28, ఫిబ్రవరి 2022, సోమవారం

Vitamins Deficiency

Vitamins Deficiency: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషక పదార్ధాలు, విటమిన్స్ చాలా అవసరం. కొన్ని రకాల విటమిన్ల లోపిస్తే ఆ సంకేతాలు స్పష్టంగా కన్పిస్తాయి. శరీరంలో ఏ విటమిన్ లోపముందో ఎలా తెలుసుకోవాలో పరిశీలిద్దాం..

శరీరం వివిధ రకాల వ్యాధులతో పోరాడాలంటే వ్యాధి నిరోధక శక్తి చాలా అవసరం. మరి వ్యాధి నిరోధకశక్తి పెంపొందించాలంటే కచ్చితంగా పోషక పదార్ధాలు, విటమిన్స్, ఖనిజాలు అత్యవసరం. శరీరంలో ఇవి లోపిస్తే వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి. ఏయే విటమిన్ల లోపంతో ఏ సమస్యలు తలెత్తుతాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

ముఖ్యంగా విటమిన్ ఎ లోపముంటే కంటి సమస్య ఎదురౌతుంది. మెరుగైన కంటి దృష్టి కోసం విటమిన్ ఎ తప్పనిసరి. చీకట్లో సైతం చూసేందుకు దోహదపడే రోడాపిన్స్ ఉత్పత్తికి విటమిన్ ఎ దోహదపడుతుంది. విటమిన్ ఎ లోపముంటే..తక్కువ వెలుతులో సరిగ్గా చూడలేకోవపోవడం, చర్మం చికాకు, దురద, కళ్లు పొడిబారడం వంటివి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.

ఇక విటమిన్ బి 2, బి 6 లు శరీర కణజాలాల నిర్వహణకు ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోడానికి చాలా అవసరం. విటమిన్ బి6 నీటిలో కరిగే గుణం కలిగినది. శరీరంలో ఎంజైమ్‌ల నిర్మాణానికి దోహదపడుతుంది. ఈ విటమిన్ లోపముంటే..నోటి అల్సర్, నోటి పూత, చుండ్రు, తలపై ప్యాచెస్, స్కాల్ప్ దురదగా ఉండటం ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.

విటమిన్ బి 7 అనేది మనం తినే ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. ఎప్పటికప్పుడు రిఫ్రెష్, ఎనర్జిటిక్ ఫీలింగ్ కల్గిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే..గోర్లు సులభంగా విరిగిపోవడం, తీవ్రమైన అలసట, కండరాల్లో నొప్పి, తిమ్మిరి, చేతులు, కాళ్లలో జలదరింపు ప్రధాన లక్షణాలుగా కన్పిస్తాయి.

ఇక విటమిన్ బి 12 అనేది మెదడు, నరాలు, రక్తకణాల పనితీరును మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతుంది. శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో ఇవే కీలకం. ఎక్కువగా పౌల్ట్రీ, పాల ఉత్పత్తుల్లో లభిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే..తరచూ తలనొప్పి, చర్మం లేతగా ఉండటం లేదా పసుపుగా ఉండటం, నోటిలో పగుళ్లు, వాపు, డిప్రెషన్ వంటి లక్షణాలు కన్పిస్తాయి.

విటమిన్ సి కారణంగా కణజాలాలు మెరుగ్గా ఉంటాయి. శరీరంలో జరిగే వైద్య ప్రక్రియకు దోహదపడుతుంది. గాయాలు త్వరగా మానేందుకు ఉపయోగకరం. ఇమ్యూనిటీ పెంచేందుకు ఈ విటమిన్ కీలకం. విటమిన్ సి లోపిస్తే..గాయాలు త్వరగా మానకపోవడం, డ్రై స్కాల్ప్, చర్మం పొడిగా ఉండి దురద ఉండటం, ముక్కు నుంచి రక్తం కారుతుండటం, మడమల్లో పగళ్లు రావడం ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.

