12, జూన్ 2023, సోమవారం

దేవుడు అంటే ఏంటి?

దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది? అని...
చిన్నపిల్లలే కాదు ..నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది.

పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ, . మనసుతో చేసే వ్యాయామం.
మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి ....మన మెదడుని మనమే ట్యూన్‌ చేసుకునే ప్రక్రియ.
దీప ప్రజ్వలనం అనేది..... త్రాటకం అనే యోగ ప్రక్రియ.
రోజూ ఓ మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే.... కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట.
ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే.. నాలిక మొద్దుబారదు.
అది నాలికకు ఎక్సర్‌సైజ్‌. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది.
ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే...స్టేజ్‌ ఫియర్ కూడా‌ పోతుంది.

పూజ అంటే చాదస్తం కాదు .మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పండి.
మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి.
అదే సమయంలొ మూడ విశ్వాసాలకు దూరం గా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన భాద్యత కూడా పెద్దవారిపై ఉంది.....

1. మూలవిరాట్ 🚩 భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి.

2. ప్రదక్షిణ 🚩 మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి.

3. ఆభరణాలతో దర్శనం 🚩 ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని.

4. కొబ్బరి కాయ 🚩 ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం.

5.మంత్రాలు 🚩 ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి.

6. గర్భగుడి 🚩 గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.

7. అభిషేకం 🚩 విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం.

8. హారతి 🚩 పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.

9. తీర్థం 🚩 ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._

10. మడి 🚩 తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!

లోకాః సమస్తాః సుఖినోభవంతు

     🙏🙏జై శ్రీ రామ్ 🙏🙏

16, ఏప్రిల్ 2023, ఆదివారం

kaalabairava temple nijamabad dist

🕉  🕉️
🔆 నిజామాబాద్ జిల్లా : రథాల రామిరెడ్డి పేట 
👉 శ్రీ కాళ భైరవ స్వామి ఆలయం.
👉 శ్రీ సీత రామచంద్ర పార్వతి సమేత రాజరాజేశ్వర స్వామి ఆలయాo

 💠 బ్రహ్మదేవుడి అహంకారాన్ని భంగం చేసిన వాడు కాలభైరవుడు. అలాంటి కాలభైరవుడికి నిజామాబాద్లో ఓ పెద్ద ఆలయం ఉంది.
కాలభైరవుడు శివుడి నుంచి ఉద్భవించిన వాడు. నా అంతవాడు లేడని విర్రవీగకూడదని కాలభైరవుడి కథ చెబుతుంది.

💠 త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుడికి మొదట అయిదు తలలుండేవట. తన సృష్టికర్త కూడా కావడంతో బ్రహ్మలో గర్వం ప్రవేశించిందట. త్రిమూర్తుల్లో తానే అధికుడనని చెప్పుకోవడం మొదలు పెట్టాడట. అప్పుడే శివుడి నుంచి ఓ ఘోర రూపం ఆవిర్భవించిందట ఆ అయిదో తలను తెంచేసింది ఆ రూపం.
అప్పుడు శివుడు ఆ రూపంతో నువ్వు బ్రహ్మ తలను కూడా తెంచావు కాబట్టి కాలం వలె కనిపిస్తున్నవు. అందుకే నిన్ను కాలభైరవుడు అని పిలుస్తారు. 
కానీ, బ్రహ్మ తల తెంచినందువల్ల నీకు బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకుంది. అందువల్ల ఈ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండేళ్లు భిక్షాటన చేసి ఇందులో తింటే పాపం పరిహారమవుతుంది. 
ఇకపై నా దేవాలయాల్లో నువ్వే క్షేత్రపాలకుడివి. కాశీపట్నణానికి అధిపతివి. నా ఆలయాలకు వచ్చే భక్తుల పాపాలను భక్షిస్తావు అని చెప్పాడట.

💠ఈ కాలభైరవుని ఆలయాలు మనదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. అలాంటి పుణ్య క్షేత్రమే నిజామాబాద్ జిల్లాలోనూ ఉంది. 

