పాలు
• అతిరసపడి - అరిసెలు
• వడైపడి - వడ
• గోధిపడి - వడ వంటిది
• సుఖియాన్‌పడి
• ఇడ్డిలీపడి - ఇడ్లీ
• సిడైపడి
• ప్రోదిలింగైపడి
ఇతర పదార్థాలు
• పోరిపడి - అటుకులు
• తిరుక్కనమడై లేక మనోహరపడి - మినపలడ్డు (సున్నుండ లాంటిది)
• పారుప్పువియలు - గుగ్గిళ్ళు
• తిరుప్పయ్యారం - మినపవడ (పొట్టు ఉన్న మినుములతో చేస్తారు)
• అవల్‌పడి - గట్టి అటుకులు
• తెరకులాల్
ఇతర తినుబండారాలు
• మాత్ర
• బెల్లం
• పంచదార
• రకరకాల పళ్ళు
• వేయించిన జీడిపప్పు
• బాదం
• మినపసున్ని
• జిలేబీ
• దోసె
• వేయించిన నువ్వుల పొడి
• కజ్జాయం పాలు
• పెరుగు
• వెన్న
• తాంబూలం

కర్మలు, కర్మ ఫలాలు


      _*👌*కర్మలు, కర్మ ఫలాలు, గత జన్మ కర్మఫలం.. అనే వీటితో బంధం, అనుబంధం, ఋణాను బంధము.. అనే వీటికి ఉన్న సంబంధం ఏమిటి? పిల్లలు కలగడం గతజన్మ ఋణాను బంధం అంటూ ఉంటారు. వీటన్నింటి వివరాలను ఒకసారి కూలంకషంగా పరిశీలిద్దాం..*_👌

       _**కంటితో చూసినా, చేత్తో చేసినా, కాలితో చేసినా, మనసుతో ఆలోచించినా వీటన్నింటినీ కర్మలు అంటారు. ఆ చేసేవి మంచి పనులైతే వాటిని ఉత్తమ కర్మలని, చెడు పనులైతే చెడు కర్మలని అంటారు. వీటిలో ఏవి చేసినా వాటికి తప్పక ఫలితం వస్తుంది. దానినే కర్మఫలం అంటారు. తెలిసి చేసినా, తెలియక చేసినా కర్మఫలం తప్పకుండా అనుభవించ వలసినదే. అది ఉత్తమ కర్మఫలం అయినా, చెడు కర్మఫలం అయినా మన ఖాతాలో జమ అవుతూ ఉంటాయి. ఇవి తక్కెడ లోని బరువును తూచి నట్లుగా ఒకటి పెరిగితే మరొకటి తగ్గుతుంది. ఒకటి తగ్గితే మరొకటి పెరుగుతుంది. అలా నీ జీవితం ముగిసే సమయానికి ఏది నీ ఖాతాలో ఎక్కువగా జమై ఉంటే దాన్ని బట్టి నీకు మరుజన్మలో ఆ స్థాయిలో మనిషిగానో, మరొక జీవిగానో జన్మించి ఆ గత జన్మ కర్మ ఫలాలను అనుభవించిన వలసి ఉంటుంది.*_

     _**గతజన్మ ఉత్తమ కర్మలే ఈ జన్మలో సుఖ శాంతులు. గతజన్మ చెడు కర్మలే ఈ జన్మలో అష్టకష్టాలు, రోగాలు, రొస్టులు.. గత జన్మలో నీవు తెలిసి తెలియక చేసే తప్పులు కూడా బంధాలు అవుతాయి. ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు. ఆ ఇచ్చి పుచ్చుకునే ఋణాలు తీరగానే వారు మనకు దూర మవడమో లేక మరణించడమో జరుగుతుంది.*_

      _**ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు. కష్టసుఖాలకు స్పందన, ప్రతి స్పందనలు ఉండవు. ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే.. మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గానో తారసపడతారు. ద్వేషం కూడా ఒక బంధమే. పూర్వజన్మలో మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగానో లేదా సంతానంగానో ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు.*_

      _**మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసే వారిగానో ఎదురవుతారు. మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులు గానో, సహాయకులు గానో ఎదురవుతారు. దీనికి ఒక ఉదాహరణగా ఒక అమ్మవారి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు. ఆ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు. కానీ తను సౌకర్య వంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని బిక్షగాడి జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచ లోనో పడుకుంటూ, ఆలయం లో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు.*_

      _**తన సంపాదనతో ఇద్దరి కొడుకులను పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నాడు. ఒకసారి తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహాను భావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు. పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా వారికి తిరిగి ఇవ్వలేదు. అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను బాధలు పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు అని చెప్పాడు. ఇక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక ఉదాహరణ..*_

      _**ఒకసారి ఒక మహర్షి బస చేసిన అతిథిగృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన ఎంగిలి విస్తరాకుల కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోటీపడుతూ పోట్లాడు తున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, స్వామి ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని. ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకనే వారు ఈ జన్మలో ఆహారం కోసం ఇలా పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు. నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు మహర్షి..*_

     _**ఒకసారి శ్రీ విద్యా ప్రకాశా నందగిరి స్వామి వారు బందరుకి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే, ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడుగుతే, పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెప్పాడు. అప్పుడు మలయాళ స్వామి వారు నువ్వు మోయగలిగి ఉండికూడా ఈ జన్మలో నీ మిత్రుడు చేత నీ సంచీని మోయిస్తే వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది అన్నారు. ఇలాంటివి మనము కూడా తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం.*_

      _**మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో, గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించిన వన్నీ కర్మ బంధాలయి జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి. కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన వస్తువులను మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే నాకు ఫలానా వస్తువులు తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం. అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన జీవిత కాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాలలో చిక్కుకుపోతూ ఉంటాము.*_

     _**ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం. అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితాన్ని ఈ జన్మలో కాక పోయినా వచ్చే జన్మలో నైనా తప్పకుండా అనుభవించ వలసిందే, తప్పించుకొనే అవకాశమే లేదు.. అందుకే మిత్రులారా ! అందరూ ఉత్తమ కర్మలనే ఆచరించి కర్మరాహిత్యాన్ని పొంది, మరొక జన్మలేని జన్మరాహిత్యాన్ని పొంది, ముక్తిని మోక్షాన్ని పొంది ఆ భగవంతుడిలో ఐక్యమౌతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.. శుభం భూయాత్.*_👌

_*🤘*సర్వే జనా సుఖినోభవంతు**_🤘

       _*👌*ధర్మో రక్షతి రక్షతః **_👌

       _**For Every Action Equal &*_   
             _*Opposite Reaction**_        

                                       

కోడలి గొప్పతనం గురించి

♦️*కొడుకు పెట్టె పిండాలకన్నా.... కోడలు పెట్టే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.* అది....కోడలి గొప్పతనం....    ♦️
♦️*కూతురా కోడలా ఎవరు ప్రధానం...???అనే ప్రశ్నకు 'కోడలే' అని సమాధానం చెపుతుంది భారతీయ ధర్మం...*—ఎందుకోతెలుసా...!!!♦️
♦️చీర మార్చుకున్నంత సులవుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ 'త్యాగశీలి' కోడలు...!!♦️
♦️కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే 'గుణశీలి' కోడలు..!!♦️
♦️తండ్రికి పంచభక్ష్యాలు పెట్టగలిగే స్తోమత ఉన్నా భర్త పెట్టే పచ్చడిమెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల 'భాగ్యశీలి' కోడలు...!!♦️
♦️తాను మెట్టినింటి పట్టపురాణి. అయినా సరే ఒక దాసిలా అందరికీ సేవచేసి అలసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరచి మరునాడు ఉదయమే గృహ సేవకు సిద్ధమయ్యే 'శ్రమజీవి' కోడలు...!!♦️
♦️కుడికాలు పెట్టి కోడలు తన ఇంటిలోకి రాగానే, అమ్మ కోసం బెంగపెట్టుకున్న పసివాడిలా ఎగిరి గంతులేస్తాడు ఆ కోడలి మామ గారు. ఎందుకోతెలుసా రేపట్నుంచి అందరికీ అన్నం పెట్టే అమ్మే కదా! కోడలు..!!♦️
♦️కొడుకు పెళ్ళికోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం *నాంది శ్రాద్ధం* పెట్టి, మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్పకోడలిని ఎంచుకున్నాను అని గర్వంతో చెపుతాడు మామయ్య.ఎందుకంటే కోడలే అత్తింటికి అసలు కాంతి..!!♦️
♦️ఏ ఇంట కొడలిని తక్కువ చేసి కూతురిని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్న బుచ్చుకుని వెళ్ళి పోతుంది, ఎందుకో తెలుసా...?? కోడలే గృహలక్ష్మి...!!!....... అందరు ఆనందంగా ఉండాలి....

అధిక మాసం లో ఆచరింవలసిన విధులు

అధిక మాసం లో ఆచరించవలసిన విధులు
అధిక మాసం లో ఆచరించవలసిన విధులు 

సూర్యుడు నెలకు ఒక రాశి చొప్పున సంవత్సరానికి 12 రాశుల్లో సంచరిస్తాడు. అయితే ఒక రాశి నుండి వేరొక రాశి కి సూర్యుడు ప్రవేశించడాన్ని సంక్రమణ మని అంటారు. సూర్యుని సంక్రమణం జరగని శుద్ద పాడ్యమి నుండి అమావాస్య వరకు గల నెల రోజులను "అధిక మాసమని" అంటారు. 