ఇక మరో ముఖ్యమైంది విటమిన్ ఇ. ఇది శరీరంలో ఇమ్యూనిటీ పెంచేందుకు దోహదపడుతుంది. ధమనులు గడ్డకట్టకుండా ఆపుతుంది. రక్త ప్రసరణ, గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ విటమిన్ లోపిస్తే..చేతులు, కాళ్లలో చలనం లేకపోవడం, శరీర కదలిక అనియంత్రితంగా ఉండటం, బలహీనమైన కండరాలు ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.

24, ఫిబ్రవరి 2022, గురువారం

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః.....*_ _*గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః.

_*🙏గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః.....*_ _*గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః....🙏*_ 

_*ఈ శ్లోకం అందరికీ తెలుసు కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది...మొదట ఎవరు పలికారు....ఎందుకు పలికారు.....దాని వెనుక ఉన్న కథ....*_ _*🍃🌻పూర్వం కౌత్సుడు అనే పేద పిల్లవాన్ని విద్యాధరుడు అనే గురువు గారు తన ఆశ్రమానికి పిలుచుకు వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు. ఒకసారి గురువు గారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళాడు. గురువు గారు తిరిగి వచ్చేవరకు కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు.*_ _*🍃🌻గురువు గారు తిరిగివచ్చిన కొన్ని రోజులకు కౌత్సుడి చదువు పూర్తయింది. కౌత్సుణ్ణి తీసుకెళ్లాడానికి తల్లిదండ్రులు వచ్చారు. కానీ కౌత్సుడు తాను గురువు గారి దగ్గరే ఉంటానని ఇంటికి రానని ఖరాఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపాడు.*_ _*🍃🌻వాళ్ళు వెళ్లిన తరువాత గురువు కారణం అడిగాడు.అప్పుడు కౌత్సుడు ఇలా చెప్పాడు "గురువు గారూ మీరు కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్ళినపుడు మీ జాతకం చూసాను.మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్లలేను." అని చెప్పాడు.*_ _*🍃🌻కొన్ని రోజులకు గురువు గారికి క్షయ రోగం వచ్చింది.ఆ కాలంలో క్షయకు చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్లి దాన ధర్మాలు ,పుణ్య కార్యాలు చేయాలని గురుశిష్యులు కాశీకి వెళ్లారు. గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్ళను అసహ్యించుకున్నారు. కానీ కౌత్సుడు గురువు గారికి సేవలు చేస్తూనే ఉన్నాడు.ఎంతోమంది గురువు గారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌత్సుడు మాత్రం గురువు గారిని వదలలేదు.*_ _*🍃🌻కౌత్సుడి గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు. మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్లి గురువుని వదిలేయమని సలహా ఇచ్చాడు. కౌత్సుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు. మరలా విష్ణువు మారు వేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌత్సుడు వినలేదు. చివరికి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు. మెచ్చిన పరమేశ్వరుడు ఏదయినా సహాయం కావాలా అని అడిగాడు. మరెవరూ గురువును వదిలేయమనే సలహా ఇవ్వడానికి రాకుండా కాపలా కాయమన్నాడు.*_ _*🍃🌻అతని గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. కౌత్సుడికి మోక్షం ఇస్తాం అన్నారు. అప్పుడు కౌత్సుడు వారితో నాకు మీ గురించి చెప్పి ఈ రోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణువు, నా గురువే నాకు మహేశ్వరుడు. మీరు సాక్షాత్కారం అవడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఇలా శ్లోకం చెప్పాడు.*_ _*గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః*_ _*గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః*_ _*🍃🌻తన గురువు గారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు. గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువుగారికి మోక్షం ప్రసాదించారు. ఆనందంతో కౌత్సుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు.*_ _*ఇదీ ఈ శ్లోకం వెనుక ఉన్న కథ....*_ _*కొన్ని ముఖ్య శ్లోకల విలువలు, అర్ధాలు అందరము తెలుసుకోవాలి, మనము అందరం మన తరువాత వాళ్ళకి కూడా తెలియజేయాలి*🙏☯️🕉️🌞🔱🚩

