7, నవంబర్ 2020, శనివారం

పోయిన వాటిని దొరికే మంత్రం

ఈ మంత్రం పోయినవాటిని తిరిగి తెస్తుందా..
🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏

.ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా, ఇంట్లో ఎవరైనా చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయినా, భార్యా భర్తల మధ్య మనశ్శాంతి కరువయినా ఒకేఒక మంత్రం నిరంతరం స్మరిస్తూ ఉంటే పోయినవన్నీ తిరిగి లభిస్తాయి. 

ఇంతకీ ఏమిటా మంత్రమని ఆలోచిస్తున్నారా? 

అదే కార్తవీర్యార్జున మంత్రం. ....
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్పూర్తిగా స్మరిస్తే పోయినవి తిరిగి మనకిదొరుకుతాయి. అది డబ్బైనా, మనశ్శాంతి అయినా లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళయినా మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుందని చెపుతున్నారు మన పండితులు. 

ఆ మంత్రం ఈ విధంగా ఉంటుంది.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
ఓం కార్తవీర్యార్జునో నమః రాజ బాహు సహస్రవాన్తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే..!!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఈ మంత్రాన్ని మన మనసులో కోరిక చెప్పుకుని రోజూ పూజ చేసేటప్పుడు స్మరిస్తే పోయినవాన్ని తిరిగి మనకు దక్కుతాయి. 

ఇంతకీ ఈ కార్తవీర్యార్జునుడు ఎవరూ అంటేసాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశ. 

తను చేతిలో ఉండటం వల్లే విష్ణుమూర్తి రాక్షసులని సంహరించ గలుగుతున్నాడు అనే గర్వం ఏర్పడటంతో అది గ్రహించిన స్వామి సుదర్శనుని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు. 

కాని భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు. చేతులు లేకుండా పుట్టిన ఇతను దత్తాత్రేయుడిని పూజించి వెయ్యి చేతులు కలవాడిగా మారతాడు. అందుకే ఇతనిని సహస్రబాహు అని కూడా అంటారు. అంతేకాదు తనకి కేవలం శ్రీ హరి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం రాకుండా ఉండేలా వరాన్ని కూడా పొందుతాడు. 

ఇతను ఎంత బలశాలి అంటే అతి పరాక్రమవంతుడైన రావణాసురుడిని ఒక యుద్ధంలో బంధించి తన రాజ్యానికి తీసుకుని పోయి తరువాత పులస్త్య మహర్షి అభ్యర్ధన విని అతనిని వదిలేస్తాడు.

ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మాహిష్మతిపురము. ఇతని పురోహితుడు గర్గ మహర్షి. ఒకసారికార్తవీర్యుడు వేట కోసమై అడవికి వెళ్తాడు. అక్కడ అలసిపోయి దగ్గరలో ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన కార్తవీర్యునికి స్వాగతం పలికిజమదగ్ని విశేషమైన విందు పెడతాడు. అంత రుచికరమైన ఆహారపదార్థాలు కామదేనువు సంతతి అయిన గోమాత ద్వారా లభించాయన్న నిజం తెలుసుకుని దానిని తనకి ఇచ్చేయ్యమని అడుగుతాడు, అందుకు జమదగ్ని నిరాకరించటంతో మహర్షి తలను ఖండించి ఆ గోమాతను తీసుకెళ్ళిపోతాడు. 

ఆశ్రమానికి తిరిగివచ్చిన జమదగ్ని కొడుకు పరశురాముడు విషయం తెలుసుకుని కార్తవీర్యునితో పాటు 21 మంది క్షత్రియులని చంపుతానని శపథం పూనుతాడు. అన్న మాట ప్రకారమే కార్తవీర్యుడిని సంహరిస్తాడు. 

పరశురాముడు విష్ణుమూర్తి అవతారం కావటంతో కార్తవీర్యుని కోరిక కూడా తీరి మళ్లీ శ్రీహరి చేతిలో సుదర్శునుడిగా మారి, గర్వం విడిచిపెట్టి తన జన్మ సార్ధకం చేసుకుంటాడు.

అలా అతి బలపరాక్రముడు అయిన కార్తవీర్యుడు తనకు లేని చేతులని తపస్సు చేసి పొందటమే కాకుండా శ్రీహరి చేతిలో ప్రాణాలు విడిచి మళ్లీ అతని కుడి చేతిలోనే సుదర్శన చక్రమై ఆజన్మాంతం నిలిచి ఉంటాడు.

స్వస్తి......

👉**సనాతన ధర్మస్య రక్షిత-రక్షిత

.

5, నవంబర్ 2020, గురువారం

తులసి మొక్క ప్రాధాన్యత

తులసి మొక్క ప్రాధాన్యత

భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసిలేని హిందువుల ఇల్లు
ఉండదు. తులసి లక్ష్మీ స్వరూపం.

అసలు తులసి మొక్కకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? తులసి ప్రత్యేకత ఏమిటి?

మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే, అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. మనకు అవి తెలియవి, అంతే. తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం.

మాములు మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజెన్ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్వన్-డై-ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి.

కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని మన భారతీయుల పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు.

తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసి కున్న ఘాటైనవాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు.

అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుకా కూడా తులసిమొక్కను పెట్టి పూజించమన్నారు, ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి.

తులసిలో విద్యుఛ్చక్తి అధికంగా ఉందని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వేదంలో కూడా వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి ప్రస్తావన ఉంది.

తులసి ఏ ఇంటిలో ఉంటే, ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు.

తులసిలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని మనం శరీరం గ్రహిస్తే, ఆరోగ్యం చేకూరుతుంది, అందుకోసమే తులసమ్మకు నీరు పోసి, చుట్టు ప్రదక్షిణం చేయాలి. అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా, ఆరికాళ్ళలోకి చేరి, నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది.

తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంధాలు చెప్పాయి. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడ అంగీకరించారు.

ప్రపంచాన్ని హడలుగొట్టిన స్వైన్‌ప్లూ భారత్‌లో స్వైరవిహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది.

తులసి గాలి కారణంగా జనంలో స్వైన్‌ప్లూను తట్టుకునే రోగనిరోదక శక్తి పెరిగిందట.

అంటే మన తులసమ్మ మనకు ఆయుషు పోసిందన్నమాట. ఏ ఇంట్లో అధికంగా తులసిమొక్కలు ఉంటాయో, ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు.

తులసిచెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. తాజ్‌మహల్ కాలుష్యం బారినపడి మసకబారకుండా ఉండడం కోసం, తాజ్‌మహల్ పక్కనే, లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు.

అట్లాగే తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయి. కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కైనా పెంచాలి.

నల్గోండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తోంది. తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్ వ్యాపితిని తగ్గిస్తాయని ఈ మధ్యే దృవీకరించారు.

మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే, రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఇది తులసి మహాత్యం.

తులానాం నాస్తి ఇతి తులసి అన్నారు, దేని గురించి ఎంత చెప్పుకున్నా, ఇంకా చెపుకోవలసినది మిగిలి ఉంటుందో, దాన్ని తులసి అంటారని అర్దం.

తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతారు .

2, నవంబర్ 2020, సోమవారం

మీ భాగ్యరేఖ మీరే రాసుకోండి

ఒకసారి ఒక వ్యక్తికి దారిలో యమధర్మరాజు కలిశారు. అయితే ఆ వ్యక్తికి అతను యమధర్మరాజుని తెలియదు. యమధర్మరాజు ఆ వ్యక్తిని తాగడానికి నీళ్ళు అడిగారు. ఒక క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే, వెంటనే యమధర్మరాజుకు *నీళ్లు* ఇచ్చాడు. నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు వ్యక్తితో చెప్పాడు నేను నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యముని కానీ నీవు తాగడానికి నాకు నీళ్ళిచ్చి నా దప్పిక తీర్చావు. కావున నీ తలరాత మారడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని , యమధర్మరాజు ఆ వ్యక్తికి ఒక *డైరీ* ఇచ్చారు. నీకు ఒక ఐదు నిమిషాలు సమయం ఇస్తున్నాను ఇందులో నీకు ఏమి కావాలో రాసుకో అది *జరుగుతుంది* కానీ గుర్తుంచుకో నీకు సమయం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే. ఆ వ్యక్తి డైరీ తీసుకుని ఓపెన్ చేసాడు. మొదటిపేజీలోనిది చదివాడు అందులో తన పక్కింటాయనకు "లాటరీ రాబోతోంది అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు" అది చదివి ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు అని రాశాడు. తర్వాత పేజీ చదివాడు, "తన స్నేహితుడు ఎన్నికలలో గెలిచి మంత్రి పదవి రాబోతోంది " అది చదివి అతడు ఓడిపోవాలి అని రాశాడు. ఈ విధంగా ప్రతి పేజీ చదువుతూ చివరికి ఖాళీ ఉన్న పేజీలో తనకు కావలసింది రాయలని అనుకోగా ఈలోపే యమధర్మరాజు ఆ వ్యక్తి చేతినుండి డైరీని తీసుకుని నీకు ఇచ్చిన ఐదు నిమిషాల సమయం పూర్తి అయ్యింది. ఇప్పుడు నీవు ఏమి రాయకూడదు. *నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల చింతన చేయడంలో సమయం వృధా చేసుకున్నావు. నీ జీవితాన్ని స్వయంగా నువ్వే కష్టంలోకి నెట్టు కున్నావు* నీ యొక్క మృత్యువు నిశ్చితం అయింది అని డైరీ తీసుకున్నాడు యముడు . ఆ వ్యక్తి చాలా పశ్చాతాప పడ్డాడు. వచ్చిన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నాడు.

 ఈ కథ యొక్క *అర్థం* ఏమిటంటే భగవంతుడు మనందరినీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో *అవకాశాలు* ఇస్తాడు. కానీ మనము వ్యర్థము ఆలోచిస్తూ *ఇతరులకు చెడు చేస్తూ* మన సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాము. ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారి పైన సదా *భగవంతుని కృప నిండి ఉంటుంది.* 

ఈ సంగమయుగంలో భగవంతుడు కలం మనచేతికి ఇచ్చి "మీ భాగ్యరేఖ మీరే రాసుకోండి "అని అవకాశం ఇస్తున్నారు. కానీ మనము పర చింతన చేస్తూ సమయము వృధా చేసుకుంటున్నాము. మన అదృష్టాని మనమే వంచన చేసుకుంటున్నాం... 

ఓం శాంతి🙏

ఆదిత్య హృదయం- విశిష్టత


ఆదిత్య హృదయం వాల్మీకి రామాయణం లో యుద్ద కాండలో చెప్పబడింది. ఈ స్తోత్ర పారాయణం అనేక సమస్యలను తొలగిస్తుంది. ఆర్ధిక, ఋణ సమస్యలను మరియు ఆరోగ్య సమస్యలను ఈ స్తోత్ర పారాయణం తగ్గిస్తుంది. ముఖ్యంగా నేత్ర సమస్యలకు ఈ స్తోత్రం బాగా ఉపకరిస్తుంది. తీవ్ర వృత్తి సమస్యలలో ఉన్న వారు, జాతకంలో రవి గ్రహంచే బాధలు పొందేవారు మరియు 1, 10, 19,28 తేదీలలో జన్మించిన వారు ఈ స్తోత్రం ను ప్రతిరోజూ పారాయణం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ స్తోత్రం ను ప్రతిరోజూ 6 సార్లు పారాయణం చేస్తూ ఆదివారాలందు పగటిపూట ఉపవాసం ఉండాలి. ఈ విధంగా 60 రోజులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ 60 రోజులు అన్ని నియమాలను పాటించాలి. అదే విధంగా తీవ్ర అనారోగ్యం తో బాధపడుతున్నవారు ఈ స్తోత్రం ను ప్రతిరోజూ పారాయణం చేస్తూ ఆదివారాలందు గోమాతకు గోధుమలను నివేదించాలి. వీలుంటే ఆదివారములందు సూర్యదేవాలయంలో 60 ప్రదక్షిణాలు చేసి 36 సార్లు ఈ స్తోత్రంను పారాయణం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. యే కోరికను ఆశించకుండా ఈ స్తోత్రంను ప్రతిరోజూ చదివినట్లైతే అన్ని సమస్యలు తొలగి సూర్య సాయుజ్యన్ని పొందుతారు. రధసప్తమి రోజు ఈ స్తోత్రంను పారాయణం చేస్తే సమస్త భోగాలు లభిస్తాయి. .

మహామహితాన్వితమైన ఈ స్తోత్రంను ప్రతిరోజూ సూర్యభగవానునకు అభిముఖంగా నిలబడి ప్రతి రోజు పారాయణం చేస్తే అన్నీ జాడ్యాలు నశిస్తాయి. పూజా మందిరం లో లేదా గృహంలో ఎక్కడైనా కూర్చుని చదువుకోవచ్చు. మంచి ఫలితాలకు ప్రతి రోజు సూర్యోదయ మరియు సూర్యాస్తమయ సమయాలలో పారాయణం చేయాలి.. ఇంతటి మహిమ కలిగిన ఈ స్తోత్రం ఈ క్రింద ఉదహరింపబడింది. అందరూ తప్పనిసరిగా ప్రతిరోజు పారాయణం చేసి సకల రోగ,ఋణ ఆర్ధిక మరియు వృత్తిబాధల నుండి విముక్తిని పొందండి.

*ఆదిత్యహృదయం*

తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ |
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || ౧ ||
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ |
ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః || ౨ ||
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ |
యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి || ౩ ||
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్ |
జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివమ్ || ౪ ||
సర్వమంగళ మాంగళ్యం సర్వపాపప్రణాశనమ్ |
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ || ౫ ||
రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతమ్ |
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ || ౬ ||
సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః || ౭ ||
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః |
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః || ౮ ||
పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః |
వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః || ౯ ||
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ |
సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః || ౧౦ ||
హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ |
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ || ౧౧ ||
హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః |
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః || ౧౨ ||
వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః |
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః || ౧౩ ||
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః |
కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః || ౧౪ ||
నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః |
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోఽస్తు తే || ౧౫ ||
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః || ౧౬ ||
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః || ౧౭ ||
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః |
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః || ౧౮ ||
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే |
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః || ౧౯ ||
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః || ౨౦ ||
తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే |
నమస్తమోఽభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే || ౨౧ ||
నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః |
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః || ౨౨ ||
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః |
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్ || ౨౩ ||
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ |
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః || ౨౪ ||
ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ |
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ || ౨౫ ||
పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ |
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి || ౨౬ ||
అస్మింక్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వా తదాఽగస్త్యో జగామ చ యథాగతమ్ || ౨౭ ||
ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోఽభవత్తదా |
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ || ౨౮ ||
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ |
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ || ౨౯ ||
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ |
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ || ౩౦ ||
అథ రవిరవదన్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః |
నిశిచరపతిసంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి || ౩౧ ||

*ఓం శ్రీ సూర్య దేవాయ నమః*

పరమాత్మ పట్ల కృతజ్ఞతా? కృతఘ్నతా?:


ఈ శరీరంలో నిలబడడం (భుక్తి) కోసం, మనము, మనకు నిర్ణయించిన కాలమునకు, మన పనిని మనము, చేయుచున్నామా లేదా? ఉదా:-ఒక ఉద్యోగికి ఉదయం 10 గం|| ఆఫీసు. ఆ టైమ్ కు వెళుచున్నాడా లేదా? ఒక కూలి ఉదయం 8 గం|| వెళ్ళుచున్నాడా?, ఒక కార్మాగార ఉద్యోగికి మధ్యాహ్నం 2గం|| లకు duty కరెక్టుగా ఆ timeకు వెళ్లుచున్నాడ లేదా?, ఒక వ్యాపారి ఉదయం 8గం|| వ్యాపారం ప్రారంబించాలి, చేస్తున్నాడా లేదా?, ఇంట్లో ఇల్లాలు తన భర్త పిల్లలు ఉదయాన 7గం|| బయలుతేరి వెళ్లాలంటే, పాపం ఆ ఇల్లాలు, వేకువజామునే ఏ నాలుగింటికో లేచి, కాలకృ త్యాలు తీర్చుకొని, పిల్లలకు, భర్తకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఉదయం 7గం||కు, సిద్దం చేసి వారి వారి విధులకు, భంగం కలగకుండా వారిని, పంపుతోందా?, పైన వివరించిన వివిధ పనులు వివిధ సమయ పాలన ఎందుకు. కేవలం భుక్తి కొరకు. మన సంసారం పిల్లలు అందరి శరీరాలు భుక్తితో నిలబడడానికేనా? బాగా ఆలోచించండి? మరి ఒకొక్కరూ రోజుకు 8గం||లు, మరీ అదనపు ఆదాయం ఇస్తామంటే, ఇంకా ఎక్కువ గంటలు పనిచేయడం లేదా? మరి భగవంతుడు మనకు ఈ మానవ శరీరం, మానవ ఉపాధి ఇవ్వకపోతే, ఇవన్నీ మనము చేయగలమా? మాన ఉపాధి కాక (ఏ కుక్కో, ఏ పామో, ఏ బల్లో) ఉపాధి అయితే ఇవన్నీ సాధ్యమా? ఈ జనజీవనంలో మిగతా ఉపధులను మనము చూడడంలేదా? అవి ఎలా బ్రతుకుతున్నాయో, మనము నిత్యమూ చూడడంలేదా? అవి ఉపాధులు కావా వాటికి జీవం లేదా? అవి బ్రతకడంలేదా? వాటికి క్రమశిక్షణ ఉన్నదా? మంచి చెడులు ఆలోచించే జ్ఞానము కలదా? మరి భగవంతుడు మనకు ఇంతగొప్ప ఉపాధిని ఇచ్చి దీనితో వేదములు, ఉపనిషత్తులు, పురాణములు చదివి, విని అర్ధంచేసుకొనే శక్తినిచ్చి, పెద్దలు చెప్పిన విధముగా బ్రతుకమని, నిత్యమూ ధర్మమును గురించి ఆలోచించుచూ, సత్త్య భాషణమే చేయుచూ, పరోపకారియై, ధర్మాన్ని రక్షించుచూ, నిత్యమూ భగవంతుని పూజలో, భగవంతుని ధ్యానముతో బ్రతుకమని భగవంతుడు మనకు అవకాశము ఇస్తే దానిని ఇలా వృధా చేయడం న్యాయమా?

పరమాత్మకు మనము మాతృ గర్భములో ఉన్నప్పుడే పరమాత్మను ప్రార్ధించాం, ప్రమాణము చేశాము.పరమాత్మా నన్ను త్వరగా ఈ (మురుకి కూపమునుండి) మాతృగర్భము నుండి బయట పడవేయుము. బయటకు వచ్చిన తర్వాత నేను నీకుకృతజ్జ్ణుడుగా (నన్ను ఈమురుకి కూపమునుండి బయట పడ వేసినందుకు) ఉంటూ నిత్య పూజలతో, భజనలతో, ధ్యానముతో నిన్ను మరువను, పొరపాటునకూడ ఈ సంసార బంధనములో చిక్కుకోను, నన్ను నమ్ము అని మాట ఇచ్చి, పరమాత్మకు ప్రమాణము చేసి, ప్రస్తుతము మనము చేయుచున్న దేమిటి? ఒకసారి హృదయ ము మీద చేయి వేసుకొని ఆలోచించి నిస్పక్ష పాతముగా చెప్పండి? రోజూ, ఒక గంటసేపైనా స్వామికి పూజ చేయడానికి మనకు, తీరిక, సమయము లేదా? పురాణ కధలు వినడానికి, తీరిక, సమయము లేదా? ఇంతగొప్ప ఉపాధిని ఇచ్చిన పరమాత్మను, ఆలయమునకు వెళ్ళి చూడడానికి, ఆలయములకు వెళ్ళడానికి, తీరిక, సమయము లేదా? మిగతా అడ్డమైన తిరుగుళ్ళు తిరగడానికి, అడ్డమైన పనులు చేయడానికి, సోల్లు కబురులు చెప్పుకోవడానికి, పరనిందలు చేయడా నికి, తీరిక, సమయమూ, పుష్కలంగా ఉందా? ఒక్కసారి బాగా లోతుగా ఆత్మవిమర్శ చేసుకొని గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి?

