7, నవంబర్ 2020, శనివారం

పోయిన వాటిని దొరికే మంత్రం

ఈ మంత్రం పోయినవాటిని తిరిగి తెస్తుందా..
🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏

.ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా, ఇంట్లో ఎవరైనా చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయినా, భార్యా భర్తల మధ్య మనశ్శాంతి కరువయినా ఒకేఒక మంత్రం నిరంతరం స్మరిస్తూ ఉంటే పోయినవన్నీ తిరిగి లభిస్తాయి. 

ఇంతకీ ఏమిటా మంత్రమని ఆలోచిస్తున్నారా? 

అదే కార్తవీర్యార్జున మంత్రం. ....
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్పూర్తిగా స్మరిస్తే పోయినవి తిరిగి మనకిదొరుకుతాయి. అది డబ్బైనా, మనశ్శాంతి అయినా లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళయినా మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుందని చెపుతున్నారు మన పండితులు. 

ఆ మంత్రం ఈ విధంగా ఉంటుంది.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
ఓం కార్తవీర్యార్జునో నమః రాజ బాహు సహస్రవాన్తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే..!!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఈ మంత్రాన్ని మన మనసులో కోరిక చెప్పుకుని రోజూ పూజ చేసేటప్పుడు స్మరిస్తే పోయినవాన్ని తిరిగి మనకు దక్కుతాయి. 

ఇంతకీ ఈ కార్తవీర్యార్జునుడు ఎవరూ అంటేసాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశ. 

తను చేతిలో ఉండటం వల్లే విష్ణుమూర్తి రాక్షసులని సంహరించ గలుగుతున్నాడు అనే గర్వం ఏర్పడటంతో అది గ్రహించిన స్వామి సుదర్శనుని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు. 

కాని భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు. చేతులు లేకుండా పుట్టిన ఇతను దత్తాత్రేయుడిని పూజించి వెయ్యి చేతులు కలవాడిగా మారతాడు. అందుకే ఇతనిని సహస్రబాహు అని కూడా అంటారు. అంతేకాదు తనకి కేవలం శ్రీ హరి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం రాకుండా ఉండేలా వరాన్ని కూడా పొందుతాడు. 

ఇతను ఎంత బలశాలి అంటే అతి పరాక్రమవంతుడైన రావణాసురుడిని ఒక యుద్ధంలో బంధించి తన రాజ్యానికి తీసుకుని పోయి తరువాత పులస్త్య మహర్షి అభ్యర్ధన విని అతనిని వదిలేస్తాడు.

ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మాహిష్మతిపురము. ఇతని పురోహితుడు గర్గ మహర్షి. ఒకసారికార్తవీర్యుడు వేట కోసమై అడవికి వెళ్తాడు. అక్కడ అలసిపోయి దగ్గరలో ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన కార్తవీర్యునికి స్వాగతం పలికిజమదగ్ని విశేషమైన విందు పెడతాడు. అంత రుచికరమైన ఆహారపదార్థాలు కామదేనువు సంతతి అయిన గోమాత ద్వారా లభించాయన్న నిజం తెలుసుకుని దానిని తనకి ఇచ్చేయ్యమని అడుగుతాడు, అందుకు జమదగ్ని నిరాకరించటంతో మహర్షి తలను ఖండించి ఆ గోమాతను తీసుకెళ్ళిపోతాడు. 

ఆశ్రమానికి తిరిగివచ్చిన జమదగ్ని కొడుకు పరశురాముడు విషయం తెలుసుకుని కార్తవీర్యునితో పాటు 21 మంది క్షత్రియులని చంపుతానని శపథం పూనుతాడు. అన్న మాట ప్రకారమే కార్తవీర్యుడిని సంహరిస్తాడు. 

పరశురాముడు విష్ణుమూర్తి అవతారం కావటంతో కార్తవీర్యుని కోరిక కూడా తీరి మళ్లీ శ్రీహరి చేతిలో సుదర్శునుడిగా మారి, గర్వం విడిచిపెట్టి తన జన్మ సార్ధకం చేసుకుంటాడు.