23, ఫిబ్రవరి 2022, బుధవారం

తిరుమల సమగ్ర samaacharam

👏✍️🔱
*తిరుమల సమగ్రసమాచారం మీకు ఇక్కడ ఇవ్వబడింది . మీకు కావాల్సిన సమాచారం పైన క్లిక్ చేస్తే క్షణాలలో సమాచారం ఓపెన్ అవుతుంది . మీకు ఎంతగానో ఈ సమాచారం ఉపయోగపడగలదు . ఎంతశ్రమకోర్చి ఈ సమాచారం సేకరించమో మీకు చదివితే అర్ధమౌతుంది . మీరు షేర్ చేస్తే అందరికి ఈ సమాచారం ఉపయోగపడగలదు* . 

తిరుమల శ్రీవారి మెట్టు నడక దారి :  https://goo.gl/MqM8Qg

ఇకపై అలిపిరి మెట్లమార్గం సులువు :  https://goo.gl/ahvx4f

తిరుమల చుట్టుప్రక్కల ఏమేమి చూడాలి :  https://goo.gl/azxwRV

తిరుమల కొండపైన ఏమేమి చూడాలి :  https://goo.gl/EddXiw

తిరుమల సేవలు వాటి ధరలు బుక్ చేస్కునే విధానం : https://goo.gl/1Mdeef

అంగప్రదిక్షణ వివరాలు :  https://goo.gl/6dKzrm

తులాభారం ఎలా వెయ్యాలి :  https://goo.gl/fJ5eij

తిరుమల సేవకు ఎలా వెళ్ళాలి :  https://goo.gl/o2t5Eh

తిరుమల లడ్డు మొదటి నుంచి లేదు :  https://goo.gl/JDqNq5

తిరుపతి విమానం లో వెళ్లే రోజులు వచ్చాయి :  https://goo.gl/UCvVjV  

తిరుమల మొదటి సారి వెళ్తున్నారా ? :  https://goo.gl/afNxs9

తిరుమల గురించి ఈ నిజాలు మీకు తెలుసా :   https://goo.gl/4a3tVd

తిరుమల రూమ్స్ నెట్ లో బుక్ చేస్కునే సమయం లో ఇవి గుర్తుపెట్టుకోండి :  https://goo.gl/TmNqgQ 


కపిలతీర్థం ఎలా చేరుకోవాలి :  https://goo.gl/FiYDnf


శ్రీకాళహస్తి దర్శనం తరువాత ఎక్కడికి వెళ్లకూడదా ? :  https://goo.gl/dL4oB7

కొత్త జంటకు శుభవార్త :  https://goo.gl/BT2KXA 

తిరుమల సమగ్ర సమాచారం :  https://goo.gl/s3FkjC

తిరుమల దర్శనం ముందుగా ఎవరు చెయ్యాలి :   https://goo.gl/kxtS8y  

ఈ నెంబర్ లు సేవ్ చేస్కోండి :  https://goo.gl/pEVK2R 

కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు :  https://goo.gl/32t1kA

తిరుమల వెళ్లేవారికి నా సలహా :  https://goo.gl/PkSPou

తిరుమల చుట్టుప్రక్కల చూడాల్సిన క్షేత్రాలు :  https://goo.gl/ZKa956

అరుణాచలం గురించి సమగ్ర సమాచారం :  https://goo.gl/RcYHMN

ఏడూ కొండల పరమార్ధం ఏమిటి :   https://goo.gl/igEbZq

తిరుమల వెళ్లే చంటి పిల్లల N తల్లిదండ్రులకు :  https://goo.gl/fKvyjo

గోవింద రాజుల ఆలయ చరిత్ర :  https://goo.gl/eWWVeM

*🙏🙏🙏తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో 👏👏👏*

1, ఫిబ్రవరి 2022, మంగళవారం

కూర్చొన్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడిని చూశారా?