ప్రతిసారి వచ్చిన అధిక మాసం మొదలుకొని 30 మాసాలకు పైన తిరిగి అధిక మాసం వస్తుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఈ మాసం లో ప్రత్యేకమైన ఫలాన్ని ఆశించి చేసే విధులు నిషిద్దం. నిత్య కర్మలు యధావిధిగా ఆచరించవచ్చు. ఈ మాసం లో పరమాత్ముడైన పురుషోత్తముడిని ప్రతి రోజు విధిగా అర్చించి పూజించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. పురాణ ప్రవచనాలు వినడం, జరిపించడం ప్రత్యేకించి భవద్గీత పారాయణ చేయడం, దేవాలయాలని పుణ్య తీర్ధాలని దర్శించడం మంచిది. ఈ సమయం లో శ్రీ మహావిష్ణువు ని తులసి దళాలతో పూజించి, అభిషేకాది పుణ్య కార్యాలు నిర్వహించడం విశేష ఫలితాన్నిస్తుంది.

శక్తి కొలది దాన ధర్మాలు, ఆరోగ్యం సహకరిస్తే ఒంటి పూట భోజనం చేయడం , విస్తరాకులో భుజించడం, ముఖ్యం గా సాత్విక ఆహారం తీసుకోవడం, నేల పై నిద్రించడం, సూర్యోదయానికి ముందే లేచి, స్నానాది కార్యక్రమాల అనంతరం నిత్య కర్మలు, భగవన్నామస్మరణ చేయడం, అధికమాస వ్రతమాచరించడం, బ్రాహ్మణులని సత్కరించడం పుణ్యదాయకం.
    

  

16, సెప్టెంబర్ 2020, బుధవారం

నవగుంజర ఇది ఎప్పుడైనా విన్నారా???? ఇది ఇక జంతువు, ఇది 9 జంతువులుగా మారగలదు, కనిపించగలదు. మహాభారతంలో దీని పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. విష్ణుమూర్తి అవతారం అయిన మృగంగా ఇది వస్తుంది. ఎవరైతే విశ్వరూప దర్శనం అర్జునుడికి ఇచ్చారో ఆ పరమాత్మ గీతలో కూడా చెప్పబడింది. ఒడియాలో మహాభారతాన్ని Poet సరళదాసగారు రాశారు. అందులో ఈ నవగుంజర యొక్క గోప్పత్తనాన్ని వర్ణించాడు. ఒకప్పుడు, ఎప్పుడైతే అర్జునుడు ఒక కొండ మీద తపస్సు చేయగా అప్పుడు విష్ణుమూర్తి ఈ నవగుంజర రూపం లో ప్రత్యక్షమయ్యాడు. నవగుంజర అనేది ఇలా ఉంటుంది.దీని తల కోడిలాఉండి, మొత్తం నాలుగు కాళ్లతో ఉంటుంది. అందులో మూడు కాళ్ళ మీద నిలబడి ఉంటుంది. ఆ కాళ్లు ఎలా ఉంటాయంటే, వరుసగా ఏనుగు కాలు, పులి కాలు, గుర్రంకాలు, నాలుగవ కాలు మాత్రం ఒక మనిషి చేతిగా మారి ఒక చక్రాన్ని పట్టుకున్నట్టు ఉంటుంది. దాని మెడ నెమలి మెడలా, తల పైభాగంలో ఒక దున్నపోతులా, పూర్తి వెనక భాగం ఒక సింహములా దాని తోక పాములా ఉంటుంది. దీనినే నవగుంజర అంటారు.... మంచి విషయాలు అందరికీ తెలుపుదాం, జ్ఞానాన్ని పంచుదాం.

ఈ పదములు చూడండి. తెలుగులో తప్ప ఎక్కడా ఇన్ని పదములు అర్ధవంతముగా వుండవు. మనం చాలా పదప్రయోగాలు పుస్తకాలు చదివే అలవాటు తప్పిపోతూ మర్చిపోతున్నాం. 1. కలకల 2.కిలకిల 3.గలగల. 4.విలవిల. 5.వలవల. 6.మలమల. 7.వెలవెల. 8.తళతళ. 9.గణగణ. 10.గునగున 11.ధనధన. 12.ఝణఝణ. 13.కణకణ. 14.గడగడ. 15.గుడగుడ. 16.దడదడ. 17.కిటకిట. 18.గటగట. 19.కటకట. 20.పటపట. 21. కితకిత 22.గిలి గిలి. 23.కిచకిచ. 24.జిబ జిబ. 25.చక చక. 26.పక పక. 27.మెక మెక 28.బెక బెక. 29.నకనక. 30.చురచుర. 31.చిరచిర. 32.బిరబిర. 33.బుర బుర. 34.పరపర. 35.జరజర. 36.కర కర. 37.బరబర. 38.చర చర. 39.గజగజ. 40.తపతప. 41.టపటప. 42.పదపద. 43.గబగబ. 44.గుసగుస.. 45.కువకువ.. 46.ఠవఠవ 47.చిమచిమ. 48.గురగుర. 49.కొరకొర. 50.భుగభుగ. 51.భగభగ. 52.ఘుమఘుమ. 53.ఢమఢమ. 54.దబదబ. 55.కుహుకుహు. అందుకే....... దేశ భాషలందు తెలుగులెస్స..