నిజం చెప్పాలంటే మనము పరమాత్మ పట్ల చూపు వినయము,విధేయత, చేయు సేవ, దాస్యము,ధ్యానమూ పూజ, హోమము కేవలం పరమాత్మ కొరకు మాత్రమేకాదు. మన అభ్యున్నతికి, మన చుట్టూ ఉన్న సమాజము అభ్యున్న తికి, మన పిల్లలూ, వారి పిల్లలూ (వంశాబివృద్ధికి, దేశాభివృధికి) అభివృద్ధికి మాత్రమేనని మరచిపోకండి. ఈ మానవ ఉపాధి, శరీర పోషణకు ఆహారము, నీరు, గాలి, వెలుతురు ఎంత అవసరమో, మనలోని జీవాత్మకూ, పరమాత్మల పోషణకు సత్యభాషణమూ, ధర్మానుష్టానమూ, నిత్య పూజ, నిరంతర స్మరణ అంతే అవసరము. 

దుర్ముహూర్తం?

దుర్ముహూర్తం అంటే ఏమిటీ? ఎలా ఏర్పడుతుంది?*

మానవ నిత్య జీవితంలో ఎన్నో సంస్కారాలు చేయాల్సి ఉంటుంది. వాటి నిర్వహణకు శుభ ముహూర్తాలు అవసరమవుతాయి. అయితే శుభ ముహూర్తాలతో పాటు దుర్మూహూర్తాలపై కూడా అవగాహన ఉండాలి. అప్పుడే మనం మంచి ముహూర్తమేంటో అర్థం చేసుకోగలము.

నక్షత్ర ప్రమాణమును బట్టి విడువ తగిన కాలమును వర్జ్యం అంటారు. దినప్రమాణమును బట్టి, వారమును బట్టి విడువ తగిన కాలమును దుర్మూహుర్తం, రాహూకాలము అంటారు.

గ్రంథాలలో దుర్మూహుర్తమును మాత్రమే చెప్పారు.

రాహుకాలంను గూర్చి చెప్పినట్లుగా లేదు. రాహు కాలమును తమిళులు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. మన ప్రాంతమున వర్జ్యము, దుర్మూహూర్తమును పాటిస్తే సరిపోతుంది.

దుర్ముహూర్తం వారమునకు సంబంధించిన దోషము. ఇది సూర్యోదయము 6 గంటలకయ్యేటప్పుడు దుర్మహూర్తం ఈ విధముగా వచ్చును. దీని ప్రమాణం 48 నిమిషాలు, ఆదివారం సాయంత్రము 4-32కు. సోమవారం మధ్యాహ్నం 12-28 మరల 2-58కు మంగళవారం ఉదయం 8-30కు, మరల రాత్రి 11-50కు, బుధ వారం ఉదయం 11-41కు, గురువారం మధ్యాహ్నం 2-54కు, శుక్రవారం మధ్యాహ్నం 12-28కు శనివారం ఉదయం 2-40కు దుర్మహూర్తం వచ్చుచుండును. ఘడియల్లో ఆది-26, సోమ-16, 22 మంగళ-6 మరల రాత్రి 11-50 బుధవారం-11ఘ, గురువారం-10, శుక్ర-16 శని-4 ఘడియలకు వచ్చును.

పంచకరహితము

ముహూర్తం ఏర్పరచుకొను నాటికి తిధి, వార, నక్షత్ర లగ్న సంఖ్యలను కలిపిన మొత్తమును 9చేత భాగించగా శేషము 3-5-7-9 ఉన్న ముహూర్తములు రహితమైనవని గ్రహించాలి. 1 మిగిలిన మృత్యు పంచకం అగ్నిపంచకం, 4 రాజపంచకం, 6 చోరపంచకం, 8 రోగపంచకం ఇవి దోషకరమైనవి.

శూన్యమాసము

శూన్యమాసములో ఎటువంటి శుభకార్యం చేయరాదు. శూన్యమాసం, ఆషాఢం, భాద్రపదము, పుష్యం.. ఇవికాక మీన, చైత్రము, మిధునాషాఢము, కన్యాభాద్రపదము, ధనుఃపుష్యము. ఇవి శూన్యమాసములే సూర్యుడు ఆయా రాసులలో ఉన్నప్పడు శుభకార్యముల గూర్చి తలపెట్టరాదు.

మూఢము లేక మౌఢ్యమి

రవితో కలసి గురు శుక్రులలో ఎవరైనను చరించు వేళను మూఢమందురు. అస్తంగత్వ దోషము ప్రాప్తించుటతో శుభమీయజాలని కాలమిది. కాబట్టి ఎలాంటి శుభకార్యములైనను ఈ కాలములో జరుపరాదు.

కర్తరి - ఏయే కార్యములయందు జరిగించరాదు ?

కర్తరి అనగా సూర్యుడు భరణి 4పాదమున కృత్తిక 4వ పాదములలోను, రోహిణి 1వ పాదమున సంచరించు కాలమును కర్తరి అంటారు. భరణీ 4వపాదము డొల్లకర్తరి అంత చెడ్డదికాదు. మిగతా కాలమంతయు చాలా చెడ్డది. గృహనిర్మాణాది కార్యములు, నుయ్యి త్రవ్వట, దేవతా ప్రతిష్ట మొదలగు ఈ కాలంలో చేయరాదు.

త్రిజ్యేష్ట విచారణ

తొలుచూలు వరుడు, తొలిచూలు కన్యక జ్యోష్ట మాసం వీటి మూడింటిని త్రిజ్యేష్ట అని అంటారు. వీనిలో ఒక జ్యేష్టం శుభకరం. రెండు జ్యేష్టములు మధ్యమం. మూడు జ్యేష్టములు హానీ. కాని తొలిచూలు వరకు ద్వితీయాది గర్భజాతయగు కన్యను తొలిచూలు కన్య ద్వితీయాది గర్భజాతకుడగు వరుని పెళ్లాడినప్పుడు జ్యేష్టమాసం శుభకరమైందే.

ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి ? ఏ ముగ్గును ఎక్కడ, ఎప్పుడు వేయాలి ?మన ధర్మంలో ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి? ఏ ముగ్గును ఎక్కడ,ఎప్పుడు వేయాలి?


ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.

ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.

నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.

తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.

నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.

దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.

ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవరు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైదవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.

పండుగ వచ్చిందా కదా అని, నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు.

ముగ్గులు రోజు వేయలేక పేంట్ పెట్టస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి.

నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.

ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.

ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మన ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి.

హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు.....



[1] సంతాన గోపాల పశుపత రుద్ర హొమం

ఈ హొమం చేసినందు వల్ల సంతాన దోషాలు తొలగి సత్ సంతానము కలుగును,



[2] మహా మృత్యుంజయ హొమం
ఈ హొమం వల్ల అనారోగ్యం తొలగి ,అపమృత్యు భయం ,దీర్గాయుషునుఇవ్వగలదు .



[3] నవగ్రహ ,నక్షత్ర హొమం
గ్రహ దోషాలు తొలగి ,సర్వ కార్య సిద్దికి ,ఆరోగ్యము ,సర్వ గ్రహ ప్రసన్నత లభిస్తుంది




[4] లక్ష్మి గణపతి హొమం
సర్వ విగ్నములకు ,సర్వ దోషములకు ,ఉద్యోగ ప్రాప్తికి ,విద్యాభి వృద్దికి




[5] రుణవిమోచన గణపతి హొమం
రుణ భాదలు తొలగుటకు మార్గం దొరకుతుంది మనో ధైర్యము పెరుగుతుంది



[6] రుద్ర హొమం
ఇది సంసారములో ఉన్న మనస్పర్ధలు తొలగి ఆనందమైన జీవితమునకు ఉపయోగ పడుతుంది



[7 ] ఆయుష్షు హొమం
ఇది అయురరోగ్యములను ప్రసాదిస్తుంది



[8] కుబేర పశుపత హొమం
ఇది సకల వ్యాపారములకు ,ధన సంపాదనకు ఉపయోగ పడుతుంది


[9] చండి హొమం
ఇది సర్వ గ్రహ దోషాలకి ,రాహు కేతు ,దోషాలకి ,అలస్యపనులకి ,సర్వ కార్య సిద్ది కి అవుతుంది


[10] సుదర్శన హొమం
సర్వ శత్రు జయము, సర్వకార్య సిద్ది,మనో బలం ,తేజస్సు కు ఉపయోగ పడుతుంది


[11] ధన లక్ష్మి హొమం
ధన ,దాన్య సమ్రుద్దికి ,సుక సంతోషాలకి ఉపయోగ పడుతుంది

18, అక్టోబర్ 2020, ఆదివారం

భరోసా

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿,
*మనిషికి మనిషి భరోసా*
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
అనగనగా, ఒక పిరికివాడు ఓ స్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి...కొంచెం దూరంలో ఎరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా స్మశానం దాటేసాడు... ఇంతకీ ..ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట!...కాని కేవలం వాడికి వీడు..వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని స్మశానం దాటేలా చేసింది.నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే... నేను ఉన్నాను అనే భరోసా...ఒక మాట సాయం...ఏమి కాదు నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడు..మనిషికి ఎంత బలం వస్తుందో..ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు.****ఓ సారి ఒకాయన తన కారులో ఓ గ్రామానికెళ్తుంటే, కారు దారిలో ఓ బురదగుంటలో దిగబడిపోయింది. సాయంకోసం చుట్టూచూస్తే ఓరైతు కనపడ్డాడు. పరిస్థితిచూసిన రైతు, "ఉండండి, నా ఎద్దుతో కారును బైటికి లాగుదాం" అని దగ్గరలోని తన పొలంనుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్నిచూస్తూనే ఆ పెద్దమనిషి నిరాశతో ఉసూరుమన్నాడు!రైతు ఎద్దుని కారు ముందు తాడుతో కట్టి, "ఓరేయ్ రాజూ, అంజీ, నందీ! ఎంటిరా ఆలోచిస్తున్నరూ, తిన్నదంతా ఏమైంది, బండిని లాగండిరా" అని ఉత్సాహంగా అదిలించాడు. అంతే! రాజు ఆ కారుని ఒక్క ఊపుతో బైటికి లాగేసింది. పెద్దాయన ఆశ్చర్యంతో, " సర్, ఉన్నది ఒక ఎద్దేకదా, మీరేంటీ‌, అన్ని ఎడ్లు ఉన్నట్టు అదిలించారు?"రైతు, "ఈ రాజు బక్కదే కాదండి, గుడ్డిది కూడా! ఐతే, తనుకాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది, అంతే! పూర్తి నమ్మకం తో చేస్తే, ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయచ్చు!"రైతు తెలివికీ, సమయస్ఫూర్తికీ ఆ నగరవాసి తలమునకలయ్యాడు!******పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే, అంటే అలాంటి ధైర్యమే కారణం..ఉమ్మడి కుటుంబాలలో 'మేము ఉన్నాం' అనే భరోసా కారణం...కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లో పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు..బంధువులు నీ చుట్టూ లేక పోవటం...కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇద్దాం...అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేద్దాం..ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి.🙏🏻🙏🏻🙏🏻

గాయత్రి దేవి అంటే ఎవరు ?

_*గాయత్రి దేవి అంటే ఎవరు ?*_

*గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న దేవతా శక్తులు...*
*మహా శక్తి వంతమైన గాయత్రి మంత్రాక్షరాలు ....*
*తల్లిని మించిన దైవం , గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా ...*

ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా , ‘నా , స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో , దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని . అగ్ని నుండి వాయువు , వాయువు నుండి ఓంకారం , ఓంకారంతో హృతి , హ్రుతితో వ్యాహృతి , వ్యాహృతితో గాయత్రి , గాయత్రితో సావిత్రి , సావిత్రితో వేదాలు , వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతుదిన్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.

గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు , వారి చైతన్య శక్తులు:

*1. వినాయకుడు:* సఫలత్వ శక్తికి అధిపతి. విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ , జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.

*2. నృసింహ స్వామి:* పరాక్రమ శక్తికి అధిపతి , పురుషార్థ , పరాక్రమ , వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.

*3. విష్ణుమూర్తి:* పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.

*4. ఈశ్వరుడు:*
సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.

*5. శ్రీకృష్ణుడు:*
యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను , వైరాగ్య , జ్ఞాన , సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.

*6. రాధాదేవి:*
ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి , భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.

*7. లక్ష్మీదేవి:*
ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం , సంపద , పదవి , వైభవం , ధనం , యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.

*8. అగ్నిదేవుడు:* తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం , శక్తి , తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.

*9. మహేంద్రుడు:* రక్షాశక్తికి అధిష్ఠాత , అనారోగ్యాలు , శతృభయాలు , భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.

*10. సరస్వతి:*
విద్యా ప్రదాత. జ్ఞానాన్ని , వివేకాన్ని , బుద్ధిని ప్రసాదిస్తుంది.

*11. దుర్గాదేవి:*
దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి , శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.

*12. ఆంజనేయుడు:* నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి , నిష్ఠ , కర్తవ్య పరాయణ తత్వం , బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.

*13. భూదేవి:* ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని , ధైర్యాన్ని , దృఢత్వాన్ని , నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.

*14. సూర్య భగవానుడు:* ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని , సుదీర్ఘ జీవనాన్ని , ప్రాణశక్తికి , వికాసాన్ని , తేజస్సును ప్రసాదిస్తాడు.

*15. శ్రీరాముడు:*
 ధర్మం , శీలం , సౌమ్యత , మైత్రి , ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.

*16. సీతాదేవి:* తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి , అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.

*17. చంద్రుడు:*
శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం , క్రోధం , మోహం , లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.

*18. యముడు:* కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.

*19. బ్రహ్మ:*
సకల సృష్టికి అధిష్ఠాత.

*20. వరుణుడు:* భావుకత్వాన్ని , కోమలత్వాన్ని , దయాళుత్వాన్ని , ప్రసన్నతను , ఆనందాన్ని అందిస్తాడు.

*21. నారాయణుడు:* ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.

*22. హయగ్రీవుడు:* సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని , సాహసాన్ని ప్రసాదిస్తాడు.

*23. హంస:*
వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.

*24. తులసీ మాత:* సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి , దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.

*శ్రీ గాయత్రీ మాత మహాత్యం :*
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.
*ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత* *త్సవితుర్వరేణ్యమ్*
*భర్గో దేవస్య ధీమహి* *ధియో యోనః* *ప్రచోదయాత్*
ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.

త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం , సంకల్ప బలం , ఏ కాగ్రత , ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం , గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ , వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని , ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలోనప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి , కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ *‘ఓం నమో గాయత్రీ మాత్రే’* అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.

బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ , నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి , సృష్టి ఉత్పత్తి , వర్తన , పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ ఋషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహాఋషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.

*గాయత్రి మంత్రాక్షరాలు :*
సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం
సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే
*‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’*
గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం , గాయత్రిని మించిన దైవం లేదు. *‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’* శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి , దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా , 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి.
సర్వం శివసంకల్పం

నేటి మాట

💦🌺🌻🌸💦🌺

         🌹నేటి మాట.🌹

*_ఏది నిజం.... ఏది అబద్దం... ఏది తప్పు... ఏది ఒప్పు... ఎటు చుసిన ఏమున్నది. మనుసులు, మనుసులకి ముసుగులువేసుకొని బ్రతికేయడం తప్ప..._*

*_ఈ రోజుల్లో డబ్భుకు ఉన్న విలువ మనిషికి లేదు.. అందులో మనుసుకి అసలే... లేదు. డబ్బుతో అన్ని వస్తాయి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఇవ్వన్నీ వస్తాయి. అందుకే మనిషి డబ్బును ప్రేమిస్తూ మనుషుల్ని దూరం చేసుకుంటూ..గర్వంతో ప్లాస్టిక్ నవ్వులతో, ఆప్యాతలను మరిచి ఏదోలా బ్రతికేస్తున్నాడు !!_* 

*_మిత్రమా.... జీవితంలో ఒకసారి పొతే తిరిగి రాని నాలుగు అంశాలు గుర్తుపెట్టుకో...1,కాలం. 2,మాట. 3,అవకాశం. 4,ప్రాణం. ._* 

*_జీవితంలో అత్యంత విలువైవి నాలుగు అంశాలు 1,ప్రేమ. 2,విశ్వాసం. 3,నమ్మకం. 4,మానవత్వం..._*

*_జీవితంలో వ్యక్తి పతనానికి శాసించే నాలుగు అంశాలు 1,కామం. 2,గర్వం. 3,కోపం. 4,స్వార్థం.._*

*_నమ్మకం పొతే కష్టపడి తిరిగి ఆర్జించవచ్చు కానీ, మనసే విరిగిపోతే మళ్లీ అతకడమనేది ఉట్టిమాటే..._*

*_సంపాదించడం అంటే కేవలం డబ్బునే కాదు, డబ్బు సంపాదించించాలి. డబ్బు మన దైనందిక జీవితంలో ఒక భాగం మాత్రమే..డబ్బుతో పాటు మనుషుల్ని, విలువల్ని సంపాదిస్తూ...ఆపదలో, కష్టాల్లో ఆదుకొనేవారిని, బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించాలి. మన కోపంలో అర్థం చేసుకునే వారిని సంపాదించాలి._*

*_ఇవ్వన్నీ సంపాదించుకోలేనివాడు కష్టపడి కోట్లు కూడబెట్టిన కూడా అవి కొన్ని సార్లు దేనికి పనికి రావు.._*

*_గెలిచాక, డబ్బులున్నాక నీతో నడిచే వాళ్ళకంటే... నిన్ను నిన్నుల ప్రేమించి నీ గెలుపుకై, నీ ఉన్నతికై అహర్నిశలు నీ వెంట నడిచిన వాళ్ళను ఎప్పటికి గుర్తు పెట్టుకో... ._*

*_భగవంతుడు ప్రసాదించిన ఐశ్వర్యంతో భోగాలను అనుభవిస్తూ..కొంతభాగం అనాధలకు,దీనజలకు, ధర్మకార్యముకై, వెచ్చించు. ఎవరికి సహాయం చేసిన నేను "నియమిత మాత్రుడను " ఈ మంచి పని భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు అనే తలంపుతో చెయ్ .._*

🙏* ఓం నమో వెంకటేశాయ_ ఓం నమో వెంకటేశాయ🙏_*

*_సర్వేజనాః_* *_సుఖినోభవంతు._*🙏

💦🌺🌻🌸💦🌺🌻

బ్రహ్మరాత


✍బ్రహ్మరాత✍

సర్వం..పుణ్య మయం.. సర్వం..పాప మయం..
   
అనగనగా ఓ ముని చాలా ప్రతిభావంతుడు. సకలశాస్త్రాలు, విద్యలు తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తూ అన్నపూర్ణయే. ఆమె శిష్యులను తన కన్నబిడ్డల్లా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది. 

ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో, అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ ఇట్టే అబ్బేవి. 

వసంతుడు కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చేసుకున్నాడు. 

ఇక అతనికి నేర్పడానికి తనవద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో, తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్ళకే అతనికి నేర్పడానికి తమవద్ద ఉన్న విద్యలన్నీ పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు. 

ఇదిలావుండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో, వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ, తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు క్రింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ్రమంలోపల ప్రసవం జరుగుతుండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు. 

కాసేపట్లో లోపలి నుండి చంటిబిడ్డల ఏడుపులు వినవచ్చాయి. గురుపత్ని కవలపిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భువికి దిగివచ్చిన ఒక దివ్యపురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెడుతూ, గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించి వుండేవాడు కాదు. 

కాని వసంతుడు దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతనెవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు. అతడు ''బ్రహ్మ''. అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకుని కూర్చున్నాడు వసంతుడు. బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి ''స్వామి'' మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరు అనరి వినమ్రపూరితంగా అడిగాడు. 