ముసలితనం కారణంగా తన వద్దకు రాలేని ఒక భక్తుడి కోసం కలియుగ దైవమైన శ్రీనివాసుడు అతని కోటకే తరలి వెళ్లారు. 
స్వయంభువుగా యోగ ముద్రలో వెలిసి ఆ భక్తుని కోరికను తీర్చారు. 
ఆయన ఎవరో కాదు తిరుమలో వెలిసిన శ్రీనివాసుడు. 
ఆ భక్తుడు ఎవరు? 
స్వామి ఎక్కడ వెలిసారు? 
ఎల్లప్పుడు నిలువెత్తు రూపంలో కనిపించే ఆ శ్రీనివాసుడు యోగ ముద్రలో అంటే సుఖాసీనుడై ఉన్న క్షేత్రం ఏమిటి తదితర వివరాలన్నీ మీకోసం.

కలియుగదైవం శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశ రాజుకు స్వయాన సోదరుడే ఈ తొండమాన్ చక్రవర్తి. శ్రీవారికి గొప్ప భక్తుడైన ఈ తొండమానుడు అగస్త్యాశ్రమంలో సేదతీరుతున్న శ్రీనివాసుడిని దర్శించుకొంటాడు. శ్రీనివాసుని ఆదేశాలను అనుసరించి తొండమానుడు విశ్వకర్మ సహాయంతో సప్తగిరుల పై శ్రీనివాసుడి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు.

రత్నఖచితమైన సువర్ణ కళశాలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి దాని చుట్టూ మూడు ప్రాకారాలతో మూడు ప్రదక్షిణ మార్గాలను మూడు మండపాలను వంటశాలలను బంగారు బావిని నిర్మిస్తాడు. ఇలా ఆలయ నిర్మాణం పూర్తైన తర్వాత ప్రతి రోజూ తిరుమలకు వెళ్లి తొండమానుడు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చేవాడు.

శ్రీవారి దర్శన అనంతరమే రాజ్య వ్యవహారాలు చూసుకోవడానికి అలవాటయ్యింది. ఒక రహస్య సొరంగ మార్గం గుండా ప్రతి రోజూ తిరుమలకు వెళ్లివచ్చేవాడు. కాగా కాలక్రమంలో ముసలితనం కారణంగా తొండమానుడు తిరుమలకు వెళ్లలేకపోతాడు. దీంతో జీవిత చరమాంకంలో ఉన్నానని అందువల్ల తిరుమలకు రాలేకపోతున్నాని మొర పెట్టుకొంటాడు. దీంతో తన ఇంటనే స్వామి వెలిసి ఉండాలని ఆ కలియుగ దేవుడిని వేడుకొంటాడు.

తొండమాను చక్రవర్తి భక్తికి మెచ్చిన శ్రీ వేంకటేశ్వర స్వామి తొండమాన్ ఇంటనే స్వయంభువుగా ఉద్భవించారు. ఒక చేతితో యోగముద్ర, మరోచేతితో అభయహస్తం కలిగి ఉండటంతో పాటు శ్రీదేవి, భూదేవి సమేతుడిగ ప్రసన్న వేంకటేశ్వరుడిగా దర్శనమిస్తాడు. 

చాలా చోట్ల శ్రీవారు నిలుచున్న స్థితిలో కనిపిస్తే ఇక్కడ మాత్రం కూర్చొన్న స్థితిలో దర్శనమిస్తాడు. ప్రపంచంలో ఈ స్థితిలో వేంకటేశ్వరుడు భక్తులకు ధర్శనమిచ్చేది ఇక్కడ మాత్రమే. ఇక ఈ స్వామివారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.

ఇక్కడ తామరగుంట పుష్కరిణి ఉంది. తిరుమలలోని ఆకాశగంగ, కపిల తీర్థం జలపాతాల నుంచి వచ్చే నీటిని కాలువల ద్వారా తొండమనాడులోని తామరగుంట పుష్కరిణిలోకి మళ్లిస్తారు. ఈ జలాలతోనే స్వామివారికి నిత్యాభిషేకం జరుగుతుంది. 

ఈ క్షేత్రం తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో, శ్రీకాళహస్తి పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ తొండమనాడు గ్రామం ఉంది.

 ఇక్కడికి చేరుకోవడానికి తిరుపతి శ్రీకాళహస్తి నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది.

🙏#ఓం_నమో_వేంకటేశాయ🚩.