అలా అతి బలపరాక్రముడు అయిన కార్తవీర్యుడు తనకు లేని చేతులని తపస్సు చేసి పొందటమే కాకుండా శ్రీహరి చేతిలో ప్రాణాలు విడిచి మళ్లీ అతని కుడి చేతిలోనే సుదర్శన చక్రమై ఆజన్మాంతం నిలిచి ఉంటాడు.

స్వస్తి......

👉**సనాతన ధర్మస్య రక్షిత-రక్షిత

.

5, నవంబర్ 2020, గురువారం

తులసి మొక్క ప్రాధాన్యత

తులసి మొక్క ప్రాధాన్యత

భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసిలేని హిందువుల ఇల్లు
ఉండదు. తులసి లక్ష్మీ స్వరూపం.

అసలు తులసి మొక్కకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? తులసి ప్రత్యేకత ఏమిటి?

మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే, అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. మనకు అవి తెలియవి, అంతే. తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం.

మాములు మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజెన్ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్వన్-డై-ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి.

కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని మన భారతీయుల పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు.

తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసి కున్న ఘాటైనవాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు.

అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుకా కూడా తులసిమొక్కను పెట్టి పూజించమన్నారు, ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి.

తులసిలో విద్యుఛ్చక్తి అధికంగా ఉందని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వేదంలో కూడా వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి ప్రస్తావన ఉంది.

తులసి ఏ ఇంటిలో ఉంటే, ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు.

తులసిలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని మనం శరీరం గ్రహిస్తే, ఆరోగ్యం చేకూరుతుంది, అందుకోసమే తులసమ్మకు నీరు పోసి, చుట్టు ప్రదక్షిణం చేయాలి. అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా, ఆరికాళ్ళలోకి చేరి, నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది.

తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంధాలు చెప్పాయి. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడ అంగీకరించారు.

ప్రపంచాన్ని హడలుగొట్టిన స్వైన్‌ప్లూ భారత్‌లో స్వైరవిహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది.

తులసి గాలి కారణంగా జనంలో స్వైన్‌ప్లూను తట్టుకునే రోగనిరోదక శక్తి పెరిగిందట.

అంటే మన తులసమ్మ మనకు ఆయుషు పోసిందన్నమాట. ఏ ఇంట్లో అధికంగా తులసిమొక్కలు ఉంటాయో, ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు.

తులసిచెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. తాజ్‌మహల్ కాలుష్యం బారినపడి మసకబారకుండా ఉండడం కోసం, తాజ్‌మహల్ పక్కనే, లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు.

అట్లాగే తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయి. కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కైనా పెంచాలి.

నల్గోండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తోంది. తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్ వ్యాపితిని తగ్గిస్తాయని ఈ మధ్యే దృవీకరించారు.

మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే, రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఇది తులసి మహాత్యం.

తులానాం నాస్తి ఇతి తులసి అన్నారు, దేని గురించి ఎంత చెప్పుకున్నా, ఇంకా చెపుకోవలసినది మిగిలి ఉంటుందో, దాన్ని తులసి అంటారని అర్దం.

తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతారు .

2, నవంబర్ 2020, సోమవారం

మీ భాగ్యరేఖ మీరే రాసుకోండి

ఒకసారి ఒక వ్యక్తికి దారిలో యమధర్మరాజు కలిశారు. అయితే ఆ వ్యక్తికి అతను యమధర్మరాజుని తెలియదు. యమధర్మరాజు ఆ వ్యక్తిని తాగడానికి నీళ్ళు అడిగారు. ఒక క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే, వెంటనే యమధర్మరాజుకు *నీళ్లు* ఇచ్చాడు. నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు వ్యక్తితో చెప్పాడు నేను నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యముని కానీ నీవు తాగడానికి నాకు నీళ్ళిచ్చి నా దప్పిక తీర్చావు. కావున నీ తలరాత మారడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని , యమధర్మరాజు ఆ వ్యక్తికి ఒక *డైరీ* ఇచ్చారు. నీకు ఒక ఐదు నిమిషాలు సమయం ఇస్తున్నాను ఇందులో నీకు ఏమి కావాలో రాసుకో అది *జరుగుతుంది* కానీ గుర్తుంచుకో నీకు సమయం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే. ఆ వ్యక్తి డైరీ తీసుకుని ఓపెన్ చేసాడు. మొదటిపేజీలోనిది చదివాడు అందులో తన పక్కింటాయనకు "లాటరీ రాబోతోంది అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు" అది చదివి ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు అని రాశాడు. తర్వాత పేజీ చదివాడు, "తన స్నేహితుడు ఎన్నికలలో గెలిచి మంత్రి పదవి రాబోతోంది " అది చదివి అతడు ఓడిపోవాలి అని రాశాడు. ఈ విధంగా ప్రతి పేజీ చదువుతూ చివరికి ఖాళీ ఉన్న పేజీలో తనకు కావలసింది రాయలని అనుకోగా ఈలోపే యమధర్మరాజు ఆ వ్యక్తి చేతినుండి డైరీని తీసుకుని నీకు ఇచ్చిన ఐదు నిమిషాల సమయం పూర్తి అయ్యింది. ఇప్పుడు నీవు ఏమి రాయకూడదు. *నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల చింతన చేయడంలో సమయం వృధా చేసుకున్నావు. నీ జీవితాన్ని స్వయంగా నువ్వే కష్టంలోకి నెట్టు కున్నావు* నీ యొక్క మృత్యువు నిశ్చితం అయింది అని డైరీ తీసుకున్నాడు యముడు . ఆ వ్యక్తి చాలా పశ్చాతాప పడ్డాడు. వచ్చిన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నాడు.

 ఈ కథ యొక్క *అర్థం* ఏమిటంటే భగవంతుడు మనందరినీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో *అవకాశాలు* ఇస్తాడు. కానీ మనము వ్యర్థము ఆలోచిస్తూ *ఇతరులకు చెడు చేస్తూ* మన సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాము. ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారి పైన సదా *భగవంతుని కృప నిండి ఉంటుంది.* 

ఈ సంగమయుగంలో భగవంతుడు కలం మనచేతికి ఇచ్చి "మీ భాగ్యరేఖ మీరే రాసుకోండి "అని అవకాశం ఇస్తున్నారు. కానీ మనము పర చింతన చేస్తూ సమయము వృధా చేసుకుంటున్నాము. మన అదృష్టాని మనమే వంచన చేసుకుంటున్నాం... 

ఓం శాంతి🙏

ఆదిత్య హృదయం- విశిష్టత


ఆదిత్య హృదయం వాల్మీకి రామాయణం లో యుద్ద కాండలో చెప్పబడింది. ఈ స్తోత్ర పారాయణం అనేక సమస్యలను తొలగిస్తుంది. ఆర్ధిక, ఋణ సమస్యలను మరియు ఆరోగ్య సమస్యలను ఈ స్తోత్ర పారాయణం తగ్గిస్తుంది. ముఖ్యంగా నేత్ర సమస్యలకు ఈ స్తోత్రం బాగా ఉపకరిస్తుంది. తీవ్ర వృత్తి సమస్యలలో ఉన్న వారు, జాతకంలో రవి గ్రహంచే బాధలు పొందేవారు మరియు 1, 10, 19,28 తేదీలలో జన్మించిన వారు ఈ స్తోత్రం ను ప్రతిరోజూ పారాయణం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ స్తోత్రం ను ప్రతిరోజూ 6 సార్లు పారాయణం చేస్తూ ఆదివారాలందు పగటిపూట ఉపవాసం ఉండాలి. ఈ విధంగా 60 రోజులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ 60 రోజులు అన్ని నియమాలను పాటించాలి. అదే విధంగా తీవ్ర అనారోగ్యం తో బాధపడుతున్నవారు ఈ స్తోత్రం ను ప్రతిరోజూ పారాయణం చేస్తూ ఆదివారాలందు గోమాతకు గోధుమలను నివేదించాలి. వీలుంటే ఆదివారములందు సూర్యదేవాలయంలో 60 ప్రదక్షిణాలు చేసి 36 సార్లు ఈ స్తోత్రంను పారాయణం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. యే కోరికను ఆశించకుండా ఈ స్తోత్రంను ప్రతిరోజూ చదివినట్లైతే అన్ని సమస్యలు తొలగి సూర్య సాయుజ్యన్ని పొందుతారు. రధసప్తమి రోజు ఈ స్తోత్రంను పారాయణం చేస్తే సమస్త భోగాలు లభిస్తాయి. .