బ్రహ్మ తనను చూడగలిగిన ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని, వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి, ఇతరులకు తెలియజెయ్యరాని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా చెప్పాడు - నాయనా !

పూర్వ జన్మ కర్మ ల కారణంగా ఈ అబ్బాయి నిరక్షర కుక్షి అవుతాడు. ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప మరిక ఏమీ ఉండవు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కనాకష్టంగా పెళ్లాన్ని, పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు. 

ఇక ఆ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ. అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు. సాక్షాత్తూ దైవసమానులైన తన గురుదంపతులకి పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాసాడేమిటా విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు. 

వెంటనే తన గురువుగారిని బ్రహ్మ రాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు. దానికి, ఆయన అది సాధ్యం కాదు నాయనా. అది ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవడం వసంతుడికి కనిపించసాగింది. 

ఆ ఇద్దరికీ చదువులు వంటపట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా? అనే దిగులుతో, వసంతుడికి దేనిమీద ఏకాగ్రత కుదరడంలేదు. 

దానికితోడు ఆ పిల్లలిద్దరు వసంతుడి వెంటపడి అన్నయ్య, అన్నయ్య అని తిరుగుతూ వుంటే, అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. ఒకరోజు గురువుగారితో చెప్పి, ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్ళాడు. ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిసాడు. 

వారందరిని వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా? దానికి వసంతుడికి అందరు చెప్పిన సమాధానం బ్రహ్మరాత మార్చడం అసాధ్యం. అది ఎవరితరమూ కాదు అని. అలా అక్కడా ఇక్కడా తిరుగుతూ, తన అన్వేషణను కొనసాగిస్తూ ఇరవై సంవత్సరాలకు పైగా గడిపాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు పాతికేళ్ళు వచ్చాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది. 

ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడి పరిస్థితి గురువుగారి కుమారుడి పేరు శంకరుడు అని, ఆ ఊరిలోనే కూలిపని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంతసేన అని దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉందని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి, గురు దంపతులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు. 

వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్యా! అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న కటిక దారిద్య్రం ఇదీ శంకరుడి దుస్థితి. తమ్ముడూ, నువ్వు బాధపడకు. ఇప్పటినుండి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు వసంతుడు. దానికి శంకరుడు, ''సరే అన్నయ్యా! ఇకనుండి నువ్వు ఎలా చెపితే అలానే చేస్తాను'' అన్నాడు శంకరుడు. 

ముందు ఆ ఆవుని తోలుకుని పట్టణానికి వెళదాం పద అన్నాడు వసంతుడు. ఏమి మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్టణంలోని సంత దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి ఈ ఆవుని ఎంతకు కొంటావు అని అడిగాడు వసంతుడు. తరువాత అతను చెప్పిన ధరకు అమ్మేసాడు వసంతుడు. 

శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా, వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరం అయిన సరుకులను, శంకరుడి భార్యకు, పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య, పిల్లలు ఆవురావురుమని తిని ఆకలి తీర్చుకున్నారు. 

తర్వాత వసంతుడు శంకరుడితో తమ్ముడూ అన్నదానం చేద్దాం. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కాని శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్యా! ఇంతవరకు ఆ ఆవు వుంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది, ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా వుంది అని అన్నాడు. దానికి వసంతుడు తమ్ముడూ, నువ్వు ఏమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో. ప్రొద్దునకంతా సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పాడు. 

ప్రొద్దున్నే లేచి తలుపు తెరచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. శంకరుడి ఇంటిముందు ఒక ఆవు నిలబడి వుంది. శంకరుడి ఆస్తి ఎప్పుడూ ఒక్క ఆవే అని తను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మయే స్వయంగా ఒక ఆవుని తీసుకొని వచ్చి అక్కడ కట్టేసాడు. 

ఆ రోజు కూడా ఆవును తీసుకెళ్ళి సంతలో అమ్మి, వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. 

తమ్ముడూ, ఇక ఇలాగే ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంతసేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూట కట్టుకున్నాడు. 

వసంతుడు వాళ్ళని, వీళ్ళని అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు. వసంతసేన ఒక అవ్వతో కలసి ఒక ఇంట్లో ఉంటోంది. ఆమె వసంతుడిని చూడగానే భోరుమని ఏడ్చేసింది.

 అన్నయ్యా! నేను మహాపాపిని. ఈ పాపపంకిలంలో కూరుకుపోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడటానికి కూడా నాకు అర్హత లేదు అని బావురు మంది. ఊరుకో చెల్లీ! ఊరుకోమ్మా! ఈ పాపపు పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెబుతాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన. 

ఆ రాత్రికి విటులు ఎవ్వరు వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడ వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు. ఆమె ఆశ్చర్యపడుతూ అయ్యా! ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. ఆ రాత్రి ఇద్దరు, ముగ్గురు విటులు వచ్చి లక్ష వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయారు. 

అది వాళ్ళు ఊహించలేని మొత్తం. కాని అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటిరోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకూడదని, లక్ష వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తూ ఆ బ్రహ్మే నని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటివరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ పటాపంచలయ్యాయి. ఆమె జన్మ చరితార్థమైంది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి, గురుదంపతుల రుణం తీర్చుకున్నాడు. 

ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు, దానిని నిరూపించాడు. అలా బ్రహ్మ రాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపాడు వసంతుడు.
       
            🙏సర్వేజనాఃసుఖినోభవంతు🙏 ఓం నమో వెంకటేశాయ🙏

17, అక్టోబర్ 2020, శనివారం

ధర్మ_సందేహాలు__సమాధానాలు


 వాస్తు పురుషుడు ఎప్పుడు జన్మించాడు ?
 
భాద్రపద బహుళ తదియ, మంగళవారము, కృత్తిక నక్షత్రము, వ్యతిపాత యోగము, భద్రనాకరణము గుళికతో కూడిన కాలములో వాస్తు పురుషుడు జన్మించాడు.

 *ఏడుగురు అప్సరసల పేర్లు ఏవి ?*
 
1.రంభ. 2. ఉర్వశి. 3.మేనక 4.తిలోత్తమ. 5.సుకేశి. 6. ఘ్రుతాచి 7. మంజుగోష .

 *సప్త సంతానములు అంటే ఏమిటి ?*
 
1. తటాక నిర్మాణం. 2. ధన నిక్షేపం. 3. అగ్రహార ప్రతిష్ట . 4. దేవాలయ ప్రతిష్ట . 5. ప్రభంధ రచన. 
6. స్వసంతానం ( పుత్రుడు ).
 
*తొమ్మిది రకాల ఆత్మలు ఏవి ?*

 1. జీవాత్మ. 2. అంతరాత్మ. 3. పరమాత్మ.
 4. నిర్మలాత్మ. 5. శుద్దాత్మ. 6. జ్ఞానత్మ  
7. మహాధాత్మ . 8. భూతాత్మ . 9. సకలాత్మ.

 *పదిరకాల పాలు ఏవి ?*

 1. చనుబాలు. 2. ఆవుపాలు . 3. బర్రెపాలు .
 4. గొర్రె పాలు. 5. మేక పాలు. 6. గుర్రం పాలు.
 7. గాడిద పాలు. 8. ఒంటె పాలు. 9. ఏనుగు పాలు.
 10. లేడి పాలు.

 *యజ్ఞోపవీతం లొ ఎన్నిపోగులు ఉంటాయి?*

 యజ్ఞోపవీతం లొ 9 పోగులు ఉంటాయి. ఆ తొమ్మిది పోగుల్లో 9 మంది దేవతలు నివసిస్తారు. వారు  
 1. బ్రహ్మ . 2. అగ్ని. 3. అనంతుడు. 4. చంద్రుడు . 5. పితృ దేవతలు . 6. ప్రజాపతి. 7. వాయువు .
 8. సూర్యుడు . 9. సూర్య దేవతలు .

 *అష్టాదశ ఆయుర్వేద సంహితలు ఏవి ?*

 1. చరక సంహిత. 2. శూశ్రుత సంహిత. 3. పరాశర సంహిత. 4. హరిత సంహిత. 5. అగ్నివేశ సంహిత. 6. చ్యవన సంహిత. 7. ఆత్రేయ సంహిత. 8. భోజ సంహిత. 9. బృగు సంహిత. 10. బెడ సంహిత. 
11. అగస్త్య సంహిత. 12. వరాహ సంహిత. 
13. అత్రి సంహిత. 14. నారయణ సంహిత. 
15. చంద్ర సంహిత. 16. నారసింహ సంహిత. 
 17. శివ సంహిత. 18. సూర్య సంహిత.

 *గృహ నిర్మాణం ఏ విధంగా చేపడితే సర్వ సుఖాలు పొందుతారు?*

 1. ఈశాన్యం లొ పూజలు , పవిత్ర కార్యాలును నిర్వర్తించే విధంగా పూజగది ఉండాలి.
 2. ఆగ్నేయం లొ అగ్నికి సంబందించిన వంటావార్పు చేసుకొనే విధంగా వంటగది ఉండాలి.
 3. నైరుతిలో ఆయుధ సామగ్రి మొదలయిన వాటిని పెట్టుకోవడానికి ఒక గది ఉండాలి.
 4. వాయువ్యం లొ స్వతంత్రబిలాష చిహ్నములు .
 5. తూర్పు దిక్కున సూర్యునికి ప్రీతికరమైన పనులు.
 6. యమస్థానం అయిన దక్షిణం వైపు తలపెట్టి నిద్రించుట.
 7. కుభేర స్థానం అయిన ఉత్తరం వైపు చూస్తూ నిద్రలేచుట.
 8. వరుణ స్థానం అయిన పశ్చిమాన పాడిపశువులు పెంచుటకు తగిన స్థలం ఉండవలెను.
 ఈ విధంగా చేయుటవలన ఆయా దిక్కులలోని ఉన్న దేవతలు సంతృప్తి చెంది ఆ గృహములో నివసించేవారికి సర్వసుఖాలు, సర్వ సంపదలు ఇస్తారు.

 *వివిద ఫలాల నైవేద్యం - ఫలితాలు*

 కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) - భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.

 అరటి పండు - భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.

 నేరెడు పండు. - శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు.

 ద్రాక్ష పండు. - భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.
 
మామిడి పండు. - మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.

 అంజూర పండు. - భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.
 
సపోట పండు. - సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.
 
యాపిల్ పండు - భగవంతుడికి యపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు.
 
కమలా పండు. - భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.

 పనసపండు - పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.

 *పంచవిధ సూతకములు అంటే ఏమిటి ?*

 1.జన్మ సూతకము. 2. మృత సుతకము. 3. రజః సూతకం . 4. అంటు (రొగ ) సూతకం . 5. శవదర్శన సూతకం . 

 *దేవాలయాల వద్ద గృహ నిర్మాణం చేయడం దోషమా ?*

 శివాలయానికి నూరు బారుల దూరం లొపల, విష్ణువాలయముకు వెనక ఇరవై బారుల దూరం లొపల, శక్తి ఆలయముకు సమీపం లొను గృహనిర్మాణం చేయకూడదు . దీనికి వ్యతిరేఖంగా గృహ నిర్మాణం జరిగితే సఖల సంపదలు నశించి కష్టాలపాలు అవుతారు. గుడి దగ్గర ఉన్న ఇళ్ళకు ఏ వైపునైనా , ఏ మాత్రమైనా గుడి నీడ పడిందంటే దరిద్రం, ప్రాణనష్టం వంటి అనేక కష్టనష్టాలు ఎదుర్కోక తప్పదు.

 *తాంబూలం సేవించేప్పుడు తమలపాకు తొడిమ, చివర్లు ఎందుకు తుంచాలి ?*

 తాంబులం వేసుకునే ముందు తమలపాకుల తొడిమలు, చివరలు తుంచివేయాలి. ఎందుకంటే తొడిమను తినడం వ్యాదికారకం అవుతుంది. చిగుర్లు పాపానికి ప్రతీకలు అని అంటారు. కనుక తమలపాకు తొడిమలు , చివరలు తుంచిన తర్వాతే తాంబులం వేసుకొవడం ఆరొగ్య ప్రధమం . అలాగే తమలపాకులో ఉండే ఈనెలు బుద్దిని మందగింప చేస్తాయి. అందుకే తమలపాకును నమిలి మొదటగా నోటిలో ఊరిన రసాన్ని ఉమ్మివేయాలి. తొడిమలు, చివరలు తున్చివేసినా ఇంకా అవి తమలపాకులో శేషించి ఉంటాయి కనుక 

 *శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధిలో కుంచం ఉంటుంది ఎందుకు ?*

 తిరుపతి శ్రీ గొవింద రాజస్వామి వారి సన్నిదిలో కుంచం ఉండటం నిజమే . దీనికి కారణం ఈ విధంగా చెబుతారు. తిరుమల స్వామి శ్రీ వెంకటేశ్వరస్వామి కుబేరుని వద్ద అప్పు చేసాడట . దానిని తీర్చుట కొరకు ద్రవ్యాన్ని కుంచం తో కొలిసి ఇచ్చేవారట స్వామివారు. స్వామివారి పక్షాన గొవింద రాజస్వామి ఈ కార్యమును సాగించారని ఒక కధ ప్రచారం లొ ఉంది. ఆ కుంచం తన తలక్రింద ఉంచుకున్నాడు అని ప్రతీతి.

 *నవగ్రహాలకు సంభందించిన సమిధలు ఏవి ?*

 1. సూర్యుడు - జిల్లెడు. 2. చంద్రుడు - మొదుగ .
 3. అంగారకుడు - చండ్ర. 4. బుదుడు - ఉత్తరేణి .
 5. బృహస్పతి - రావి . 6. శుక్రుడు - అత్తి .
 7. శని - జమ్మి . 8. రాహువు - దర్భ. 
 9. కేతువు - గరిక .

  *ఎటువంటి స్థలం లొ గృహ నిర్మాణం చేయరాదు?*

 1. గోవుల మందలు ఉండే ప్రదేశాలలోనూ .
 2. స్మశాన భూమికి సమీపం లొను .
 3. మలమూత్రాలు విసర్జించు ప్రదేశాలలోను .
 4. ఉప్పు నేలలోను, చవుడు నేలలయందు .
 5. ఎల్లప్పుడు నీటి వుటలు గల ప్రదేశాలలోను .
 6. రాతి భూముల యందు , మిక్కిలి రక్త వర్ణం గల భూమి యందు 
 7. చెరువులను పూడ్చి గృహ నిర్మాణం చేయరాదు అలా చేయడం వలన అనేకములు అయిన పంది జన్మలు ఎత్తి రౌరవాది నరకములు అనుభవించి కష్టాల పాలవుతారు .

 *పుజాంగాలు ఎన్ని రకాలు ?*

 పుజాంగాలు 5 రకాలు.
 1.అభిగమనము - దైవాన్ని స్మరిస్తూ దేవాలయానికి వెళ్ళుట.
 2. ఉపాధానము - పూజా సామగ్రిని సంపాదించుట
 3. ఇజ్య - దూప, దీప, నైవేద్యములతో పూజించుట.
 4. స్వాద్యాయము - తనకు తానుగా మంత్రోచ్చారణ తో స్తుతించడం.
 5. యోగము - తదేకమైన నిష్టతో ధ్యానించుట .
  
 *ఏయే గృహాలకి ఎటువంటి శంఖువు ప్రతిష్ట చేయాలి ?*

 రాతితో కట్టే గృహానికి ఆ రాతితోనే శంఖువు తయారు చేసి శంఖుస్థాపన చేయవలెను . ఇటుకలతో కట్టిన గృహమునకు ఇటుకలతోనే శంఖువు చేసి ప్రతిష్ట చేయవలెను .గోడలు పెట్టక కర్రలతో , నిట్రాట లతో వేయు పాకలకు కర్రతో శంఖువు తయారు చేసి ప్రతిష్ట చేయవలెను . శంఖువును నవరత్న, సువర్ణ, తామ్ర , రజిత నాణేలతో , నవధన్యములతో పూజించి , స్థాపించవలెను . అన్ని రకాల గృహములకు కర్ర శంఖువు ప్రతిష్టించరాదు . కాష్ట శంఖువు భుమిలొ ఎంతకాలం ఉండునో అంతకాలం ఆ గృహం శుబప్రధంగా ఉండును. ఆ తరువాత ఆ గృహములలో నివసించువారికి కష్టాలు కలుగును.కావున కర్రతో చేసిన శంఖువు కంటే రాతితో చేసిన శంఖువు ఉత్తమం అని తెలుస్తుంది.

 *గృహ నిర్మాణం లొ ఇంటి కిటికీలు, ద్వారాలు ఏ విధంగా అమర్చాలి ?*

 గృహంలో కిటికీలు, ద్వారములు సమసంఖ్యలో ఉండాలి. వేటికవే విడివిడిగా సమసంఖ్యలొ ఉండాలి. కిటికీలు సరిసంఖ్యలోను , ద్వారాలు సరిసంఖ్యలొను ఉండాలి. అలమారాల గురించి శాస్త్రం లొ ఏమీ చెప్పలేదు. వాటి ఉపయోగాన్ని అనుసరించి సరిసంఖ్యో, బేసి సంఖ్యలొ నో పెట్టుకొవాలి. వాటికి స్థల నిర్ణయం కూడా చెప్పలేదు కిటికీలు , ద్వారాలు సరిసంఖ్యలో ఉన్నా చివరన సున్నా లేకుండా ఉండాలి. అనగా 10,20,30 ఇలా చివరన సున్నా రాకూడదు. అలాగే మొత్తం గృహం లొ ఉన్న ద్వారాలు, కిటికీలు అన్ని లెక్కపెట్టాలి.

 *వివిధ జన్మలు ఏవి ?*

 1. దేవతలు . 2. మనుష్యులు. 3. మృగములు.
 4. పక్షులు . 5. పురుగులు. 6. జలచరములు.
 7. వృక్షములు .

 *శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఏడుకొండల పేర్లు ?*
 
 1. వ్రుషబాద్రి . 2. నీలాద్రి. 3. గరుడాద్రి. 
 4. అంజనాద్రి. 5. శేషాద్రి. 6. వెంకటాద్రి.
 7. నారాయణాద్రి.

 *ఎవరెవరికి యే విధంగా నమస్కరించాలి?*

 1. విష్ణుమూర్తి యెక్క సర్వ అవతారాల విగ్రహాలకు మరియు శివునికి 12 అంగుళాల ఎత్తులొ చేతులు జోడించి శిరస్సు వంచి భక్తి , శ్రద్దలతో వినయంగా నమస్కరించాలి.
 2. ఇతర దేవుళ్ళకు శిరస్సు పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.
 3. గురువుకి నోటితో " నమస్కారం " అని చెప్పకుండా రెండు చేతులు జోడించి వినయవిధేయలతో నమస్కరించాలి.
 4. మహానుభావులకు , యోగులకు రెండు చేతులు వక్షస్థలం పై జోడించి నమస్కరించాలి.
 5. తండ్రికి , పరిపాలకుడికి రెండు చేతులు నోటి మీదగా జోడించి నమస్కరించాలి.
 6. తల్లికి ఉదరం పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.

  *శ్రీ చక్రం నందు గల దేవతలు ఎవరు?*

 1. వశిని . 2. కామేశ్వరి. 3. మోదిని . 4. విమల.
 5. అరుణి . 6. జయిని . 7. సర్వేశ్వరీ . 8. కాళిని .