💠 ఇసన్నపల్లి గ్రామ ప్రారంభంలో శ్రీ కాలబైరవస్వామి ఆలయం రామరెడ్డి గ్రామనికి ఈశాన్యం వైపు ఉంది. అందువల్ల ఈ గ్రామాన్ని మొదట్లో ఈశాన్యపల్లిగా పిలిచేవారు.
కాలక్రమేణా అది ఇసన్నపల్లిగా మారిపోయింది. 

🔅 ఆలయ చరిత్ర 🔅

💠 16వ శతాబ్దంలో దోమకొండను పాలిస్తున్న రామిరెడ్డి,కామిరెడ్డి అనే అన్నదమ్ములకు శ్రీ కాల బైరవ స్వామి కళలో దర్శనమిచ్చి, నా విగ్రహం



8, మార్చి 2023, బుధవారం

🍎కాయ?పండు?🍎

*కాశీ కి వెళితే...***
*కాయో పండో వదిలేయాలి అని పెద్దలు అంటారు...అందులో మర్మమేమిటి...?* 

అసలు శాస్త్రం లో 
ఎక్కడ కూడా.. 
కాశీ కి వెళితే 
కాయో, పండో వదిలేయాలి 
అని చెప్పలేదు..

శాస్త్రం చెప్పిన విషయాన్ని.. 
కొందరు తెలిసీ తెలియని విషయ పరిజ్ఞానం తో కొంచం వాళ్లకు అనుకూలంగా మార్చు కున్నారు.

కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రము చెప్తున్నది ఏమిటి అంటే... 
కాశీ వెళ్లి గంగ లో స్నానం చేసి 
"కాయా పేక్ష మరియు ఫలా పేక్ష" ను
గంగలో వదిలి,
ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని.

*ఇక్కడ...*

కాయాపేక్షా,
ఫలాపేక్ష
అన్నారు...
అంటే...
ఈ కాయము పై
(శరీరము పై అపేక్షని ) ,

ఫలా పేక్షా 
(కర్మ ఫలము పై అపేక్ష ని)
పూర్తిగా వదులు కొని...
కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు.

*కాలక్రమేణా...*

అది కాస్తా 
కాయ, పండు  
గా మారి పోయింది.

*అంతే కానీ...*  

కాశీ వెళ్లి ఇష్టమైన 
కాయ గూరలు,
తిండి పదార్థాలు 
గంగ లో వదిలేస్తే...
మనకు వచ్చు భక్తి కానీ,
అందులో నిజమైన
పుణ్యం ఎం ఉంటుంది.

*కనుక...*

శాస్త్రం నిజంగా 
ఎలా చెప్తుందో 
అర్థం చేసుకొని... 
ఆ క్షేత్ర దర్శనము, 
ఆ సంప్రదాయం పాటిస్తే..
నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది...
అంతే కాని 
మామిడి పండుని, వంకాయ ని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమి ఉండదు.

*కనుక...*

*ఈసారి మీరు కాశీ వెళితే...*

మనకి శత్రువులు అయిన
ఈ శరీరం పై 
ఎక్కువ ప్రేమని, 
మనం చేసే కర్మల మీద లేనిపోని కర్మఫలం అపేక్ష ని మాత్రమే వదులుకొని...
ఆ విశ్వనాథ దర్శనం చేసి, 
నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలగాలి అని ప్రార్దిదాం ......*****

5, మార్చి 2023, ఆదివారం

🛕విష్ణు పాద దేవాలయం 🛕


ఈ ఆలయం మధ్యలో విష్ణువు పాదముద్రలతో నిర్మించబడిందని నమ్ముతారు.🎊

విష్ణుపాద దేవాలయం



🌸విష్ణుపాద దేవాలయం ( విష్ణువు యొక్క పాదాల ఆలయం) భారతదేశంలోని గయ, బీహార్, ఫాల్గు నది ఒడ్డున ఉన్న విష్ణువు కి అంకితం చేయబడిన పురాతన హిందూ దేవాలయం. విష్ణువు గయాసురుడు అనే రాక్షసుడిని సంహరించి భూగర్భంలో బంధించిన ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించబడిందని నమ్ముతారు.