*||మహాలయ పక్ష తర్పణం||* !!దీపారాధన!! ఆచమ్య.... పవిత్రం ధృత్వా...... (పవిత్రవంతః....తత్తథ్సమాశత).... పునరాచమ్య........... ప్రాణానాయమ్య... గోవింద.. గోవింద.. గోవింద..... మహావిష్ణోరాజ్ణయా........పుణ్యతిథౌ.. (ప్రాచీనావీతి)అస్మత్ పితుః పితౄణాం అక్షయ పుణ్య లోక ఫలావాప్త్యర్థం. కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచమాపర పక్షే కర్తవ్య సకృన్మహాలయాఖ్యాన్న శ్రాధ్ధ ప్రతినిధి తిల తర్పణాని(సవ్యం)కరిష్యే..... (ప్రాచీనావీతి) దక్షిణాభిముఖో భూత్వా....) కేవలం గతించిన వారికి మాత్రమే.. ఇవ్వాలి... అలా గతించిన వారికి ఇవ్వడంలో కూడా!? ఒకవరస ఉంటుంది కావున ఆవరస క్రమంలో ఇవ్వడం జరిగింది.. (యథావియోగం) శ్లోకం - ఆదౌ పితా తథా మాతా సాపత్నీజననీ తథా! మాతామహస్సపత్నీక:ఆత్మపత్నిస్త్వనంతరం! సుత భ్రాతృ పితృవ్యాశ్చ మాతులాస్సహభార్యకా:! దుహితా భగినీ చైవ దౌహిత్రో భాగినేయక:! పితృస్వషా మాతృస్వషా జామాతా భావుక స్నుషా! శ్వశుర స్యాలకశ్చైవ స్వామినో గురు రిక్థిన:!! =================== *1) పితరం..* (తండ్రి) *గోత్రం....శర్మాణం..వసురూపం..*స్వధానమస్తర్పయామి..3 మారులు* *2) పితామహం..* (తాత /తండ్రితండ్రి ) *గోత్రం... శర్మాణం.. రుద్రరూపం..* *స్వధానమస్తర్పయామి 3 మారులు* *3)ప్రపితామహం.* (ముత్తాత/తండ్రితాత) *గోత్రం...శర్మాణం... ఆదిత్య రూపం..స్వధానమస్తర్పయామి 3మారులు* [ఉదాహరణకు - సుబ్బాయమ్మ దాం అంటే సరిపోతుంది]👇 అలా ఇవ్వడం జరిగింది... *4) మాతరం* (తల్లి) *గోత్రాం...దాం..వసురూపాం స్వధానమస్తర్పయామి 3 మారులు* *5) పితామహీం* (నానమ్మ) *గోత్రాం..దాం..రుద్రరూపాం స్వధానమస్తర్పయామి 3 మారులు* *6) ప్రపితామహీం* (నానమ్మ గారి అత్త) *గోత్రాం.. దాం..ఆదిత్యరూపాం* *స్వధానమస్తర్పయామి 3 మారులు* *7) సాపత్నిమాతరం* (సవితి తల్లి) *గోత్రాం....దాం...వసురూపాం స్వధానమస్తర్పయామి 3 మారులు* *8)మాతామహం* (తాత అనగా!? తల్లి గారి తండ్రి) *గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి 3 మారులు* *9) మాతుః పితామహం* (తల్లి గారి తాత) *గోత్రం..శర్మాణం... రుద్రరూపం.. స్వధానమస్తర్పయామి 3 మారులు* *10) మాతుఃప్రపితామహం* (తల్లి యొక్క తాతగారి తండ్రి) *గోత్రం...శర్మాణం.. ఆదిత్య రూపం.. స్వధానమస్తర్పయామి ...3 మారులు* *11) మాతామహీం.* (అమ్మ మ్మ) *గోత్రాం..దాం. వసురూపాం స్వధానమస్తర్పయామి...3 మారులు* *12) మాతుః పితామహీం.* (తల్లి యొక్క నానమ్మ) *గోత్రాం.. దాం.. రుద్రరూపాం.. స్వధానమస్తర్పయామి ...3 మారులు* *13)మాతుః ప్రపితామహీం..* (తల్లి యొక్క నానమ్మ గారి అత్త) *గోత్రాం... దాం.. ఆదిత్య రూపాం... స్వధానమస్తర్పయామి.. 3 మారులు* *14) ఆత్మ పత్నీం* (తనభార్య) *గోత్రాం.. దాం.. వసురూపాం.. వసురూపం.. స్వధానమస్తర్పయామి.. 3 మారులు* {ఇక్కడ కూడా!? ఎన్నవ సంతానమో!? అది సంబోధన చేయాలి..} *15) సుతం* (కుమారుడు) *గోత్రం..శర్మాణం.. వసురూపం..* *స్వధానమస్తర్పయామి .... 3మారులు* {అన్న - తమ్ముడు.. జ్యేష్ఠ.. కనిష్ఠ.. సన్నిహిత.. వ్యవహిత.. ఇలా మార్చుకుని.. చెప్పుకోవలెను} 👇 *16) జ్యేష్ఠ భ్రాతరం* (స్వంత సోదరుడు) *గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు...* *!! తత్పత్నీం!!* (సోదరుని భార్య.. వదిన) *గోత్రాం..దాం వసురూపాం . స్వధానమస్తర్పయామి ....3 మారులు* {ఇక్కడ కూడా!? జ్యైష్ఠ.. కనిష్ఠ} 👇 *17) పితృవ్యం* (పెదనాన్న/చిన్నాన్న) *గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు* *!! తత్పత్నీం!!..* (పెద్దమ్మ/ చిన్న మ్మ లు) *గోత్రాం..దాం... వసురూపాం..స్వధానమస్తర్పయామి ....3 మారులు* [ఇవి ప్రత్యేకంగా ఇవ్వలేదు.. మనకు వారితో ఉండే అనుబంధము వలన.. తర్పణము చేయవచ్చు]👇 *[18)తత్ పుత్రం* (పెదనాన్న & చిన్నాన్న కుమారులు..) *గోత్రం... శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు* *!! తత్పత్నీం!!* (పెదనాన్న చిన్నాన్న కుమారుని భార్య) *గోత్రాం..దాం..వసురూపాం..స్వధానమస్తర్పయామి ....3 మారులు]* *19)మాతులం* (మేనమామ.. తల్లి సోదరుడు) *గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు* *!! తత్పత్నీం!!* (మేనమామ భార్య) *గోత్రాం..దాం..వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు* {ఇక్కడ కూడా ఎన్నవ కూతురు అనేది} 👇 *20) దుహితరం* (కూతురు) *గోత్రాం..దాం...వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు* {ఇక్కడ కూడా!? జ్యేష్ఠ... కనిష్ఠ.. సన్నిహిత..} 👇 *21) ఆత్మ భగినీం* ( సోదరి. అక్క&చెల్లెలు) *గోత్రాం.. దాం.. వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు* *22)దౌహిత్రం* (కూతురి కొడుకు & మనుమడు) *గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు* *!! తత్పత్నీం!!* (కూతురు యొక్క కొడుకు భార్య) *గోత్రాం..దాం.వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు* *23)భాగినేయకం* ( మేనల్లుడు) *గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు* *!!తత్పత్నీం!!* (మేనల్లుడి భార్య) *గోత్రాం.దాం..వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు* *24) పితృష్వసారం* ( మేనత్త & తండ్రి సోదరి) *గోత్రాం..దాం..వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు* *!!తద్భర్తారం!!* (మేనత్త భర్త) *గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు* *25)మాతృష్వసారం* (తల్లి సోదరి . చిన్న మ్మ. పెద్దమ్మ) *గోత్రాం..దాం..వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు* *!!తద్భర్తారం!!* ( తల్లి సోదరి యొక్క భర్త) *గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు* *26) జామాతరం* ( అల్లుడు కూతురి భర్త) *గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు* *27)భావుకం -* (బావగారు..మనయొక్క అక్క /చెల్లెలు భర్త) *గోత్రం - శర్మాణం - వసురూపం.. స్వధానమస్తర్పయామి.. 3 మారులు* *28)స్నుషాం* ( కొడుకు భార్య/కోడలు) *గోత్రాం.దాం..వసురూపాం. స్వధానమస్తర్పయామి ....3 మారులు* *29)శ్వశురం* ( పిల్లనిచ్చిన మామ) *గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు* *!!శ్వశ్రూం!!* (పిల్లనిచ్చిన మామ భార్య.. అత్త) *గోత్రాం..దాం..వసురూపాం స్వధానమస్తర్పయామి ....3 మారులు* *30)శ్యాలకం* (బావమరిది) *గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు* *!!తత్పత్నీం!!* (బావమరిది భార్య) *గోత్రాం..దాం.వసురూపాం స్వధానమస్తర్పయామి ....3 మారులు* *31)స్వామినం* *గోత్రం శర్మాణం వసురూపం స్వధానమస్తర్పయామి ....3* *32)గురుం ..* *గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు* *33)రిక్థినం ..* *గోత్రం..శర్మాణం..వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు* =================== 1)యే బాంధవాః యే బాంధవాః అన్య జన్మని బాంధవాః| తే సర్వే తృప్తి మాయాన్తు మయా దత్తేన. వారిణా|| 2)ఆ బ్రాహ్మ స్తంబ పర్యన్తం దేవర్షి పితృ మానవాః| తృప్యంతు పితర స్సర్వే‌ మాతృ మతామహాదయః|| 3)అతీత కుల కోటీనాం సప్త ద్వీప నివాసినాం| ఆ బ్రహ్మ భువనాల్లోకా దిదమస్తు తిలోదకం|| {యజ్ణోపవీత నిష్పీడనం} *||యే కే చాస్మత్కులే జాతాః* *అ పుత్రా గోత్రిణో మృతాః|* *తేగృహ్ణంతు మయా దత్తం* *సూత్ర నిష్పీడనోదకం||* *||శ్రీ రామ రామ రామ రామ||* పవిత్రం విసృజ్య.... 🙏