 *ధర్మం అంటే ?*
 
  ధృతి, క్షమ , దమము, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీ , విద్య, సత్యము, అక్రోధము. ఈ పది లక్షణములు కలిగినదే "ధర్మము"

 *సహంపక్తి బోజనాల సమయం లొ అందరూ ఒకేసారి లేవాలి అంటారు ఎందుకు ?*

 సహంపక్తి బోజనానికి కూర్చున్న వారందరి జీవన ప్రమాణం ఒకేవిధంగా ఉండదు. సహంపక్తి బోజనాలలో రకరకాల వారు ఉంటారు. వారిలొ మంచివారు ఉంటారు. అలాగే చెడు అలవాట్లు ఉన్నవారు ఉంటారు. ఎవరి శరీరాల్లోని విద్యుత్ వారి వారి శరీరపు శక్తిని అనుసరించే పనిచేస్తూ ఉంటుంది . కాని సహపంక్తి లొ కూర్చున్నప్పుడు దాదాపు అందరి శరీరాల్లోని విద్యుత్ నియంత్రణ అందరిలో ఒకేలా ఉంటుంది. అటువంటప్పుడు తక్కువ శక్తితో ఉన్న వ్యక్తీ అందరికంటే ముందుగా లేచినచో మిగిలిన వారి శక్తి అతనికి ఎంతోకొంత వెళ్ళిపోతుంది.
          కనుకనే సహపంక్తి బోజనానినికి కుర్చున్నప్పుడు ఎవరు ముందు తిన్నా , ఎవరు వెనక తిన్నా , అందరూ ఒకేసారి లేవాలన్న నియమం పూర్వకాలం నుండి ఆచరణలో ఉంది.

 *దేవతా లక్షణాలు ఏవి ?*

 1. రెప్పపాటు లేకుండుట . 2. భూమి మీద పాదాలు ఆనించ కుండా ఉండుట.3. వ్యసనం లేకుండా ఉండుట.

 *నవ వ్యాకరణాలు అనగా ఏవి ?*

 1. పాణి నీయం . 2. కలాపం. 3. సుపద్మం. 
4. సారస్వతం. 5. ప్రాతిశాఖ్యం ( కుమార వ్యాకరణం ) 6. ఐంద్రం . 7. వ్యాఘ్ర బౌతికం. 
 8. శాఖటా టా యానం . 9.శాకల్యం .

 *శ్రీ రాముని జన్మనక్షత్రం , మాసం ఎప్పుడు ?*

 శ్రీ రాముడు చైత్ర మాసం , నవమి తిధిలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఆయన జన్మ నక్షత్రం పునర్వసు .

 *పర్వ దినాలలో వడపప్పుని ఎందుకు పెడతారు* 

 భగవంతుడికి ప్రతి పండగనాడు వడపప్పుని , చలిమిడిని తప్పకుండా చేసి పెడతారు. అలాగే తల స్నానం చేసి ఆయా దేవుళ్ళకి ఇష్టమైన పిండి వంటలు చేయడం వల్ల వేడి చేసి తిన్న పిండి వంటలు సరిగ్గా అరగవు . తద్వార అనారోగ్యం కలుగుతుంది.
          ఇటువంటి ఉపద్రవాలు తలెత్తకుండా ఉండటానికి కొన్ని ప్రాంతాలలో వడపప్పు, పానకం , చలిమిడి తప్పకుండా చేస్తారు . పెసరపప్పుతో చేసిన వడపప్పు తినడం వలన తిన్న పిండి వంటలు జీర్ణం అయ్యి వేడి చేయకుండా చలువ చేస్తుంది .

 *శ్రీ వారి సుప్రభాతాన్ని ఎవరు ఎప్పుడు రచించారు.?*

 శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ సుప్రబాతాన్ని రచించిన వారు శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ అనే ఆచార్యులు. వీరు అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధులైన శ్రీ మనవాల మహామునుల శిష్యులలో ప్రముఖులు వీరు క్రీ .శ . 1361 లొ జన్మించి 1454 వరకు అంటే 93 సంవత్సరాలు జీవించి ఉన్నారని పరిశోధకుల అభిప్రాయం.వీరు తమ జీవిత కాలంలో అనేక కృతులు రచించారు. వీరి రచనలలో శ్రీ స్వామివారి సుప్రబాతం అనన్య సామాన్యమైన ప్రచారం పొందింది.

 *పంచ కోశాలు అంటే ఏమిటి ?*

 1. అన్నమయ కోశం. 2. ప్రాణమయ కోశం .
 3. మనోమయ కోశం . 4. విజ్ఞానమయ కోశం .
 5. ఆనందమయ కోశం .

 *శౌచమంటే ఏమిటి ?*

 శుచి అంటే శుభ్రము , శుద్ధము . ధర్మాది పరీక్షల చేత భాహ్య అంతరములలో పరిశుద్దిని పొందుటయే " శౌచం" అనబడును. శౌచం రెండు విధములు 
 1. బాహ్య శౌచం.
 2. అంతః శౌచం .

 భాహ్య శౌచం - శరీరం పైన ఉండే మలినాలను పోగొట్టుకోవడానికి చేసే స్నానాదులు, శరీరం పరిశుద్ధం గా ఉండేందుకు పూసే సుగంద ద్రవ్యాలు వంటివి. వీటిని భాహ్య శౌచం అంటారు.

 అంతః శౌచం - మనస్సులో ఎటువంటి చెడు భావాలు లేకుండా అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద , వాత్సర్యాలు లేకుండా నిర్మలమైన అంతహకరణను కలిగి ఉండటమే అంతః శౌచం అనబడను. అంతః శౌచం మనస్సుకి సంభందించినది. కాబట్టి దీనికి శాస్త్రాలలో అదిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

 *ఏయే ప్రదేశాల్లో జపం చేస్తే ఎంతెంత ఫలితం ?*

 ఇంట్లో చేసే జపానికి సత్ఫలితమే ఉంటుంది . కాని ఇంట్లో జపం చేస్తే అంతే ఫలితం ఉంటుంది. అదే జపాన్ని నది పరీవాహక ప్రాంతాల్లో చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది . గోశాలలో చేసే జపం వల్ల వందరెట్ల ఫలితం ఉంటుంది . యాగశాలలో చేసే జపం వలన వందరెట్ల కంటే అధికమైన ఫలితం వస్తుంది. దేవాలయాలలో , పుణ్య ప్రదేశాలలో చేసే జపం వలన పదివేల రెట్లు ఫలితం కలుగుతుంది. శివాలయాలలో , శివ సాన్నిద్యం నందు చేసే జపం వలన అత్యున్నతమైన ఫలితం దక్కుతుంది.

 *రావణుడు ప్రతిష్టించిన 6 శివ లింగాలు ఏవి ?*

 1. వైద్యనాధ లింగం. 2. వక్రేశ్వర నాద లింగం.
 3. సిద్ధినాద లింగం. 4. తారకేశ్వర లింగం.
 5. ఘటేశ్వర లింగం. 6. కపిలేశ్వర లింగం.

ధర్మ సందేహాలు - సమాధానాలు . PART - 4.

 *పదనాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు ?*

 పదనాలుగు లోకాలలోని మొదటి మూడు లోకాల్లోను అంటే భూలోకం , భువర్లోకం, స్వర్లోకాలను " కృతక లోకాలు " అంటారు. జీవులు తాము చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లొకాల్లొను ఉంటారు.
 
 నాల్గొవదైన మహర్లోకం కల్పాన్తములో కూడా నశించదు. ఈ లొకం లొ కల్పాంత జీవులు ఉంటారు.

 అయిదోవది అయిన జనలోకం లొ బ్రహ్మ దేవుని మానస పుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు నివసిస్తారు.

 ఆరొవదైన తపోలోకంలో దోష వర్జితులు , దేహ రహితులు అయిన వైరాజులనే వారు ఉంటదము. 6. మాత్స్చార్యము .
 7. రాగము. 8. ద్వేషము. 9. ఈర్ష్య . 10. అసూయ
 11. దర్పము. 12. దంబము. 13. అహంకార దోషము.

 *భగవంతుడికి నివేదించే సమయం లొ గుర్తు ఉంచుకోవలసినవి ?*

 భగవంతుడికి నివేధించేప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయరాదు . తెలిసి చెసినా,తెలియక చేసినా తప్పు తప్పే అంటారు. కనుక నివేధించేప్పుడు ప్రతివారు తప్పక చేయవలసినవి .

 1. దేవునికి నైవేద్యం గా పెట్టడానికి చేసిన వంటకాలలో నుంచి కొంత విడిగా తీయరాదు .పాత్ర మొత్తాన్ని దేవుని ఎదుట పెట్టాలి .
 2. పదార్ధాలు వేడిగా ఉన్నప్పుడు నివేదిన్చరాదు . చల్లారాక పెట్టాలి .
 3. నివేదనలో మంచినీటిని కుడా తప్పనిసరిగా పెట్టాలి.
 4. నివేదించే వంటకాలలో పంచదారకు బదులు బెల్లం వాడాలి.

 *ఊర్ధ్వ పుండ్ర ములు ఎందుకు ధరిస్తారు ?*

 ఆర్య మతంలో ముఖధారణం (బొట్టు ) ఒక ఆర్ష సాంప్రదాయంగా ఏర్పడింది. అది త్రి పుండ్రము , ఊర్ధ్వ పుండ్రము. అని రెండు రకాలుగా విభజించబడింది. వైష్ణవులు ఊర్ధ్వ పుండ్రము లు ధరిస్తారు . స్త్రీలు తిలకధారణ చేస్తారు . 
     తిరుమణిని నిలువునా మూడు రేఖలుగా ధరించడంనే ఊర్ధ్వ పుండ్ర దారణ అంటారు.ఈ మూడు రేఖలు అకార, ఉకార, మకార స్వరూపమైన ప్రనవాన్ని సూచిస్తాయి. అకారం - సత్వ స్వరుపడైన శ్రీ మహావిష్ణువును , ఉకారం - చిత్వ స్వరూపిణి అయిన మహాలక్ష్మిని , మకారం భగవద్భాక్తులైన భాగవతులను తెలియజేస్తాయని చెబుతారు. శైవులు భస్మాన్ని మూడు అడ్డరేకులుగా నుదుట ధరిస్తారు .

    తిరుమణి మట్టికి సంభందించినది . కావున అది మట్టి నుండి కలిగిన ఈ శరీరం చివరికి మట్టిలోనే కలిసిపోతుందని సుచిస్తుంది. ఇందువల్ల వైరాగ్యం కలుగుతుంది. ముక్తి కోరేవానికి వైరాగ్యం చాలా ముఖ్యం. విభూతి దారణ కూడా ఈ శరీరం చివరికి బూడిద అయ్యేది అనే తత్వాన్ని నిర్దేశిస్తుంది. ముఖదారణ లేకుండా చేసే సత్కర్మలు నిరర్ధకాలు అని ఆగమాలు పేర్కొన్నాయి.

  ద్వాదశ (12) ఊర్ధ్వ పుండ్రము లు ధరించడం కూడా కద్దు. నాడులు, హృదయం మొదలయిన శరీర భాగములను చల్లబరుచుటకు కూడా ఆయా స్థానములలో ఊర్ధ్వ పుండ్ర దారణ అవసరమయిన వైజ్ఞానికం గా విశ్లేషణ చేసి కొంతమంది వివరిస్తున్నారు . ఉర్ధ్వ పుండ్రం లొ ఉపయొగించే వస్తువులకు చల్లదనం కలిగించే లక్షణం ఉంది.

 *నదులలోను, సముద్రాలలోను పవిత్ర స్నానాలు చేసేప్పుడు పాటించవలసిన నియమాలు ఏవి ?*

 నదీ స్నానం , సముద్ర స్నానం వంటివి చేసే ముందు నదీ స్నానం అయితే నదీమ తల్లిని, సముద్ర స్నానం అయితే సముద్రున్ని, అనంతరం క్షేత్ర దేవతల్ని, మనస్సులొ స్మరించుకొని సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి .
 * రాత్రి పూట నిద్రించే టైములో ఒంటిపై ధరించిన వస్త్రాలతో నదిలో మునగరాదు. ఈ బట్టలను విడిచి శుభ్రమైన వస్త్రములను ధరించాలి.
 * పుణ్య నదులలో పాప పరిహారార్ధం చేసే పవిత్ర స్నానముల సమయం లొ ఖచ్చితమైన నియమాలు పాటించి తీరాలి.
 * స్నాన అనంతరం ఆ బట్టల్ని నదుల్లో పిండ రాదు అలాగే సబ్బులను ఉపయొగించి కూడా బట్టలను ఉతకరాదు . 
 * అభ్యంగ స్నానం అంటే కుంకుళ్ళు , షాంపు లు మొదలయిన వాటిని ఉపయొగించి తలంటు స్నానం చేయరాదు . 
 * పొరబాటున కూడా నదిలోగాని, నదీ తీరాల్లోగాని మలముత్రాలు విసర్జిన్చరాదు . ఈ నియమానికి వ్యతిరేకంగా చేస్తే పాపం అంటుతుంది.
 * ఆఖరికి నీళ్లను పుక్కిలించి ఉమ్మి వేసినా కూడా మహా దొషం అవుతుంది.
 * పవిత్ర స్నానములు ఆచరించే సమయంలో అ మంగళ కరమైన మాటలు మాట్లడకుడదు. కసురుకోవడం, కోప్పడటం, వంటివి చేయకూడదు .
 * సముద్ర స్నానం కేవలం పర్వదినములలో మాత్రమే చేయాలి .మాములు సమయాలలో సముద్రాన్ని తాకకూడదు .
 * స్నానం చెసే ముందు సంకల్పం చెప్పుకోవాలి.

15, అక్టోబర్ 2020, గురువారం

తప్పు - కర్మ

ఎవరూ చూడటం లేదు చూడరని 
తప్పులు చేస్తూ పోతుంటే అవి కర్మలుగా మారి 
మనల్ని జన్మ జన్మలు తరుముతూ ఉంటాయి

*ఉదాహరణ ఒక కధ చెబుతాను చదవండి 

*ఒక రాజు..తన ఆస్థానంలో ఉన్న ముగ్గురు మంత్రులను పిలిపించి..వారికి ఒక్కొక్క ఖాళీ గోనె బస్తా బ్యాగ్ లను చేతికిచ్చి..అరణ్యంలోనికెళ్ళి వాళ్లకు తోచిన పండ్లు,ఫలాలను అందులో నింపి..సాయంత్రం లోపు తీసుకు రావలసిందిగా ఆజ్ఞాపించాడు.

ముగ్గురూ అరణ్యం లోనికెళ్లారు..

మొదటి మంత్రి ఆలోచించాడు..రాజు గారు పండ్లు తెమ్మన్నారంటే ఏదో విశేషం ఉండిఉండాలి..కనుక మంచి పండ్లు తీసుకు వెళ్ళాలి..అనుకుంటూ అరణ్యం అంతా తిరుగుతూ పండ్లు నింపసాగాడు.

రెండో మంత్రి ఆలోచన..రాజు గారికి పండ్లకి కొదవ లేదు..అయినా మాకు పంపారు..సరే ఏదోలా బస్తా నింపేస్తే చాలు..అనుకుంటూ కంటికి కనిపించిన పండ్లు తాజా,వాడిన,పుచ్చిన భేదభావం లేకుండా నింపసాగాడు.

ఇక మూడో మంత్రి..చాలా చతురంగా ఆలోచించాడు..రాజు గారికి చాలా పనులు..పండ్ల అవసరం అతనికి లేదు.,పై పైన చూస్తే చూడొచ్చు.బస్తా ఖాళీచేసి చూసే సమయం కూడా ఉండదు..చూడనిదానికి కష్టపడి అడివంతా తిరగాల్సిన అవసరం ఏముంది..అనుకుంటూ ఆకులు అలములతో బస్తానింపి..పైన కొన్ని పండ్లతో అలంకరించేసాడు..

సాయంత్రం ముగ్గురూ పండ్ల బస్తాలు తీసుకుని రాజుగారి ముందు హాజరయ్యారు.

మూడో మంత్రి ఊహించినట్లే..రాజు గారు చాలా పనుల్లో తలమునకలై ఉన్నారు..కనీసం బస్తాలు వంక చూడనైనా చూడకుండా సైనికులను ఆదేశించారు."ఈ ముగ్గురినీ చెరసాలలో నెల రోజుల పాటు వారి పండ్ల బస్తాలతో పాటు బంధించండి.తినడానికి ఏమి ఇయ్యరాదు..వారు తెచ్చిన పండ్లే వారికి ఆహారం."

ముగ్గురిని చెరసాలలో బంధించారు..

మొదటి మంత్రి..చక్కని తాజా పండ్లు మూలంగా ఎలాంటి ఆకలిబాధలు లేకుండా శిక్షాకాలం పూర్తిచేసి తిరిగి ఆస్థానానికి చేరుకున్నాడు.

రెండవ మంత్రి..కొన్నిరోజుల వరకు బాగానే తిన్నా..కుళ్ళిన,వాడిన పండ్లు మిగతా రోజుల్లో తిని తీవ్ర అస్వస్థతకు గురై మంచాన పడ్డాడు..శాశ్వతంగా.

మూడవ మంత్రి..పైపైన అలంకరించిన పండ్లతో 2 రోజులు గడిపి..ఆకులు,అలములు తో మరో వారం పాటు మాత్రమే గడిపి..పై లోక యాత్రకు వెళ్ళిపోయాడు శిక్షాకాలం ముగిసే లోపే..

*కర్మ : మనం చేసిన పనులకు తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది..మంచి కర్మలకి మంచి.,
చెడు/పాప కర్మలకు చెడు పర్యవసానాలు తప్పవు. 

*1000 గోవుల మంద ఉన్నా..దూడ ఖచ్చితంగా తన తల్లి దగ్గరికి ఎలా పోగలదో..మంచి,చెడు కర్మలు కూడా అలానే మనల్ని వెదుక్కుంటూ వచ్చేస్తాయి.

*కర్మ సిద్ధాంతం పనిచేసే తీరు ఇదే..

🌿బ్రాహ్మణ జన్మ - గొప్పదనం🌿


🌺 బ్రాహ్మణత్వము గురించి భీష్ముణ్ణి...
ధర్మరాజు ఇలా అడిగాడు...!
శ్రీ పితామహా ! బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణకర్మల వలన బ్రాహ్మణత్వము పొందవచ్చునా ! అని తన సందేహం వెలిబుచ్చాడు.

🌺 భీష్ముడు ధర్మనందనా ! బ్రాహ్మణత్వము పొందడం చాలా దుర్లభం.ఎన్నోజన్మలు ఎత్తిన తరువాత కాని బ్రాహ్మణజన్మ లభించదు. ఈ విషయము గురించి నీకు ఒక ఇతిహాసము చెప్తాను విను.

🌿 పూర్వము మతంగుడు అనే విప్రకుమారుడు ఉండే వాడు. అతడు తండ్రి ఆదేశానుసారము ఒక యజ్ఞానికి వెడుతున్నాడు.
దారిలో అతడు ఒక గాడిదపిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తనతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది. ఆ గాడిద తన కూతురుతో అమ్మా ! ఇతడు చంఢాలుడు, క్రూరుడు అందుకే నిన్ను అలా కొట్టాడు అని చెప్పింది.

🌿 గాడిద మాటలను అర్ధము చేసుకున్న విప్రకుమారుడు ఆ గాడిద ఊరికే అలా అన లేదు. గాడిద మాటలలో ఏదో అంతరార్ధము ఉంది. లేకుంటే అలా ఎందుకు అంటుంది? అనుకున్నాడు.

🌿 విప్రకుమారుడు ఆ గాడిద వద్దకు వెళ్ళి తన జన్మరహస్యము చెప్పమని అడిగాడు.
గాడిద విప్రకుమారా ! నీ తల్లి కామంతో వర్ణసంకరము వలన కులమును చెడగొట్టి ఒక క్షురకుని వీర్యం వలన నిన్ను కన్నది. కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు అని చెప్పింది.

🌿 ఆపై అతడికి యజ్ఞముకు వెళ్ళడానికి మనస్కరించక ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో తండ్రీ ! నేను బ్రాహ్మణ స్త్రీకి క్షురకుడికి( శూద్రుడు వీర్యం,)పుట్టాను కనుక నేను బ్రాహ్మణుడను కాను. ఆ గార్ధభము ఏదో శాపవశాన ఇలా జన్మ ఎత్తి ఉంటుంది. లేకున్న ఈ నా జన్మరహస్యము ఎలా తెలుస్తుంది?. తండ్రీ ! నేను తపస్సు చేసి బ్రాహ్మణత్వము సంపాదిస్తాను అని చెప్పి మతంగుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు.