🌸ఈ ఆలయంలో పెద్ద పాదముద్ర ఉంది, ఇది విష్ణు భగవానుడిది అని చెప్పబడింది. ధర్మశిల అని పిలువబడే బసాల్ట్, దేవత గయాసురుడిని భూగర్భంలోకి పిన్ చేసే ముందు అతని ఛాతీపై అడుగు పెట్టినప్పుడు నిలుపుకుంది.

చరిత్ర:
🌸ఒకసారి గయాసురుడు అని పిలువబడే ఒక రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసాడు మరియు అతనిని చూసేవాడు మోక్షం ( మోక్షం ) పొందాలని వరం కోరాడు. ఒకరి జీవితకాలంలో నీతిమంతుడిగా ఉండటం ద్వారా మోక్షం లభిస్తుంది కాబట్టి, ప్రజలు దానిని సులభంగా పొందడం ప్రారంభించారు.

🌸అనైతిక ప్రజలు మోక్షాన్ని పొందకుండా నిరోధించడానికి, విష్ణువు గయాసురుడిని భూమి క్రిందకు వెళ్ళమని కోరాడు మరియు అతని కుడి పాదాన్ని అసురుడి తలపై ఉంచాడు. గయాసురుడిని భూ ఉపరితలం క్రిందకు నెట్టివేసిన తరువాత, విష్ణువు యొక్క పాదముద్ర ఇప్పటికీ మనకు కనిపించే ఉపరితలంపై అలాగే ఉంది. పాదముద్ర శంకం, చక్రం మరియు గాధంతో సహా తొమ్మిది విభిన్న చిహ్నాలను కలిగి ఉంటుంది.ఇవి స్వామివారి ఆయుధాలని నమ్ముతారు. గయాసురుడు ఇప్పుడు భూమిలోకి నెట్టబడ్డాడు ఆహారం కోసం వేడుకున్నాడు. విష్ణువు అతనికి ప్రతిరోజూ ఎవరైనా ఆహారం ఇస్తారని వరం ఇచ్చాడు. 

🌸ఎవరైతే అలా చేస్తే వారి ఆత్మలు స్వర్గానికి చేరుకుంటాయి. గయాసురుడికి ఆహారం లభించని రోజు బయటకు వస్తాడని నమ్మకం. ప్రతిరోజూ, భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఒకరు లేదా మరొకరు అతని నిష్క్రమించిన వారి క్షేమం కోసం ప్రార్థిస్తారు మరియు గయాసురుడికి ఆహారం ఇస్తారు.

🌸 1787లో ఫల్గునది ఒడ్డున ఇండోర్ పాలకుడైన దేవి అహల్యా బాయి హోల్కర్ ద్వారా ప్రస్తుత నిర్మాణాన్ని పునర్నిర్మించారు. అహల్యాబాయి హోల్కర్ ఆలయాన్ని రూపొందించారు, మొత్తం ప్రాంతంలో ఆలయానికి ఉత్తమమైన రాయిని పరిశీలించడానికి మరియు కనుగొనడానికి ఆమె అధికారులను పంపారు, చివరకు వారు జయనగర్ లో ముంగర్ నల్ల రాయిని ఉత్తమ ఎంపికగా గుర్తించారు.

🌸సరైన రహదారి లేకపోవడం మరియు పర్వతాలు గయ నుండి చాలా దూరంలో ఉన్నందున, అధికారులు మరొక పర్వతాన్ని కనుగొన్నారు, ఇక్కడ వారు రాయిని చెక్కి సులభంగా గయకు తీసుకురావచ్చు. ఆ ప్రదేశం బథాని ( గయా జిల్లాలోని ఒక చిన్న గ్రామం ) సమీపంలో ఉంది. అధికారులు రాజస్థాన్ నుంచి కళాకారులను తీసుకొచ్చారు.