15, సెప్టెంబర్ 2020, మంగళవారం

*తల్లి ఋణం - తీర్చలేనిది* ఒక యువకుడు మాతృ రుణం తీర్చుకోవాలని లక్ష బంగారు నాణాల సంచిని తల్లికి ఇస్తూ, ‘అమ్మా! ఈ నాణాలను తీసుకుని నీకు ఇష్టమైన విధంగా ఉపయోగించుకో. దానితో నీ రుణం నుండి నాకు ముక్తి లభిస్తుంది’ అన్నాడు. తల్లి నవ్వి ఊరుకుంది. కానీ, ఆ యువకుడు అదే మాటను మళ్ళీ మళ్ళీ చెప్పడంతో- తల్లి ఇలా అంది .. బిడ్డా, నా రుణం తీర్చుకోవాలీ అనుకుంటే ఈ డబ్బు నాకు అవసరం లేదు, నీవు ఒకరోజు రాత్రిపూట నా వద్ద పడుకో చాలు అంది. ఆ బిడ్డడు సరే అని ఆ రోజు తల్లి మంచం మీద ఆమె పక్కనే పడుకున్నాడు. అతనికి నిద్ర రాగానే తల్లి లేపి నాయనా, దప్పికవుతోంది, నీళ్ళు తాగించు’ అంది. కొడుకు సంతోషంగా లేచి గ్లాసుతో నీళ్ళిచ్చాడు. రెండు గుటకలు వేసి గ్లాసును జారవిడిచింది. నీళ్ళుపడి పక్క తడిసిపోవడం చూసి ‘ఏమిటమ్మా ఇది’ అన్నాడు. ‘పొరపాటు అయిపోయింది నాయనా’ అంది తల్లి. కొడుకు మౌనంగా పడుకున్నాడు. అతడికి కాస్త నిద్రపట్టగానే తల్లి మళ్ళీ లేపి ‘బిడ్డా! దప్పిక అవుతోంది, నీళ్ళు ఇవ్వు’ అంది. ‘ఇప్పుడే కదా నీళ్ళు తాగావు, ఇంతలోనే మళ్ళీ దప్పిక అయిందా... పత్తి గింజలు ఏమైనా తిన్నావా?’ అంటూ చిరాగ్గా లేచి నీళ్ళు ఇచ్చాడు. తల్లి మొదటి మాదిరిగానే ఒకటి రెండు గుటకలు వేసి నీటిని పక్కమీద ఒలకబోసింది. కొడుకు కోపంతో ‘అమ్మా, ఏమిటిది, పక్కంతా తడిపేశావు... కళ్ళు కనిపించట్లేదా’ అన్నాడు. ‘నాయనా! చీకటిగా ఉండటంతో గ్లాసు చేతినుండి జారిపోయింది’ అని చెప్పింది తల్లి. అది విని కోపాన్ని తమాయించుకున్న కొడుకు మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. అంతలో తల్లి మళ్ళీ లేపి మంచినీళ్ళు అడగడంతో కోపం పట్టలేకపోయాడు. ‘అమ్మా! ఏమిటి... దప్పిక దప్పిక అని నా దుంప తెంచుతున్నావు. నన్ను అసలు నిద్రపోనిస్తావా లేదా’ అంటూ నీళ్ళు తీసుకువచ్చి ‘ఇదిగో తాగి చావు’ అన్నాడు. తల్లి ఎప్పటిలాగానే ఓ గుక్క తాగి మిగిలిన నీళ్ళతో పక్కను తడిపేసింది. ఇది చూసిన కొడుకు ఇక సహించలేక .... అమ్మా !! బుద్ధుందా లేదా ఏమిటిది ఇలా వేధించడానికేనా నన్ను నీ మంచం మీద పడుకోమన్నావు? ఈ తడిబట్టల మీద ఎట్లా పడుకోవాలి? చూడబోతే నీకు మతి పూర్తిగా పోయినట్లు ఉంది... అందుకే ఇలా చంపుకు తింటున్నావు’ అంటూ ఆగ్రహంతో కేకలేశాడు. అప్పుడు తల్లి ..... బిడ్డా చాలించు. అరుపులు ఆపు. నా రుణం తీర్చుకుంటానన్నావు, తల్లి రుణం తీర్చుకోగలుగుతావా? నీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని జన్మలెత్తి, నిరంతర సేవ చేసినా మాతృ రుణం నుండి విముక్తుడవు కాలేవు. ఎందుకంటావా... నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు రోజూ పక్కమీదే మల మూత్రాదులు చేసేవాడివి. నీ తడిసిపోయిన బట్టలు విప్పేసి, నా కొంగుతో నిన్ను కప్పేదాన్ని. పక్కబట్టలను నువ్వు తడిపిన వైపు నేను పడుకుని నిన్ను పొడిగా ఉన్నవైపు పడుకోబెట్టి నిద్రబుచ్చేదాన్ని. ఇలా ఒకరోజు కాదు, ఒక వారం కాదు, కొన్ని సంవత్సరాలపాటు- నీ అంతట నువ్వు వేరే పడుకోగలిగే వరకూ నేను ప్రతిరోజూ అలానే- ఎంతో ప్రేమతో చేస్తూ ఉండేదాన్ని. కానీ నువ్వు ఒకటి రెండుసార్లు నీళ్ళతో పక్క తడిపినందుకే కోపం వచ్చి విసుక్కుంటున్నావు, ఒక్క రాత్రి నిద్రలేనందుకే వీరంగం వేస్తున్నావు అంది తల్లి. ఆ కొడుకు సిగ్గుపడి తల్లి పాదాలు పట్టుకుని ,అమ్మా! నా కళ్ళు తెరుచుకున్నాయి. బిడ్డలను కనిపెంచే క్రమంలో తల్లి పడే శ్రమకు ,ఆమె చేసే సేవలకు ,ఆమె త్యాగాలకు , కష్టానికి , సహనానికీ బదులు తీర్చుకోవడమన్నది ఎన్ని వందల సంవత్సరాలు సేవలు చేసినా జరిగే పని కాదు. నీ రుణం చెల్లించడం అసంభవం. నేనే కాదు, లోకంలో ఎవరూ కూడా తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేరు’ అన్నాడు. మాతృ దేవోభవ 🙏🙏🙏. ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. 🙏 Must read this story real fact of every one life....... 👏👏👏

ఏ నామం అయినా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు👍 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 👍👌💐 👉అదే శ్రీ రామ అనే నామం లో రాముడు ఒక్కడే పలుకుతాడు అనుకోడం పొరపాటు. * శ్రీ రామ అనే నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారు అట.* అదెలాగో చూద్దాం. 1⃣ రామ అంటే *రాముడు* పలుకుతాడు తెలిసిందే 2⃣ రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ *హనుమంతుడే* 3⃣ *శ్రీ* అంటే *లక్ష్మి* 4⃣ *రా* అంటే *విష్ణువు* (ఓం నమో నారాయణాయ అనే నామం లో నుంచి రా అనే జీవ అక్షరం తీసుకున్నారు) 5⃣ *మ* అంటే *శివుడు* (ఓం నమః శివాయ అనే నామం లో నుంచి మ అనే జీవ అక్షరం తీసుకున్నారు) 6⃣ శివుడు హనుమంతుడి రూపం లో భూలోకానికి రామ సేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీ దేవి నాకు ఆ అదృష్టం కావాలి అంటే అపుడు శివుడు ఇలా అన్నాడు ఈ అవతారం లో హనుమంతుడు బ్రహ్మచర్యం పాటిస్తారు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరని పని. అపుడు పార్వతీ దేవి అయితే నేను మీ తోక రూపం లో వస్తాను అని హనుమంతుడి తోక లో ప్రవేశించింది అట. మరి రామ అన్నపుడు హనుమ వస్తే *పార్వతీ* కూడా వచ్చింది కదా. *రాముడు, హనుమంతుడు, లక్ష్మి, విష్ణువు, శివుడు, పార్వతీ* ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు. అలాంటి నామ పారాయణం చేయడం మరువకండి🌸💐🌹 🕉🚩🚩 జై శ్రీ రామ్ 🚩🚩🕉

13, సెప్టెంబర్ 2020, ఆదివారం

మీరు ఏ ఊర్లో ఉన్నా, మీ ఇంట్లోనే ఉంటూ, మీకు నచ్చిన సమయములో, మీ మొబైల్ ఫోన్ ద్వారా భగవద్గీతను ఉచితముగా నేర్చుకునేందుకు వీలుగా భగవద్గీత 18 అధ్యాయములు, 700 శ్లోకములను అర్ధాలతో సహా రికార్డ్ చేసి వెబ్ సైట్ లో పెట్టాము. మీరు చేయవలసిందల్లా http://learnbhagavadgitaonline.org అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి, మీ భగవద్గీత పుస్తకమును తెరచి, 1వ అధ్యాయము 1వ శ్లోకము నుండి మొదలు పెట్టి, రోజుకి పది శ్లోకములను అర్థాలతో సహా నేర్చుకోండి. 70 రోజులలో మీరు భగవద్గీత 700 శ్లోకములను చదవగలుగుతారు. భగవద్గీతను చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. ఎంతోమంది భగవద్గీతను నేర్చుకోవాలి అనుకున్నా నేర్పించేవారులేక నేర్చుకో లేకపోతున్నారు. దయచేసి ఈ మెసేజ్ ను వాళ్ళందరికీ అందేటట్టు వీలైనంత మందికి ఫార్వర్డ్ చేయండి. (సేకరణ) జగన్నాథ🙏

*మంగళసూత్రాలని ముత్తైదువుల హృదయానికి ఎందుకు తాకిస్తారు.?*. ైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైై మాంగల్యధారణ సమయంలో మాంగల్యాన్ని కళ్యాణ వేదికలో ఉన్న ముత్తైదువుల అందరి మెడలలో తాకించిన తరువాత వరుని చేత వధువు మేడలో మాంగల్యధారణ చేయిస్తూ ఉంటారు. ఇలా చెయ్యడం ఎందుకు అని మనకి ఒక సందేహం కలుగుతుంది. కన్యాదాత ఎంత జాగ్రత్తగా వధూవరుల జాతకాలను చూపించినా, ప్రతి నక్షత్రానికి ఒక గండకాలం ఉంటుంది. అలాంటి గండకాలం వస్తే? అన్నటువంటి విషయాన్ని కూడా ఏ తండ్రి ఆలోచించలేడు. అందుకనే వధువు కళ్యాణవేదిక మీదకి వచేటప్పుడు కూడా గౌరీ పూజ చేసి వస్తుంది. మరి అందరి స్త్రీలకీ ఉపాసనా శక్తి ఒకే రకంగా ఉండదు కదా! ఒక్కొక్కరి స్థాయి ఒక్కొక్క రకంగా ఉంటుంది. పైగా హృదయస్థానంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు. అందుకనే మాంగల్యధారణ చేయించే సమయంలో కూడా మంగళసూత్రాలను వచువు హృదయస్థానానికి తాకేటట్టుగా పట్టుకొమ్మంటారు. ఇలా ప్రతి ముత్తైదువు యొక్క మెడలో ఆ మంగళసూత్రాలను తాకించడం చేత ఏ తల్లి ఉపాసన ఎక్కువగా ఉన్నదో తెలియదు. అలా తాకించి కట్టడం వల్ల ఆ ఉపాసన శక్తి కొంత ఆ మంగళ సూత్రాలు తీసుకుంటాయి. తీసుకొని వధువుని దీర్ఘసుమంగళిగా ఉండేటట్లుగా అనుగ్రహించగలిగిన శక్తి ఈ ప్రక్రియకి ఉన్నది. అందుకనే మాంగల్యధారణ సమయం ఆసన్నం కాగానే ఇటు మగపెళ్లి వారివైపు వారిలో హుషారుగా ఉన్నవారు కాని, ఇటు ఆడపిల్ల వైపు వారు కాని, ఇలా చెయ్యడానికి కారణం. ఇలా ముత్తైదువులకు మాంగల్యం తాకించే సమయంలో కొంతమంది లలితా సహస్రం చదువుతారు. పూర్తిగా చదివే సమయం లేకపోయినా "కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరా" అన్న నామం వరకు అయినా చదువుతారు. అలా చదవడం వల్ల ఆ తల్లి యొక్క కృప అప్పుడే మాంగల్యం కట్టించుకోబోతున్న వధువు మీద ఉండి తీరుతుంది. విశ్వాసం ప్రధానం. ఇలా మన సనాతన ధర్మంలో ఆచరించే ప్రతి ఆచారానికి అర్ధం పరమార్ధాలు ఉన్నాయి. కాబట్టి మనం ప్రతి విషయం గురించి తెలుసుకుంటూ అందరూ ఆచరించేటట్లుగా చూస్తూ మన సనాతన ధర్మం యొక్క వృక్షశాఖలు ఇంకా శాఖోపశాఖలుగా పటిష్టపడాలని, అలా అవ్వడానికి ప్రతి ఒక్కరం మన వంతు కృషి మనం చెయ్యాలి..! *సర్వేజనా సుఖినోభవంతు..* *సేకరణ* *నారాయణం వెంకట అప్పయ్య శాస్త్రి*