🌿 మతంగుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రసన్నము చేసుకున్నాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై కుమారా ! నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావు ? నీ కోరిక ఏమిటి అని అడిగాడు. మతంగుడు దేవా ! నాకు బ్రాహ్మణత్వము ప్రసాదించండి అని అడిగాడు.

🌿 ఇంద్రుడు కుమారా ! బ్రాహ్మణత్వము మహత్తరమైనది. ఇతరులకు అది లభ్యము కాదు కనుక మరేదైనా వరము కోరుకో అని అన్నాడు. మతంగుడు అయ్యా ! నా కోరిక తీర్చడం మీకు కుదరదు కనుక మీరు వెళ్ళండి. నా తపస్సు కొనసాగిస్తాను అన్నాడు.

🌿 ఇంద్రుడు వెళ్ళగానే మతంగుడు తన తపస్సు కొనసాగించి ఒంటి కాలి మీద మరొక నూరేళ్ళు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు.
ఇంద్రుడు కుమారా ! నీ పట్టు విడువక ఉన్నావు! శూద్రుడు ఇలాంటి తపస్సు చేస్తే చస్తాడు జాగ్రత్త అని బెదిరించి అసలు బ్రాహ్మణత్వము ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా !

🌿 ఇంతకంటేపది రెట్లు తపస్సు చేస్తే కాని ఒక చంఢాలుడు శూద్రుడు కాలేడు.
దాని కంటే నూరు రెట్లు తపస్సు చేస్తే కాని శూద్రుడు వైశ్యుడు కాలేడు.
దాని కంటే వేయిరెట్లు తపస్సు చేసిన కాని వైశ్యుడు క్షత్రియుడు కాలేడు.
దాని కంటే పది వేల రెట్లు తపస్సు చేసిన కాని క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు.
దానికంటే లక్షరెట్లు తపస్సు చేస్తే కాని దుర్మార్గుడైన బ్రాహ్మణుడు ఇంద్రియములను, మనస్సును జయించి, సత్యము అహింసలను పాటించి, మాత్సర్యము విడిచి పెట్టి సద్బ్రాహ్మణుడు కాలేడు.

🌿 అటువంటి సద్బ్రాహ్మణత్వము ఒక వంద సంవత్సరాల తపస్సుకు వస్తుందా ! చెప్పు అన్నాడు. ఒక వేళ బ్రాహ్మణ జన్మ పొందినా దానిని నిలబెట్టుకొనుట కష్టము.
ఒక్కొక్క జీవుడు అనేక జన్మల తర్వాత కాని బ్రాహ్మణజన్మ ఎత్తలేడు. అలా ఎత్తినా అతడు దానిని నిలబెట్టుకోలేడు. ధనవాంఛ, కామవాంఛ, విషయాసక్తితో సదాచారములను వదిలి దుర్మార్గుడు ఔతాడు.

🌿 తిరిగి బ్రాహ్మణజన్మ రావడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అటువంటి బ్రాహ్మణజన్మ కొరకు నీవు తాపత్రయపడి నీ వినాశనము ఎందుకు కొని తెచ్చుకుంటావు. నీ కిష్టమైన మరొక వరము కోరుకో ఇస్తాను తపస్సు చాలించు అన్నాడు.

🌿 మారుమాటాడని మాతంగుడి మొండి తనము చూసి విసుగు చెంది ఇంద్రుడు వెళ్ళి పోయాడు. మాతంగుడు తిరిగి తన తపస్సు కొనసాగించాడు. కాలి బొటనవేలి మీద నిలబడి శరీరం అస్థిపంజరము అయ్యేవరకు తపస్సు చేసాడు.
అతడి శరీరము శిధిలమై పడిపోతుండగా ఇంద్రుడు పట్టుకున్నాడు. ఏమిటి నాయనా ఇది? పెద్ద పులిలా నిన్ను మింగగలిగిన బ్రాహ్మణత్వము నీకెందుకు? చక్కగా వేరు వరములు అడిగి సుఖపడు అన్నాడు.

🌿 మాతంగుడు అంగీకరించగానే ఇంద్రుడు నీవు చంఢదేవుడు అనే పేరుతో అందమైన స్త్రీల. పూజలందుకుని వారి వలన నీ కోరికలు ఈడేర్చుకుంటావు అని వరాలు ప్రసాదించాడు.
కానీ బ్రాహ్మణ జన్మను ప్రసాదించలేదు.
(భారతంలోని అనుశాసనిక పర్వంలోని కథ).

🌿 అటువంటి ఉత్కృష్టమైన, పరమ పవిత్రమైన బ్రాహ్మణ జన్మను కాపాడుకోవలసిన అవసరం మన అందరిది. 

💐లోకా సమస్తా సుఖినో భవంతు..!!💐💐💐సర్వంశివసంకల్పం💐💐💐

భక్తి - అనుగ్రహం

కావ్య కంఠ గణపతి ముని ఒకసారి అరుణాచలం వెళ్లారు. వారితోపాటు వారి తమ్ముడు కూడా వచ్చాడు. ఆయనకు జఠరాగ్ని ఎక్కువ. ఆ పిల్లాడు అన్నయ్యా ఆకలేస్తోంది అంటున్నాడు. ఆ రోజున ఏకాదశి తిధి. అందుకని ఆయన తన దగ్గర ఉన్న డబ్బులతో ఒక డజను అరటిపళ్ళు కొన్నారు. వాడు అవన్నీ తినేశాడు. తినేసి ఒక గంట గడిచేసరికి మళ్ళీ అతడు అన్నయ్యా ఆకలేస్తోంది అన్నాడు. అపుడు గణపతి ముని బ్రాహ్మణుల ఇంటి ముందుకు వెళ్లి 'భవతీ బిక్షామ్ దేహీ' అంటూ ఎవరైనా అన్నం పెడితే తమ్ముడికి పెడదామని యాచన చేస్తున్నారు. ఆ రోజు ఏకాదశి. ఎవ్వరూ అన్నం పెట్టలేదు. వీడు ఏడుపు. అపుడు ఆయన ఒక శ్లోకం చదివారు. బ్రాహ్మణ గృహంలో ఎవరైనా అకస్మాత్తుగా వస్తే పెట్టడాడనికి కొద్దిగా అన్నం ఉండేటట్లుగా వండాలి."ఆఖరికి కలియుగంలో వీళ్ళ అన్న పాత్రలలో అన్నం కూడా లేదన్నమాట! ఒక్కడు కూడా అన్నం పెట్టలేదు" అని ఆయన అనుకున్నారు.

ఆయన ఒక ఇంటి ముందునుంచి వేడుతున్నారు. ఆ ఇంటి అరుగుమీద ఒక వృద్ధ బ్రాహ్మణుడు పడుకుని ఉన్నాడు. ఆయన గభాలున లేచి కావ్య కంఠ గణపతి మునిని పట్టుకుని అన్నాడు. 'నీవు బాగా దొరికావు. నా భార్య కు ఒక నియమం ఉంది. అందరూ ఏకాదశి వ్రతం చేసి మరునాడు ఉదయం పారణ చేస్తే నా భార్య ఏకాదశి నాడు రాత్రి భోజనం చేస్తుంది. కానీ భోజనం చేసేముందు ఆవిడకు ఒక నియమం ఉంది. ఆవిడ ఎవరైనా ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుని తింటుంది. ఇవ్వాళ తిరువణ్ణ మలైలో యాత్రికులు కూడా దొరకలేదు. ఎవ్వరూ దొరకలేదు. నువ్వు ఆకలని తిరుగుతున్నావు. మా ఇంట్లో కి రా! అని తీసుకు వెళ్ళాడు. ఆ ఇంట్లోని ఇల్లాలు స్నానం చేసి రండి.భోజనం వడ్డిస్తాను' అంది.
కావ్యకంఠ గణపతి ముని, ఆయన తమ్ముడు గబగబా వెళ్లి స్నానం చేసి తడిబట్టతో వచ్చారు. ఆవిడ మడి బట్టను ఇచ్చింది. అవి కట్టుకుని భోజనానికి కూర్చున్నారు. ఆవిడ షడ్రషోపేతమైన భోజనం పెట్టింది.
 భోజనం ఐన తరువాత ఆవిడ చందనం ఇచ్చింది. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే భోజనం అయ్యాక చందనం పెట్టాలి. వారు అది చేతులకి రాసుకుని లేవాలి. అది ఇంటి యజమానే తీస్తే దానివలన ఎంతో గొప్ప శ్రేయస్సు ను పొందుతాడు. వాళ్ళు చందనం రాసుకున్నాక ఆవిడ తాంబూలం ఇచ్చింది.
 వీళ్ళు కడుపునిండా తినేసారేమో కళ్ళు పడి పోతున్నాయి. 'అమ్మా , ఇంక ఎక్కడికీ తిరగలేం. ఈ రాత్రికి మీ అరుగుమీద పడుకుంటామమ్మా!' అన్నారు. ఆవిడ సరేనని ఆవిడ తలుపు వేసేసింది. వీళ్ళిద్దరూ పడుకుని నిద్రపోయారు. గాఢ నిద్ర పట్టేసింది. వీరు నిద్రించిన ఇల్లు అరుణాచలం లో అయ్యంకుంట్ల వీధిలో ఉంది. 

మరునాడు సూర్యోదయం అవుతుంటే వారికి మెలకువ వచ్చింది. ఇద్దరూ నిద్ర లేచారు. 'అమ్మయ్య రాత్రి ఈ తల్లి కదా మనకి అన్నం పెట్టింది' అనుకుని అరుగుమీద నుండి లేచి చూసారు. అది వినాయకుడి గుడి. అక్కడ ఇల్లు లేదు. వాళ్ళు తెల్లబోయి 'రాత్రి మనం షడ్రషోపేతమైన భోజనాలు తిన్నాము. ఇక్కడ రత్నకింకిణులు ఘల్లుఘల్లు మంటుంటే ఎవరో ఒక తల్లి మనకి అన్నం పెట్టింది. ఆ తల్లి ఇల్లు ఏది'అని చూసారు. కలకాని కన్నామా అనుకున్నారు. పక్కకి చూస్తే రాత్రి ఆవిడ ఇచ్చిన తాంబూలాలు ద్రవ్యంతో కూడా ఆ పక్కనే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి. ఎవడు ఆర్తితో ప్రార్థన చేసి, ఎవడు ఆర్తితో పూజ చేస్తున్నాడో , వాడు నోరు తెరచి అడగవలసిన అవసరం లేకుండా, వాడి అవసరాలు తీర్చడానికి భగవంతుడు వాడి వెనుక తిరుగుతూ ఉంటాడు. వాడికి ఈశ్వరుని అనుగ్రహం ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. దానికి ప్రకటనలు అక్కర్లేదు. కాబట్టి అంత స్వచ్ఛమైన భక్తితో , అమ్మవారిపట్ల కృతజ్ఞతతో బ్రతికేవాడు ఎవడున్నాడో వాడిని అమ్మ యే కాపాడుతూఉంటుంది. ఈ స్థితికి ఎదిగితే వాడు చింతాకు పతాకాన్ని అమ్మవారి మెడలో పెట్టినట్టు.

నేను ఎక్కడ????

శివుని నుండి రాలిన విబూథిని పోగుచేసి చక్కటి బొమ్మను తయారుచేసాడు బ్రహ్మ. ఆ బొమ్మను చూసుకుని మురిసిపోతున్న బ్రహ్మగారి ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయడానికి అటుగా వెళ్తున్న విష్ణువు, ఆ బొమ్మకు ప్రాణంపోసాడు. అది తెలిసిన దేవతలు తామూ ఏదో చేయాలని సంకల్పించి ఇంద్రియగుణాధి ఐశ్వర్యములూ ఆ బొమ్మకు ఇచ్చారు. అది విన్న దానవాది రాక్షసులు దేవతల కన్నా తామేమీ తక్కువ కాదని, మేమూ ఇవ్వగలవారమే అని వారువారు ఇవ్వగలిగిన , వారి తాహతకు తగ్గ కామక్రోదాది అరిషడ్వర్గాలను ఆ బొమ్మకు ఇచ్చారు. దానవాదిరాక్షసులు ఇచ్చినవే ఉంచుకోపో, వాళిచ్చినవి నీ దగ్గర ఉన్నాయి కాబట్టి మేమిచ్చిన ఇంద్రియగుణాధి ఐశ్వర్యములు మేమిచ్చినవి మేము తీసేసుకుంటాము అని దేవతలు వారిచ్చినవి వారు లాగేసుకున్నారు. ఈ పరిణామాలు మళ్ళీ దేవదానవుల యుద్దానికి దారితీస్తాయేమో, యందుకొచ్చిన గొడవ అని విష్ణువు తానిచ్చిన ప్రాణం తనే తీసేసుకున్నాడు. అప్పటి వరకూ ప్రాణమున్న ఆ బొమ్మతో ఆడుకోవడానికి అలవాటుపడ్డ బ్రహ్మగారికి ఇప్పుడు ఆ ప్రాణంలేని బొమ్మతో ఆడుకోవడానికి మొహం మొత్తి దానిని మళ్ళీ ముక్కలుముక్కలుగా చేసి దానిని చిదిమేసి మళ్ళీ విభూధిగా చేసేసాడు. శివుడు ఇది నా విభూథి అంటూ మళ్ళీ వంటికి పులిమేసుకున్నారు. అహా ఏమి జరిగింది , ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది అనుకునేలోపే...... *నేను ఎక్కడ*?........

14, అక్టోబర్ 2020, బుధవారం

ఇక మీదట మీరు కొనే Android phoneలతో పాటు ఛార్జర్ ఇవ్వబడదా?


ఇక మీదట మీరు కొనే Android phoneలతో పాటు ఛార్జర్ ఇవ్వబడదు!


 
ఇప్పటికే మీరు iPhone వాడినట్లయితే, అది కొనుగోలు చేసినప్పుడు మీకు వచ్చిన ఛార్జర్‌ని iPhone 12తో పాటు వాడుకోవచ్చు. సరిగ్గా ఇదే విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా Android phoneలను తయారు చేస్తున్న వివిధ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు అనుసరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఇకమీదట మీరు Android phone కొనుగోలు చేసినప్పుడు కేవలం ఫోన్ మాత్రమే వస్తుంది, దాంతో పాటు ఛార్జర్ అందించబడదు.


 
Phone తయారీ కంపెనీలు ఎందుకు ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకున్నాయి అన్న డౌట్ చాలామందికి వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఎలక్ట్రానిక్ వేస్ట్ తగ్గించడం, అలాగే ఫోన్ ధర కొద్దిగా తక్కువగా ఉండే విధంగా పరోక్షంగా ఈ నిర్ణయం ఉపకరిస్తుంది. ఉదాహరణకు Apple iPhone 12నే తీసుకుంటే, ఇది 90 శాతం రీసైకిల్ ఫ్రెండ్లీ ఫైబర్ తో తయారు చేయబడి ఉంటుంది.


ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరుగుతోంది. భారీ మొత్తంలో smartphoneలు అన్ని దేశాల్లో అమ్ముడవుతున్నాయి. గతంలో రెండేళ్లకు ఒక ఫోన్ కొనే వారు కూడా ఇప్పుడు ఏడాదికి ఒక ఫోన్ మార్చే పరిస్థితి‌కి వచ్చింది. ఫోన్ తో పాటు charger, headphoneలను అందించడం వల్ల ఎలక్ట్రానిక్ వేస్ట్ బాగా పెరిగిపోతోంది అని ఫోన్ తయారీ కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే కేవలం అవసరం ఉన్నవారు మాత్రమే కొనుగోలు చేసుకునే విధంగా, ఇప్పటికే తమ దగ్గర ఛార్జర్ ఉన్న వారు ఆ పాత ఛార్జర్ ఉపయోగించుకునే విధంగా phone ర్యాలీ కంపెనీలు నిర్ణయం తీసుకోబోతున్నాయి. అలాగే పాత చార్జర్ కొత్త ఫోన్ కి కంపాటబుల్ అయ్యే విధంగా ఆయా ఫోన్లను రూపొందిస్తారు.


 

Androidలో ఈ కొత్త ఫీచర్ తో బ్యాటరీ చాలా ఆదా అవుతుంది!
500 నుండి 5000 వేల లోపు ఉన్న ఈ gadgets ఉంటే మీ ఇల్లు Smart Home అయిపోతుంది.

13, అక్టోబర్ 2020, మంగళవారం

తిరుమల తరుపతి

*తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల*

1.తిరుమల పూర్వ నామధేయమేమిటి?                         
Ans.: *వరహాపర్వతం.*
2. శ్రీవారిఆలయంలో సరుకులు నిల్వ చేసే గిడ్డంగిని ఏమంటారు? 
Ans. : *ఉగ్రాణం.* 
3. వెండివాకిలి కి ఇంకో పేరేమిటి?
Ans. : *నడిమిపడికావాలి.*
4. స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారయ్యే ప్రదేశాన్ని ఏమంటారు? 
Ans.: *పరిమళపు అర.* 
5. సంపంగి ప్రదక్షిణ లో ప్రసాదాలు నిల్వ ఉంచి విక్రయించే ప్రదేశాన్ని ఏమంటారు?
Ans.: *పోటు.* 
6. వెండి వాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు ఎంత?
Ans. : *30 అడుగులు.* 
7. విమాన ప్రదక్షిణ మార్గానికి ఇంకో పేరు ఏంటి?
Ans.: *అంగప్రదక్షణ.* 
8. బంగారు వాకిలి ముందున్న మండపాన్ని ఏమంటారు?
Ans.: *మహామణిమండపం.* 
9. బంగారు వాకిలి దాటాక వచ్చేమండపాన్ని ఏమంటారు?
Ans.: *కొలువు మండపం.*
10. రాములవారి మేడ దాటాక వచ్చే మండపం ఏమిటి?
Ans. : *శయన మండపం.* 
11. శ్రీవారి డోలోత్సవం ఎక్కడ జరుగుతుంది?
Ans.: *అద్దాల మండపం.* 
12. అద్దాల మండపానికి ఇంకో పేరేమిటి? 
Ans.: *డోలా మండపం.*
13. అద్దాల మండపానికి ఎదురుగా ఉన్న మండపం ఏమిటి?
Ans. : *రంగనాయకుల మండపం.*
14. తిరుమల రాయ మండపంలో ఉన్న విగ్రహం ఎవరిది?
Ans.: *రాజా తొదరమల్లు.* 
15. ధ్వజ స్థంబాన్ని అనుకుని ఉన్న పీఠాన్ని ఏమంటారు?
Ans.: *బలి పీఠం.*
16. శ్రీవారి ఆలయాన్ని శుద్ధిచేసే కార్యక్రమాన్ని ఏమంటారు?
Ans. : *కోయిల్ తిరుమంజనం.*
17. చక్రస్నానం ఏడాదికి ఎన్నిసార్లు చేయిస్తారు?
Ans. : *4 సార్లు.*
18. విష్ణు సహస్రనామాల్లో ''శ్రీనివాస'' అని ఎన్ని సార్లు వస్తుంది?
Ans.: *2 సార్లు* 
19. సుప్రభాతం లో ఎన్ని శ్లోకాలున్నాయి?
Ans. : *29*
20. ఏడాదిలో ఆలయాన్ని ఎన్నిసార్లు తిరుమంజనం చేస్తారు?
Ans. : *7 సార్లు*
ఓం నమో వెంకటేశాయ 🙏🏼వెంకటేశా🙏🏼

ఋణ బాధలు పోవాలంటే?

*రుణ బాధలు వదిలిపోతాయ్.*
🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు.అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా, ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకున్న 8 దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి.

ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనకున్న దారిద్ర్యము, సమస్యలు పోవాలంటే శివుడిని ఈవిధంగా పూజించాలి.

1. సోమవారం ముందుగా తలస్నానం చేయాలి. ఆ తరువాత పార్వతీపరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టుపెట్టి దీపారాధన చెయ్యాలి. పూలు సమర్పించుకోవాలి. తరువాత శివఅష్టోత్తరం చదువుతూ విభూదిని సమర్పించాలి.

2. పూజానంతరం పరమశివునికి నైవేధ్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. ముఖ్యంగా దేవునికి పూజ చేసినా, ప్రసాదం పెట్టినా ఏకాగ్రమైన మనసుతో చేయాలి. అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు.

3. మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది.

4. ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయిష్షును సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది.

5. ఉమామహేశ్వరులను వేకువ జామున పూజించడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు.

ఓం నమః శివాయ

12, అక్టోబర్ 2020, సోమవారం

త్ర్యంబకేశ్వరుడు

#శివపురాణం -

#త్ర్యంబకేశ్వరుడు :

త్ర్యంబకుడు తనను దర్శనం చేసిన వారిని రక్షించే స్వభావం కలవాడు. ఆయనను స్మరించిన వారిని, ఆయనను నమ్మిన వారిని సర్వకాలముల యందు రక్షించే స్వరూపం ఉన్నవాడు. ఇప్పటివరకు చదివిన స్వయంభూలింగముల విశేషం ఒకలా ఉంటుంది. త్ర్యంబకేశ్వరుని వద్దకు వచ్చేటప్పటికి ఒకలా ఉంటుంది. ఇది కేవలము ఒక లింగము ఆవిర్భవించిన కథ కాదు. గౌతమ మహర్షి జీవితమును, ఆయన శీలమును, ఆయన గొప్పతనమును ఇందులో చూస్తారు. అక్కడి శివలింగం గొప్పదా, గౌతముడు గొప్పవాడా అని ఒకసారి ఆలోచిస్తే గౌతముడే గొప్పవాడని అనిపిస్తుంది. ఇక్కడ ఒక నది, ఒక శివలింగం ఆవిర్భవించాయి. మనం తెల్లవారి లేస్తే ఏ నదీజలములు త్రాగి బతుకుతున్నామో ఆ నదిని తీసుకువచ్చిన మహాపురుషుని చరిత్ర ఇప్పుడు చదవబోతున్నాము. 

గౌతముడు చాలా గొప్ప మహర్షి. ఆయన తన శిష్యులతో కలిసి ప్రతిరోజూ శంభు లింగారాధనము చేస్తుండేవాడు. ఆ లింగానికి శంభులింగము అని పేరు పెట్టాడు. ‘శం భావయతి ఇతి శంభుః’ – మంచి భావములను కల్పించ గలిగిన లింగమును ఆరాధనా చేశాడు. అటువంటి మహర్షి కోరుకునేది ఒక్కటే. లోకమంతటినీ లోకేశ్వరునిగా చూడడం. చాలామంది శిష్యులు ఆయనను అనుగమించి ఉండేవారు. వాళ్ళందరికీ అనేక శాస్త్రములను బోధిస్తూ బ్రహ్మగిరి అనే పర్వతశిఖర పాదమూలమునందు ఆశ్రమమును నిర్మాణము చేసుకుని లింగారాధన చేస్తూ పవిత్రమయిన జీవితమును గడుపుతున్నాడు. 

ఇలా నడుస్తుండగా కొంతకాలమునకు అనావృష్టి వలన భయంకరమయిన క్షామం వచ్చింది. వర్షములు పడలేదు. ఎక్కడా నీరు లేదు. ఇప్పటికీ లోకమునందు నీరు లేకపోతే శివలింగామునకు సహస్ర ఘటాభిషేకం చేస్తారు. చేస్తే వర్షములు పడతాయి. ఇటువంటి పరిస్థితిలో ఒక్కొక్కరు నీరు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతున్నారు. దీనిని గౌతముడు చూసి నేను ఎలాగయినా ఈ లోక బాధను తీర్చే ప్రయత్నం చేస్తాను’ అని జలముల యొక్క అధిదేవతను గురించి తపస్సు చేశాడు. ‘నీవు తపస్సు చేశావు. సంతోషించాను. కానీ నేను మాత్రం వర్షించడం కుదరదు. కానీ నీకు ఒక ఉపకారం చేస్తాను. లోకమునకంతటికీ నేను నీరు ఇవ్వలేను. నీవు ఒక చిన్న గుండం తవ్వు. నేను అందులో నీళ్ళు పోస్తాను. ఒక వరం ఇస్తాను. ఆ కుండం ఆరదు. ఎప్పుడూ నీళ్లు ఉంటాయి’ అని చెప్పాడు వరుణుడు. అపుడు గౌతముడు ఇంతకన్నా నాకు అదృష్టం ఎక్కడ ఉంటుంది. తప్పకుండా అలా చేస్తాను’ అని తన భార్య అయిన అహల్యతో కలిసి ఒక గుండం తవ్వాడు. అహల్య గొప్ప పతివ్రత. వారు తవ్విన గుండంలో నీరు నింపాడు వరుణుడు. అపుడు గౌతముడు అహల్య కలిసి ఈ నీటిని పట్టుకు వెళ్ళి సేద్యం చేసి అనేకమయిన పంటలు పండించాడు. అందరికీ ఉచితంగా భోజనం లభించింది. అక్కడి ప్రజలు గౌతమ మహర్షి ఆశ్రమమునకు వెళ్లి చక్కగా ఆ పెట్టిన పదార్థముల నన్నిటిని తినడమే కాక ఈ కీర్తిలో వాటా కోసం కొందరు గౌతమునితో బంధుత్వం కలదని చెప్పుకోవడం ప్రారంభించి ఆయన దగ్గరకు చేరారు. 

ఇలా జరుగుతుండగా గౌతమాశ్రమంలో ఒక విచిత్రం జరిగింది. ఒకరోజు తెల్లవారు జామున మహర్షి శివలింగమునకు అభిషేకం చేయాలి. వరుణ గుండంలోకి వెళ్ళి నీళ్ళు పట్టుకురండి అన్నారు శిష్యులను మహర్షి. వాళ్ళు నీళ్ళు తేవడానికి వెళ్ళారు. అదే సమయమునకు మునుల భార్యలు అక్కడికి స్నానం చేయడానికి వచ్చారు. వాళ్ళు స్నానం చేశాక పట్టుకుందాములే అని అక్కడ నిలబడడం బ్రహ్మచారికి దోషం అవుతుంది కాబట్టి అమ్మలారా, మీరు ఒక్కదారి అలా ప్రక్కకి తొలగితే మీము నీళ్ళు పట్టుకుని వెళ్లిపోతాము అని చెప్పారు. స్త్రీలు అన్నారు ‘ మీకు ఎంత మిడిసిపాటు వచ్చింది. మా స్నానం కన్నా గౌతముడికి సంధ్యావందనం, అభిషేకం ఎక్కువయ్యాయా?అవతలికి పొండి ’ అన్నారు. ఆ మాటలకు శిష్యులు చిన్నబుచ్చుకుని ఖాళీ కుండతో తిరిగివచ్చారు. అప్పుడు వాళ్లకి ఏమి చేయాలో అర్థం కాక అహల్య దగ్గరికి వెళ్ళి ‘అమ్మా, ముని పత్నులు మమ్మల్ని అనరాని మాటలు అని పంపించి వేశారు. ఇప్పుడు గురువుగారి వద్దకు ఎలా వెళ్ళడం’ అని అడిగారు. ఆమాటలను విన్న అహల్య వెంటనే తాను వెళ్ళి నీళ్ళు ముంచుకుని వెళ్ళిపోయింది. 

వెంటనే వాళ్ళు అహల్య మనల్ని చూసి ఏమీ మాట్లాడకుండా చులకన చేసి వెళ్ళిపోయింది అని దెప్పిపొడిచారు. వాళ్ళలో అక్కసు బయలుదేరింది. వెళ్ళి భర్తలను “మా భర్తలు ఒకళ్ళు పెడితే అంగలారుస్తూ తినేవాళ్ళు అనుకుంటున్నారా?” అని అడిగారు. అలా భార్యలు అడిగేసరికి వాళ్లకి కష్టం వచ్చింది. వెంటనే వీళ్ళు గణపతి హోమం మొదలు పెట్టారు. వీళ్ళు విఘ్నేశ్వరుని ఉద్దేశించి దంతిమఖము అనే మఖము ఒకటి చేశారు. వీళ్ళు చేసినటువంటి మఖమునకు తృప్తిపొందిన గణపతి యజ్ఞ గుండంలోంచి ఆవిర్భవించాడు. ‘నేను మీకు ఏమి చేసిపెట్టాలి?” అని అడిగాడు. అపుడు వాళ్ళు ‘గౌతముడు పొగరెక్కి ఉన్నాడు. కాబట్టి ఈ ఆశ్రమంలోంచి గౌతముడు తరమబడేటట్లు నీవు ఏదో ఒక పథకం చేసి మమ్మల్ని రక్షించాలి’ అన్నారు. అపుడు విఘ్నేశ్వరుడు ‘ఇది మీరు అడగవలసిన మాట కాదు. ఒకనాడు మీకు తాగడానికి నీళ్ళు లేక, తినడానికి అన్నం లేకపోతె ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మీకు వడ్డించి అన్నం పెడుతుంటే ఆయనను ఈ ఆశ్రమం నుండి తరిమి క్షామంలోకి తొరి మీరు సుఖములను అనుభవిద్దామని అనుకుంటున్నారా? ఇది ఎంత కృతఘ్నత! ఇలా చేయకూడదు. అలా చేస్తే మీరు లోకంలో నశించిపోతారు” అన్నాడు.

అపుడు వాళ్ళు “నీ దగ్గర నీతులు వినదానిమి మేము ఈ మఖము చేయలేదు. మాకోరిక ఒక్కటే. గౌతముడు ఈ ఆశ్రమం నుండి తరమబడాలి. అలా నువ్వు చేస్తే మేము చేసిన మఖమునకు ఫలితం ఇచ్చినట్లు అవుతంది. కానినాడు నీవు కృతఘ్నుడవు అయిపోయినట్లు మేము భావిస్తాము” అన్నారు. అపుడు విఘ్నేశ్వరుడు ‘మీరు చేసిన మఖమునకు నేను ప్రీతి చెందాను. తప్పకుండా మీకోరిక తీరుస్తాను. కానీ మీరు పాడయిపోతారు. తన ఉపాసన యందు భంగము లేకుండా నడిచి వెళ్ళిపోయినటువంటి గౌతముడు సర్వోత్క్రుష్టమయిన కీర్తిని పొందుతాడు. దీనిని మీ మనస్సులో పెట్టుకోండి. మీ కోరిక తీర్చడంలో నాకు అభ్యంతరం లేదు’ అన్నాడు. ఒక వృద్ధ గోవు ఆయన కష్టపడి వేసిన పళ్ళు, ఆకుకూరలు వచ్చి తినేస్తోంది. గణపతి ఆ వృద్ధ గోవు రూపంలో వచ్చాడు మునుల కోర్కెను తీర్చడానికి గాను. బక్క ఆవు మేస్తుంటే ఆవును కర్రతో కొట్టినా, చేతితో కొట్టినా గోమోదక దోషం వస్తుందని మహానుభావుడు గౌతముడు ఒక ఎండిపోయిన గడ్డిపరక తీసి ఆవుమీద పడేసి ‘హ హ’ అన్నాడు. ఆ గడ్డిపరక పడగానే ఆవు చచ్చిపోయింది. నాకు గోహత్యాదోషం వచ్చింది’ అని ఏడ్చాడు. ప్రాయశ్చిత్తం కోసం వెంపర్లాడలేదు. అక్కడికి అహల్య, ఆయన శిష్యులు వచ్చి ఏడుస్తున్నారు. మునులు, మునిపత్నులు వచ్చారు. ఏమయిందని గౌతముని అడిగారు. జరిగింది చెప్పాడు గౌతముడు. అపుడు వారు’ఆవును చంపిన నీ ముఖం చూస్తే మహా పాతకములు వస్తాయి. నీవు నీ భార్యను, శిష్యులను తీసుకుని ఆశ్రమం వదలి ఎక్కడికయినా పో’ అన్నారు. అక్కడితో ఊరుకోక నువ్వు గోహత్య చేసిన వాడివి, ఇక్కడ నీవు ఉంటె మేము ఉండము అంతేకాక ఈవేళ నుండి నీవు దేవతలను ఆరాధించకూడదు. గోహత్య చేసిన నీలాంటి దుర్మార్గుడు పూజచేస్తే భగవంతుడు నొచ్చుకుంటాడు. అదేమీ కుదరు పో’ అన్నారు. గౌతముని ప్రాణం ఈశ్వరార్చన. అప్పుడు ఆయన ‘అయ్యో, నేను తప్పకుండా వెళ్ళిపోతాను. అని వెళ్ళిపోయాడు. అక్కడ నుండి బయలుదేరి అక్కడ అక్కడ తిరిగి ఎంతో దుఃఖమును అనుభవించి ఆ మునులను ఏదైనా ప్రాయశ్చిత్తం వుంటే చెప్పండి. నేనది చేసుకుని మరల నా జీవితమును ఈశ్వరాభిముఖం చేసుకుంటాను’ అన్నాడు. నిజానికి ఆయనకు తెలియని విషయమా? ఆయన ఇంకా మెట్లు దిగి వినయమునకు వెళుతున్నాడు. వీళ్ళు మెట్లెక్కి అహంకారమునకు వెడుతున్నారు. అపుడు వీళ్ళు ‘అయితే ఈ భూమండలమునంతటినీ మూడు మార్లు ప్రదక్షిణ చెయ్యి. అలా చేస్తున్నప్పుడు అడుగుతీసి అడుగు వేసినప్పుడల్లా గోవును చంపిన మహా పాతకుణ్ణి నేను అని అంటూ చెయ్యి. వచ్చిన తరువాత చాంద్రాయణ వ్రతం చెయ్యి. అప్పుడు నీకు ఆవును చంపిన పాపం పోతుంది’ అని చెప్పారు. ఒకవేళ అలా చేయలేక పోయినట్లయితే వెళ్లి శంకరుని గూర్చి తపస్సు చెయ్యి. శంకరుడు ప్రత్యక్షమయిన తర్వాత గంగను ఇమ్మని అడుగు. ఎక్కడ ఆవును చంపావో అటువైపు నుంచి గంగను ప్రవహింపజెయ్యి. తర్వాత అఘమర్షణవ్రతం చెయ్యి. కోటి లింగములు పెట్టు. వాటికి అర్చన చెయ్యి. అలా చెయ్యి అన్నారు. మరల గౌతముడు ఆశ్రమమునకు తిరిగి రాకుడా ఉండేవిధంగా ఉపదేశం చేశారు. 

గౌతమ మహర్షి వెళ్లి అద్భుతమయిన తపస్సు ప్రారంభం చేశారు. ఒక పార్థివ లింగమును తీసుకుని పంచాక్షరీ మహామంత్రముతో తదేక నిష్ఠతో శివుణ్ణి ఆరాధన చేశారు. అలా తపస్సు చెయ్యగా శంకరుడు ప్రత్యక్షం అయి ‘నాయనా, ఎందుకింత గొప్ప తపస్సు చేశావు?” అన్నాడు. కన్నుల నీరు కారుస్తూ గౌతముడు ‘ఈశ్వరా నీకు తెలియనిది ఏముంటుంది? నేను ఆవుని చంపి మహాపాపం చేశాను. నేను చేసిన గోహత్యా పాపమును నా నుంచి తీసివేసి నేను పాపాత్ముడను కానన్న స్థితిని నాక్కు కల్పించవలసినది’ అని ప్రార్థించాడు. శంకరుడు ‘అయ్యో పిచ్చివాడా. ఇంత తపస్సు చేసి పాపమును తియ్యమని అడుగుతున్నావా? నీకు పాపం ఉన్నాడని అనుకుంటున్నావా? అసలు నీకు పాపం లేదు. నీవు గోహత్య చేశావని చెప్పిన వాళ్ళు దుర్మార్గులు. జగత్తులో ఎవడయినా గౌతమమహర్షి అన్న పేరు పలికినా, గౌతమ మహర్షిని చూసినా వాడి పాపములు నశించిపోతాయి. నీవు అంతటి పుణ్యాత్ముడవు. నిన్ను చూడడానికి నేను వచ్చాను’ అన్నాడు. గౌతముడు ఒక్కసారి అంతర్ముఖుడై చూశాడు. సత్యం తెలిసిపోయింది. వెంటనే ఆయన కళ్ళు తెరచి శంకరుని చూసి ఆహా పరమేశ్వరా, వాళ్ళు నాకు ఎంతో ఉపకారం చేశారు. వాళ్ళు నన్ను అలా తిట్టక పొతే నిన్ను ఇలా తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఉండేవాడిని కాదు. వాళ్ళ వల్లనే కదా నాకు నీ దర్శనం అయింది. వాళ్లకు నేను ఋణపడిపోయాను అన్నాడు.

తరువాత శివుడు ‘గౌతమా! ఏదైనా వరం కోరుకో ఇస్తాను’ అన్నాడు. అపుడు గౌతముడు స్వామీ మీరు నిజంగా నన్నుకానీ అనుగ్రహించాలి అనుకుంటే ఒక్కసారి మీ జటాజూటంలో ఉన్న గంగను విడిచి పెట్టండి. నేను ఆంద్రదేశమునకు తీసుకువెడతాను’ అనగానే గభాలున గంగ స్త్రీరూపంలో పైనుండి క్రిందికి దూకి తెల్లటి వస్త్రములతో నిలబడింది. గౌతమునికి గంగాదర్శనం అయింది. వెంటనే ఆయన తన రెండు చేతులు ముకుళించి నన్ను నిర్మలుడిని చెయ్యి తల్లీ అన్నాడు. అపుడు ఆ తల్లి నీవు కోరుకున్నట్లుగా ఇక్కడ ఒక్కసారి నేను ఆగుతాను. నీటి రూపంలో నీ తలమీద పడతాను. అపుడు నీవు గంగా స్నానం చేసిన వాడవు అవుతావు. నీవు నిర్మలుడవు అయినట్లే. వెంటనే శివుని తలమీద వెళ్ళిపోతాను. ఇంకొకసారి భూమిమీద ప్రవహించను అన్నది. అపుడు గౌతముడు ‘అమ్మా, లోకం అంతా సుభిక్షం కావాలి. నీవు ప్రవహించాలని కదా తల్లీ నేను కోరింది అన్నాడు. అపుడు గంగ శంకరుని వంక చూసి స్వామీ, గౌతముని కోరిక ప్రకారం నేను ప్రవహిస్తాను. మీరు లింగరూపంలో ఇక్కడ వెలయండి. 33 కోట్ల దేవతలు నా ప్రవాహం ఎటువెడుతుందో అటు ఉండాలి. అంది. శివుడు తప్పకుండా అలాగే ఇక్కడ వెలుస్తాను అన్నాడు. అప్పుడు దేవతలు అమ్మా మేము మాత్రం ఏడాదికి ఒకమారు వచ్చి ఇక్కడ కూర్చుంటాము. పుష్కరములు వచ్చినప్పుడు మాత్రం ఏడాది అంతా ఉంటాము. అని గంగామాతను ప్రార్థించారు. గంగ సరే సంవత్సరమునకు ఒకరోజు వచ్చి ఈ తటంలో కూర్చోండి అంది. 

గౌతముని మీద వెడుతున్న గంగ పాయ కనుక దీనిని గౌతమి అని పిలుస్తారు. స్వామి ఇక్కడ త్ర్యంబకుడు అనే పేరుతో వెలశాడు. ఇది పరమశివుని అపారమయిన కారుణ్యమును, సౌలభ్యమును తెలియజేస్తుంది. ఇప్పటి వరకు ఏ మునులయితే గౌతమ మహర్షిని పో పో అని తరిమేశారో వాళ్ళందరూ గంగ క్రింద పడిందిట మనం స్నానం చేద్దాం రండి అని భార్యలతోటి, శిష్యుల తోటి, దిగుతున్నారు. గంగ వారిని చూసి ‘ఆయన పేరు మీద పుడితే మళ్ళీ అందులో స్నానం చేసి పాపములు పోగొట్టేసుకుందాం అనుకుంటున్నారా దూర్తులారా? అని అంతర్ధానం అయిపోయింది. గౌతముడు ఏడ్చాడు. ఈయన ఏడుపు చూడలేక గంగాదేవి తిరిగి వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ చక్కగా లోపలికి దిగి స్నానం చేశారు.