మహామహితాన్వితమైన ఈ స్తోత్రంను ప్రతిరోజూ సూర్యభగవానునకు అభిముఖంగా నిలబడి ప్రతి రోజు పారాయణం చేస్తే అన్నీ జాడ్యాలు నశిస్తాయి. పూజా మందిరం లో లేదా గృహంలో ఎక్కడైనా కూర్చుని చదువుకోవచ్చు. మంచి ఫలితాలకు ప్రతి రోజు సూర్యోదయ మరియు సూర్యాస్తమయ సమయాలలో పారాయణం చేయాలి.. ఇంతటి మహిమ కలిగిన ఈ స్తోత్రం ఈ క్రింద ఉదహరింపబడింది. అందరూ తప్పనిసరిగా ప్రతిరోజు పారాయణం చేసి సకల రోగ,ఋణ ఆర్ధిక మరియు వృత్తిబాధల నుండి విముక్తిని పొందండి.

*ఆదిత్యహృదయం*

తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ |
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || ౧ ||
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ |
ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః || ౨ ||
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ |
యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి || ౩ ||
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్ |
జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివమ్ || ౪ ||
సర్వమంగళ మాంగళ్యం సర్వపాపప్రణాశనమ్ |
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ || ౫ ||
రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతమ్ |
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ || ౬ ||
సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః || ౭ ||
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః |
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః || ౮ ||
పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః |
వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః || ౯ ||
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ |
సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః || ౧౦ ||
హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ |
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ || ౧౧ ||
హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః |
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః || ౧౨ ||
వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః |
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః || ౧౩ ||
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః |
కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః || ౧౪ ||
నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః |
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోఽస్తు తే || ౧౫ ||
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః || ౧౬ ||
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః || ౧౭ ||
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః |
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః || ౧౮ ||
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే |
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః || ౧౯ ||
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః || ౨౦ ||
తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే |
నమస్తమోఽభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే || ౨౧ ||
నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః |
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః || ౨౨ ||
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః |
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్ || ౨౩ ||
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ |
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః || ౨౪ ||
ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ |
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ || ౨౫ ||
పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ |
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి || ౨౬ ||
అస్మింక్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వా తదాఽగస్త్యో జగామ చ యథాగతమ్ || ౨౭ ||
ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోఽభవత్తదా |
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ || ౨౮ ||
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ |
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ || ౨౯ ||
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ |
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ || ౩౦ ||
అథ రవిరవదన్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః |
నిశిచరపతిసంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి || ౩౧ ||

*ఓం శ్రీ సూర్య దేవాయ నమః*

పరమాత్మ పట్ల కృతజ్ఞతా? కృతఘ్నతా?:


ఈ శరీరంలో నిలబడడం (భుక్తి) కోసం, మనము, మనకు నిర్ణయించిన కాలమునకు, మన పనిని మనము, చేయుచున్నామా లేదా? ఉదా:-ఒక ఉద్యోగికి ఉదయం 10 గం|| ఆఫీసు. ఆ టైమ్ కు వెళుచున్నాడా లేదా? ఒక కూలి ఉదయం 8 గం|| వెళ్ళుచున్నాడా?, ఒక కార్మాగార ఉద్యోగికి మధ్యాహ్నం 2గం|| లకు duty కరెక్టుగా ఆ timeకు వెళ్లుచున్నాడ లేదా?, ఒక వ్యాపారి ఉదయం 8గం|| వ్యాపారం ప్రారంబించాలి, చేస్తున్నాడా లేదా?, ఇంట్లో ఇల్లాలు తన భర్త పిల్లలు ఉదయాన 7గం|| బయలుతేరి వెళ్లాలంటే, పాపం ఆ ఇల్లాలు, వేకువజామునే ఏ నాలుగింటికో లేచి, కాలకృ త్యాలు తీర్చుకొని, పిల్లలకు, భర్తకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఉదయం 7గం||కు, సిద్దం చేసి వారి వారి విధులకు, భంగం కలగకుండా వారిని, పంపుతోందా?, పైన వివరించిన వివిధ పనులు వివిధ సమయ పాలన ఎందుకు. కేవలం భుక్తి కొరకు. మన సంసారం పిల్లలు అందరి శరీరాలు భుక్తితో నిలబడడానికేనా? బాగా ఆలోచించండి? మరి ఒకొక్కరూ రోజుకు 8గం||లు, మరీ అదనపు ఆదాయం ఇస్తామంటే, ఇంకా ఎక్కువ గంటలు పనిచేయడం లేదా? మరి భగవంతుడు మనకు ఈ మానవ శరీరం, మానవ ఉపాధి ఇవ్వకపోతే, ఇవన్నీ మనము చేయగలమా? మాన ఉపాధి కాక (ఏ కుక్కో, ఏ పామో, ఏ బల్లో) ఉపాధి అయితే ఇవన్నీ సాధ్యమా? ఈ జనజీవనంలో మిగతా ఉపధులను మనము చూడడంలేదా? అవి ఎలా బ్రతుకుతున్నాయో, మనము నిత్యమూ చూడడంలేదా? అవి ఉపాధులు కావా వాటికి జీవం లేదా? అవి బ్రతకడంలేదా? వాటికి క్రమశిక్షణ ఉన్నదా? మంచి చెడులు ఆలోచించే జ్ఞానము కలదా? మరి భగవంతుడు మనకు ఇంతగొప్ప ఉపాధిని ఇచ్చి దీనితో వేదములు, ఉపనిషత్తులు, పురాణములు చదివి, విని అర్ధంచేసుకొనే శక్తినిచ్చి, పెద్దలు చెప్పిన విధముగా బ్రతుకమని, నిత్యమూ ధర్మమును గురించి ఆలోచించుచూ, సత్త్య భాషణమే చేయుచూ, పరోపకారియై, ధర్మాన్ని రక్షించుచూ, నిత్యమూ భగవంతుని పూజలో, భగవంతుని ధ్యానముతో బ్రతుకమని భగవంతుడు మనకు అవకాశము ఇస్తే దానిని ఇలా వృధా చేయడం న్యాయమా?

పరమాత్మకు మనము మాతృ గర్భములో ఉన్నప్పుడే పరమాత్మను ప్రార్ధించాం, ప్రమాణము చేశాము.పరమాత్మా నన్ను త్వరగా ఈ (మురుకి కూపమునుండి) మాతృగర్భము నుండి బయట పడవేయుము. బయటకు వచ్చిన తర్వాత నేను నీకుకృతజ్జ్ణుడుగా (నన్ను ఈమురుకి కూపమునుండి బయట పడ వేసినందుకు) ఉంటూ నిత్య పూజలతో, భజనలతో, ధ్యానముతో నిన్ను మరువను, పొరపాటునకూడ ఈ సంసార బంధనములో చిక్కుకోను, నన్ను నమ్ము అని మాట ఇచ్చి, పరమాత్మకు ప్రమాణము చేసి, ప్రస్తుతము మనము చేయుచున్న దేమిటి? ఒకసారి హృదయ ము మీద చేయి వేసుకొని ఆలోచించి నిస్పక్ష పాతముగా చెప్పండి? రోజూ, ఒక గంటసేపైనా స్వామికి పూజ చేయడానికి మనకు, తీరిక, సమయము లేదా? పురాణ కధలు వినడానికి, తీరిక, సమయము లేదా? ఇంతగొప్ప ఉపాధిని ఇచ్చిన పరమాత్మను, ఆలయమునకు వెళ్ళి చూడడానికి, ఆలయములకు వెళ్ళడానికి, తీరిక, సమయము లేదా? మిగతా అడ్డమైన తిరుగుళ్ళు తిరగడానికి, అడ్డమైన పనులు చేయడానికి, సోల్లు కబురులు చెప్పుకోవడానికి, పరనిందలు చేయడా నికి, తీరిక, సమయమూ, పుష్కలంగా ఉందా? ఒక్కసారి బాగా లోతుగా ఆత్మవిమర్శ చేసుకొని గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి?