1 విశ్వం --- విశ్వము అంతా తానే ఐన వాడు (నామ రూపాత్మకమై, చిత్రాతి చిత్రమై, వికసించి, విస్తరించి, విరాజిల్లుచు గాన వచ్చు సకల చరాచర జడ చైతన్య సంహితమగు ప్రపంచమే విశ్వము) , సకల విషయములందును సంపూర్ణమైన వాడు. (అంతా తానైన వాడు). ఇది శ్రీ విష్ణుసహస్రనామములలో మొదటి నామము. అంతా భగవంతుడే అన్న భావంలో ఈ నామానికి భాష్యకారులు వ్యాఖ్యానం చెప్పారు 2 విష్ణుః --- అంతటనూ వ్యాపించి యున్నవాడు. సర్వ వ్యాపకుడు. (అంతటా తానున్నవాడు). 3 వషట్కారః --- వేద మంత్ర స్వరూపి, వషట్ క్రియకు గమ్యము (యజ్ఞములలో ప్రతిమంత్రము చివర మంత్రజలమును 'వషట్' అనే శబ్దముతో వదులుతారు); అంతటినీ నియంత్రించి పాలించు వాడు. 4 భూతభవ్యభవత్ ప్రభుః --- భూత కాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము - మూడు కాలములకు అధిపతి, మూడు కాలములలోను అన్నింటికి ప్రభువు. 5 భూతకృత్ --- సకల భూతములను సృష్టించువాడు; ప్రళయ కాలమున సకల భూతములను నాశనము చేయువాడు (భూతాని కృన్తతి). 6 భూతభృత్ --- సమస్త భూతములను పోషించువాడు, భరించువాడు. 7 భావః --- అన్నింటికి ఉనికియైనవాడు. తనలోని సర్వ విభూతులను ప్రకాశింపజేయువాడు. సమస్త చరాచర భూతప్రపంచమంత వ్యాపించి యుండు భగవానుడు. తాను తయారు చేసిన సృష్టి తనకన్నా అన్యముగాక పోవుటవేత తాను సర్వవ్యాపి అయినాడు. 8 భూతాత్మా --- సమస్త భూతములకు తాను ఆత్మయై యుండువాడు. సర్వ జీవకోటియందు అంతర్యామిగా యుండువాడు. సర్వభూతాంతరాత్మకుడైన భగవానుడు సమస్త శరీర మనుగడకు కర్తయై, సాక్షియై యుండు చైతన్యము. 9 భూతభావనః --- అన్ని భూతములను సృష్టించి, పోషించి, నిలుపువాడు. జీవులు పుట్టి పెరుగుటకు కారణమైనవాడు. తల్లిదండ్రులవలె జన్మనిచ్చి, పెంచి, పోషించు వాడు భగవానుడు. అతడే జగత్పిత. 10 పూతాత్మా --- కర్మ ఫల దోషములు అంటని పవిత్రమైన ఆత్మ. 'పూత' అనగా పవిత్రమైన, 'ఆత్మా' అనగా స్వరూపము గలవాడు. పవిత్రాత్ముడు. భూతములు ఆవిర్భవించి, వృద్ధిచెందుటకు భగవానుడు కారణమైనను జీవగుణములతో సంబంధము లేనివాడు. 11 పరమాత్మా --- పరమమైన, అంతకు అధికము లేని, ఆత్మ. సర్వులకూ తానే ఆత్మ గాని, తనకు వేరు ఆత్మ యుండని వాడు. నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్యకారణములకంటె విలక్షణమైనవాడు. తాను సర్వులకు ఆత్మయై తనకు మరొక ఆత్మ లేనివాడు. 12 ముక్తానాం పరమాగతిః --- ముక్తులైన వారికి (జనన మరణ చక్రమునుండి విముక్తి పొందిన వారికి) పరమాశ్రయమైన వాడు. ముక్తులకు ఇంతకంటె ఆశించవలసినది మరొకటి లేదు. ముక్త పురుషులకు పరమగమ్యమయిన వాడు - భగవంతుడు. గతి యనగా గమ్యము. పరమా అను విశేషణము యొక్క అర్ధము ఉత్తమము. ఏది గ్రహించిన పిదప మరొకటి గ్రహించనవసరములేదో, ఏ స్థానమును చేరిన జ్ఞానికి పునర్జన్మ ప్రాప్తించదో అదియే పరమగతియని తెలియదగును. నదికి సాగరము పరమగతి అయినట్లు-మానవులకు భగవానుడు పరమగమ్యమయి ఉన్నాడు. సాగరములో లయించిన నది తన వ్యక్తిత్వమును కోల్పోయి అనంత సాగరములో ఐక్యమయిన రీతిని భగవానుని చేరిన జీవి భగవద్వైభవములో లయించుట జరుగుచున్నది. అది కరిగిపోవు సమస్థితియేగాని తిరిగివచ్చు దుస్థితి కాదు. "దేనిని చేరిన పిదప జీవులు తిరిగి రాలేరో అట్టి పవిత్ర పరమగతియే నా నివాసము" అని భగవానుడు భగవద్గీతలో తెలియజేసి యున్నాడు. 13 అవ్యయః --- తరుగు లేని వాడు; తనను చేరిన వారిని మరల జనన మరణ చక్రములో పడనీయని వాడు. వినాశము కానివాడు మరియు వికారము లేనివాడు. గోచరమగునది యేదయినను పరిణామము చెందును. పరిణామశీలమయిన వస్తువు నశించి తీరును. భగవానుడలా పరిణామము చెందు వస్తు సముదాయములలో చేరడు. 14 పురుషః --- ముక్తులకు పుష్కలముగా బ్రహ్మానందానుభవమును ప్రసాదించువాడు; శరీరమందు శయనించియున్నవాడు; సమస్తమునకు పూర్వమే ఉన్నవాడు. జగత్తునకు పరిపూర్ణతనిచ్చువాడు. 15 సాక్షీ --- సర్వమును ప్రత్యక్షముగా (ఇంద్రియ సాధనములు అవుసరము లేకుండా) చూచువాడు; సమస్తము తెలిసినవాడు; భక్తుల ఆనందమును వీక్షించి ప్రీతితో కటాక్షించువాడు. సా+అక్షి = చక్కగా దర్శించువాడు. చక్కగా సమస్తమును దర్శించువాడు సాక్షి యని పాణిని వ్యాకరణము తెలియజేయుచున్నది. 16 క్షేత్రజ్ఞః --- ఈ శరీరమను క్షేత్రమున విలసిల్లుచు, నాశనరహితుడై, క్షేత్ర తత్వమును తెలిసిన వాడు; ముముక్షువుల పరమార్ధమైన శుద్ధ సచ్చిదానంద పర బ్రహ్మానుభవము తెలిసి, వారినక్కడికి చేర్చువాడు. 17 అక్షరః --- ఎన్నడునూ (కల్పాంతమునందు కూడ) నశింపక నిలచియుండువాడు; ముక్తులు ఎంత అనుభవించినా తరగని అనంత సచ్చిదానంద ఐశ్వర్య స్వరూపుడు 18 యోగః --- ముక్తి సాధనకు ఏకైక మార్గము, సాధనము, ఉపాయము; యోగము వలననే పొందదగినవాడు; కోర్కెలు తీరుటకు తిరుగులేణి ఉపాయము. ధ్యానము వలన, సమత్వ భావము వలన తెలియబడువాడు. యోగముచే పొందదగినవాడు - భగవానుడు. సాధ్య సాధనములు తానైన భగవానుడే సాధకులకు మార్గగామి. సాధ్యవస్తువయిన భగవానుడు తనకన్నా అన్యం కాదని గ్రహించిన సాధకుడు ఇంద్రియ మనోబుద్దులను నిగ్రహించి, యోగయుక్తుడయిన భగవానునితో కలసి కరిగిపోవుటయే యోగము. 19 యోగవిదాం నేతా --- తానే మార్గదర్శియై, నాయకుడై, యోగ సాధన చేయువారిని గమ్యమునకు చేర్చువాడు. యోగులకు నేత; కర్మజ్ఞానాది సాధనాంతరములకు ఫలమునొసగువాడు. 20 ప్రధాన పురుషేశ్వరః --- ప్రధానము (ఆనగా ప్రకృతి, మాయ), పురుషుడు (జీవుడు) - రెండింటికిని ఈశ్వరుడు (అధిపతి, నియామకుడు). 21 నారసింహ వపుః --- ప్రహ్లాదుని కాచుటకై శ్రీనారసింహావతారమును ధరించి అవతరించినవాడు; అభయమునొసగువాడు. మంగళ మూర్తి. 22 శ్రీమాన్ --- రమణీయమైన స్వరూపము గలవాడు (శ్రీనారసింహ మూర్తిగా); సదా లక్ష్మీదేవిని తన వక్షస్థలమున ధరించినవాడు. 23 కేశవః --- సుందరమైన కేశములతో విరాజిల్లువాడు. కేశి అను రాక్షసుని సంహరించినవాడు. బ్రహ్మ, విష్ణు, శివ రూపములు ధరించువాడు (త్రిమూర్తి స్వరూపి); అందమైన కిరణములతో విశ్వమును చైతన్యవంతులుగా చేయువాడు. 'కేశ' యనెడి అసురుని వధించినవాడు - విష్ణుమూర్తి. మనోహరములైన శిరోజములు (కేశములు) కలిగియున్నవాడు - శ్రీ కృష్ణుడు. "క + అ + ఈశ" కలసి "కేశ" శబ్దమయినది. 'క' అనగా బ్రహ్మ. 'అ' అనగా విష్ణువు, 'ఈశ' అనగా ఈశ్వరుడు. ఈ త్రిమూర్తులకు ఆధారమయిన వాసుదేవ చైతన్యమే కేశవుడు. 24 పురుషోత్తమః --- పురుషులలో ఉత్తముడు; త్రివిధ చేతనులైన బద్ధ-నిత్య-ముక్తులలో ఉత్తముడు. క్షరుడు (నశించువాడు), అక్షరుడు (వినాశన రహితుడు) - ఈ ఇద్దరు పురుషులకు అతీతుడు, ఇద్దరికంటె ఉత్తముడైన వాడు. 25 సర్వః --- సర్వము తానెయైన వాడు. సృష్టి స్థితి లయములకు మూలము. 26 శర్వః --- సకల పాపమును పటాపంచలు చేయువాడు. సమస్త జీవుల దుఃఖములను, అనిష్టములను నాశనము చేయువాడు. ప్రళయ కాళములో సమస్త భూతములను తనలో లీనం చేసుకొనేవాడు. 27 శివః --- మంగళములనొసగు వాడు. శుభకరుడు. 28 స్థాణుః --- స్థిరమైన వాడు. భక్తుల పట్ల అనుగ్రహము కలిగి నిశ్చయముగా ఇష్ట కామ్యములు సిద్ధింపజేయువాడు. వృద్ధి క్షయ గుణములకు లోబడనివాడు. 29 భూతాదిః --- సకల భూతములకు మూలము, కారణము, సకల భూతములచే ఆత్రముగా కోరబడువాడు. పంచ భూతములను సృష్టించిన వాడు. 30 నిధిరవ్యయః --- తరుగని పెన్నిధి, ప్రళయకాలమునందు సమస్త ప్రాణికోటులను తనయందే భద్రపరచుకొనువాడు. 31 సంభవః --- తనకు తానుగానే (కర్మముల వంటి కారణములు, బంధములు లేకుండానే) అవతరించువాడు. శ్రద్ధా భక్తులతో కోరుకొన్నవారికి దర్శనమిచ్చువాడు. 32 భావనః --- కామితార్ధములను ప్రసాదించువాడు. మాలిన్యములు తొలగించి వారిని పునరుజ్జీవింపజేయువాడు. 33 భర్తా --- భరించువాడు; భక్తుల యోగ క్షేమములను వహించువాడు; సకల లోకములకును పతి, గతి, పరమార్ధము. 34 ప్రభవః --- దివ్యమైన జన్మ (అవతరణము) గలవాడు; కర్మ బంధములకు లోనుగాకుండనే అవతరించువాడు. 35 ప్రభుః --- సర్వాధిపతి, సర్వ శక్తిమంతుడు; బ్రహ్మాదులకు కూడ భోగ మోక్షములొసగు సమర్ధుడు. 36 ఈశ్వరః --- సర్వులనూ పాలించి పోషించువాడు; అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు; మరే విధమైన సహాయము, ప్రమేయము లకుండ, ఇచ్ఛామాత్రముగ, లీలామాత్రముగ ఏదయిన చేయగలవాడు. 37 స్వయంభూః --- స్వయముగా, ఇచ్ఛానుసారము, వేరు ఆధారము లేకుండ జన్మించువాడు. 38 శంభుః --- శుభములను, సుఖ సంతోషములను ప్రసాదించువాడు. 39 ఆదిత్యః --- సూర్య మండల మధ్యవర్తియై బంగారు వర్ణముతో ప్రకాశించువాడు; ద్వాదశాదిత్యులలో విష్ణువు;సమస్తమును ప్రకాశింపజేసి పోషించువాడు; అదితి కుమారుడైన వామనుడు. సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు - భగవానుడు. "ద్వాదశాదిత్యులు లో విష్ణువు అను పేరు గలవాడు తానే" యని భగవానుడు భగవద్గీత విభూతి యోగములో తెలియజేసి యున్నాడు. 'ఆదిత్యః' అనగా ఆదిత్యుని వంటి వాడని కూడా భావము. ఆదిత్య ఉపమానము ద్వారా ఈ అద్వైత సత్యమును నిత్యానుభవములోనికి తెచ్చుకొని సంతృప్తి చెందవచ్చును. 40 పుష్కరాక్షః --- తామరపూవు వంటి కన్నులు గల వాడు. 41 మహాస్వనః --- గంభీరమైన దివ్యనాద స్వరూపుడు; వేద నాదమునకు ప్రమాణమైనవాడు. 42 అనాదినిధనః --- ఆది (మొదలు, పుట్టుక) లేనివాడు మరియు నిధనము (తుది, నాశనము) లేనివాడు. 43 ధాతా --- బ్రహ్మను కన్న వాడు; నామ రూపాత్మకమైన ఈ చరాచర విశ్వమునంతను ధరించిన మహనీయుడు. 