కొన్నిచోట్ల గౌతముడు మునులను శపించాడు అని వ్రాయబడింది. అలా చెప్తే ఈ ఆఖ్యానమునకు అర్థం ఉండదు. గౌతముడు శపించలేదు. తమ గురువుగారు ఇంత చేసినా సరే, గంగాస్నానమునకు మళ్ళీ ఏర్పాటు చేసిన అసారే స్నానం చేసి వచ్చి క్షమాపణ చెప్పి ఆయన కాళ్ళు పట్టని మునులను చూసి గౌతమ శిష్యులు మీకు శివభక్తి లేకుండుగాక అని శపించారు. ఆనాటి నుండి వాళ్ళు జడులై, తమ జీవితములను పాడుచేసుకుని తిరగసాగారు. ఆనాడు వెలసిన త్రయంబక లింగమే మహారాష్ట్రలోని త్ర్యంబకేశ్వరుడు అని పిలవబడుతూ గౌతమీ తటి ఒడ్డునే మనం చూస్తున్నది. ఆయన త్ర్యంబకుడు. అనగా మూడు కన్నులు కలవాడు. ఆ త్ర్యంబకుడిని చూసి ఒక్కసారి మూడు కన్నుల వాడా మహాదేవా అని ఒక్కసారి నమస్కరిస్తే చాలు మీకింత ఫలితమును ఇచ్చేస్తాడు. ఒకనది ప్రవహించేటట్లు చేసి ఆనాటి నుండి ఈనాటి మనవరకు బ్రతుకుతున్నాం అంటే ఇన్ని క్షేత్రములు వచ్చాయి అంటే మహాపురుషుడయిన గౌతముడిని మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి.

అసలు దేవునికి పూలు ఎందుకు ?

అసలు దేవునికి పూలని ఎందుకు సమర్పించాలో తెలుసా?

, పూలు ఎందుకు పూజలకు పూలు వాడటం పూర్వం నుంచి ఆచారంగా వస్తోంది.
ప్రకృతి అందం అంటే మొదటగా గుర్తొచ్చేది పూలే. అంతగా రంగు రంగుల పూలతో అలంకరించుకుని ప్రకృతి అందంగా ముస్తాబవుతుంది. తద్వారా రోజూ వారీ దైనందిక వ్యవహారాలలో భాగంగా పూలను జతచేయడం, పూలను తమ పరిసరాల్లో భాగంగా భావించడం మానవుని విధిగా మారింది. భారతీయ స్త్రీల అలంకరణలో భాగంగా పూలకు ఉన్న ప్రాధాన్యత గురించి తెలియనిది కాదు. క్రమంగా పెళ్ళిళ్ళలోనూ, ఇంటిని అలంకరించుటలో, పెళ్ళికూతురుని అలంకరించడంలో, పండుగలలో, పూజా వ్యవహారాలలో, చివరికి మరణంలో భాగంగా కూడా, అనేక విధాలుగా పూలను వినియోగిస్తారు. కావున దైవ ప్రార్ధనకు పూలను వినియోగించడంలో ఆశ్చర్యమే లేదు. పూజ చేయాలి అంటే.. ముందు పూలకు ప్రాధాన్యత ఇస్తాం. దేవుడికి అత్యంత ప్రీతికరమైనవి పూలు. నిత్య పూజ అయినా, వారం పూజ అయినా, గుళ్లో అయినా, హోమం జరిగినా ముందుగా పూలు తీసుకుంటాం. ఎన్ని రకాల పూలు పూసినా.. పూజకే. దేవుడికే అనిపిస్తుంది. పూలు, పూజకు విడదీయరాని బంధం ఉంది.
కొందరు కేవలం పూల మీద మక్కువతో గృహాలలో ప్రత్యేకంగా తోటలను సిద్దం చేయడం, లేదా పూల కుండీలలో ప్రత్యేకంగా పెంచడం వంటివి చేస్తుంటారు కూడా. ప్రతి 10 కుటుంబాలలో 5 కుటుంబాలు పూల మొక్కలను కలిగి ఉంటాయి అనడంలో ఆశ్చర్యమే లేదు. అంతగా పూలు దైనందిక వ్యవహారాలలో భాగంగా మారిపోయాయి. ప్రకృతి ప్రేమికునికి ఒక స్నేహితుడిలా పూలు ఉంటాయి అనడంలో ఆశ్చర్యమే లేదు. కొందరు కేవలం పూల మీద మక్కువతో, తమ వ్యాపారాలను కూడా మొక్కలకే కేటాయించే పనులకు పూనుకుంటూ ఉంటారు. కృష్ణుడు చెప్పిన ప్రకారం భక్తితో, పవిత్ర మనస్సుతో ఎవరైతే పూలుతో గానీ, పండుతోగానీ, నీటితో గానీ దేవుడికి పూజ చేస్తారో.. వాళ్ల భక్తి నైవేద్యాన్ని తృప్తిగా స్వీకరిస్తానని గీతలో వివరించాడు. అందుకే.. పూజలకు పూలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఒక్క చుక్క నీరైనా, దర్భలైనా, సువాసనలు కలిగించే పూలైనా నాకు సమర్పించి, నా కృపకు పాత్రులవగలరు అని తెలిపాడు. భక్తితో సమర్పించిన తులసి ఆకు సైతం కృష్ణుని భారాన్ని మోయగలిగింది అంటేనే అర్ధమవుతుంది, భక్తితో సమర్పించేది ఎంత చిన్నదైనా దేవుని కృపను ఫలితంగా అందివ్వగలదు అని. దేవుడికి అలంకరించడం నుంచి పూజలోని ప్రతి అంశం పూలతోనే ముడిపడి ఉంటుంది. రకరకాల పూలు, రకరకాల రంగుల్లో దేవుడిని అలంకరించడం, పూజించడం ఆనవాయితీగా వస్తోంది. కొన్ని పూలు తప్ప అన్ని పూలనూ పూజలకు ఉపయోగిస్తాం. అలాగే దేవుళ్లకు ఇష్టమైన పూవులతో పూజించడం సంప్రదాయం. అసలు దేవుడికి పూలు ఎందుకు సమర్పించాలి ? దేవుళ్లకు పూలంటే ఎందుకంత ప్రత్యేకం ? దేవుడికి పూలు సమర్పించేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటి ?
పూలు కోసేటప్పుడు దేవుడి పూజకు ఉపయోగించే పూలు ఎలా పడితే అలా కోయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. పూలు కోసేముందు ఈ పూలు భగవంతుడి కోసం అని మనసులో ప్రార్థించి, చెట్టుకు నమస్కరించాలి. పువ్వులను కర్రతో దులపకూడదు. చేత్తోనే కోయాలి. కోసిన పూలను కిందపెట్టకూడదు. తడిబట్టలతో కోసిన పూలను భగవంతుడు స్వీకరించడని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు... పూజకు ఉపయోగించే పూలను కూడా తడపకూడదు. ఈ నియమాల్లో దేనిని తప్పినా... సమర్పించే పూల వల్ల ఎలాంటి ఫలితం ఉండదట.
అనేక రకాల నైవేద్యాలు పెట్టకపోయినా, అగర్బత్తీ సువాసనల మద్య దేవుని ఉంచకపోయినా , ఖరీదైన ఖనిజాలతో విగ్రహాలు చేయించకపోయినా, ధూప దీప నైవేధ్యాలలో ముంచకపోయినా కూడా పర్లేదు కానీ, పూలతో అలంకరణ లేకుండా పూజ ముగించడం అంటే అది జరగని పనే అవుతుంది. ప్రతి రోజూ ఒక్క పువ్వునైనా దేవుని సమర్పించడం ద్వారా అనేక పూజలు చేసిన ఫలితాన్ని పొందవచ్చు అని భక్తుల విశ్వాసం. ఈరోజు ఇక్కడ అసలు పూలను ఎందుకు దేవునికి విధిగా సమర్పిస్తాము అన్న విషయం గురించి తెలుసుకుందాం. 
పూలు వాడే విధానం పూజలకు ఉపయోగించే పూలు చాలా పవిత్రంగా ఉండాలి. వాడిపోయినవి, ముళ్లుతో ఉన్నవి, అపరిశుభ్రమైనవి, దుర్వాసనతో ఉన్న పూలు ఉపయోగించరాదు. మహాలక్షికి ఎనలేని ప్రీతి. అలాగే తెల్లని పూలంటే.. చదువుల తల్లి సరస్వతికి, పసుపు రంగు పూలు పార్వతీదేవికి ఇష్టం. కాబట్టి ఈ దేవతల పూజలకు ఈ రంగు పూలను ఉపయోగించడం శ్రేయస్కరం.
మరియు దేవునికి పూలను సమర్పించడానికి సరైన మార్గాలను గురించి కూడా తెలుసుకుందాం. ఈ ప్రకృతిలో అత్యంత అందమైన విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి పూలే , తర్వాతే ఏమైనా: నిజమే కదా, ఎటువంటి ఆలోచనా లేకుండా చెప్పవచ్చు. గడ్డి పువ్వులో కూడా అందం దాగి ఉంటుందని. శ్రేయస్కరమైన పూలు తామర, కలువ, జాజి, చామంతి, నందివర్దనం, మందారం, నీలాంబరాలు, కనకాంబరాలు, పారిజాతం, పద్మాలు, ఎర్రగన్నేరు, నిత్యమల్లి పూలు దేవుడి పూజకు శ్రేయస్కరం.
పూలను దేవుని సమర్పించడం ద్వారా, ఈ ప్రకృతిలోనే అందమైన విషయాన్ని దేవునికి సమర్పించిన భావన కలుగుతుంది. పూలను సమర్పించే విధానం అనుసరించి, భక్తుడు ఎంత భక్తి ప్రపత్తులను, నియమ నిష్ఠలని కలిగి ఉన్నాడో అన్నది తెలుస్తుంది. దేవునికి పూలను సమర్పించడం ద్వారా అనేక లాభాలను పొందవచ్చు : నియమ నిష్టలతో దేవునికి ప్రేమగా పూలను సమర్పించిన భక్తుని పట్ల దేవుని కృప ఎన్నడూ ఉంటుంది, తద్వారా ఆర్ధిక సమస్యలు లేకుండా, మానసికంగా, శారీరికంగా , స్నేహితుల మరియు కుటుంబ సంబంధాల పరంగా సమస్యలను దూరం చేసి , క్రమంగా సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగేలా ఆశీర్వదిస్తాడని భక్తుల ప్రఘాడ విశ్వాసం. పూలు తమ పరిసరాలను అందంగా మార్చడమే కాకుండా, సానుకూల ఫలితాలకు మార్గాన్ని సుగం చేస్తాయి: పూలలో అంతర్లీన అందం, ఆకర్షణ దాగి ఉంటుంది, మరియు వాటి సువాసన పూజలో ఒకరకమైన సానుకూల దృక్పధాలను కలిగేలా చూస్తుంది. తద్వారా మానసిక ప్రశాంతత చేకూరి, ఏకాగ్రత పెరగడానికి కారణమవుతుంది. ద్యానం, మంత్రోచ్చాణలు తోడైతే పూజా ఫలం మరింత ఎక్కువగా ఉంటుంది. పూజ అనే పదంలో కూడా పూల గురించిన ప్రస్తావన ఉంది : పూజ అనే పదంలో మొదటి అక్షరం పుష్పాన్ని సూచిస్తే, రెండవ అక్షరం జపాన్ని సూచిస్తుంది. అనగా పుష్ప జపం అని అర్ధం వచ్చేలా. జపం అనగా ఇష్ట దేవుని ఇతర పేర్లతో స్మరించడం. మరియు “ జ ” అనే అక్షరం జలాన్ని కూడా సూచిస్తుంది. దేవునికి పూలను ఎందుకు సమర్పించాలి ? నిజానికి దేవునికి ఆలోచనలతో సంబంధమే లేకుండా పూలను సమర్పించడం జరుగుతుంది. నిజానికి పెద్ద విషయం కాకపోయినా, మీ ఇష్టదైవానికి సంబంధించి మాత్రం కొన్ని విధివిధానాలు పాటించడం మంచిది. ముళ్ళు కలిగిన లేదా అసంబద్దమైన పూలను దేవునికి సమర్పించకూడదు. కొన్ని పురాణాల, దేవుని కథలు, వ్రత విధానాల ప్రకారం కొన్ని పూలు పూజకు పనికి రావు అని తెలుపబడినది. అవి ఏమిటో పెద్దలను కనుగొని, తద్వారా పూజకు ఉపక్రమించడం అన్ని విధాలా మంచిదిగా సూచించబడినది. ప్రతి దేవుడు లేదా దేవత తమకంటూ ఇష్టమైన పూలను కలిగి ఉంటారు. ప్రతి దేవుడు లేదా దేవత తమకంటూ ఇష్టమైన పూలను కలిగి ఉంటారు. అవి ఏమిటో తెల్సుకుని తద్వారా పూజకు ఉపక్రమించడం మంచిది. ఉదాహరణకు సరస్వతీ దేవికి తామర పువ్వులా. మంచి సువాసనలు కలిగిన పూలను మంచి సువాసనలు కలిగిన పూలను దేవునికి సమర్పించడంలో జాగ్రత్తను తీసుకోవాలి. తద్వారా తాజా పూలనే దేవునికి సమర్పించవలసి ఉంటుంది. పెద్దల సూచనల ప్రకారం క్రింద పడిన పూలను సమర్పించడం చేయరాదు. శుభ్రంగా ఉన్న పూలనే దేవునికి సమర్పించవలసి ఉంటుంది ఎటువంటి కళంకం లేని అందమైన, శుభ్రంగా ఉన్న పూలనే దేవునికి సమర్పించవలసి ఉంటుంది. కొందరు ఒక పళ్ళెంలో నీటిని తీసుకుని అందులో పూలను ఉంచి, సున్నితంగా శుభ్రపరచిన తర్వాతే దేవుని సమర్పించే అలవాట్లు కలిగి ఉంటారు. ఇళ్ళలో ప్రత్యేకంగా మీరే పెంచిన పూల మొక్కలనుండి సేకరించిన పూలను వీలయితే, ప్రత్యేకమైన, శుభ్రంగా ఉన్న ప్రదేశాలలో పెంచిన పూల మొక్కల నుండి పూలు తీసుకోవడం శ్రేయస్కరం. ఇంకా వీలయితే ఇళ్ళలో ప్రత్యేకంగా మీరే పెంచిన పూల మొక్కలనుండి సేకరించిన పూలను పూజకు వాడడం అన్ని విధాలా మంచిది. మంత్రోచ్చారణ సమయంలో పూలను పద్దతిగా దేవుని పాదాల కడ విడువడం పూలను మాలధారణ, లేదా ప్రతిమకు కాని విగ్రహానికి కాని పూలను అలంకరించడమే కాకుండా మంత్రోచ్చారణ సమయంలో పూలను పద్దతిగా దేవుని పాదాల కడ విడువడం ద్వారా కూడా దేవుని కృపకు పాత్రులవగలరు.

వివాహధోషo - పరిష్కారం

వివాహాలు కుదిర్చేటప్పుడు పొంతన చూస్తారు వరుడిది , వధువుది , జాతకపరిశీలనలో కుజదోషం అమ్మాయిలో ఉందనో , లేక అబ్బాయిలో ఉందో చెప్పడం వలన ఆ సంబంధాన్ని కుదుర్చుకోరు , కొన్ని అనంతకాల సర్పదోషం ఉంది అనో , సప్తమస్థానానికి రాహుదోషం పట్టింది లేదా లగ్నములోనె రాహువు ఉన్నాడనో లేదా మాంగల్యస్థానంలో రాహువు ఉన్నాడనో, ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళు చెడిపోతుంటాయి . నిశ్చితార్థం అయిన తరువాత కూడా కొన్ని చిన్న చిన్న కారణాలతో అపశకునముల వలన పెళ్ళిళ్ళు ఆగిపోతాయి. వివాహాలు అయిన తరువాత కొంత కాలానికే విడిపోయే సంఘటనలు ఏర్పడుతాయి. ప్రేమ వివాహాలు కూడా జరగక వేరే వేరే వ్యక్తులను వివాహం చేసుకోవాల్సి వస్తుంది.... ఇలాంటి వాటికి తగిన పరిష్కారాం ...


*యక్షిణి కుందెళ్ళు:-* 

ఏ ఇంట్లో అయితే వివాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయో ఆ ఇంట్లో ఒక మగ , ఆడ కుందేలును స్వచ్చమైన తెల్లగా ఉన్న కుందేలును తీసుకుని వచ్చి ఆ రెండింటికీ వివాహం చేస్తారు ఇది కేరళ తంత్రం . పెళ్లి చేసిన తర్వాత ఆ కుందేలును ఆ ఇంటివారికి ఇస్తారు . కుజదోషం ఉంటే ఎర్రని పదార్థాలు ఆ కుందేలుకు ఆహారంగా పెట్టాలి. రాహు కేతువుల దోషం ఉంటే భూమిలో నుంచి వచ్చే దుంపలను ఆహారం పెట్టండి. శుక్రదోషం ఉంటే తెల్లని పదార్థాలు, తీపి పదార్థాలు ఎక్కువగా వేయాలి. బుధగ్రహదోషం ఉంటే ఆకుపచ్చని గడ్డి లేదా పెసలను నానబెట్టి ఆహారంగా వెసి పెంచమని చెబుతారు. ఇలా చేయడం వల్ల మూడు నెలల కాలంలోనే వివాహం కుదిరి సంతోషంగా దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తారు . అనతి కాలంలోనే చక్కని సంతానం కలుగుతుంది.యక్షిణీ కుందేలు దొరకని వారు అటువంటి కుందేలు బొమ్మలను రెండింటినీ తీసుకుని వచ్చి బొమ్మల పెళ్ళి చేయవచ్చు. నల్ల ఇరుగుడు చెక్కతో గానీ , ఎర్రచందనం చెక్క తో గాని చేసినటువంటి బొమ్మలకు వివాహం చేసి ఆ ఇంట్లో పెడితే శుభకార్యాలు జరుగుతాయి. ఇది కేరళలో ఉన్న చాలా పురాతనమైన తంత్ర ప్రక్రియ.

అన్వేషణ

అన్వేషణ

జీవితంలో ఎదగాలంటే అన్వేషణ ఉండాలి.

అన్వేషణలో ముఖ్యమైనది జిజ్ఞాస. 

ఏదైనా 

ఇది ఏమిటీ, 

ఇది ఎలా, 

ఇదే ఎందుకు, 

ఇది ఎవ్వరూ,

ఇది ఎప్పటిది, 

ఇది ఏక్కడిది 

ఇలా ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలు వెతకాలి. 

ఈ ప్రశ్నలేవో సామాన్యంగా ఉన్నాయి అనిపిస్తాయి కానీ మనం అంతర్ముఖం అయ్యి ఈ ప్రశ్నలు వేసుకొని సమాధానాలు తెచ్చుకుంటే మన అవహాగన పెరుగుతుంది.

 ఉదాహరణకు 

ఏమిటి ఈ జీవితం? 

ఎందుకు పుట్టాను?

ఏమి చెయ్యాలి నేను?

ఏమి చేస్తున్నాను?

ఎందుకు నాకు ఇలా జరిగింది?

ఎందుకు నాకు ఇలా జరగలేదు?

అస్సలు నేనేవరు?

ఎక్కడినుంచి వచ్చా?

ఎక్కడికి పోతా?

ఇక్కడికే ఎందుకు వచ్చా?

ఇక్కడ ఉన్నవి అన్ని నావేనా?

వీటిని నాతో ఈ లోకం వదిలి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్లవచ్చా?

ఈ శరీరము లోకి రాక ముందు నేను ఎక్కడ ఉన్నాను?

ఎందుకు ఈ శరీరంలో కి వచ్చాను?

ఈ శరీరం వదిలాక ఎక్కడికి పోతా?

ఇలా ప్రశ్నలు వేసుకొని వాటికి సమాధానాలని గ్రంధముల ద్వారా కానీ, 
సత్పురుషులతో సంభాషణ ద్వారా కానీ, 
ధ్యాన స్థితిలో కానీ తెలుసుకోవాలి. 

ఆ సమాధానాలు మనకి సంతృప్తి ని ఇవ్వాలి. 