నిజం చెప్పాలంటే మనము పరమాత్మ పట్ల చూపు వినయము,విధేయత, చేయు సేవ, దాస్యము,ధ్యానమూ పూజ, హోమము కేవలం పరమాత్మ కొరకు మాత్రమేకాదు. మన అభ్యున్నతికి, మన చుట్టూ ఉన్న సమాజము అభ్యున్న తికి, మన పిల్లలూ, వారి పిల్లలూ (వంశాబివృద్ధికి, దేశాభివృధికి) అభివృద్ధికి మాత్రమేనని మరచిపోకండి. ఈ మానవ ఉపాధి, శరీర పోషణకు ఆహారము, నీరు, గాలి, వెలుతురు ఎంత అవసరమో, మనలోని జీవాత్మకూ, పరమాత్మల పోషణకు సత్యభాషణమూ, ధర్మానుష్టానమూ, నిత్య పూజ, నిరంతర స్మరణ అంతే అవసరము. 

దుర్ముహూర్తం?

దుర్ముహూర్తం అంటే ఏమిటీ? ఎలా ఏర్పడుతుంది?*

మానవ నిత్య జీవితంలో ఎన్నో సంస్కారాలు చేయాల్సి ఉంటుంది. వాటి నిర్వహణకు శుభ ముహూర్తాలు అవసరమవుతాయి. అయితే శుభ ముహూర్తాలతో పాటు దుర్మూహూర్తాలపై కూడా అవగాహన ఉండాలి. అప్పుడే మనం మంచి ముహూర్తమేంటో అర్థం చేసుకోగలము.

నక్షత్ర ప్రమాణమును బట్టి విడువ తగిన కాలమును వర్జ్యం అంటారు. దినప్రమాణమును బట్టి, వారమును బట్టి విడువ తగిన కాలమును దుర్మూహుర్తం, రాహూకాలము అంటారు.

గ్రంథాలలో దుర్మూహుర్తమును మాత్రమే చెప్పారు.

రాహుకాలంను గూర్చి చెప్పినట్లుగా లేదు. రాహు కాలమును తమిళులు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. మన ప్రాంతమున వర్జ్యము, దుర్మూహూర్తమును పాటిస్తే సరిపోతుంది.

దుర్ముహూర్తం వారమునకు సంబంధించిన దోషము. ఇది సూర్యోదయము 6 గంటలకయ్యేటప్పుడు దుర్మహూర్తం ఈ విధముగా వచ్చును. దీని ప్రమాణం 48 నిమిషాలు, ఆదివారం సాయంత్రము 4-32కు. సోమవారం మధ్యాహ్నం 12-28 మరల 2-58కు మంగళవారం ఉదయం 8-30కు, మరల రాత్రి 11-50కు, బుధ వారం ఉదయం 11-41కు, గురువారం మధ్యాహ్నం 2-54కు, శుక్రవారం మధ్యాహ్నం 12-28కు శనివారం ఉదయం 2-40కు దుర్మహూర్తం వచ్చుచుండును. ఘడియల్లో ఆది-26, సోమ-16, 22 మంగళ-6 మరల రాత్రి 11-50 బుధవారం-11ఘ, గురువారం-10, శుక్ర-16 శని-4 ఘడియలకు వచ్చును.

పంచకరహితము

ముహూర్తం ఏర్పరచుకొను నాటికి తిధి, వార, నక్షత్ర లగ్న సంఖ్యలను కలిపిన మొత్తమును 9చేత భాగించగా శేషము 3-5-7-9 ఉన్న ముహూర్తములు రహితమైనవని గ్రహించాలి. 1 మిగిలిన మృత్యు పంచకం అగ్నిపంచకం, 4 రాజపంచకం, 6 చోరపంచకం, 8 రోగపంచకం ఇవి దోషకరమైనవి.

శూన్యమాసము

శూన్యమాసములో ఎటువంటి శుభకార్యం చేయరాదు. శూన్యమాసం, ఆషాఢం, భాద్రపదము, పుష్యం.. ఇవికాక మీన, చైత్రము, మిధునాషాఢము, కన్యాభాద్రపదము, ధనుఃపుష్యము. ఇవి శూన్యమాసములే సూర్యుడు ఆయా రాసులలో ఉన్నప్పడు శుభకార్యముల గూర్చి తలపెట్టరాదు.