🌸వారు పథర్కట్టి (ఒక గ్రామం మరియు బీహార్లోని ఒక పర్యాటక ప్రదేశం)లో ఆలయాన్ని చెక్కడం ప్రారంభించారు. చివరి ఆలయం విష్ణుపాద ఆలయ స్థలానికి సమీపంలోని గయలో ముగించారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత చాలా మంది హస్తకళాకారులు తమ స్వస్థలాలకు తిరిగి వచ్చారు.

🌸అయితే వారిలో కొందరు పట్టర్కట్టి గ్రామంలోనే స్థిరపడ్డారు. బీహార్ ప్రభుత్వం ఈ స్థలాన్ని బీహార్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా గుర్తించింది. విష్ణుపాద మందిరానికి నైరుతి దిశలో బ్రాహ్మజ్ఞుని కొండపైకి వెళ్లే 1000 రాతి మెట్లు గయా నగరం మరియు పర్యాటక ప్రదేశం అయిన విష్ణుపాద ఆలయాన్ని చూడవచ్చు. ఈ ఆలయానికి సమీపంలో అనేక చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి.

🌸ఈ ఆలయం మధ్యలో విష్ణువు పాదముద్రలతో నిర్మించబడిందని నమ్ముతారు. హిందూమతంలో, ఈ పాదముద్ర విష్ణువు గయాసురుడిని అతని ఛాతీపై ఉంచి అణచివేసిన చర్యను సూచిస్తుంది. విష్ణుపాద మందిరం లోపల, విష్ణువు యొక్క అతి పెద్ద పొడవు గల పాదముద్ర గట్టి రాతితో ముద్రించబడింది. ఆలయం లోపల అమర మర్రి చెట్టు అక్షయవత్ ఉంది, ఇక్కడ మరణించినవారికి చివరి కర్మలు జరుగుతాయి. ఆలయం లోపల ఒక (గర్వ్ గిరి) వెండి పూతతో కూడిన షడ్భుజి రెయిలింగ్ (పహల్) అని కూడా పిలుస్తారు.

 

2, మార్చి 2023, గురువారం

అన్నపూర్ణ దేవి



అన్నపూర్ణ.. ఆకలితో ఉన్న వారెవరికైనా అన్నం పెట్టి ఆదరించమనే సందేశము అమ్మవారు మనకు ఇస్తుంది🍂

అన్నపూర్ణాదేవి 

🌺అన్నపూర్ణ అనగా పార్వతి కి మరోపేరు.అన్నపూర్ణ అంటే ఈశ్వరస్వరూపం. ఈశ్వరుని సతి కూడా .ఇంకా అన్నపూర్ణమ్మను లక్ష్మీ, సరస్వతుల రూపంగానూ కొలుస్తారు. సర్వమంగళకారిణి, అన్నపూర్ణామాతను పూజిస్తే సర్వవ్యాధులు, ఈతిబాధలు తొలగిపోతాయని పురోహితులు అంటున్నారు.జీవుల జీవాన్ని నియమింపజేసి, అనుగ్రహించే కరుణామయి, జగన్మాత అన్నపూర్ణాదేవి, అని ప్రశ్నోపనిషత్ చెప్తోంది.ఈ విషయాన్నీ, యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం, బృహదారణ్యకోపనిషత్, భగవద్గీత మనకు అందచేస్తున్నాయి.

🌺శరన్నవరాత్రుల్లో అమ్మవారు.. ఓ రోజు.. అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చింది.. అన్నపూర్ణ దేవి అంటే.. ఓ ఇల్లాలిగా.. ఓ తల్లిగా కుటుంబంలో మహిళకు ఉండే పాత్రను చాటిచెప్పే అవతారం.. అన్నపూర్ణ.. ఆకలితో ఉన్న వారెవరికైనా అన్నం పెట్టి ఆదరించమనే సందేశము…అమ్మవారు మనకు ఇస్తుంది. కుటుంబంలో తల్లిపాత్రకు…ఉన్న ప్రాథాన్యాన్ని…ఈ అవతారము మనకు బోదపడేలా చేస్తుంది.అన్నపూర్ణ దేవి శక్తిని, బుద్ధిని కూడా ఆమే ఇస్తుంది. ‘భిక్షాం దేహీ కృపావలంబన కరీ మాతాన్నపూర్ణేశ్వరి’ అని నిత్యం కొలిచిన వారికి ఈతిబాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి.