అలా ఇవ్వనంత వరకు అన్వేషణ కొనసాగించాలి. విశ్రమించకూడదు. 

ఒకవేళ వీటికి నేను సమాధానాలు చెప్పినా అవి వెంటనే ఆమోదించకూడదు. 

తర్కము తో విచారించాలి. 

పెద్దలతో చర్చించాలి. మీరు తృప్తి పొందితే అప్పుడు ఆ సమాధానాలు అంగీకరించాలి.

మూల సూత్రం ఏమిటీ అంటే 
వెతుకు, వెతుకు, వెతుకు, 
వెతికితే దొరకనిది ఏది లేదు. 
నీవెవరో, నీవారెవరో, నీ ఉనికి ఏమిటి 

ఇలా అన్నిటి గురించి 

వెతికి వెతికి వెతికి 

తెలుసుకో.

ఏమంటారు.

11, అక్టోబర్ 2020, ఆదివారం

అరవై సామెతలతో.. అందమైన కధ.

*అరవై సామెతలతో.. అందమైన కధ.* 

          *"కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది.." అంటూ గొణుగుతూ.. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన భర్త కాంతారావు గారికి కాఫీ తెచ్చి ఇచ్చింది సుమతి..     " ఏంటోయ్ నీలో నువ్వే గొణుక్కుంటున్నావు.. ఏంటో.. అర్ధమయేటట్లు చెప్పొచ్చు కదా! " అన్నారు ఆయన..*

      *"ఏం చెప్పమంటారు.. " చిలక్కి చెప్పినట్లు చెప్పాను" మీకు.. విన్నారా.. మీ అక్కగారి" నోట్లో నువ్వు గింజ దాగదు " అని.. నామాట వినకుండా.. ఆవిడ చెవిలో ఊదారు.. ఆవిడ సంగతి తెలిసిందే గా* 

*"తిరిగే కాలూ.. తిట్టే నోరూ ఊరుకోదని" మనమ్మాయికి కుజ దోషం వుందని ఆవిడ ఊరంతా టాంటాం చేస్తోంది. ఒకరిని అనుకుని ఏం లాభం.." మన బంగారు మంచిదవాలి కానీ".. ఇక దీనికి పెళ్ళి అయినట్టే.." అంది సుమతి.*

      *"ఔనా.. మా అక్క అలా చెప్పదే ఎవరికీ..*

*"అనుమానం.. పెను భూతం.." అనవసరంగా అపార్థం చేసుకోకు.. మీ పుట్టింటి వాళ్ళేమయినా చెపుతున్నారేమో కనుక్కో.. జాతకం రాయించింది మీ తమ్ముడేగా.. " అన్నాడు కాంతారావు.*

    *"ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు" ప్రతీదానికీ మా అన్నదమ్ముల్ని ఆడిపోసుకోవడమే మీరు."ఆడలేనమ్మ మద్దెల గోల" లాగా... అయినా మా తమ్ముడేం మీ అక్కయ్య లాగా ఎవరికీ చాటింపులు వేసే రకం కాదు.." అంది సుమతి.*

        *"ముంజేతి కంకణానికి అద్దమేల".. అయినా.. ఇప్పుడు ఆ గోల ఆపి అసలు సంగతికి రా... ఇంతకీ నీ బాధ... మా అక్క అందరికీ చెపుతోందనా... మనమ్మాయి పెళ్ళి కావడం లేదనా.. " చెవిలో జోరీగ లాగా " నస పెట్టకుండా ఏదో చెప్పు ముందు.." అన్నాడు కాంతారావు.*

      *"ఇంకేం వుందీ చెప్పడానికీ.. మీకు ఎప్పుడూ" కడుపే కైలాసం.. ఇల్లే వైకుంఠం" నా మాట ఎప్పుడు పట్టించుకున్నారు కనకనా.. అమ్మాయికో మంచి సంబంధం వాకబు చేద్దాం అనిగానీ.. అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేద్దామనిగానీ.. ఆలోచనే లేదు.. " అంది సుమతి నిష్ఠూరం గా..*

  *"ఓసి, పిచ్చిదానా.. " కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదే ".. ఆ ఘడియ రాలేదింకా మన పిల్లకి.. " అన్నాడు తాపీగా..*

    *"అబ్బబ్బా మీకు చెప్పీ చెప్పీ నా " తల ప్రాణం తోకకివస్తోంది" . " చెవినిల్లు కట్టుకుని పోరినా" వినిపించుకోరు. మీ పెదనాన్న కొడుకు.. చూడండి.. ఎంచక్కా రెండేళ్ళలో ఇద్దరి ఆడపిల్లలు పెళ్ళి చేసి*

*"గుండెల మీద కుంపటి" దించేసుకున్నారు.. కాస్త ఆయన ఎరికలో ఏవైనా మంచి సంబంధాలున్నాయేమో అడగండి." అంది సుమతి.*

      *"వాడినా.. వాడు" ఉపకారం అంటే ఊళ్ళోంచి పారిపోయేరకం." వాడినుంచి నేను సహాయం ఆశించడం "ఇసుకలో నూనె పిండినంత".. అయినా వాడు*

*"అయినవాళ్ళకి ఆకులు.. కాని వాళ్ళకి కంచాలు" పెట్టే తరహా.. వాడిని చచ్చినా అడగను." అన్నాడు కాంతారావు.*

  *"అయ్యో.." అలా అనుకుంటే ఎలా అండీ..*

  *"వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్లు పట్టుకున్నాడు" ఆయన ముందు మనమెంతటివారం.. అయినా మన*
*"నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది." మీరోసారి ఫోను చెయ్యండి.. ఆ తర్వాత" అందితే జుట్టు అందకపోతే కాళ్లు" పట్టుకుందాం." అంది సుమతి.*

     *"వాడి గురించి "అరటిపండు వలచి చేతిలో పెట్టినట్లు" చెప్పినా నీకు అర్ధం కావడం లేదు. సరేలే..* 

*"తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉన్నా ఒకటే పోయినా ఒకటే" నీ తృప్తి కోసం వాడిని అడుగుతాను. ఆ ఫోన్ ఇటు తీసుకురా..*

    *"హలో.. అన్నయ్యా.. నేనురా.. కాంతారావు ని.. ఎలా వున్నావు? అమ్మాయిల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయా? కులాసాగా వున్నారా ?.. ఆ.. ఏం లేదు.. ఈ ఏడు మేము మా శ్రీవల్లికి సంబంధాలు చూడడం మొదలెట్టాము.. నీ ఎరికలో ఏవైనా మంచి సంబంధాలుంటే చెప్పమని మీ మరదలు అడగమంటే.. అందుకని ఫోను చేస్తున్నాను.. నీకు.."* 

    *"మేనరికమా... లేదన్నయ్యా.. నీకు తెలీనిదేముందీ.. "పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు" అయినా.. వాడిని గారాబంతో చెడగొట్టింది అక్క... "మొక్కై వంగనిది మానై వంగునా" వాడికి ఇంకా ఉద్యోగం.. సద్యోగం లేదు.. స్ధిరపడలేదు... ఓ పక్క.. అక్కయ్య అంటూనే వుందిలే.. సంబంధం కలుపుకోరా.. అంటూ... మా ఇద్దరికీ సుతారామూ ఇష్టం లేదు.. "అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు" వద్దు అని చెప్పేసాలే అక్కకి.. ఏదైనా సాంప్రదాయ కుటుంబం, మంచి ఉద్యోగం చేసుకుంటున్న పిల్లాడెవరైనా వుంటే చెప్పు.. నా స్ధితిగతులు నీకెరికేగా..... ఔను.. జాతకంలో కొంచెం కుజ దోషం వుందట.. ఏవో పరిహార పూజలు చేయించింది మీ మరదలు.. అక్క చెప్పిందా..." అన్నాడు కాంతారావు..*

    *ఆ ఫోను లో ఆ అన్నగారి మాటలు అన్నీ విని విసురుగా ఫోను పెట్టేసారు కాంతారావు గారు..*

    *"ఏంటండీ.. ఏమన్నారు మీ అన్నయ్య?" అంది సుమతి.*

    *"నీ మాట విని వాడికి ఫోన్ చేసాను... నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. "మంచోడు మంచోడు అంటే చంకనెక్కి కూర్చున్నాడట" ఇలాంటి వాడే..."కళ్ళు నెత్తికెక్కాయి" వాడికి."కడుపు నిండిన బేరాలూ.. కడుపు నిండిన మాటలూ" వాడివి. ఏంటో ఆడపిల్ల పెళ్ళి చేయడమంటే ఆషామాషి అనుకుంటున్నావా.. నాకంటే ఏదో అదృష్టం పుచ్చి మంచి సంబంధాలు వచ్చాయి... అందరికీ అలా రావు... ఎవరైనా పెళ్ళిళ్ళ పేరయ్యని పట్టుకుని "గంతకి తగిన బొంతని" వెతుక్కోమని ఉచిత సలహా పడేసాడు."* *"ఊరుకున్నంత ఉత్తమం లేదు.. బోడిగుండంత సుఖం లేదు" అనవసరంగా వీడికి ఫోన్ చేసి మాటలనిపించుకున్నాను" అన్నాడు కాంతారావు కోపంగా..*

      *"అయ్యో.. అంతమాటన్నారా.. అయినా..*

  *"జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి" పోన్లెండి ఆయన బుధ్ది బయటపడింది... "తలని తన్నేవాడొకడుంటే.. తాడిని తన్నేవాడొకడుంటాడు." ఏదో ఒకరోజు ఆయనకే తెలుస్తుంది.. "ఉంగరాల చేత్తో మొట్టేవాడు చెపితేనే మాట వింటారు కొందరు".. మీరేం బాధ పడకండి.. "మనసుంటే మార్గముంటుంది".. ఆ దేముడే మనకే దారి చూపిస్తాడు. చెప్పడం మర్చిపోయా... నా చిన్నప్పటి స్నేహితురాలు పార్వతి నిన్న గుళ్ళో కనపడింది... తనకి తెలిసిన మంచి సంబంధాలు వున్నాయట.. ఈ రోజు మనింటికి వచ్చి.. చెపుతానంది.. చూద్దాం తనేం చెపుతుందో... "విత్తం కొద్దీ వైభోగం" పైగా మన దురదృష్టం "గోరు చుట్టు మీద రోకలి పోటు" లాగా పిల్లకి కుజ దోషం ఒకటీ... అది కప్పెట్టి పెళ్ళి చేయలేం కదా.." అంది సుమతి.*

    *మర్నాడు.. కాంతారావు ఆఫీసు నుంచి.. రాగానే.. ఆనందంతో ఎదురెళ్ళింది సుమతి.*

  *"ఏంటోయ్.. "గాజుల కళకళ గుమ్మంలోనే ఎదురయిందీ".... కొంపతీసి ఉదయం నేను "నక్కని తొక్కివెళ్ళినట్టున్నాను".. అన్నారు.. చమత్కారంగా..*

      *"పోండి.. మీకెప్పుడూ వేళాకోళమే... ముందిలా కూర్చుని కాఫీ తాగుతూ... నేను చెప్పే విషయం సావధానంగా వినండి. "ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయకండి" అంది. "ముద్దొచ్చినపుడే చంకకెక్కాలి" అనుకుంది సుమతి.*

        *బుద్ధి గా చేతులుకట్టుకుని..ఆ.. ఇప్పుడు చెప్పు" అన్నాడు కాంతారావు.*

      *"నిన్న.. నా స్నేహితురాలు పార్వతి గురించి చెప్పాను కదా.. మధ్యాహ్నం తను వాళ్ళాయనని తీసుకుని మన ఇంటికి వచ్చింది. ఆయన బేంక్ మేనేజర్ గా పని చేసి రిటైర్ అయ్యారట. పెద్దది ఆడపిల్ల కి పెళ్ళి చేసి.. కాపురానికి పంపారట. తర్వాత అబ్బాయి.. వేణుగోపాల్.. ఎమ్ బి ఏ.. చేసి.. ఏదో పెద్ద కంపెనీలో చేస్తున్నడట. నెలకి లక్ష పైగా జీతం వస్తోందట. గుళ్ళో నాతో పాటు మన వల్లిని చూసారు కదా.. పిల్ల చక్కగా*

  *"చిదిమి దీపం పెట్టుకునేలా వుంది" అనిపించిందట. వాళ్ళ వేణుకి చేసుకుంటామని అడిగారు. అప్పటికీ చెప్పాను.. "అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని వుంది" అన్న చందాన పిల్ల జాతకంలో కుజ దోషం గురించి కూడా చెప్పాను. వాళ్ళ కి అలాంటి పట్టింపులు ఏవీ లేవనీ... అసలు జాతకాల గురించి* 

  *ఆలోచించమనీ.. పైగా పెట్టుపోతలు కూడా ఏవీ ఆశించమనీ.. చెప్పారు. నాకైతే... "వెతకపోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టు" అనిపించింది. "ఉయ్యాల్లో బిడ్డని పెట్టుకుని ఊరంతా తిరిగామేమో" మనం. ఇదిగో అబ్బాయి ఫోటో ఇచ్చి వెళ్ళారు.. చూడండి.. దొరబాబు లా వున్నాడు.. మన శ్రీవల్లి పక్కన చూడ ముచ్చటగా వుంటాడనిపించింది. ఇంతకంటే గొప్ప సంబంధం మనం తేలేము.. ఆలోచించండి.." అంది సుమతి.. సంబరంగా.*

    *"నువ్వు చెప్పిందీ నిజమే సుమతీ... పిల్లాడు బావున్నాడు.. కుటుంబమా.. మంచి సాంప్రదాయ కుటుంబమని చెపుతున్నావు.. పైగా వాళ్ళకి ఈ జాతకాల పట్టింపు లేకపోవడం... నిజంగా మన అదృష్టం. సరే మరి.. రేపు వెళ్లి మంచీ చెడూ మాట్లాడి వద్దాం." అన్నాడు కాంతారావు.*

      *రేపటిదాకా ఎందుకూ..*

    *"శుభస్య శీఘ్రం..." ."తలుచుకున్నపుడే తాత ప్రయాణం" అన్నట్లుగా ఇప్పుడే బయలుదేరదాం. మనం వస్తున్న్నట్టు పార్వతి కి ఫోన్ చేస్తాను."మీన మేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా అయిపోతుంది".. లేవండి.. లేవండి.." అంది సుమతి.*

      *"లేడికి లేచిందే పరుగు".. మా లేడీ గారు యమ హుషారుగా వున్నారు.. ఉండు పనిలో పని... మా పెదనాన్న కొడుక్కి ఫోన్ చేసి.. ఈ విషయం చెప్పాలి.*

*"గంతకి తగిన బొంత" అన్నాడుగా... ఇప్పుడు నేను చెప్పే ఈ సంబంధం వాడికి "కుక్క కాటుకి చెప్పు దెబ్బ" అనిపించాలి. "ఇనుము విరిగినా అతకవచ్చుకానీ.. మనసు విరిగితే అతకలేము..".. అంతలా నా మనసుని బాధ పెట్టాడు వాడు." అన్నాడు కాంతారావు.*

        *"పోన్లెండి.. "ఊరందరిదీ ఓ దారి ఉలిపిరి కట్టెదో దారి" వదిలేయండి.. ఆయనని.. "గురివింద గింజ తనకింద నలుపెరగదట" మనకెందుకింక ఆయన సంగతి.. ముందు బయలుదేరదాం పదండి" అంటూ భర్త ని తొందరపెట్టింది సుమతి.*

        *వెళ్లే దారిలో..."ఏవండీ.. చెప్పడం మర్చిపోయా.. ఇందాక పార్వతీ.. వాళ్ళాయన వచ్చినపుడు మీ అక్కయ్య గారు వచ్చారు.. విషయం అంతా తెలుసుకున్నారు.. వాళ్ళు వెళ్ళాక.. తన కొడుక్కి.. శ్రీవల్లి ని ఇవ్వడంలేదని ఉక్రోషం తో.. నానా మాటలు అన్నారు.."ఏ రాయైతేనేం పళ్ళూడకొట్టుకోవడానికి".. ఆ జాతకాల పట్టింపులు నాకు లేవన్నాను.. అయినా నా మాటకి విలువీయకుండా పరాయిసంబంధాలకి పోతున్నారూ.. "కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక పోతుంది" అంటూ.. శాపనార్థాలు పెట్టిందావిడ..*

*"శుభం పలకరా పెళ్ళి కొడకా అంటే పెళ్ళి కూతురు... ఏది ?" అన్నట్టుగా.. ఈవిడ అపశకునపుమాటలేంటీ.. అని బాధేసింది నాకు" అంది సుమతి.*

    *"పోనీలే.. మా అక్క సంగతి తెలుసుకదా... నువ్వు ఎందుకు.."గుమ్మడి కాయల దొంగంటే భుజాలు తడుముకుంటావు" పట్టించుకోకు..."గుడ్డి గుర్రానికి పళ్ళు తోమడం" తప్ప దానికి వేరే పనీపాటా లేదు.*

  *"పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు" అది అలా వాగుతూనే వుంటుంది. వదిలేయి తన మాటలు.. ఎప్పుడూ వుండేవేగా.." అంటూ భార్య ని ఓదార్చాడు.*

          *పెళ్లి చూపులు అయిపోవడం.. పెళ్లి మాటలు మాట్లాడుకోవడం.. ఆకాశమోత పెళ్ళి పందిరిలో భూదేవంత అరుగు మీద.. కాంతారావు, సుమతి దంపతులు.. పెళ్లి కొడుకు కి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం అయిపోయి.. . అమ్మాయిని అత్తగారింటికి సాగనంపారు.*

      *పై పంచతో చెమర్చిన కళ్ళని తుడుచుకుంటూ..*

  *"అందరికాళ్ళు మొక్కినా అత్తవారింటికి పోక తప్పదు కదా" అంటూ అనుకున్నాడు ఆ ఆడపిల్ల తండ్రి.*

      *ఈ జాతకాలు కుదరడం లేదనే వంకో.. ఈ కుజ దోషం కారణంగానో.. చాలా మంది ఆడపిల్లలకి.. సరైన సమయంలో వివాహం కాకపోవడమో.. అసలు వివాహాలే కాకపోవడమో జరుగుతోంది. విఙ్ఙానం ఇంతలా వెల్లివిరిసి.. ప్రపంచం ఆధునికంగా ముందుకు కు సాగిపోతోంటే... ఇంకా ఈ మూఢ నమ్మకాలేంటి ? ఆడపిల్లల జీవితాలకి ఈ జాతకాలు ఓ అడ్డుగోడ.. చదువుకున్నవారిలోనే ఈ జాడ్యం ఎక్కువగా వుంది.. అందరికీ.. మా శ్రీవల్లి చేయందుకున్న వేణుమాధవ్.. ఓ ఆదర్శం కావాలి... అనుకున్నాడు కాంతారావు.*

        *ఇంతలో ఫోన్మోగింది.... ఈ పెళ్ళి కి పిలవలేదుగా.. అందుకే ఈ సంగతి తెలీక ... పెదనాన్న కొడుకు.... "ఒరేయ్ కాంతారావూ... మీ అమ్మాయికి ఏదైనా నా సంబంధం వుంటే చెప్పమన్నావుగా... ఇక్కడ.. ఈ. సేవ లో పనిచేస్తూంటాడు.. నెలకి పదివేలు జీతం .. అతనికీ కుజ దోషం వుందట. సరిపోతుంది ఇద్దరికీ.. వాళ్ళ నెంబర్ ఇస్తాను.. ఓ సారి మాట్లాడి.. సంబంధం కుదుర్చుకో... నాపేరు చెపితే.. కట్నంలో.. కాస్త తగ్గిస్తారు.." అన్నాడు..*

    *"ఆ.. అన్నయ్యా... "దొంగలు పడ్డ ఆరునెలలకి కుక్కలు మొరిగాయట".. అర్ధమయిందనుకుంటాను.." అంటూ ఫోన్ పెట్టేసాడు.*. ఇన్ని సామెతలతో చక్కటి సన్నివేశం రక్తి కట్టించిన అజ్ఞాత రచయిత కు అనేక అభినందనలతో..ఇది మీరూ ఆనందించగోరుతున్నాను✨