44 విధాతా --- బ్రహ్మను ఆవిర్భవింపజేసిన వాడు; విధి విధానములేర్పరచి, తగురీతిలో కర్మ ఫలములనొసగువాడు. కర్మఫలముల నందించువాడైన భగవానుడు. విశ్వ యంత్రాంగమంతయు అతని ఆజ్ఞకు లోబడి నడచుచున్నది. తనకు భయపడి ప్రకృతి ప్రవర్తించుచున్నది. సర్వమును కదిలించి, కదిలిన సర్వమును కనిపెట్టి, ధర్మబద్ధంగా ఫలితముల నందించి, పోషించుటచే ఆదిదేవుడు విధాత ఆయెను. 45 ధాతురుత్తమః --- బ్రహ్మకంటెను శ్రేష్ఠుడు, ముఖ్యుడు; సృష్టికి మూలములైన సమస్త ధాతువులలోను ప్రధానము తానే అయినవాడు. 46 అప్రమేయః --- ఏ విధమైన ప్రమాణములచేత తెలియరానివాడు; కొలతలకందనివాడు; సామాన్యమైన హేతు ప్రమాణముల ద్వారా భగవంతుని నిర్వచించుట, వివరించుట, అంచనా వేయుట అసాధ్యము. 47 హృషీకేశః --- ఇంద్రియములకు (హృషీకములకు) అధిపతి; సూర్య, చంద్ర రూపములలో కిరణములు పంచి జగముల నానందింప జేయువాడు. హృషీకములకు అనగా ఇంద్రియములకు ప్రభువు - భగవానుడు. సూర్యచంద్ర కిరణములు హరి ముంగురులని వేద ప్రవచనము. సూర్యచంద్ర రూపులగు భగవానుని కేశములు (కిరణములు) జగత్తునకు హర్షమును కలిగించుచున్నవి. అందుచేత కూడా తాను హృషీకేశుడయ్యెనని మహాభారత శ్లోకము వివరించుచున్నది. 48 పద్మనాభః --- నాభియందు పద్మము గలవాడు. ఈ పద్మమునుండే సృష్టికర్త బ్రహ్మ ఉద్భవించెను. పద్మము నాభియందు కలిగియుండువాడు - భగవానుడు. అట్టి పద్మము నుండి సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించెను. పద్మము జ్ఞానమునకు ప్రతీక. విష్ణుదేవుడు తన జ్ఞానశక్తిచే బ్రహ్మను సృష్టించి, తద్వారా సకల జీవులు పుట్టుటకు కారణమాయెను. 49 అమరప్రభుః --- అమరులైన దేవతలకు ప్రభువు 50 విశ్వకర్మా --- విశ్వమంతటికిని సంబంధించిన కర్మలను తన కర్మలుగా గలవాడు. విశ్వమును సృష్టించిన వాడు. విశ్వరచన చేయగలుగువాడు - భగవానుడు. విచిత్రమైన సృష్టినిర్మాణము చేయగల సామర్ధ్యమును కలిగియుండెను. బ్రహ్మ ఆవిర్భావమునకు పూర్వమే భగవానుదు సృష్టిరచన సాగించెను; కాని సృష్టిని అనుసరించలేదు. అందుచేత సృష్టిలోని అశాశ్వత లక్షణములు భగవానునియందు లేవు. "సర్వభూతములు నాయందున్నవి. నేను వానియందు లేను" అని భగవానుడు భగవద్గీత-రాజవిద్యా రాజగుహ్యమునందు తెలియజేసియున్నాడు. 51 మనుః --- మననము చేయు మహిమాన్వితుడు; సంకల్పము చేతనే సమస్తమును సృష్టించిన వాడు. 52 త్వష్టా --- శిల్పివలె నానా విధ రూపములను, నామములను తయారు చేసినవాడు; బృహత్పదార్ధములను విభజించి సూక్ష్మముగా చేసి ప్రళయ కాళమున తనయందు ఇముడ్చుకొనువాడు. 53 స్థవిష్ఠః --- బ్రహ్మాండమును తనయందు ఇముడ్చుకొన్న బృహద్రూప మూర్తి; సమస్త భూతజాలమునందును సూక్ష్మ, స్థూల రూపములుగా నుండు విశ్వ మూర్తి. 54 స్థవిరః --- సనాతనుడు; సదా ఉండెడివాడు 55 ధ్రువః --- కాలముతో మార్పు చెందక, ఒకే తీరున, స్థిరముగా ఉండెడివాడు స్థవిరో ధ్రువః (ఆది శంకరాచార్యులు ఒకే నామముగా పరిగణించిరి) --- స్థిరుడై, నిత్యుడై, కాలాతీతుడైన వాడు 56 అగ్రాహ్యః --- తెలియరానివాడు. ఇంద్రియ, మనో బుద్ధులచే గ్రహింప నలవి కానివాడు. 57 శాశ్వతః --- కాలముతో మార్పు చెందక ఎల్లప్పుడు ఉండెడివాడు. 58 కృష్ణః --- సర్వమును ఆకర్షించువాడు; దట్టమైన నీల వర్ణ దేహము గలవాడు; సృష్ట్యాది లీలా విలాసముల వలన సర్వదా సచ్చిదానందమున వినోదించువాడు.. 59 లోహితాక్షః --- తామర పూవు వలె సుందరమగు ఎర్రని కనులు గలవాడు; అంధకారమును తొలగించు ఎర్రని కనులు గలవాడు. 60 ప్రతర్దనః --- ప్రళయకాలమున అంతటిని (విపరీతముగ) నాశనము చేయువాడు. 61 ప్రభూతః --- పరిపూర్ణుడై జన్మించిన వాడు; జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజము మొదలగు సర్వగుణములు సమృద్ధిగా గలవాడు. 62 త్రికకుద్ధామః , త్రికకుబ్ధామః --- సామాన్యలోకము కంటె మూడు రెట్లు పెద్దదైన పరమ పదమందు ఉండెడివాడు; మూడు గుణ వర్గములకును ఆశ్రయమైన వాడు; ఊర్ధ్వ, మధ్య, అధో లోకములకు ఆధార భూతుడు; జాగ్రత్, స్వప్న, సుషుప్తి - మూడు అవస్థలందును వ్యాపించియున్నవాడు. త్రికకుత్ --- మూడు కొమ్ములు (మూపులు) గల శ్రీవరాహమూర్తి ధామః --- నివాస స్థానము, ప్రకాశవంతమైన కిరణము. 63 పవిత్రం --- పరమ పావన స్వరూపుడు, పరిశుద్ధమొనర్చువాడు. 64 మంగళం పరం --- అన్నింటికంటె మంగళకరమగు మూర్తి; స్మరణ మాత్రముననే అన్ని అశుభములను తొలగించి, మంగళములను ప్రసాదించువాడు. 65 ఈశానః --- సమస్తమునూ శాసించు వాడు; సకలావస్థలలోనూ సకలమునూ పాలించువాడు. 66 ప్రాణదః --- ప్రాణములను ప్రసాదించువాడు (ప్రాణాన్ దదాతి);ప్రాణములను హరించువాడు (ప్రాణాన్ ద్యాతి); ప్రాణములను ప్రకాశింపజేయువాడు (ప్రాణాన్ దీపయతి). 67 ప్రాణః --- ప్రాణ స్వరూపుడు; జీవనము; చైతన్యము. 68 జ్యేష్ఠః --- పూర్వులకంటె, వారి పూర్వులకంటె, పెద్దవాడు; తరుగని ఐశ్వర్య సంపదచే పెద్దవాడు, మిక్కిలి కొనియాడదగినవాడు. 69 శ్రేష్ఠః --- ప్రశంసింపదగిన వారిలోకెల్ల ఉత్తముడు. 70 ప్రజాపతిః --- సకల ప్రజలకు ప్రభువు, తండ్రి; నిత్యసూరులకు (పరమపదము పొందినవారికి) ప్రభువు. 71 హిరణ్యగర్భః --- రమణీయమగు స్థానమున నివసించువాడు, పరంధాముడు; సంపూర్ణానందమగువానిని ప్రసాదించువాడు; చతుర్ముఖ బ్రహ్మకు ఆత్మయై యున్నవాడు. 72 భూగర్భః --- భూమిని (కడుపులో పెట్టుకొని) కాపాడువాడు; విశ్వమునకు పుట్టినిల్లు అయినవాడు. 73 మాధవః --- మా ధవః -శ్రీమహాలక్ష్మి(మా)కి భర్త ; మధువిద్య (మౌనము, ధ్యానము, యోగము) ద్వారా తెలిసికొనబడువాడు; సకల విద్యా జ్ఞానములకు ప్రభువు; పరమాత్మను గూర్చిన జ్ఞానము ప్రసాదించువాడు; మధు (యాదవ) వంశమున పుట్టినవాడు; తనకు వేరు ప్రభువు లేనివాడు (అందరకు ఆయనే ప్రభువు); మౌనముగానుండి, సాక్షియై నిలచువాడు. 74 మధుసూధనః --- మధు, కైటభులను రాక్షసులను సంహరించినవాడు; బంధకారణములైన కర్మఫలములను నాశనము చేయువాడు. 75 ఈశ్వరః --- సర్వులనూ పాలించి పోషించువాడు; అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు; మరే విధమైన సహాయము, ప్రమేయము లేకుండ, ఇచ్ఛామాత్రముగ, లీలామాత్రముగ ఏదయిన చేయగలవాడు. 76 విక్రమీ --- విశిష్టమగు పాద చిహ్నములు గలవాడు; అమిత శౌర్య బల పరాక్రమములు గలవాడు. 77 ధన్వీ --- (దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు) శార్ఙ్గము అను ధనుసును ధరించినవాడు. 78 మేధావీ --- అసాధారణ, అపరిమిత మేధ (జ్ఞాపక శక్తి) గలవాడు; సర్వజ్ఞుడు. 79 విక్రమః --- బ్రహ్మాండమును కొలిచిన అడుగుల గలవాడు (శ్రీవామన మూర్తి); పక్షిరాజగు గరుత్మంతునిపై పాదములుంచి పయనించువాడు. 80 క్రమః --- సమస్తము ఒక క్రమవిధానములో చరించుటకు హేతువు (క్రమ - పద్ధతి); సమస్త జీవరాశులలోను చైతన్యము (క్రమ - కదలిక); అనంత, అసాధారణ వైభవ సంపన్నుడు (క్రమ - సంపత్తు); సంసార సాగరమును దాటించువాడు (క్రమణ - ఈదుట). 81 అనుత్తమః ---అంతకంటె ఉత్తమమైనది మరొకటి లేదు. 82 దురాధర్షః --- తననెదిరింపగల గల శక్తి వేరెవ్వరికి లేనట్టివాడు. 83 కృతజ్ఞః --- నామ స్మరణము, శరణాగతి, పూజాది భక్తి కార్యములచే ప్రసన్నుడై భక్తులననుగ్రహించువాడు; పత్ర పుష్పాది అల్ప నివేదనల చేతనే సంతుష్టుడై కామితార్ధ మోక్షములను ప్రసాదించువాడు; సమస్త ప్రాణుల పుణ్య, అపుణ్య కర్మలనెరిగినవాడు. 84 కృతిః --- తన భక్తుల సత్కార్యములకు కారణమైనవాడు; తన అనుగ్రహముచే పుణ్య కర్మలను చేయించువాడు. 85 ఆత్మవాన్ --- సత్కార్యములొనర్చు ఆత్మలకు నిజమైన ప్రభువు; తన వైభవమునందే ప్రతిష్ఠుడైనవాడు. 86 సురేశః --- సకల దేవతలకును దేవుడు; దేవదేవుడు; భక్తుల కోర్కెలను తీర్చువారిలో అధిపుడు. 87 శరణం --- తన్ను శరణు జొచ్చినవారిని రక్షించువాడు; ఆర్తత్రాణ పరాయణుడు; ముక్తుల నివాస స్థానము. 88 శర్మ --- సచ్చిదానంద స్వరూపుడు; మోక్షగాముల పరమపదము. 89 విశ్వరేతాః --- విశ్వమంతటికిని బీజము, మూల కారణము. 90 ప్రజాభవః --- సకల భూతముల ఆవిర్భావమునకు మూలమైనవాడు, జన్మకారకుడు. 91 అహః --- ఎవరినీ ఎన్నడూ వీడనివాడు; పగటివలె ప్రకాశ స్వరూపుడై అజ్ఞానమును తొలగించి జ్ఞానోన్ముఖులను చేయువాడు; తన భక్తులను నాశనము కాకుండ కాపాడువాడు. 92 సంవత్సరః --- భక్తులనుద్ధరించుటకై (వెలసి)యున్నవాడు; కాల స్వరూపుడు. 93 వ్యాళః --- భక్తుల శరణాగతిని స్వీకరించి అనుగ్రహించువాడు; (సర్పము, ఏనుగు, పులి వంటివానివలె) పట్టుకొనుటకు వీలుగానివాడు (చేజిక్కనివాడు) 94 ప్రత్యయః --- ఆధారపడ దగినవాడు; విశ్వసింపదగినవాడు (ఆయనను నమ్ముకొనవచ్చును); ప్రజ్ఞకు మూలమైనవాడు. 95 సర్వదర్శనః --- తన కటాక్షపరిపూర్ణ వైభవమును భక్తులకు జూపువాడు; సమస్తమును చూచుచుండెడివాడు. 96 అజః --- జన్మము లేనివాడు; అన్ని అడ్డంకులను తొలగించువాడు; భక్తుల హృదయములందు చరించుచుండువాడు; అన్ని శబ్దములకు మూలమైనవాడు. 97 సర్వేశ్వరః --- ఈశ్వరులకు ఈశ్వరుడు, ప్రభువులకు ప్రభువు; ఎవరు తనను వేడుకొందురో వారి చెంతకు తానై వేగముగా వచ్చి అనుగ్రహించువాడు. 98 సిద్ధః --- పొందవలసిన సమస్త సిద్ధులను పొదియే యున్నవాడు; తన భక్తులకు అందుబాటులో నుండెడివాడు; ఏ విధమైన లోపములు లేని, సకల పరిపూరహనత్వమైన రూపము గలవాడు. 99 సిద్ధిః --- సాధనా ఫలము, పరమ లక్ష్యము; సర్వ కార్య ఫలములు తానై యున్నవాడు; భక్తులకు నిధివలె సిద్ధముగా నున్నవాడు. 100 సర్వాదిః --- సర్వమునకు మూలకారణము, ప్రప్రధమము; సకల సృష్టికి పూర్వమందే యున్న పరమాత్మ. Recommended For You విష్ణు సహస్రనామాలు - 5 విష్ణు సహస్రనామాలు - 5 విష్ణు సహస్రనామాలు - 4 విష్ణు సహస్రనామాలు - 4 విష్ణు సహస్రనామాలు - 3 విష్ణు సహస్రనామాలు - 3 విష్ణు సహస్రనామాలు - 2 విష్ణు సహస్రనామాలు - 2 విష్ణు సహస్రనామాలు - 1 విష్ణు సహస్రనామాలు - 1