మూఢము లేక మౌఢ్యమి

రవితో కలసి గురు శుక్రులలో ఎవరైనను చరించు వేళను మూఢమందురు. అస్తంగత్వ దోషము ప్రాప్తించుటతో శుభమీయజాలని కాలమిది. కాబట్టి ఎలాంటి శుభకార్యములైనను ఈ కాలములో జరుపరాదు.

కర్తరి - ఏయే కార్యములయందు జరిగించరాదు ?

కర్తరి అనగా సూర్యుడు భరణి 4పాదమున కృత్తిక 4వ పాదములలోను, రోహిణి 1వ పాదమున సంచరించు కాలమును కర్తరి అంటారు. భరణీ 4వపాదము డొల్లకర్తరి అంత చెడ్డదికాదు. మిగతా కాలమంతయు చాలా చెడ్డది. గృహనిర్మాణాది కార్యములు, నుయ్యి త్రవ్వట, దేవతా ప్రతిష్ట మొదలగు ఈ కాలంలో చేయరాదు.

త్రిజ్యేష్ట విచారణ

తొలుచూలు వరుడు, తొలిచూలు కన్యక జ్యోష్ట మాసం వీటి మూడింటిని త్రిజ్యేష్ట అని అంటారు. వీనిలో ఒక జ్యేష్టం శుభకరం. రెండు జ్యేష్టములు మధ్యమం. మూడు జ్యేష్టములు హానీ. కాని తొలిచూలు వరకు ద్వితీయాది గర్భజాతయగు కన్యను తొలిచూలు కన్య ద్వితీయాది గర్భజాతకుడగు వరుని పెళ్లాడినప్పుడు జ్యేష్టమాసం శుభకరమైందే.

ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి ? ఏ ముగ్గును ఎక్కడ, ఎప్పుడు వేయాలి ?మన ధర్మంలో ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి? ఏ ముగ్గును ఎక్కడ,ఎప్పుడు వేయాలి?


ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.

ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.

నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.

తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.

నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.

దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.

ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవరు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైదవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.

పండుగ వచ్చిందా కదా అని, నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు.

ముగ్గులు రోజు వేయలేక పేంట్ పెట్టస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి.

నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.

ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.

ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మన ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి.

హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు.....



[1] సంతాన గోపాల పశుపత రుద్ర హొమం

ఈ హొమం చేసినందు వల్ల సంతాన దోషాలు తొలగి సత్ సంతానము కలుగును,



[2] మహా మృత్యుంజయ హొమం
ఈ హొమం వల్ల అనారోగ్యం తొలగి ,అపమృత్యు భయం ,దీర్గాయుషునుఇవ్వగలదు .



[3] నవగ్రహ ,నక్షత్ర హొమం
గ్రహ దోషాలు తొలగి ,సర్వ కార్య సిద్దికి ,ఆరోగ్యము ,సర్వ గ్రహ ప్రసన్నత లభిస్తుంది




[4] లక్ష్మి గణపతి హొమం
సర్వ విగ్నములకు ,సర్వ దోషములకు ,ఉద్యోగ ప్రాప్తికి ,విద్యాభి వృద్దికి




[5] రుణవిమోచన గణపతి హొమం
రుణ భాదలు తొలగుటకు మార్గం దొరకుతుంది మనో ధైర్యము పెరుగుతుంది



[6] రుద్ర హొమం
ఇది సంసారములో ఉన్న మనస్పర్ధలు తొలగి ఆనందమైన జీవితమునకు ఉపయోగ పడుతుంది



[7 ] ఆయుష్షు హొమం
ఇది అయురరోగ్యములను ప్రసాదిస్తుంది



[8] కుబేర పశుపత హొమం
ఇది సకల వ్యాపారములకు ,ధన సంపాదనకు ఉపయోగ పడుతుంది


[9] చండి హొమం
ఇది సర్వ గ్రహ దోషాలకి ,రాహు కేతు ,దోషాలకి ,అలస్యపనులకి ,సర్వ కార్య సిద్ది కి అవుతుంది


[10] సుదర్శన హొమం
సర్వ శత్రు జయము, సర్వకార్య సిద్ది,మనో బలం ,తేజస్సు కు ఉపయోగ పడుతుంది


[11] ధన లక్ష్మి హొమం
ధన ,దాన్య సమ్రుద్దికి ,సుక సంతోషాలకి ఉపయోగ పడుతుంది