🌺సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయి, ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యాస్వరూపిణి- అన్నపూర్ణాదేవి. అన్నము సమృద్ధిపరచుము, దీనిని వ్రతముగా పాటించాలి. అంటే, ఆహార ధాన్యాల్ని ప్రజలకందరకు సరిపోయేటట్లుగా సమృద్ధిగా దీక్షతో దక్షతగా కృషిచేసి పండించాలి. ఈ కృషిలో అందరూ పాలుపంచుకోవాలి. భూమియే- అన్నము. ఆకాశము అన్నాదము, అనగా భూమి నుండి అన్నమునకు సంబంధించిన పంట పండుతోంది. ఆకాశము భూమిపైగల జలమును సూర్యరశ్మి ద్వారా సేకరించి తిరిగి వర్షరూపమున పంటలకు అందించుచున్నది. భూమియందు ఆకాశము ఆకాశమునందు భూమి ప్రతిష్ఠితమవుతున్నాయి. ఇవి ఒకదానికొకటి అన్నము, అన్నాదులు. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు, అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందినవాడై, అన్నము, పుత్రపౌత్రాభివృద్ధి పశు సంపద బ్రహ్మవర్చస్సు కలిగి కీర్తిమంతుడవుతాడు.




🌺అన్నం ఎలా పుడుతుందనే విషయాన్నికూడా వేదం వివరించింది. పరబ్రహ్మతత్త్వమునుండియే ఆకాశము ఉద్భవించింది. ఆకాశమునుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి భూమి, భూమినుండి ఔషధులు (మొక్కలు) ఓషధులనుండి అన్నము, అన్నమునుండి ప్రాణి పుడుతున్నాయి. కనుక పురుషాది ప్రాణికోటి అన్నరసమయము. అన్నరసమయుడైన ఈ పురుషుడే ఆ పరమ పురుషుడు. అనగా పరబ్రహ్మతత్త్వము. ఈ విధముగా జీవబ్రహ్మైక్య స్థితిని ప్రసాదించే కరుణామయి. అన్నపూర్ణాదేవి.

🌺దీనులకు అన్నము ఉదకము దానము చేయుటం ధర్మము. దాన్ని ఆచరిస్తే, శ్రేయస్సు ఆరోగ్యము, సర్వశుభములు కలుగుతాయి. అన్న, ఉదక దానములకు మించిన దానము లేదని, అదే అన్నపూర్ణేశ్వరి ఆరాధన అని పేర్కొన్నది మహాభారతము.ప్రకృతి స్వరూపం- ఋతువులు. శక్తిస్వరూపమే ప్రకృతి. అన్నాన్నిచ్చి శారీరకంగా పుష్ఠివంతులుగా చేసేది, సద్బుద్ధి భిక్ష నొసగి జ్ఞాన పుష్టివంతులగా నొనర్చు కరుణామయి, విశేషంగా అర్చించబడు, మూల ప్రకృతి శక్తి- అన్నపూర్ణాదేవి.

🌺‘‘బిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ’’ అని ఆదిశంకరులు ప్రార్థించిన అన్నపూర్ణాష్టకం తప్పనిసరిగా పారాయణ చేయాలి.

🌺‘‘పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే’’ కనుపించనివన్నీ శక్తిచే నిండి ఉన్నాయి. కనిపించేవి అన్నీకూడా ఆ శక్తి చేత వ్యాప్తములై ఉన్నాయి. అఖిల ప్రపంచమూ ఆ పూర్ణ శక్తినుండే వచ్చింది. అయినా, ప్రపంచమంతా నీ నుండే వచ్చినా, ఇంకా ఆ శక్తి ‘పూర్ణమే’. ఆ పూర్ణశక్తియే ‘అన్నపూర్ణ’.