✍️... *నేటి చిట్టికథ* (స్కాంద పురాణము నుండి) ఒకసారి బ్రహ్మదేవుని ఉపదేశంపై ఇంద్రాది దేవతలు మహర్షులతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు. మహదానందంతో వారెన్నో తీర్థాలు దర్శించినారు. ఒకచోట బాగా ఎండిపోయిన వృక్షం ఒకటి వారికి కనబడింది. ఆ చెట్టు తొఱ్ఱలో ఓ శుష్కించిన చిలుక కాపురమున్నది. అది చూచి ఇంద్రాది దేవతలు “పక్షీశ్వరా! ఈ వృక్షం బాగా శుష్కించియున్నది. పూలూ ఆకులు పండ్లు ఏమీ లేకుండా ఉన్నది. ఐనను నీవెందులకు ఈ వృక్ష ఆశ్రయాన్ని విడువలేదో తెలుసుకోవాలని ఉన్నది మాకు” అని అడిగినారు. చిలుక ఇలా బదులిచ్చింది “ఓ దేవతలారా! ఇది చాలా పురాతనమైన వృక్షం. ఇది ఓ కల్పవృక్షం. అమృత మాధుర్యంగల దీని ఫలములు భుజించి నేను చిరకాలం జీవించాను. కాలగమనం వల్ల ఈ కల్పవృక్షం ఈనాడు ఇలాగున్నది. కాలగతిని ఆపడం ఎవరి తరమ్? ఒకప్పుడు నాకు ఆశ్రయమిచ్చి నన్ను ఎండ వాన నుండి కాపాడి నాకు మంచి ఆహారం ఇచ్చిన ఈ వృక్షమును నేనీనాడు శుష్కించినదని విడనాడలేను. అట్లు చేసిన అది కృతఘ్నత అవుతుంది. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు కదా! నిజాశ్రయమైన ఈ కల్పవృక్షమే నాకు సర్వలోకాలున్నూ”. ఇలా ధర్మ్యం మాట్లాడిన శుకరాజుని చూచి దేవేంద్రుడిలా అన్నాడు “ఓ శుక రాజమా! నీకు ఇంతటి విజ్ఞానం ధర్మం ఎలా తెలిసినాయో వినాలని ఉంది మాకు”. అప్పుడు చిలుక ఇలా చెప్పింది “నేను ఎన్నడూ మిత్రద్రోహం చేయలేదు. తల్లిదండ్రులయందు అనురాగం కలవాడను. నా భార్యను బాగా చూసుకుంటాను. నాతో సహజీవనం చేస్తున్నవారిని ఎన్నడూ అవమానించను. ఈ కారణాలవలన నాకు నిర్మలజ్ఞానం కలిగింది”. చిలుక మాటలకు సతోషించి దేవేంద్రుడు తన అభీష్టం కోరుకోమని అడిగాడు. “అయ్యా! నేను ఏ లోకాలనీ కోరను. నాకు ఈ వృక్షమే కైవల్యం. అయితే నాకు ఈ చెట్టు ఇవ్వడమేకాని నేన్నడును దీనికేమీ ఇవ్వలేదు. ఈ చెట్టుని మళ్ళీ సజీవంగా చేయండి” అని శుకం బదులిచ్చింది. 🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜 దేవేంద్రుడు చిలుక యొక్క సద్భావాన్ని కృతజ్ఞతాభావాన్ని మెచ్చి ఆ కల్పవృక్షాన్ని సర్వగుణాన్వితంగా చేశాడు. ఇలా ఆ శుకరాజమును ఆశీర్వదించి అందరు తీర్థయాత్రలు కొనసాగించి చివరకు లక్షీకటాక్షం సంపాదించారు. తన నిజాశ్రయాన్ని పరిత్యజించని చిలుకకు తన ధర్మవర్తనం వలన కడకు బ్రహ్మలోకం ప్రాప్తించింది. 🍁🍁🍁🍁 మనకు నీడనిచ్చిన ఇంటిని మనకు అన్నంపెట్టిన నేలతల్లిని ఎన్నడూ పరిత్యజించకూడదని ఈ కథ మనకు చెబుతున్నది. అట్లు త్యజించినవాడు కృతఘ్నుడౌతాడని శుకరాజం చెప్పింది. అలాగే మనం మనకు ప్రత్యంక్షంగా పరోక్షంగా సహాయపడ్డ వారందరితో కృతజ్ఞతా భావంతో మెలగాలని శుకరాజు మనకు చెప్పాడు. 🍁🍁🍁🍁

ఆదిత్య హృదయ స్తోత్రం ఆదిత్య హృదయం అనే ఈ స్తోత్రం సూర్యభగవానుడి ని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు. ఆదిత్య హృదయ స్తోత్రం తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం 1 దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః 2 అగస్త్య ఉవాచ: రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి 3 ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం 4 సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం 5 రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం 6 సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః 7 ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః 8 పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః 9 ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః 10 హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండక అంషుమాన్ 11 హిరణ్యగర్భహ్ శిశిరస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనహ్ 12 వ్యోమనాథ స్తమోభెదీ ఋగ్ యజుస్సామ పారగః ఘన వృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః 13 ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః 14 నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః తెజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే 15 నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయె నమః జ్యోతిర్గణాణాం పతయే దినధిపతయే నమః 16 జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమస్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః 17 నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః 18 బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషె నమః 19 తమొఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనె కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః 20 తప్త చామీక రాభాయ హరయే విష్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే 21 నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః 22 ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం 23 వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వేషు రవిః ప్రభుః 24 ఏనమాపత్సు కృత్ శ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవః 25 పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి 26 అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం 27 ఏతత్ శృత్వా మహాతెజా నష్టశొకొభవత్తదా ధారయామాస సుప్రీతొ రాఘవహ్ ప్రయతాత్మవాన్ 28 ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ 29 రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ సర్వ యత్నేన మహతా వధె తస్య ధృతోభవత్ 30 అథ రవి రవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి .

*TTD e-Books:* తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక మంచి పని చేశారు. వారి మొత్తం ప్రచురించిన అన్ని పుస్తకాలను పిడిఎఫ్ (PDF ) ప్రతులు గా మార్చి ఉచితంగా చదువు కోవడానికి వీలుగా INTER NET లో అందు బాటు లోకి తెచ్చారు. వాటిని ఉచితంగా DOWNLOAD కూడా చేసుకోవచ్చు . మహా భారతం , పోతన భాగవతము, అన్నమయ్య సంకీర్తనలు ,త్యాగరాజ కీర్తనలు, వంటి ఎన్నోఅరుదయిన మంచి రచనలు , పుస్తకాలు మనకు ఇప్పటికయినా అందు బాటు లోకి తేవడం ఒక ప్రయోజనం. సప్తగిరి సచిత్ర మాసపత్రిక కూడా అన్ని భాషల్లో ఉచితం గా చదువు కోవచ్చు . 👇 *Link click here:* ebooks.tirumala.org. *Please share with friends and relatives....*👍👌👍💐💐