🌺దీపావళినాడు కాశీక్షేత్రంలో అన్నపూరాణ దేవిని, స్వర్ణ ఆభరణాలతో అలంకరించి దేవాలయాన్ని దివ్యకాంతులీనే దీపాలతో అలంకరిస్తారు. ‘కాశీ’ అంటే వెలుగు. అందుకే వారణాసికి కాశీ అని పేరు వచ్చింది. అనంతమైన విశ్వశక్తిని ఆకళింపు చేసుకొని, విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించాలని చెప్తోంది, అఖిల భువనసాక్షి- అన్నపూర్ణాదేవి.

 

28, ఫిబ్రవరి 2023, మంగళవారం

🛕అష్ట గణపతి క్షేత్రాలు 🛕


శక్తిపీఠాల్లో అష్టాదశ శక్తిపీఠాలు ప్రసిద్ధికెక్కినట్లు ఈ ఎనిమిదీ అష్టగణపతి క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి🌳

అష్టగణపతి క్షేత్రాలు 


🌲ప్ర: అష్టగణపతి క్షేత్రాలు ఉన్నాయని విన్నాను. ఈ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో వివరింపగలరు.

🌲జ: గణపతి ఉపాసనకు మహారాష్ట్ర పెట్టింది పేరు. దానికి తగ్గట్టుగానే ఆ రాష్ట్రంలో గణపతి క్షేత్రాలు కోకల్లలుగా ఉన్నాయి. వాటన్నిటిలోకి అష్టగణపతి క్షేత్రాలుగా ప్రాముఖ్యం సంతరించుకున్న ఎనిమిది క్షేత్రాలు గాణాపత్యులకు ముఖ్యమైనవి. అనేకానేక శక్తిపీఠాల్లో అష్టాదశ శక్తిపీఠాలు ప్రసిద్ధికెక్కినట్లు ఈ ఎనిమిదీ అష్టగణపతి క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి.

🌲1. మయూరేశ్వర గణపతి - పూనా జిల్లాలో పూనా నుండి నలభై మైళ్ళ దూరంలో నున్న 'మోరగావ్'లో మయూరేశ్వర గణపతి ఆలయం ఉంది.

🌲2. చింతామణి గణపతి - పూనా నుండి పధ్నాలుగు మైళ్ళదూరంలో నున్న 'థేపూర్' చింతామణి గణపతి క్షేత్రం.



🌲3.గిరిజాత్మజ గణపతి - పూనా నుండి అరవై మైళ్ళదూరంలో నున్న 'లేహ్యాద్రి' అనే స్థలంలో గిరిజాత్మజ గణపతి క్షేత్రం వెలిసింది.

🌲4. శ్రీ విఘ్నేశ్వర గణపతి - లేహ్యాద్రి సమీపంలోనే 'ఓఝల్' స్థలంలో 'శ్రీవిఘ్నేశ్వర' క్షేత్రం వెలిసింది.

🌲5. మహోత్కట గణపతి - పునానుండి 32 మైళ్ళ దూరంలో ''రాజన్గావ్''లో మహోత్కట గణపతి ఆలయం ఉంది.

🌲6. భల్లాలేశ్వర గణపతి - మహారాష్ట్రలోని కులాబా జిల్లాలో 'పాలీ' అనేచోట భల్లాలేశ్వర గణపతి క్షేత్రం ఉంది.

🌲7. వరదవినాయకుడు - కులాబాజిల్లాలో ''మహర్'' అనే స్థలంలో ''వరదవినాయక'' ఆలయం ఉంది.

🌲8. సిద్ధివినాయకుడు - అహ్మద్ నగర్ జిల్లాలో ''సిద్ధటేక్'' అనే స్థలంలో సిద్ధివినాయక క్షేత్రం వెలిసింది.